CSS Drop Down Menu

Saturday, August 30, 2014

"జంబలకిడి పంబలు"

























Friday, August 29, 2014

"వినాయక చవితి శుభాకాంక్షలు"





Thursday, August 28, 2014

విదేశాల టైం "సులువుగా" తెలుసుకోవడం ఎలా ?

ప్రపంచంలో ఏదైనా దేశంలోనో, నగరంలోనో టైం ఎంతో తెలుసుకోవాలంటే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు, వెబ్‌ అప్లికేషన్లు అక్కర్లేదు. గూగుల్‌ సెర్చ్‌బాక్స్‌లో ప్రత్యేక గూగుల్‌ కీవర్డ్‌తో తెలుసుకోవచ్చు. అందుకు సెర్చ్‌బాక్స్‌లో "What time is it" అని టైప్‌ చేసిన తర్వాత దేశం, ప్రాంతం పేరుని టైప్‌ చేయాలి. గూగుల్‌ ఫలితాల్లోని మొదటి వరుసలో టైం కనిపిస్తుంది.



          లేదా  గూగుల్‌ సెర్చ్‌బాక్స్‌లో మీకు కావలిసిన  "దేశం పేరు ప్రక్కన టైం" అని టైప్‌ చేసినా గూగుల్‌ ఫలితాల్లోని మొదటి వరుసలో టైం కనిపిస్తుంది. 


 

Wednesday, August 27, 2014

"మొక్కజొన్న" చేసే "మేలు"





 మొక్కజొన్న తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన బలం చేకూరుతుంది. అలాగే ఒబిసిటీని దూరం చేస్తుంది. 
 
ఉదర సంబంధిత వ్యాధులు, నోటి దుర్వాససను దూరం చేసే మొక్కజొన్నలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. అజీర్తికి చెక్ పెడుతుంది. సరి సమానంగా కార్బొహైడ్రేడ్ మరియు కెలోరీలను కలిగివుండే మొక్కజొన్నను రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. 
 
అలాగే మొక్కజొన్న డయాబెటిస్, హృద్రోగవ్యాధులను నియంత్రిస్తుంది. పీచు, కార్బొహైడ్రేడ్లను కలిగివున్న మొక్కజొన్న గింజల్ని రోజూ అరకప్పు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పసుపు రంగు మొక్కజొన్నల్ని తీసుకుంటే గొంతు వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అలాగే కంటిచూపు, దృష్టి ప్రభావం లేకుండా చేస్తుంది. గర్భిణీ మహిళలకు మేలు చేసే ఆహారంలో మొక్కజొన్న ఒకటి. మొక్కజొన్నలో ఫ్యాట్ ఫుడ్ కావడంతో గుండెకు మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడి, హృద్రోగ వ్యాధులను నయం చేస్తుంది. కార్న్ ఫ్లోర్‌ను వంటలు, సౌందర్యానికి ఉపయోగించడంతో పాటు చర్మ సంబంధిత అలెర్జీలపై రాస్తే ఉపశమనం లభిస్తుంది.

Tuesday, August 26, 2014

Monday, August 25, 2014

చిరుకి చరణ్" మెగా బహుమతి "


చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తనయుడు రామ్ చరణ్ తన తండ్రికి ఇచ్చిన విలువైన కానుక టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 1.25 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ విఎక్స్ వి8 మోడల్ కు చెందిన విలాస వంతమైన కారును తన తండ్రికి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చి తన తండ్రికి ఆనందాన్ని కలిగించి టాలీవుడ్ హాట్ న్యూస్ గా మారాడు.




ఈ కారును చిరంజీవి తన నేపాల్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఉపయోస్తాడని న్యూస్. గతంలో కూడా రామ్ చరణ్ తన తండ్రికి రోల్స్ రాయస్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తన తండ్రి నేపాల్ లో ఉన్నా తన తండ్రి తరఫున మెగా అభిమానులకు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆతిధ్యం ఇస్తూ మెగా హీరోకు వారసుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు.

