CSS Drop Down Menu

Monday, March 31, 2014

డాగ్ ఫోటో కార్టూన్


Sunday, March 30, 2014

ఉగాది శుభాకాంక్షలు


సేమ్ టు సేమ్

మీకు లాగే మేము చెయ్యగలం !













Friday, March 28, 2014

15నెలలకే తల్లి అయిన ఆవుదూడ

నేను 2000 సంవత్సరంలో పొలమూరు పశువుల ఆసుపత్రిలో పనిచేస్తున్నపుడు జరిగిన సంఘటన.సత్తి భాస్కరరెడ్డికి చెందిన జెర్సిజాతికి చెందిన 5నెలల 20రోజుల ఆవుదూడ ఎదకు రాగా OHF జాతి వీర్యమును కృత్రిమగర్బోత్పత్తి  చేయగా అది చూడికట్టి 15నెలలకే కపిలదూడను ప్రసవించడం  జరిగింది.సాదారణంగా సంకర జాతికి చెందిన ఆవులను సక్రమంగా మేపితే 12నెలల నుంచి 18నెలల మధ్య ఎదకు వస్తాయి.అటువంటి ఈ ఆవుదూడ ఎదకు వచ్చే సమయానికే ఈనడం జరిగి అరుదైన రికార్డ్ నెలకొల్పడం జరిగింది.దీని తల్లికి  ఆసుపత్రిలో కృత్రిమగర్బోత్పత్తి  చేయగా ఇది పుట్టడం జరిగింది.దీని యజమాని నే చెప్పిన విధంగా పోషకాహారం మేపడంతో ఈ రికార్డ్ నెలకొల్పడం జరిగింది.







Wednesday, March 26, 2014

Tuesday, March 25, 2014

కంగారు ఫొటో కార్టూన్


Monday, March 24, 2014

చుక్క చేసే మాయాజాలం



ఇదేమిటి ? ఈ కనిపించే చిత్రంలో రెండు సర్కిల్స్ , మధ్యలో ఒక చుక్క అంతేకదా ! ఇందులో వింత ఏముంది ? అనుకుంటున్నారు కదా !! మీరు ఊహించని అద్బుతాన్ని ఆ నల్లని చుక్కే మీకు చూపెడుతుంది . అదెలాగంటే మీ కళ్ళు రెండింటిని ఆ నల్లని చుక్కను చూస్తూ మీ తలను ముందుకి, వెనుకకు కదిలించండి అంతే మీరు ఊహించని అధ్బుతం మీ కళ్ళముందు కనబడుతుంది అదేమిటంటే చిత్రంలో కనిపించే రెండు సర్కిల్స్ ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో తిరుగుతూ కనిపిస్తాయి . 

Sunday, March 23, 2014

ఏనుగుల ఫోటో కార్టూన్


Saturday, March 22, 2014

కొండెక్కిన ఓడ


ఈ ఓడ కొండ మీదకి ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? సునామీ వచ్చినపుడు కొట్టుకొచ్చి కొండ పై ఉండిపోయిందనుకుంటున్నారా?? అది నిజం కాదండి.ఇది ఒక హోటల్ దాని పేరు “ సన్ క్రూయిస్ రిసార్ట్ & యాచ్ ”.ఇది “దక్షిణ కొరియా”లోని “జియాంగ్ డాంగ్జిన్” అనే పట్టణంలో కట్టబడి 2002 సంవత్సరంలో ప్రారంబించబడినది.ఇందులో 211 రూములు,6 ఫంక్షన్ రూములు,6 రెస్టారెంట్లు,మరియు దానిపై బాగంలో రొటేటింగ్ బార్ ఉన్నవి.అలాగే ఆటలు ఆడుకోవడానికి వాలీబాల్,నెట్టేడ్ గోల్ఫ్ కోర్టు,పిట్నెస్ క్లబ్,స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలనుకుంటే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.  
               
 

