CSS Drop Down Menu

Monday, June 16, 2014

"లైంగిక సామర్థ్యం"ను పెంచే ఆహారాలు!!!



 ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్' వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.
 నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం , డయాబెటిస్‌వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాలవలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.
 సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే: కొన్ని ముఖ్యమైన ఇండియన్ ఆహారాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్' నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును. లిబిడో సమస్యలను అధిగమించడానికి పురాతన కాలం నుండి అశ్వగంధని మనకు ప్రసాధించింది. సెక్స్ డ్రైవ్ ను పెంచే ఇండియన్ ఆహారాలు, నేచురల్ లిబిడో బూస్టర్స్ గా సహాయపడుతాయి. అవే మీ సంతోకర జీవితానికి, కొన్ని మసాలాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ లిబిడో సమస్యలను నివారించుకోండి...
యాలకులు: ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది.

సెలరీ(Celery): ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్, ఆడ్రోస్టెనోన్ ను విడుదల చేయడం వల్ల ఇది అంత ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఈ సుగంధ వాసన, భాగస్వామిని ఇట్టే ఆకర్షిస్తుంది.

అరటి పండు: అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సినంత శక్తిని అంధిస్తుంది.

 గుడ్లు: గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.

 వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది

అశ్వగంధ: సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.

Ginseng(ఒక విధమైన మూలిక): ఈ జిన్సెంగ్ మూలిక యొక్క వేరును లిబిడో సమస్యలను నివారించడంలో విస్తృతంగా ఉపయోగించారు. దీన్ని ఇంకా లోయర్ బ్లడ్ ప్రెజర్ మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఉపయోగిస్తారు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.

ఫిగ్: ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొంధిస్తుంది. సెక్స్ లైఫ్ ను సహజగా పెంచడంలో ఇదొక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తారు.

స్ట్రాబెర్రీ: కలర్ ఫుల్ స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చూడటానికి మాత్రమే కాదు, రుచి, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్ కు అద్భుతంగా సహాయపడుతాయి.

ఆస్పరాగస్:  దీన్ని ఆహారంగా పురాతన కాలం నుండే తీసుకుంటున్నారు. ఇందులో పొటాషియం, థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కండారాలకు బూస్ట్ వంటిది. తగినంత శక్తిని అందిస్తుంది.

అవొకాడో: ఇది బట్టర్ ఫ్రూట్. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో అధికంగా జింక్ మరియు ఐరన్ మరియు కావల్సినన్ని విటమిన్లు ఉండి శారీరక ఆరోగ్యానికి మరియు లైంగికజీవితానికి బాగా సహాయపడుతాయి.

రెడ్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.


















1 comment:

  1. nice collection. Recent ga oka youtube channel news ki sambandinchindi chusanandi vallu kuda oka health benefit new beer gurinchi inka chala health tips videos kuda post chesthunaru veeelithe meeru kuda velli chudandi.
    https://www.youtube.com/c/NewsCabin

    ReplyDelete