Friday, August 22, 2014

"15 సంవత్సరాలకే శృంగారం"


దేశంలోని అమ్మాయిలు  చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. కేవలం 15 యేళ్ళకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నట్టు నిస్సగ్గుగా చెపుతున్నారు. పెళ్లికి ముందే అన్నీ అయితే అనుభవం ఉంటుందని గర్వంగా ఫీల్ కావడం వల్లే కాఫీ షాపులు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, తమకు లభించిన పూర్తి స్వేచ్ఛ కారణంగా దూర ప్రదేశాల్లో చదువుతూ, ఉద్యోగాలు వెలగబెట్టే అనేక మంది యువతీ యువకులు తమ సహచరులతో సహజీవనం చేయడం ఫ్యాషనైపోయిందని తాజాగా నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. 


ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఓ సర్వే నిర్వహించింది. అందులో దిగ్భ్రమకు గురి చేసే అంశాలు వెలుగు చూశాయి. పెళ్లికి ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అమ్మాయిలు స్వేచ్ఛ పేరుతో... పురుషులు చేస్తే తప్పులేదు, మేము చేస్తే తప్పా అనే వితండవాదంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దానికి స్నేహం, ప్రేమ ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. 


ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 15-24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అబ్బాయిలను, అమ్మాయిలను ప్రశ్నించారు. వారిలో 15 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తాము శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపారు. 24 శాతం మంది అమ్మాయిలు తాము పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు లేటుగా శృంగారంలో పాల్గొంటున్నట్టు సర్వే తెలిపింది. 


దీంతో పెళ్లికి ముందు శృంగారం సర్వసాధారణమై పోయింది. పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని తమిళ నటి ఖష్బూ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. మరో సినీ నటి షెర్లీన్ చోప్రా పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని, పైగా అనుబంధం పెరుగుతుందని సెలవిచ్చింది. బంధం బలపడడం మాట అటుంచి పెళ్లికి ముందే శృంగారం కారణంగా చాలా మంది యువతులు మోసపోతున్నారు. 


అలాగే, పెళ్లికి ముందు సెక్స్ అనుభవించి, మోసపోయామని ఫిర్యాదులు చేసేవారూ తక్కువేం లేరు. కేవలం జూన్‌లోనే రాష్ట్ర మహిళా కమిషన్‌కు 150 కేసులు మోసపోయామని వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా ఫిర్యాదు చేసేవారు కూడా 20-24 మధ్య వయస్కులు. మోసపోతున్నామని బాగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకునే యువతులే ఎక్కువగా ఫిర్యాదులు చేయడం విశేషం. 


అయితే ఇవి ధైర్యం చేసి ఫిర్యాదు చేసిన యువతుల సంఖ్య. ధైర్యం చాలక, తాము చేసింది తప్పని తెలుసుకుని కొంతమంది, సిగ్గుతో కొంతమంది యువతులు ముందుకు రావడం లేదని. ఇవన్నీ సూచించేది ఒక్కటేనని, అది పెళ్లికి ముందు శృంగారం మంచిది కాదని, స్వేచ్ఛకు పరిధులు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Thursday, August 21, 2014

మీరు వాడే" టూత్ పేస్ట్‌లో ఏముందో" తెలుసా ?


మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా అనేది నేడు ఓ ప్రముఖ బ్రాండెడ్ టూత్ పేస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ లీడింగ్! కానీ మీ టూత్ పేస్ట్ ట్యూబ్ కిందిభాగంలో ఏ కలర్ ఉందో తెలుసా అనేది నేటి నెటిజెన్ క్వశ్చన్ ? ఏంటి ఏమీ అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. నిత్యం సర్వసాధారణంగా వినియోగించే చాలారకాల ఉత్పత్తుల గురించి చాలామందికి పెద్దగా తెలీదు. కాకపోతే వాటి ఉపయోగం తప్పనిసరి కనుక తెలీకుండానే వాడేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే తెలుసుకునే ప్రయత్నమైనా చేయరు. కొందరికి అంత టైమూ ఉండదు. అయితే ప్రపంచంలో చాలామందికి తెలీని ఫ్యాక్ట్.. అందరూ తెలుసుకుని తీరాల్సిన ఫ్యాక్టూ ఒకటుందంటున్నారు కొందరు నెటిజన్లు. మనం నిత్యం వాడే టూత్ పేస్ట్ ట్యూబుల క్రింప్‌పై భాగంలో చిన్న డబ్బా ఆకారంలో గ్రీన్, రెడ్, బ్లాక్, లేదా బ్లూ కలర్స్‌లో ఏదో ఓ కలర్ ప్రింట్ చేసి ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. కానీ ఆ కలర్ వెనుక పెద్ద కథే ఉందట.


