CSS Drop Down Menu

Tuesday, September 30, 2014

రోజూ ఓ గుడ్డు తినండి!స్లిమ్‌గా ఉండండి !!



స్లిమ్‌గా ఉండాలా? రోజూ ఓ గుడ్డు తినండి! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఓ గుడ్డును ఆహారంగా తీసుకుంటే.. సన్నబడుతారని ఇప్పటికే చాలా పరిశోధనలు తేల్చాయి. ఇంగ్లండ్‌లో జరిగిన సర్వేలో తెల్లవారుపూట పరగడుపున ఒక కోడిగుడ్డును తీసుకుంటే.. రోజంతా తీసుకునే ఆహారం ద్వారా అధిక క్యాలరీలను నియంత్రించవచ్చునని తేలింది. 

క్యాలరీలను కంట్రోల్ చేయడంలో కోడిగుడ్లు బాగా పనిచేస్తాయి. అందుచేత అల్పాహారంతో కోడిగుడ్డు తీసుకుంటే మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి మధ్య తీసుకునే చిరుతిళ్లకు చెక్ పెట్టవచ్చు. స్నాక్స్ అధికంగా తీసుకోవడం ద్వారా శరీరంలో చేరే అధిక క్యాలరీలను నియంత్రించడంలో కోడిగుడ్డు బాగా పనిచేస్తుంది.

మార్నింగ్ ఫుడ్‌లో ఎగ్ తీసుకుంటే మధ్యాహ్న భోజనాన్ని మితంగా తీసుకుంటారు. తద్వారా బరువు పెరగడం.. పొట్ట పెరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Monday, September 29, 2014

ఒకే ఒక్క కౌగిలింతతో ... ?



  భార్యాభర్తలు, లవర్స్ పోట్లాడుకుంటున్నారా..? అయితే కౌగిలింత మంత్రం బాగా పనిచేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. పోట్లాటలు వచ్చినప్పుడు కౌగిలించుకోవడం ద్వారా అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. కౌగిలింత క్షమించటానికి ఉత్తమ మార్గం. ఒక సంబంధంలో కౌగిలింత అనేది పోట్లాటలు అదృశ్యం అవటానికి ప్రశాంతమైన భావన కలగటానికి సహాయపడుతుంది.

అలాగే కౌగిలింతలు భౌతిక ఆకర్షణ పెంచటానికి సహాయం చేస్తాయి. మీ భాగస్వామి అందముగా కనిపిస్తుంటే, మీరు ఒక అడుగు ముందుకి వేసి ఆమెకు ఒక కౌగలింత ఇచ్చి ఆమె అందం గురించి చెప్పండి. ఇది మీ సంబంధం మరింత అర్ధవంతముగా చేయడానికి సహాయం చేస్తుంది.

కౌగిలింత మరింత ఎక్కువ ప్రేమను పెంచుతుంది. ప్రేమతో ఆలింగనం చేసుకుంటే ముఖ్యమైన ప్రత్యేకమైన అనుభూతికి సహాయపడుతుంది. అలాగే ప్రేమను తీవ్రం చేస్తుంది.

ఇంకా భద్రత భావన  ఉత్తమ కౌగిలింత ద్వారా చూపించవచ్చు. మీరు ఒక కౌగిలింతను భాగస్వామ్యం చేసినప్పుడు, మహిళకు చాలా సురక్షితమైన వ్యక్తిగా భావన కలుగుతుంది. ఈ భావన పదాలతో వివరించలేని విధంగా ఉంటుంది.

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇది జంటల మధ్య కౌగిలింత అనుకూలమైన శక్తిని సృష్టిస్తుంది. ఇది శరీరం నుండి టెన్షన్ మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు చాలా ఒత్తిడితో ఉన్నప్పుడు మీ భాగస్వామిని హాగ్ చేసుకోండి. ఈ ఆప్యాయత మీ సంబంధం మరియు మీ ఆరోగ్యానికి సహాయం చేస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.

Saturday, September 27, 2014

ఉదయాన్నే"లెమన్ వాటర్" తాగితే ?

ప్రతి రోజూ ఉదయాన్నేపరకడుపున లెమన్ వాటర్ ను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వికారం తగ్గించుకోవడానికి, బౌల్ల్ క్లియర్ చేసుకోవాడానికి, శరీరాన్ని డిటాక్సి ఫై చేసుకోవడానికి. లివర్ శుభ్రపరుచుటకు, శ్వాస సంబంధిత సమస్యల నివారణకు మరియు మరీ ముఖ్యంగా బరువు తగ్గించుకోవడానికి, చాలా మంది డైటర్స్ గోరువెచ్చని లెమన్ వాటర్ ను ఉదయాన్నే తీసుకుంటారు. అలా పరకడుపు గోరువెచ్చని లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కణాలు విచ్ఛిన్నం కాబడుతాయి. అందువల్ల, ఈ వార్మ్ లెమన్ వాటర్ లో ఇతర ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉండటాన్ని మీరు తెసులుకోవడం కోసం....
 
బరువు తగ్గిస్తుంది:-

 ఉదయాన్నేఒక గ్లాసు గోరువెచ్చని లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవడం అనేది బాగా తెలిసిన ఒక అద్భుతప్రయోజనం. మంచి ఫలితం కోసం ఇందులో పంచదార కాకుండా తేనె మిక్స్ చేసుకోవాలి.

 డిటాక్స్:-

 శరీరంలో హానికరమైన కెమికల్స్ మరియు హానికరమైన టాక్సిన్స్ శరీరానికి హాని కలిగించే వీటిని డిటాక్సిఫై చేయడానికి లెమన్ డైట్ చాలా పాపులర్ అయినటువంటిది.

 లివర్ ప్యూరిఫికేషన్:-

 లివర్ డిటాక్సిఫై చేయడంతో పాటు ప్రోటీనులను మరియు బయోకెమికల్స్ ను ఉత్పత్తి చేయడంతో జీర్ణక్రియకు బాగా సహాయపడుతాయి. ఉదయాన్నే పరకడుపున గోరువెచ్చని లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల అవసరం అయ్యే ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. లెమన్ వాటర్ యూరినేషన్ పెంచి కిడ్నీలను శుభ్రపరుస్తుంది మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

 శ్వాససంబంధిత సమస్యలకు చికిత్సవంటిది:-

జలుబు, దగ్గు వంటి సమస్యలే కాకుండా, ఆస్తమా మరియు అలర్జీలతో బాధపడే వారికి ఇది ఒక ఉత్తమ వంటింటి ఔషధం.