Friday, March 21, 2014

విధి ఆడిన వింత నాటకం

నేను సైన్సు పట్టబధ్రుడునైనా నా దృష్టి అంతా ఉద్యోగం కన్నా వ్యాపారం వైపే ఉండేది.దాంతో కాకినాడ దగ్గర భూమి కొని రొయ్యల చెరువులు తవ్వించి రొయ్యలపెంపకం చేపట్టడం జరిగింది.దీనిలో వచ్చిన లాభం నుంచి 25శాతం డబ్బులుతో ఒక సేవాసంస్థను స్థాపించి మంచి మార్కులు వచ్చినా ఆర్ధికభారంతో ఫైచదువులు ఆపేసిన పిల్లలకు, వైద్యం చేయి౦చుకోలేని పేదవారికి సహాయం చేయాలని మనసులో నిర్ణయం తీసుకొవడం జరిగింది. రొయ్యలపెంపకం చేపట్టడానికి ముందు నాకు పశుసంవర్ధకశాకలో ఉద్యోగానికీ ఇంటర్వూ జరగడం ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గవర్నమెంట్ రద్దుచేయడం జరిగింది.ఇదంతా జరగడానికి సుమారు రెండునెలలు పట్టింది.అప్పుడు రొయ్యలపెంపకం చేపట్టడం జరిగింది.ఆంధ్రా అంతటా ఒకేసారి వ్యాపించిన వైరస్ తో చెరువులు దెబ్బతినడము ఆవెంటనే క్రాప్ హాలిడే ప్రకటించడం,ఆతర్వాత నాకు వెటర్నరి డిపార్టుమెంటులో ఉద్యోగం రావడం జరిగింది.ఇంతకీ నేను చెప్పేదేమిటంటే ఉద్యోగం వద్దు వ్యాపారమే ముద్దు అనుకుంటున్ననాకు నువ్వేమి మనుష్యులకు సేవ చేయనక్కరలేదు దానికి చాలా మంది ఉన్నారు గాని నోరులేని మూగజీవాలకు సేవ చెయ్యమని పశుసంవర్ధకశాకలో ఉద్యోగం చేసేటట్టు చేసి తద్వారా ఎన్నిటికో వైద్యంద్వారా సేవచేసే అదృష్టం కల్పించడం నిజంగా విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో!

Thursday, March 20, 2014

మన కళ్ళే మనల్ని మోసం చేస్తే ?


Tuesday, March 18, 2014

మూగ జీవి చూపిన కృతజ్ఞత

నేను పొలమూరు పశువుల ఆసుపత్రి నందు పని చేస్తున్నపుడు జరిగిన యధార్ద సంఘటన.ఒక రోజు రాత్రి మూడు గంటలకు అదే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దానికి "ఇంత అర్ధరాత్రి ఎవర్రా? బాబు" అనుకుంటూ లేచి తలుపు తెరిచే సరికి ఒళ్ళంతా రక్తపు మరకలుతో నిండిన వ్యక్తిని చూసేసరికి ఒళ్ళు ఝళ్ళుమంది వెంటనే ఆ వ్యక్తి "నేనండి అన్నవరాన్ని మా గేదెకి గుడ్లమయ వచ్చింది మీరు వెంటనే రావాలి" అనే సరికి కావలిసిన మందులు తీసుకోని బయలుదేరి గుడ్లమయను లోపలికి నెట్టి గేదెకి ఇంజక్షన్లు చేసి పశువుల పాక నుండి రోడ్ మీదికి వచ్చి ఒళ్ళంతా కడుక్కుని అక్కడ ఉన్న రైతులుతో మాట్లాడుతుండగా జరిగిన విషయాన్ని చెబుతున్నారు ఏమని అంటే "వీడు రాత్రి పన్నెండు గంటలు నుంచి గుడ్లమయ లోపలికి గెంటుతున్నాడు గేదె చనిపోయేలా ఉందని మిమ్మలిని
తీసుకురమ్మని తిడితే" అప్పుడు మీ దగ్గరికి వచ్చాడు అప్పటికే బుధవారం తెల్లవారుజామున ద్వారపూడి  పశువుల సంతకు వెళ్ళే  బేరగాళ్ళంతా అన్నవరం బాగస్వామితో మీ గేదె చనిపాయిందని చెప్పడం జరిగిందట.కారణం ఏమిటంటే  గుడ్లమయ వచ్చిన పశువులలో నూటికి తొంబై శాతం చనిపోతాయి(గుడ్లమయ అంటే పశువు ఈనిన తరువాత కడుపు లోపల ఉన్న గర్బాశయం మొత్తం బయటకు వచ్చేస్తుంది)


  అప్పుడు జరిగిందా సంఘటన.  పశువుల పాక దగ్గర ఉన్న ఆ గేదె రోడ్ మీద ఉన్న మా దగ్గరకు వచ్చి నా ముఖం చూసి నా పాదాలను నాక సాగింది దాంతో అక్కడ ఉన్న రైతులంతా ఆశ్చర్యపోయి "డాక్టర్ గారు దాని ప్రాణాలు పోకుండా కాపాడినందుకు ఈ విధంగా కృతజ్ఞతలు చెబుతుంది" అనే సరికి మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే నేటి కాలంలో సాయం పొందిన సాటి మనుషులే మనం కనపడగానే తల పక్కకు తిప్పుకుని పోతున్న ఈ రోజులలో నోరు లేని ఈ మూగ జీవి తన కృతజ్ఞత ఈ విధంగా చూపే సరికి మనసంతా అదోలా అయిపోయింది.