ఒక టూత్ పేస్ట్ క్రింప్‌పై బ్లాక్ కలర్ ప్రింట్ అయ్యిందంటే ఆ పేస్ట్ తయారీకి కేవలం కెమికల్స్‌ని మాత్రమే వినియోగించారని అర్థమట. అలాగే రెడ్ కలర్ ప్రింట్ అయ్యుంటే అందులో 70% కెమికల్స్, మరో 30% సహజ మూలికలుఉంటాయట. ఇక గ్రీన్ కలర్ విషయానికొస్తే, ఆ పేస్ట్ సహజ మూలికలతో తయారైందని అర్థమట.  అదే విధంగా బ్లూ కలర్ ప్రింట్ అయినట్లయితే, ఆ పేస్ట్‌లో కొంత సహజ మూలికలు, ఇంకొంత ఔషదాలు ఉన్నాయని అర్థమట. కొంతమంది విదేశీ నెటిజన్లు మొదటిసారిగా ఈ వాదనని తెరపైకి తెచ్చారు. దీంతో అసలు ఈ వాదనలో ఎంత మేరకు వాస్తవం తెలుసుకునే పనిలో పడ్డారు మిగతా నెటిజన్లు. సగటు నెటిజెన్ అంచనా కరెక్ట్ అయ్యుంటే రేపు మార్నింగ్ మీరు ట్యూబ్‌ని చేతిలోకి తీసుకోగానే ట్యూబ్ క్రింప్‌పై ఏ కలర్ ప్రింట్ అయ్యిందా అనేదే ఫస్ట్ చెక్ చేస్తారు. 

Wednesday, August 20, 2014

పిల్లల కోసం "కన్యత్వాన్నే త్యాగం చేస్తానన్న"పాప్ సింగర్ !

                             

నేను కన్యను.. ఒక్క రాత్రి పది మందికి కంపెనీ ఇస్తా..! అందువల్ల నన్ను బందీగా ఉంచుకుని అమాయక చిన్నారులను వదిలిపెట్టాలంటూ నైజీరియాకు చెందిన వర్థమాన పాప్ గాయని అడోకియే కిరియన్ ఆ దేశ తీవ్రవాదులకు విజ్ఞప్తి చేసింది. 

నైజీరియాలోని చిబోక్ అనే పట్టణంలో రెండు నెలల క్రితం బోకోహరాం తీవ్రవాదులు ఒక పాఠశాలపై దాడి చేసి 300 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. అమాయకులైన ఆ బాలికలను వదిలి పెట్టాలంటూ ఆ దేశ వర్ధమాన పాప్ గాయని తీవ్రవాదులకు విజ్ఞప్తి చేశారు. 


కావాలంటే తీవ్రవాదులకు నా కన్యత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన బాలికలంతా 12 నుంచి 15 యేళ్ళ లోపు వారే. వారికంటే నేను పెద్దదాన్ని. అనుభవజ్ఞురాలిని. కన్యను. ఒక రాత్రికి 10 నుంచి 12 మంది నాతో కోరిక తీర్చుకోండి. నాకేం పర్వాలేదు. కానీ, అమాయక బాలికలను విడిచి పెట్టండి. వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లనివ్వండి అని అభ్యర్థించింది . 




Tuesday, August 19, 2014

జగన్ "బంపర్ ఆఫర్"


 
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి బిగ్ ఆఫర్ ఇచ్చారు!

 తన వద్ద లక్ష కోట్లు ఉన్నాయని టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారని, 

తన దగ్గర అంత డబ్బు ఉంటే?

 పది శాతం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చునన్నారు.


Monday, August 18, 2014

"ఏపి" రాజధానిపై "కేసీఆర్ వాస్తు" సలహా !!!


ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజధాని విషయంలో చంద్రబాబుకు కేసీఆర్ చిన్న సలహా ఇచ్చారట. రాజధానివున్న ప్రాంతంలో ఉత్తరం నుంచి నది ప్రవహిస్తే మంచిదని అన్నారట.
ఈ తరహా నగరాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతమైతే బాగుంటుందని కేసీఆర్‌ను చంద్రబాబు అడిగారు. అమరావతి, మంగళగిరి ప్రాంతాల మధ్య వుంటే బాగుంటుందని  కేసీఆర్ అన్నట్లు నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విషయంలో మరోసారి ఆలోచనలోపడినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

Friday, August 15, 2014

మీ జ్ఞాపకశక్తిని పరీక్షించుకోండి ! ఇలా !!