 మెరిసే చర్మం కోసం:-

 నిమ్మరసం శరీరంలో ముఖ్యమైన అవయవాలను శుభ్రం చేయడం మరియు డిటాక్సిఫై చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా కనబడుతుంది.

 యాంటీ ఏజింగ్:-

  ఉదయాన్నే నిమ్మరసం త్రాగడం వల్ల మరో గొప్ప ప్రయోజనం యాంటీఏజింగ్ వయస్సైన వారిగా కనబడనియ్యదు. ఇందులో ఉండే సిట్రిక్ ఆసిడ్ ముడుతలు మాత్రమే తగ్గించడం కాకుండా, మొటమలు, మచ్చలకు ఉత్తమం ఔషదం.

 ఓరల్ హెల్త్:-

ఈ సిట్రస్ ఫ్రూట్ నేచురల్ మౌత్ రిఫ్రెషనర్. చెడు శ్వాసతో పోరాడుతుంది మరియు సున్నితంగా నొప్పిని నివారిస్తుంది మరియు దంత క్షయంను నివారిస్తుంది.

 మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది:-

 గర్భిణీ స్త్రీలు ఎవరైతే మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడుతుంటారు అవారు గోరువెచ్చగా ఉండే లెమన్ వాటర్ ను ఒక గ్లాసు తీసుకోవడం వల్ల ఇది మార్నింగ్ సిక్ నెస్ మరియు వికారంకు విరుగుడుగా పనిచేస్తుంది.

 బౌల్ ను క్లీన్ చేస్తుంది:-

 ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్, మలబద్దక సమస్యలున్నప్పుడు లెమన్ వాటర్ ఒక నేచురల్ రెమెడీగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, శరీరం నుండి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇంకా బౌల్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తుంది.

 లిప్ సిస్టమ్ ను హైడ్రేట్ చేస్తుంది:-

 లెమన్ వాటర్ అడ్రినల్ అలసటను నివారిస్తుంది మరియు నిర్జలీకరణను నిరోధిస్తుంది. ఒత్తిడి, మలబద్దకం, విష సన్నాహాలు మొదల నివారించేందుకు లెమన్ వాటర్ కు మించిన మరో ఔషదం లేదు.

Friday, September 26, 2014

"ఆస్తి కొనేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు"

ఇటీవల కాలంలో ఆస్తి అమ్మకాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఒకే ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో చాలా మందికి విక్రయిస్తూ ఉంటారు ఆస్తి దారులు. ఐతే  ఇలాంటి మోసాలకు గురి కాకుండా ముందుగానే ఆస్తి కొనేముందు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
డాక్యుమెంట్ ఒరిజనలేనా:- సాధారణంగా ఆస్తి చాలా చేతులు మారుతుంది. ఐతే ఈ ఆస్తికి మూలం ఎక్కడిది అనేది తెలుసుకోవాలి. అంతే కాదు మొదటి ఓనర్ తాలుకా అన్ని వివరాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి.
 
చిక్కుముడులు:- హైద్రాబాద్ మహానగరంలో ఉన్న ఆస్తికి అక్కడి ప్రభుత్వ అనుమతులు అన్నీ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఉదాహారణకు హైదరాబాద్‌లో జీహెచ్‌ఎమ్‌సి నుంచి అన్ని అనుమతులు ఆ ఆస్తికి ఉన్నాయా లేదా పరిశీలించాలి.
 
ఓనర్లు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్:- మీరు కొనుగోలు చేసే ఆస్తికి ఎక్కువ మంది ఓనర్లు ఉన్నట్లైతే వారి వద్ద నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పకుండా తీసుకోవాలి.
 
రుణభారం సర్టిఫికెట్:- రిజిస్టర్ ఆఫీస్ నుండి ముఖ్యంగా ఈ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీని ఉపయోగం ఏమిటంటే మీరు కోనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి ఓనర్‌పై ఉందా లేదా అనేది తెలుస్తుంది.
పేరు:- ఎవరి వద్ద నుంచైతే మీరు ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటారో వారి పేరు.. అందులో ఉందో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలి.
 
ట్యాక్స్ సకాలంలో చెల్లిస్తున్నాడా:- ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్లేతే అతను సకాలంలో ట్యాక్స్ చెల్లిస్తున్నాడా.. లేదా సరి సరిచూసుకోండి. మహా నగరాల్లో సకాలంలో ట్యాక్స్ చెల్లించకపోతే ఇల్లు మీ పేరు మీదకు బదిలీ అవదు.

సొసైటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్:- కొన్ని కొన్ని ఆస్తులకు సొసైటీ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
 
మంచి లాయర్‌ను నియమించుకోండి:- లక్షల్లో డబ్బు పెట్టి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మంచి లాయర్‌ని కూడా సంప్రదించడం మంచి పద్దతి. ఎందుకంటే ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత ఏమైనా వివాదాలు వస్తే లాయర్ తప్పనిసరి కదా..


Thursday, September 25, 2014

మగవారి కోసం "మూడో వక్షోజం"

వాషింగ్టన్: మగవారిని ఆకర్షించేందుకు ఓ మహిళ మూడో వక్షోజాన్ని ఆపరేషన్ ద్వారా పొందింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. మన దేశంలో ఇటీవల క్లీవేజ్ గురించిన చర్చ జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. హీరోయిన్ దీపికా పదుకొణే తన వక్షోజాల గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు. తాను మహిళనని, వక్షోజాలు ఉంటాయన్న ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఇదిలా ఉండగా.. ఫ్లోరిడాలో ఓ యువతి మగవారిని ఆకర్షించేందుకు మూడో వక్షోజాన్ని పొందాలనుకోవడం గమనార్హం. అయితే, తనకు ఎవరితోను డేటింగ్ చేయాలనే ఆసక్తి లేదని చెబుతోంది.

ఫ్లోరిడాకు చెందిన జాస్మిన్ అనే 21 ఏళ్ల యువతి ఆపరేషన్ ద్వారా తన రెండు వక్షోజాల మధ్య మూడో వక్షోజాన్ని పొందింది. తాను ఈ మూడో వక్షోజాన్ని ఆపరేషన్ ద్వారా పొందేందుకు భారీగా ఖర్చయినట్లు చెప్పింది. కాగా, ఈ ఇరవై ఒక్కటేళ్ల యువతి మసాజ్ థెరపిస్ట్. ఆమె యాభై మంది డాక్టర్లను అప్రోచ్ అయి దీని గురించి తెలుసుకున్నారట.


ఈమె నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ పైన సంతకం చేసింది. దీంతో తాను మూడో వక్షోజం పొందేందుకు ఆపరేషన్ చేసిన వైద్యుల పేర్లను ఆమె వెల్లడించడం లేదు. ఈ సర్జరీని పలువురు తప్పు పట్టారు. ఈ ఆపరేషన్ చేసిన వైద్యులు వృత్తిధర్మాన్ని పక్కన పెట్టారని పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా, సదరు యువతి ఇప్పుడు ఆందోళనతో ఉందట. అయితే, ఆమె ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు.

Wednesday, September 24, 2014

"పోలీసుల్ని"కాపాడిన "క్రిమినల్"

వారందరూ ఏదో ఒక నేరం చేసి పోలీసులకు చిక్కి జైలుపాలైన నేరస్తులు. అయితే జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల చోటు చేసుకున్న భారీ వరదలు వారిలోని మంచితనాన్ని, మానవత్వాన్ని బయటికి తీశాయి. ఇటీవలి వరదల్లో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోవడమేగాక వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఈ నేపథ్యంలో కరుడుగట్టిన నేరస్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరదల్లో కొట్టుకుపోతున్న పలువురు పోలీసులను కాపాడారు. వరదలు వచ్చే ముందు పరారు కావాలనుకున్న ఓ దొంగ.. తన మనసు మార్చుకుని ప్రజలకు సహాయసహకారాలను అందిస్తున్న పోలీసులతోపాటు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. తన వృత్తిలో నేర్చుకున్న నైపుణ్యాన్ని ఓ ఇంట్లో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించేందుకు ఉపయోగించాడు.
వరదల్లో షాహీద్‌గంజ్‌లోని పోలీస్‌స్టేషన్ దాదాపు నీటిలో మునిగిపోయింది. దీంతో నాలుగు రోజులపాటు పోలీసులు, నేరస్తులు ఆ పోలీస్ స్టేషన్ భవనంపైనే ఉన్నారు. పయాజ్ అనే నేరస్తుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరద నీటిలో కొట్టుకుపోతున్న పలువురు పోలీసులను రక్షించాడని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
వరదనీటిలో చిక్కుకున్న ఓ ఇంట్లోని కుటుంబసభ్యులను ఓ దొంగ తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఆ ఇంట్లోకి ఓ తాడును పంపించి చెక్క సహాయం వారిని కాపాడాడు. మరో నేరస్తుడు ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్న పోలీసుల బృందంలో చేరి రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. గ్రేనడ్స్ కలిగి ఉండటంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వరదల సమయంలో అతడు పోలీసులకు సహాయం చేయడంతోపాటు వారికి తన ఇంటి నుంచి టీ తెప్పించి అందించాడు. ఇదంతా చూస్తుంటే.. కష్టకాలంలో మనుషుల్లో ఉన్న మంచితనం బయపడుతుందని తెలుస్తోంది కదూ!


Tuesday, September 23, 2014

"రేప్ కేసు నిందుతుల" కన్నా మంత్రి గారి "కుక్కే" మిన్న !

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ సిటీలోని వైశాలి నగర్‌లో జరిగిన దోపిడీ, అత్యాచార సంఘటనల కంటే... ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి  రాజేంద్ర రాథోడ్ కుక్క తప్పిపోయిందన్న ఫిర్యాదు అక్కడి పోలీసులకు మరింత తలనొప్పిగా మారింది. దీంతో గ్యాంగ్ రేప్, దోపిడీ కేసు విచారణను పక్కనబెట్టి.. కనిపించకుండా పోయిన కుక్కపిల్ల కోసం వారు గాలించడం మొదలుపెట్టారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సామూహిక అత్యాచారం, దోపిడీ కేసు విచారణలో తల మునకలై ఉన్న రాజస్థాన్ పోలీసులకు.. ఓ అర్జంట్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. దాంతో ఆ కేసును పక్కన పెట్టి అంతా రోడ్ల మీద పడ్డారు. విషయమేమిటంటే, ఓ మంత్రిగారు పెంచుకుంటున్న మూడేళ్ల కుక్కపిల్ల తప్పిపోయిందనీ, అది బీగిల్ జాతికి చెందిన చార్లీ అని, దీన్ని తక్షణం పట్టుకోవాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఇదే అంశంపై సొడాలా పోలీసు స్టేషన్ లో శనివారం సాయంత్రం ఫిర్యాదు కూడా చేశారు. వెంటనే అక్కడి పోలీసులు ఇతర స్టేషన్లకు కూడా సమాచారం ఇచ్చి, దాన్ని 'వీలైనంత తొందరగా' కనిపెట్టాలని చెప్పారు. ఫలితంగా ఆదివారం అంతా పోలీసులు ఆ కుక్కపిల్ల కోసం వెతుకుతూనే ఉన్నారు.
 
''కుక్కపిల్లలు, ఇతర పెంపుడు జంతువులు పోయాయన్న ఫిర్యాదులు మాకు రోజూ వస్తూనే ఉంటాయి. అది మంత్రిదైతే ఏమవుతుంది? అది కనిపించగానే మేం దాని యజమానికి అప్పగించాలి'' అని ఇన్ స్పెక్టర్ విద్యా ప్రకాష్ చెప్పారు. చార్లీ ఆచూకీ ఎవరైనా చెబితే వాళ్లకు రూ.10 వేల బహుమతి ఇస్తామంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే.. సామూహిక అత్యాచారం, దోపిడీ లాంటి పెద్దకేసును వదిలేసి ఇలాంటి కేసును పట్టుకోవడంపై పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. 


Friday, September 19, 2014

కిడ్నీ రోగాలకు దివ్యౌషధం "క్యాలీఫ్లవర్"!

కిడ్నీ సంబంధిత రోగాలకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి, పీచు అధికంగా ఉండటంతో కిడ్నీ రోగాలు దరిచేరవు. యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను డైట్‌లో చేర్చుకోవాల్సిందేనని వారు సూచిస్తున్నారు.  