చాలా మందికి కొన్ని అంశాలు బాగా గుర్తుండి పోతాయి. మరికొంతమందికి గుర్తుండవు. అయితే, మీ జ్ఞాపకశక్తి ఏపాటిదో తెలుసుకోవాలంటే ఈ చిన్నపాటి పరీక్ష పెట్టుకుని చూడండి.
 అదేంటంటే?
కలం - పగలు,
 చదరంగం - చంద్రుడు,
 టెలివిజన్ - ట్యూబ్‌లైట్,
 గ్రహం - కళాశాల,
 పుస్తకం - సాయంత్రం.

ఈ పదాలను ఒకసారి చదివిన తర్వాత ఈ పది పదాలను ఒకసారి చెప్పగలిగితే మీ జ్ఞాపకశక్తి అమోఘమని చెప్పొచ్చు. 
7-8 పదాలు మాత్రమే మీకు గుర్తుంటే ఫర్వాలేదని చెప్పొచ్చు. ఐదారుపదాలు మాత్రమే చెప్పినా కొంచెం సాధన చేస్తే మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని చెప్పొచ్చు.

Thursday, August 14, 2014

రోజూ కూల్ డ్రింక్ తాగుతున్నారా ? అయితే ! మీ పని అయినట్లే ??





మీరు తాగే చల్లని డ్రింకుల వల్ల మీ మొమరీ స్పీడ్ తగ్గుతుందంటున్నారు డాక్టర్లు. రోజుకో తియ్యని, చల్లని డ్రింక్ తాగితే కుందేలులా పరిగెత్తే మీ ఆలోచనలు తాబేలు మాదిరి స్లో అయిపోక తప్పదని వైద్యులు గట్టిగా చెబుతున్నారు. కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టాలపై సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటి జరిపిన పరిశోథనల్లో వాటివల్ల కలిగే నష్టాలు బయట పడ్డాయి. రోజుకో కూల్ డ్రింక్ తాగే టీనేజర్ల మెమరీ కెపాసిటి తగ్గిపోవడం, మెదడు చురుకుదనం కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనల్లో బయట పడింది.

రోజుకో డ్రింక్ తాగితేనే ఇలా ఉంటే ఇక సీసాలకు సీసాలు తాగేవారిలో ఊబకాయం రావడం ఖాయమంటున్నారు. పైగా కూల్ డ్రింక్ తాగే వారిమెంటాలిటీ వయెలెంట్‌గా మారే ప్రమాదముందట. గ్యాప్ లేకుండా కూల్ డ్రింక్స్ తాగే వారిలో జీర్ణ వ్యవస్థలో తీవ్రమైన మార్పులొచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తియ్యని విషం వల్ల వచ్చే అనర్థాల గురించి తెలుసుకునేందు ఎలుకలమీద జరిపిన పరిశోధనలు సత్ఫలిచ్చాయిని డాక్టర్లు తెలిపారు.

Wednesday, August 13, 2014

"స్టెమ్‌సెల్" బ్యాంక్!


బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ చెన్నైలో స్టెమ్‌సెల్ బ్యాంకింగ్ గురించి ప్రస్తావించింది. అయితే ఇది  స్టెమ్‌సెల్స్..  అంటే మూలకణాలను నిల్వచేసుకునే బ్యాంక్ అన్నమాట! మనిషి మూలకణాలతో అవయవాలను పునరుత్పత్తి చేయడమే గాక, అనేక రకాల వ్యాధులను వీటివల్ల నివారించవచ్చునని తేలింది. ఇది సామాన్యులకు కొత్తగా వినిపిస్తున్న టెక్నాలజీ! అప్పుడే పుట్టిన బిడ్డ పేగు నుంచి మూలకణాలను వేరు చేసి భద్రపరచడమే స్టెమ్‌సెల్ విధానం! పుట్టిన బిడ్డకు ఇచ్చేగిఫ్ట్‌గా దీనిని అనేకమంది తలిదండులు భద్రపరుస్తున్నారు.