 
కిడ్నీ రోగాలతో రక్తహీనత ఏర్పడుతుంది. శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా వెలివేసే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే క్యాలీఫ్లవర్‌ను తీసుకోవాలి. అలాకాకుంటే శరీరంలో బ్లడ్ సెల్స్ లెవల్స్ తగ్గిపోయి రక్తహీనత ఏర్పడుతుంది. 
 
తద్వారా నీరసం, అలసట ఆవహిస్తుంది. ఇలాంటి సమస్యలు దూరం కావాలంటే క్యాలీఫ్లవర్‌ను ఉడికించి కూరల్లో తీసుకోవడం సలాడ్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమమని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
మొలకెత్తిన విత్తనాలను కూడా ఆహారంగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చు. ఇవి కిడ్నీలో రాళ్లు రానీయకుండా నిరోధిస్తాయి. అలాగే కిడ్నీ రోగాలను నయం చేసుకునేందుకు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన ధాన్యాలతో పాటు ఆపిల్‌, ఎరుపు ద్రాక్షలు, చెర్రీ ఫ్రూట్స్, కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

 

Thursday, September 18, 2014

" నూడిల్స్ అతిగా తింటే "




నోరూరించే నూడుల్స్ అందరికీ ఇష్టమే.. అయితే దీన్ని మరీ అతిగా తినడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని ఓ స్టడీలో తేలింది. గుండె జబ్బులకు ఇది కూడా కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ దక్షిణ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలలో నూడుల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. 

ముఖ్యంగా సౌత్ కొరియావాసులు దీనిని ఎక్కువగా లాగించేస్తూ ఉంటారని, దీనివల్ల వారిలో హార్ట్ సమస్యలు ఏర్పడుతున్నాయని అమెరికాలోని  బేలర్ హార్ట్ అండ్ వాస్కులర్ ఆసుపత్రివర్గాల అధ్యయనంలో తెలియవచ్చింది.  కానీ .. ఈ స్టడీని వారు పట్టించుకోవడం లేదు. తాము ఇష్టంగా తినే నూడుల్స్ పై ఇలాంటి ప్రచారం తగదని అంటున్నారు. నూడుల్స్ లో ఉండే సోడియం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్న ఈ అధ్యయనాన్ని వాళ్ళు తోసిపుచ్చుతున్నారు.  పైగా దీన్ని సవాల్ చేస్తున్నారు. తాము వారానికి రెండు మూడు సార్లు దీనిని తింటున్నా తమకేమీ అనారోగ్య సూచనలు కనబడడం లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. సౌత్ కొరియా తరువాత చైనా, జపాన్ దేశాలు నూడుల్స్ వాడకంలో వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.

Wednesday, September 17, 2014

‘వయాగ్రా’ ఐస్‌క్రీం !!!

అసలు ఆడవాళ్లు శృంగారంలో నంబర్ వన్ అనేది త్రేతాయుగం నుంచి వస్తున్న వాదన. వాళ్లకు పేరు పెట్టే ధైర్యం ఎవరూ చేయలేదు. శృంగారానికి సంబంధించి ఏ మందొచ్చినా అది పురుషుల్లో శృంగార ఉద్ధీపనలు పెంచే విధంగానే తయారు చేయడం జరిగింది గానీ స్ర్తీలకు కాదు. అంతెందుకు ఇప్పుడీ మోడర్న్ సొసైటీలో కూడా ‘వయాగ్రా’ అనే ఔషధం మగాళ్లకే తప్ప మహిళలకు కాదనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.


ఇక అసలు విషయానికి వస్తే... ఇప్పటివరకు ట్యాబ్లెట్ల రూపంలో మార్కెట్లో లభిస్తున్న ఖరీదైన వయాగ్రా మెడిసిన్ ఇప్పుడు ఐస్‌క్రీం రూపంలో తయారుచేశారు. 'లిక్ మీ అయాం డెలీషియస్' అనే వెబ్ సైట్ ఈ వయాగ్రా ఐస్‌క్రీమ్‌ను ప్రమోట్ చేస్తోంది. ‘తమ వయాగ్రా ఐస్‌క్రీమ్ తుది ఫలితం పట్ల కొందరు సెలబ్రిటీ క్లయింట్లు 'సంతృప్తి' వ్యక్తం చేశార’ని సదరు వెబ్ సైట్ పేర్కొంది. అయితే, ఇది ప్రపంచ మార్కెట్లోకి వచ్చేందుకు చాలా సమయం పట్టనున్నట్టు చెబుతున్నారు. వయాగ్రాలో ఉండే సిల్డెనాఫిల్ సిట్రేట్ అనే మెడిసిన్ అసాధారణ రీతిలో అంగస్థంభన కలిగిస్తుందని ప్రయోగాల్లో రుజువైంది. ఈ ఔషధానికి 1998లో అనుమతి లభించింది.



 

Tuesday, September 16, 2014

"ఆకలి"


Saturday, September 13, 2014

" దేవుళ్ళకీ ఆధార్ కార్డులు"


 చూడబోతే దేవుళ్ళకీ ఆధార్ కార్డులు జారీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఓ ప్రభుత్వ తీరు అలా ఉంది మరి.. రాజస్తాన్‌లోని సికార్ జిల్లాలో ఓ పోస్టాఫీసుకు ఇటీవల ఓ ఆధార్ కార్డు చేరింది. ఈ కార్డుతో కూడిన కవరు మీద అడ్రస్ సరిగా లేకపోవడంతో ..కవరు చించి చూసిన పోస్ట్‌మన్ నోరు వెళ్ళబెట్టాడు. ఆ కవర్‌లోని ఆధార్ కార్డు మీద హనుమంతుని ఫోటో ఉంది.

కార్డు యజమాని పేరును హనుమాన్‌జీ సన్ ఆఫ్ పవన్‌జీ అని కూడా ఉందట..బహుశా ఇది అచ్చు తప్పు అయిఉంటుందని భావించిన పోస్టల్ సిబ్బంది ఆ హనుమాన్‌జీ ఎవరో కనుక్కునేందుకు యత్నించి విఫలమయ్యారు. కాగా.. ఈ కార్డు మీద ముద్రించి ఉన్న నెంబరు అంకిత్ అనే వ్యక్తిదట...ఆధార్ కార్డులు జారీ చేసే ఓ సంస్థలో ఇతడు  పని చేస్తున్నాడు. ఈ కార్డు విషయం మొత్తానికి అతనికి చేరింది. దీనిమీద తన నెంబరు ఎలా ప్రింట్ అయిందో తెలియదని అంకిత్ అంటున్నాడు. ఏమైనా ఈ ఆధార్ కార్డు యవ్వారం అక్కడ అందరినీ నవ్వించింది. బహుశా అంకిత్ ఫోటో బదులు పొరబాటున ఆంజనేయుని ఫోటోను ముద్రించి ఉండవచ్చునని భావిస్తున్నారు. 



Friday, September 12, 2014

'సర్వరోగనివారిణి'..."మంచినీరు"

నీళ్లు...మంచినీళ్లు. ఉదయంపూట కాళీ కడుపుతో ఒక్క నాలుగు గ్లాసులు తెరిపిస్తూ సేవిస్తే చాలు. దాదాపు 30నుంచి 50రోగాలకు మనం దూరంగా వుండ గలుగుతాం. శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటుంది. ఈ విషయాన్ని ఎప్పటినుంచో ప్రతి ఒక్క డాక్టర్, రిసెర్చ్ ఎనలిస్టులు చెబుతున్న అంశమే కదా అని లైట్ తీసుకోకండి. తాజా సర్వేలో మరిన్ని ఆశ్చర్యకరమైన వివరాలు వెల్లడయ్యాయి. 

ఇప్పుడు జపాన్ నగరవాసులు మార్నింగ్ లేచిన వెంటనే ఓ నాలుగు గ్లాసుల నీళ్లు తాగిన తర్వాతనే ఆరోజును ప్రారంభిస్తున్నారు. దీంతో వారు తలనొప్పి నుంచి ఒళ్లునొప్పులు, గుండె, ఆస్తమా, టీబీ వరకు చాలావాటి నుంచి రక్షిస్తోందని అంటున్నారు.
ఎలా...ఎంత...ఎప్పుడెప్పుడు తాగాలంటే...

 1 ఉదయం లేచిన వెంటనే ఓ నాలుగు గ్లాసుల నీళ్లు

2 ఆ నీళ్లు తాగిన తర్వాత 45నిమిషాల వరకు ఏమీ తినకుండా వుండాలి.

3 ఆ తర్వాత ఏదైనా తినొచ్చు...తాగొచ్చు

4 బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత దాదాపు 2గంటలవరకు ఏమీ తినకూడదు, తాగకూడదు.

5 వయస్సు పెద్దబడిన వాళ్లు, పేషెంట్లు ఇలా చేయలేని పక్షంలో ఒక గ్లాసు నుంచి తాగడం మొదలుపెట్టి మెలమెల్లగా నాలుగు గ్లాసులకు పెంచుకోవాలి.

6 తద్వారా రోగాలకు దూరంగా వుంటూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వుండొచ్చు.

 ఇంతకీ ఆ జబ్బుల వివరాలేంటో తెలుసుకోవాలనుందా?

 1 హై బ్లడ్ ప్రెషర్ -(నీళ్లు తాగిన 30రోజుల్లో కంట్రోల్‌ చేస్తుంది)

2 గ్యాస్‌ట్రిక్ (10రోజులు)

3 డయాబెటీస్ (30రోజులు)

4 మలబద్ధకం (10రోజులు)

5 టీబీ (90 రోజులు)

ఇవేకాకుండా...తలనొప్పి,ఒళ్లు, కీళ్లనొప్పులు, వేగంగా గుండె కొట్టుకోవడం, ఉబ్బసం, ఒబేసిటీ, ఆస్తమా, కిడ్నీ మరియు మూత్ర సమస్యలు, వాంతులు, పైల్స్, కంటికి సంబంధించిన వ్యాధులు, కేన్సర్ లాంటి ఎన్నో వ్యాధులను కేవలం ఉదయం ఓ నాలుగు గ్లాసుల మంచినీరు సేవించడం ద్వారా దూరంగా వుంచవచ్చు...జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.

Thursday, September 11, 2014

"నిజమైన నాయకుడు"





Wednesday, September 10, 2014

"ముగ్గులు తో వ్యాయామం"

 ముగ్గులు వేయడం అనేది స్త్రీలకు మంచి శారీరక వ్యాయామంగా చెప్పొచ్చు. ముగ్గు వేసేందుకు కూర్చోవడం, వంగడం, పైకి లేవడం, చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుంది. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది. 






Tuesday, September 9, 2014

"టచ్‌స్ర్కీన్‌" ను "క్లీన్" చేయటం ఏలా..?


టచ్‌స్ర్కీన్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించే వారు తరచూ స్ర్కీన్ క్లీనింగ్ విషయంలో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది. లేకుంటే టచ్‌ స్ర్కీన్ మన్నికను కోల్పోయే ప్రమాదముంది. ఈ క్రింద   టచ్‌స్ర్కీన్‌ను క్లీనింగ్ విషయంలో పాటించాల్సిన అంశాలను ప్రస్తావించటం జరిగింది.
స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి. లేదా క్లీనింగ్ కిట్‌తో వచ్చిన సొల్యూషన్‌ను ఉపయోగించండి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మైక్రో ఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడండి.

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలు ఇంకా ఆల్కాహాల్ ఆధారిత క్లీనర్లను ఉపయోగించొద్దు. స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతులతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.

Monday, September 8, 2014

"సచిన్‌కు గుడి"



క్రికెట్ దేవుడు, అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఆయన వీరాభిమానులు గుడి కట్టనున్నారు.

బీహార్‌లోని అతార్వాలియా ఓ చిన్న పట్టణం. అక్కడ 10 అడుగుల ఎత్తున్న సచిన్ విగ్రహం దర్శనమిస్తుంది. మార్బుల్ స్టోన్‌తో తయారైందా విగ్రహం. దీని బరువు 850 కేజీలుగా కాగా, ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో రూపొందించారు.

వరల్డ్ కప్ చేతబట్టుకుని ఉన్న రీతిలో సచిన్ దర్శనమిస్తాడక్కడ. ఇప్పుడా ప్రదేశంలో ఓ గుడి కట్టాలని వీరాభిమానులు నిర్ణయించారు. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ ఆరాధ్య క్రికెటర్ సచిన్‌కు ఆలయం నిర్మించాలనుకున్నారు.

అందులో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని సదరు వీరాభిమానులు సంకల్పించారు. ఈ ప్రతిపాదిత ఆలయానికి సమీపంలో భోజ్ పురి నటుడు మనోజ్ తివారీ స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియం కూడా నిర్మించనున్నారట.

Saturday, September 6, 2014

"లేటు" కన్నా "ఎర్లీ మ్యారేజ్‌లే" బెటర్ !