ఇప్పటివరకు లక్షమందికిపైగా మూలకణాలను భద్రపరచుకున్నారట! వీటిని దాచుకోవడం ద్వారా భవిష్యత్తులో పలు ఆరోగ్యసమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చునని అంటున్నారు. దేశంలో మొదటిసారిగా మానవ జీవకణాలను దాచుకునే విధానాన్ని లైప్‌సెల్ సంస్థ ప్రారంభించింది. ఎవరైనా కేవలం 19 వేల 999 రూపాయలు చెల్లించి ఈ కణాలను ఈ బ్యాంక్‌ ద్వారా జీవితకాలం పాటు భద్రంగా దాచుకోవచ్చునని, సుమారు 80 రకాల జబ్బులను నివారించడానికి ఈ కణాలు ఉపయోగపడతాయని అంటున్నారు.

Tuesday, August 12, 2014

"పులసల" పులుసు భలే పసందు!!!


 


తూర్పుగోదావరి జిల్లా లో సీజన్..నోరూరించే ఫిష్ వెరైటీ వచ్చేసింది. అదే..పులస చేప..దీన్ని ముద్దుగాఅక్కడ సెలబ్రిటీ ఫిష్ అని పిలుచుకుంటారు. మత్స్య ప్రియులు ఇష్టంగా తినే ఈ పులుసు చేప ఖరీదు కేజీ  1500 రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటోంది.ఈ చేపలు బంగాళాఖాతం ఉప్పు నీటి నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య కాలంలో గోదావరి జలాల్లో  ప్రవేశిస్తాయి.
రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం సమీపంలో లభించే పులసచేపలకు ఎక్కువ డిమాండ్ వుంటుంది. యానాం, బొబ్బర్లంక ప్రాంతాల్లోనూ  ఇవి విరివిగా లభిస్తాయి. ధర ఎంత ఎక్కువైనా వీటి కోసం పులస ప్రియులు వెనుకాడడంలేదు. హాట్ కేకుల్లా అమ్ముడు పోయే ఈ చేపలను వండేటప్పుడు మాత్రం  జాగ్రత్తలు తీసుకోవాలి.


Monday, August 11, 2014

"షుగర్ రోగుల శృంగార సామర్థ్యం"


 మధుమేహం వ్యాధి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోయి అంగస్తంభన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను అధిగమించి సెక్స్‌లో సమర్థవంతంగా పాల్గొనాలంటే ఏం చేయాలీ...?

మధుమేహ నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ వద్దు. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవడం ప్రధానం. చికిత్స ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. రోజూ ఉదయాన్నే కనీసం 5 నుంచి 6 కిలోమీటర్లు కాస్త వేగంగా నడవండి. ఇది కేవలం లైంగిక సామర్థ్యాన్ని పెంచటానికే కాదు... మధుమేహం నియంత్రణలో ఉండటానికి, చక్కటి ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.

రోజూ సైక్లింగ్, ఈత.. ఈ రెండూ లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. పొత్తికడుపు, కటి ప్రాంత కండరాలను బలోపేతం చేసే కపాల భాతి, సర్వాంగాసనం వంటివి సాధన చేయండి. రోజూ తప్పనిసరిగా ఆకుకూరలు, పచ్చి కూర ముక్కలు, తీపి తక్కువుండే బొప్పాయి వంటి పండ్లు తీసుకోండి. ఏడెనిమిది బాదం పప్పులు, ఖర్జూర పండ్ల వంటివి తీసుకోండి. సాధ్యమైనంత వరకూ బీఫ్, మటన్ వంటి మాంసాహారాన్ని తగ్గించండి.

ముఖ్యమంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దరిచేరనీయవద్దు. భాగస్వామితో ఆహ్లాదంగా గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించండి. సమయానికి ఆహారం, చక్కటి వ్యాయామం, క్రమశిక్షణ పాటించడం, లైంగిక సామర్థ్యం తగ్గకుండా చూసుకోవడానికి దోహదం చేస్తాయి. ఎప్పుడైనా శృంగార భావనలు పెంపొందిచే సినిమాలు చూడటం కూడా మంచిదే. పొగతాగే అలవాటు ఉంటే తక్షణమే మానేయాలి. అదేవిధంగా బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తే శృంగారం స్వర్గమయం అవుతుంది. 

Wednesday, August 6, 2014

చిరంజీవి 150వ చిత్రంలో "విలన్‌"గా హీరో రాజశేఖర్ ?




మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ చిత్రంలో విలన్‌గా చేస్తానని హీరో రాజశేఖర్ చెప్పారు. మల్టీస్టారర్ సినిమాలో నటించాల్సి వస్తే ఏ హీరోతో నటిస్తారని డాక్టర్ రాజశేఖర్‌ను ప్రశ్నిస్తే  ఆయన ఎవరూ ఊహించని విధంగా అంటే పై విధంగా సమాధానమిచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో నటించాలనుందని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశారు.

ఇంతకీ ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు ఆయన శ్రీమతి జీవిత. ఓ టీవీ కార్యక్రమంలో రాజశేఖర్‌కు జీవిత ఈ ప్రశ్న సంధించారు. అయితే ఏమాత్రం తడుముకోకుండా రాజశేఖర్ చిరంజీవి పేరు చెప్పడం విశేషం. చిరంజీవికి ధీటుగా ఉండే పాత్ర అయితే విలన్‌గా చేయడానికి కూడా సిద్ధమని రాజశేఖర్ ప్రకటించారు.

Monday, August 4, 2014

అల్లు అరవింద్ ని "చెంపదెబ్బ" కొట్టింది ఎవరు ?

ఒకాయన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెంప ఛెళ్లుమనిపించాడట! ఇంత పెద్ద నిర్మాతని పట్టుకుని చేయి చేసుకోవడమా? ఆ కొట్టినతడికి ఎంత ధైర్యం వుండి వుండాలి అనే అనుమానం రాకమానదు. ఇంతకీ ఆయన్ని కొట్టిన వ్యక్తి ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? ఆయనెవరో కాదులెండి.. అల్లు అరవింద్ తండ్రి, ప్రముఖ హాస్య నటుడు కీర్తి శేషులు అల్లు రామలింగయ్య గారే. కానీ అది ఇప్పుడు కాదు.. అల్లు అరవింద్ యువకుడిగా వున్న రోజుల్లో జరిగిందీ ఘటన.
ఒకరోజు అల్లు అరవింద్ కారు డ్రైవింగ్ చేస్తుండగా తండ్రి అల్లు రామలింగయ్య తన పక్క సీట్లో కూర్చున్నారట. కారు ఇంటివద్దకు చేరుకోగానే కారుని సడెన్ బ్రేక్ వేశారట. దీంతో ఒక్కసారిగా కుదుపునకు గురైన అల్లు రామలింగయ్య తలకి స్వల్పంగా దెబ్బ తగలడం.. ఆ కోపంలోనే ఎవడ్రా? .... నీకు డ్రైవింగ్ నేర్పింది అంటూ పక్కనే వున్న కొడుకు చెంపపై ఒక్కటిచ్చుకోవడం అంతా క్షణాల్లో జరిగిపోయిందట. ఇదే విషయాన్ని తాజాగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ తన జీవితంలో మరిచిపోలేని మధురజ్ఞాపకంగా గుర్తుచేసుకున్నారు .

Saturday, August 2, 2014

"పెన్‌డ్రైవ్" మోడల్స్!!

 పెన్‌డ్రైవ్ చూడటానికి చిన్నగా కనిపించినప్పటికి తన సామర్ధ్యాన్ని బట్టి జీబీల కొలది డాటాను భద్రపరుచుకుంటుంది. 2జీబి, 4జీబి, 8జీబి, 16జీబి, 32జీబి ఇలా అనేక మెమరీ వేరియంట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. గ్యాడ్జెట్‌ల వాడుకలో భాగంగా కొత్తదనం కోసం పరితపిస్తున్న నేపధ్యంలో పెన్‌డ్రైవ్‌ల్లోనూ కొత్త మోడళ్లు పుట్టుకొచ్చాయి.

పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు? - మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు.  నాసిరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించటం చేత పెన్‌డ్రైవ్‌లు తక్కువ బరువును కలిగి ఉంటాయి. కాబట్టి బరువు విషయంలోనూ ఓ కన్నేసి ఉంచండి. - అలాగే పెన్‌డ్రైవ్ మీద ఉన్న లోగోను స్ర్కాచ్ చేసి చూడండి అది తొలగిపోయినట్లయితే ఖచ్చితంగా ఆ పెన్‌డ్రైవ్ నకిలీదే. కంపెనీ పెన్‌డ్రైవ్‌లపై ముద్రించిన లోగో చెక్కు చెదరదు.
పెన్‌డ్రైవ్ మోడల్స్‌ను ఈ  క్రింద   చూడండి.