లేటు వయసు కంటే చిన్న వయస్సులో వివాహం చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. జీవితంలో ఆచరణాత్మక విషయాలు చాలా నేర్చుకోవడం, పిల్లల కోసం సమయం తీసుకోవటం అనేవి త్వరగా పెళ్లి చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలని వారంటున్నారు.
 
 లేటు వయసులో వివాహం చేసుకోవడం ద్వారా ఫలదీకరణ సామర్థ్యం తగ్గుతుంది. ఎక్కువ వయసు తర్వాత గర్భం పొందే మహిళలకు గర్భధారణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే చిన్న వయస్సులో అయితే ఇబ్బంది ఉండదు.
 
 * జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపవచ్చు. వారిని అర్థం చేసుకోవచ్చు.
 
* సరైన భాగస్వామి లభిస్తే డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవచ్చు.
 
* ఎనర్జిటిక్ తల్లిదండ్రులుగా ఉండొచ్చు.
 
* అన్యోన్యత పెరుగుతుంది.
 
* దాంపత్యం జీవితం బాగుంటుందని నిపుణులు అంటున్నారు.

Friday, September 5, 2014

"దానిమ్మ"తో ఆరోగ్యం ...!

 తినాలంటే ఓపిగ్గా గింజలు వలుచుకోవాలి... పోనీ కష్టపడి వలిచి తిందామా అంటే అద్బుతమైన రుచి కాదు. అర్ధమైంది కదా ఆపండెదో? అవును, దానిమ్మ! కాని ఈ పండు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.చూడ ముచ్చటైన రూపం, లోపల ముత్యాలాంటి గింజలతో ప్రతి ఒక్కరికీ నచ్చే ఫలం ఏదంటే దానిమ్మ అని ఠక్కున చెప్పవచ్చు. కేవలం రుచిగా ఉండే ఫలంగానే కాక మనలోని అనేక రకాల రుగ్మతలను నివారించే ఓ దివ్య ఔషధంగా దానిమ్మ ఉపయోగపడుతుందని తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు.
 
దానిమ్మ లో పొటాషియం, విటమిన్ "ఏ" విటమిన్ "సి" విటమిన్ "బి 6", ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. తరచూ తింటే ఇందులో ఉండే యాంటి అక్షిడెంట్స్, బ్రెస్ట్ , ప్రోస్టేట్ , స్కిన్ కాన్సెర్ , రాకుండా కాపాడుతాయి. సహజ వయగ్ర లాగ పనిచేసి అంగస్తంబన సమస్యను నివారిస్తాయి. రోజుకో గ్లాసు దానిమ్మరసం గర్బినిలకు ఎంతో ప్రయోజనకారి. దానివల్ల కడుపులో బిడ్డకు కావలసినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది.
 
క్రమం తప్పకుండ దానిమ్మ పండు తింటే చర్మం పై ముడతలు రాకుండా నివారిస్తుంది. నీళ్ళ విరేచినాలతో బాధపడుతున్నప్పుడు దానిమ్మరసం తాగితే త్వరగా ఉపసమనం లభిస్తుంది.
 
ఇందులో ఉండే యాంటి వైరల్, యాంటి బాక్టిరియాల్ గుణాలు గొంతు నొప్పులనూ నివారిస్తుంది. శరీరం లో కొవ్వు పేరుకోకుండా చూసేందుకు దానిమ్మ పండు చాల బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. దానిమ్మ లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు రొమ్ము ,పెద్ద పేగు ,ఊపిరి తిత్తుల కాన్సర్లు రాకుండా చూస్తుంది .
 
దానిమ్మ రసం అధిక రక్తపోటు సమస్య తగ్గిస్తుంది .ఆస్ట్రియో పోరోసిస్ ,మధుమేహం ,గుండె జబ్బు ల బారిన పడకుండా కాపాడుతుంది .ఇది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోనివ్వదు. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంద గ్రాముల దానిమ్మలో 83 కెలోరీలతో కూడిన సామర్థ్యం శరీరానికి లభిస్తుంది. ఇది ఆపిల్ కంటే అధికం. కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే దానిమ్మలో పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
 
100 గ్రాముల దానిమ్మలో నాలుగు గ్రాముల పీచు ఉంది. ఇది జీర్ణశక్తికి, ప్లేగు సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు రోజుకో దానిమ్మను తీసుకోవచ్చు. దీనిని క్రమం తప్పకుండా తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణ క్రమంగా ఉంటుంది. క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చు. విటమిన్ సి పుష్కలంగా ఉండే దానిమ్మలో ధాతువులు, క్యాల్షియం, కాపర్, పొటాషియం, మాంగనీస్‌లు కూడా ఉన్నాయి.

Thursday, September 4, 2014

"ఇన్విజిబుల్ మ్యాన్"


 

ఈ ఫొటోని క్షుణ్ణంగా గమనిస్తే అందులో మనకు ఓ వ్యక్తి కనిపిస్తాడు. అందులోవున్న మనిషి పిచ్చి ఏంటో తెలీదుగానీ నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ కనిపిస్తే అలాగే ఒదిగిపోతాడు. ఎప్పుడూ ఆయా సీన్లకు సంబంధించి పెయింటింగ్ వేసుకుంటూనే వుంటాడు.
 
ఇతని పేరు లియు బోలిన్.. చైనీస్ పెయింటరే కాదు మంచి శిల్పి కూడా! ఈయన్ని అందరూ ‘ఇన్విజిబుల్ మ్యాన్’గా పిలుస్తారు. ఎలాంటి పెయింటింగ్‌లో నైనా అలా కంటికి కనిపించగానే ఒదిగిపోతాడు. పుస్తకాలు, అరటితోటలు, కర్టన్లు, ద్వారాలు ఇలా ఒక్కటేంటి ఇలా కలిసిపోవడం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. తను నేర్చుకున్న విద్యతో ఏ బ్యాక్‌గ్రౌండ్‌లోనైనా ఒదిగిపోతాడు. తను నేర్చుకున్న కామౌఫ్లాగింగ్‌ కళలతో జీవితం గడిపేస్తున్నాడు. 






Wednesday, September 3, 2014

"బీరకాయ"లోని ఔషధగుణాలు !


 

ఆహారమంటే శక్తి! పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు... వీటి గురించే ఎక్కువగా మాట్లాడతాం.. వీటి గురించే ఎక్కువగా వింటుంటాం. కానీ ఇంతే ప్రాధాన్యం ఉన్న 'పీచు' గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం! మన ఆరోగ్యానికి ప్రాణంలాంటిది పీచు. వైద్యరంగం ఈ విషయాన్ని నానాటికీ బలంగా చెబుతోంది. వైద్య పరిశోధనలన్నీ... ఇప్పుడు పీచు పరమావశ్యకతనే చాటిచెబుతున్నాయి. క్యాన్సర్లు రాకుండా.. గుండె జబ్బులు రాకుండా.. కొలెస్ట్రాల్‌ పెరక్కుండా.. మధుమేహం రాకుండా.. వూబకాయం రాకుండా... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితాకు అంతుండదు. మన అన్నం పళ్లాన్ని నానా రకాల 'జంక్‌ ఫుడ్‌' ఆక్రమించేస్తున్న ఈ ఆధునిక కాలంలో పనిగట్టుకుని మరీ 'పీచు'ను ఎంచుకోవాల్సిన అవసరం పెరిగిపోతోంది.
 
పీచు శాకాహారంలోనే ఉంటుంది. మాంసాహారంలో ఉండదు. పీచుపదార్ధాలు తీసుకున్న ప్రతిసారీ తగినంతగా నీరు కూడా తాగాలి. బీరకాయలో పీచు అధికంగా ఉంటుంది కాబట్టి, దీన్ని మన రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవాలి. బీరకాయలో పందిర బీర, పొట్టి బీర, నేతిబీర, గుత్తిబీర అని వివిధ రకాలున్నాయి. అయితే ఈ బీరలో ఏఒక్కటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ బీరకాలయో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో నిజంగా డైటరీ ఫైబర్, విటమిన్ సి, రిబోఫ్లోవిన్, జింక్, థయమిన్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇన్ని సుగుణాలున్న ఈ బీరకాయలోని వైద్యపరమైన గుణాలు తెలుసుకుందాం...

రక్తాన్ని శుధ్ది చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది:-రక్తం శుధ్ది చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది మరియు కాలేయ ఆరోగ్యంను మెరుగుపరుస్తుంది. మరియు మధ్యం మత్తు వైపు వెళ్ళకుండా తగ్గించడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచే గుణాలు అధికం:- బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. విరేచన కారి లక్షణాలను ఇందులో ఎక్కువగా కనుగొనడం జరిగింది. అందువల్లనే పథ్యంగా బీరకాయ చాలామంచిది. మలబద్దం నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైల్స్ తో బాధపడే వారు దీన్ని తీసుకోవడం చాలా మంచిది. అంతే కాదు, పొట్ట యొక్క పనిసామర్థ్యం మీద అద్భుతంగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

కామెర్లను నివారిస్తుంది:-కామెర్లను నివారించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కామెర్లతో బాధపడేవారు, జీరకాయలోని తెల్లటి గూడే, గింజలతో సహా తీసుకోవడం వల్ల కామెర్లను నివారించవచ్చు.

డయాబెటిస్ అరికడుతుంది:- బీరకాయలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు మధుమేహాన్ని నిరోధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది . బీరకాయలోని పెప్టైడ్స్ బ్లడ్ మరియు యూరిన్ లోని షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు బ్లడ్ ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:- బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, బరువు తగ్గించే డైట్ లిస్ట్ లో దీన్ని చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ, మరియు చాలా తక్కువ కొలెస్ట్రాల్ తీసుకొనేందుకు సహాయపడుతుంది. చాలా తక్కువ ఫ్యాట్ క్యాలరీలను కలిగి ఉండి, ఎక్కువ నీటిశాతం కలిగి ఉంటుంది. కాబట్టి, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలిఅవ్వనివ్వదు మరియు ఇందులోని డైటరీ ఫైబర్ , విటమిన్స్ మరియు మినిరల్స్ బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

రోగనిధోక శక్తిని పెంచుతుంది:-ఎటువంటి అనారోగ్యానికైనా గురైనప్పుడు చాలా త్వరగా కోలుకొనేలా చేస్తుంది. అంతటి శక్తికలిగిన బీరకాయను జ్యూస్ రూపంలో తీసుకవడం వల్ల శరీరంలో జీవక్రియలు చురుకు పనిచేసేలా, త్వరగా తేరుకొనేందుకు సహాయపడుతుంది. ఏ ఇన్ఫెక్షనస్ అయినా, ఏ వైరస్ లు శరీరానికి సోకుండా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు బీరకాయ రసం త్రాగితే రోగనిరోధక శక్తిని పెంపొంధించుకోవచ్చు.

చర్మ సంరక్షణకు:- బీరకాయను పేస్ట్ చేసి లేదా చక్రాల్లా నేరుగా అలాగే పొడి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని చాలా కాంతివంతంగా మరియు మెటిమలు మచ్చలులేని చర్మంగా తయారుచేస్తుంది. మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడంలో సహాయపడే అద్భుతమైన మూలకం ఇందులో ఉంది. అంతే కాదు ఇది శరీర నిర్వహణకు మరియు పాదాల దుర్వాసన నివారించడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది.

కడుపుకు చాలా మంచిది:- బీరకాయలోని సెల్యులోజ్ కడుపు, ఉదర సంబంధిత సమస్యలు నివారించడంలో మరియు పైల్స్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

కళ్ళకు చాలా మేలు చేస్తుంది:-బీరకాయలో డైటరీ ఫైబర్ తో పాటు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది

యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలం:-బీరకాయలో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర మొత్తం శుధ్ది చేసే, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి, శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది . ఇది చర్మం సంరక్షణలో హోం ట్రీట్మెంట్ పరిష్కారంగా ఉపయోగించవచ్చు.

Tuesday, September 2, 2014

"శృంగారానికి ముందు" తినవలసిన ఫుడ్స్ ?


ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి మీకు తెలుసా?ఖచ్చితంగా అనేక ప్రయోజనాలున్నాయి, ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అని అంటారు. ఎందుకంటే ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల హార్ట్ కు మరియు వ్యాధినిరోధకతకు చాలా మంచిది. అయితే మీరు అలసిపోయి ఇంటికి చేరుకుంటే?అందుకోసం ఒక చక్కటి చిట్కా ఉంది. నోటికి రుచికరంగా తియ్యని పదార్థాలు తినండి. ఇవి మీ స్టామినా అందిస్తాయి. అంతే కాదు, ఇవి మీరు రోజంతా కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందేలా చేస్తాయి. అప్పుడు సంతోషంగా మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేలా హార్మోనులను ప్రేరేపిస్తాయి.

శృంగార క్రియకు ముందు పడుకొనే ముందు తీసుకొనే ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కంటే, కొన్ని ఆరోగ్యకరమైన స్వీట్ ఫుడ్స్ తీసుకోవడం ఉత్తమం. స్వీట్ ఫుడ్స్ అంట్ నేచురల్ షుగర్ కలిగినటువంటి ఫిగ్స్ పండ్లు ఇవి మీలో స్టామినాను పెంచుతాయి. రాత్రుల్లో మీ భాగస్వామితో హాయిగా గడుపుతారు.

అలాగే సలాడ్స్ లో టమోటోల ముక్కలను జోడించి డిన్నర్ కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇటువంటి నేచురల్ స్వీట్ ఫుడ్స్ ను మీరు శృంగారంలో పాల్గొనడానికి ముందుగా తీసుకొన్నట్లైతే మిమ్మల్ని ఎనర్జిటిక్ గా మరియు ఫిట్ గా ఉంచుతుంది. అటువంటి స్వీట్ ఫుడ్స్ లిస్ట్ ను ఈక్రింది విధంగా లిస్ట్ అవుట్ చేసి అందివ్వడం జరిగింది. అయితే గుర్తుంచుకోవల్సి విషయం ఏంటంటే, ఈ ఫుడ్స్ తినడం వల్ల మీలో ఎనర్జీలు నింపడానికి మాత్రమే ఈ స్వీట్ ఫుడ్స్ సహాయపడుతాయిని గ్రహించాలి. కానీ, తక్షణమే ప్రభావం చూపుతాయని మాత్రం ఆశించ కండి. మరి స్వీట్ ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం...


టమోటో:- రాత్రుల్తో మీరు తినే ఆహారాల్లో మరికొంత అదనంగా టమోటోలను జోడించండి. ఇది మీ ఫర్ఫెక్ట్ లవ్ మేకింగ్ నైట్ కోసం మీకు అవసరం అయ్యే స్టామినా అందిస్తుంది. టమోటోలో ఉండే లైకోపిన్ అనే అంశం సెక్స్ సామర్థ్యం ను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

బాదం మిల్క్:- బెడ్ మీదకు పోయే ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి ఎనర్జీని పొందవచ్చు. అది మీకు రాత్రి సమయంలో ఎంతో సహాయపడుతుంది.

ఫిగ్స్ :-ఇది ఒక ఫ్రూట్. ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి, లిబిడోను మెరుగుపరుస్తుంది . ఈ చిన్నఫ్రూట్ తినడం వల్ల వండర్ ఫుల్ అనుభవం ఉంటుంది.

డార్క్ చాక్లెట్ :- శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెంచడంతో పాటు, ఇందులో ఉండే థియోబ్రొమైన్ అనే కంటెంట్ నేచురల్ ఎనర్జీని అందించి మంచి మూడ్ ను అందిస్తుంది.

అవొకాడో :- ఈ పండును టెస్టికల్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ హెల్తీ స్వీట్ ఫుడ్ శృంగారంలో పాల్గొనడానికి ముందు మీరు తీసుకొనే ఆహారంలో చేర్చుకోవాలి. అయితే పురుషులు మాత్రం పరిమితంగా తీసుకోవాలి. లేదంటే త్వరగా శీఘ్రస్ఖలం అయ్యే అవకాశం ఉంది.

తేనె :- తేనె మరో హెల్తీ స్వీట్ ఫుడ్. దీన్నిబెడ్ మీదకు చేరే ముందు తినవచ్చు . ఇందులో బిటమిన్ బి అధికంగా ఉండే టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది . అలాగే స్టామినా పెంచే ఒక ఎనర్జెటిక్ ఫుడ్ ఇది. కాబట్టి మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

క్యారెట్ :- స్టామినా పెంచడంలో అద్భుతమైన స్వీట్ ఫుడ్ క్యారెట్. క్యారెట్ ను పచ్చిగా లేదా ఉడికించి కూడా తీసుకోవచ్చు. ఇందులో చెప్పలేనన్ని విటమిన్స్ ఉన్నాయి. ఇవి మీలో తగినంత ఎనర్జీని అందిస్తాయి.

 పుచ్చకాయ:- శృంగారంలో పాల్గొనడానికి ముందు ఒక పెద్ద బౌల్ల్ పుచ్చకాయ ముక్కలను తీసుకోవాలి . ఇందులో ఉండే సిట్రోలైన్ రక్తకణాలను తెరచుకొనేలా చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది . ఇది క్రమంగా కామేచ్చను పెంచుతుంది.

దానిమ్మ :-శృంగారంలో పాల్గొనడానికి ముందు ఈ రెడ్ ఫ్రూట్ తీసుకోవడం చాలా మంచిది. ఇది జెనిటల్ ఆర్గాన్స్ కు రక్తప్రవాహాన్నిమెరుగుపరుస్తుంది.

Monday, September 1, 2014

దేవుడా? మజాకా !

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఏది మాట్లాడినా సెన్సేషన్‌గానే మారుతోంది. ఎప్పుడూ దేవుడు కంటే దెయ్యాలే మంచివని వాదించే ఈ దర్శకుడు, ప్రస్తుతం ఆస్తికుడిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వున్నట్లుండి ఇతనిలో ఈ మార్పు ఏంటా అని అనుకుంటున్నారా..? తన సినిమాలు వరసగా ప్లాప్ కావడానికి దేవుళ్లను దూషించడమే కారణమంటూ మనసులోని మాట బయటపెట్టేశాడు. అందుకే తాను భక్తుడిగా మారుతానంటూ ట్వీట్ చేశాడు.
 
దేవుడు మంచివాడైతే మెదక్‌లో జరిగిన రైల్వే గేట్ ప్రమాదంలో చిన్నారులను ఎందుకు పొట్టన పెట్టుకుంటాడు అంటూ గతంలో వర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! ఇంతలోనే మార్పు ఎలా సాధ్యమంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు. అంటే తన సినిమాలు హిట్ కావాలని ఒక విధంగా దేవుణ్ని ప్రార్థించడమేకదా అంటూ ఇండస్ర్టీలో సెటైర్లు వినిపిస్తున్నాయి.