CSS Drop Down Menu

Thursday, December 31, 2015

ఆక్వేరియం లో "లిఫ్ట్" చూసారా ?

జర్మనీ రాజదాని బెర్లిన్ నగరంలో రాడిసన్ బ్లూ హోటల్లో ప్రపంచంలోనే 82 అడుగుల అతిపెద్ద సిలిండ్రికల్ ఆక్వేరియం టేంక్ ఆక్రిలిక్ గ్లాస్ తో నిర్మించారు.

దీనిలో 2,60,000 గేలన్ల సముద్రపు నీటితో నింపి దానిలో 97 జాతులకు చెందిన 1500 రకాల చేపలను పెంచుతున్నారు.

వీటికి రోజూ ముగ్గురు లేదా నలుగురు డైవర్స్ 18 పౌండ్స్ ఆహారాన్నిఅందిస్తారు. దీని మధ్యలో ట్రన్సపరెంట్ ఎలివేటర్ ఉంటుంది.





Wednesday, December 30, 2015

"తల 180 డిగ్రీల్లో ముందుకు, వెనక్కూ తిప్పడం" ఎక్కడైనా చూసారా ?

ఏరా? తల తిరుగుతోందా? అనే ప్రశ్న మీరందరూ వినే ఉంటారు. కానీ అదే ప్రశ్న ఈ పిల్లాణ్ని అడిగితే మాత్రం అవును. తిరుగుతోంది. అదీ 180 డిగ్రీల్లో .. అని సమాధానం ఇస్తాడు.. ఈ తలతిరుగుడు  గురించి వివరాల్లోకి వెళ్తే.. అనగనగా ఒక బుడ్డోడు. వాడికి  అందరి లాగే  మెడ కాయ మీద తలకాయ ఉంది. సో వాట్ ? అని అందరిలా రొటీన్  క్వశ్చన్ వేయకండి. వాడి తల వాడు చెప్పినట్టే వింటుంది. ఎటు తిరగమంటే అటు తిరుగుతుంది.
 కూర్చున్న చోటు నుంచి వళ్లేమాత్రం కదల్చకుండా కేవలం తల మాత్రమే తిప్పేస్తాడు. వినడానికీ, చూడ్డానికీ ఆశ్చర్యంగా ఉన్నా...ఇది  నిజంగా నిజం..ఆ పిల్లాడి తల వేరీ ఫ్లెక్సిబుల్. ఈ పిల్లాడి వెనుక నంచి పలకరించినా, విష్ చేసినా బాడీ కదల్చకుండా తలమాత్రం వెనక్కి  తిప్పి పలకరించేస్తాడు. ఈ సీన్ డైరెక్ట్ గా చూసిన వాళ్లు, యూట్యూబ్ లో వీడియో చూసిన వాళ్లూ షాక్.  ఇప్పటికే  రెండు లక్షల మందికి పైగా చూసేశారు. హారర్  మూవీలో సీన్లను తలపించేలా తల 180 డిగ్రీల్లో ముందుకు, వెనక్కూ, పక్కకు  తిల తిప్పుతుంటే చూసిన వాళ్ళకు నోట మాట రావడం లేదు. అయితే పొరబాటున కూడా మిగతా పిల్లలెవ్వరూ ఈ ఫీట్ ను ట్రై చేయకండి అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
ఈ పిల్లాడిని చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.




Tuesday, December 29, 2015

"గొడుగుల వీధు"లను ఎక్కడైనా చూసారా?

గొడుగులతో అలంకరించిన వీధులను మీరు ఎక్కడైనా చూసారా? చూడకపోతే ప్రతి సంవత్సరం జూలై నెలలో Agueda a municipality in Portugal లో రంగు రంగుల గొడుగులతో అలంకరించిన వీధులను చూడవచ్చు.





Monday, December 28, 2015

కూతురి పాలిట "విలన్" గా మారనున్నహీరో ?

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కు గతకొద్ది కాలంగా అట్టర్ ఫ్లాప్ లే ఎదురవుతున్నాయి. ఎంతో కష్టపడి తీసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోతుంది. దీంతో ఇక హీరోగా తన స్థాయిని పక్కనపెట్టి, నటుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాడు. విలన్ పాత్రలో నటించడానికి రాజశేఖర్ సిద్ధమవుతున్నాడు.

జగపతిబాబు తరహాలో విలన్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ, రాజశేఖర్ ఏ సినిమాను కూడా ఒప్పుకోలేదు. ఇటీవలే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎవడో ఒకడు’ సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించాలంటూ దిల్ రాజు అడిగినప్పటికీ,... రాజశేఖర్ ఒప్పుకోలేదట. కానీ తాజాగా తన కూతురు సినిమాలో విలన్ గా నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ‘వందకు వంద’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇందులో రాజశేఖర్ ఓ నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. మరి ఈ ‘వందకు వంద’ సినిమాతో అటు శివానికి, ఇటు రాజశేఖర్ కు ఎలాంటి సక్సెస్ ను అందించనుందో త్వరలోనే తెలియనుంది.

Saturday, December 26, 2015

‘అఖిల్’ సినిమా చేసి తప్పు చేశా ?


‘అఖిల్’ మూవీ డిజాస్టర్ అయ్యాక ఇన్నాళ్ళకు డైరెక్టర్ వీవీ వినాయక్ నోరు విప్పాడు. ఆ సినిమా చేసి తాను పెద్ద పొరబాటు చేశానని, లాస్‌కు కారకుడైన తనను హీరో అఖిల్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ క్షమించాలని కోరాడు. ‘ఇక నుంచి మరింత ఎలర్ట్‌గా ఉంటా.. మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడతా’ అని ఓపెన్‌గా చెప్పాడు. రాజమౌళి తప్ప ఈ సినీ పరిశ్రమలో అందరూ పొరబాట్లు చేసేవాళ్ళేనని, తన కెరీర్‌లో మొట్టమొదటి సారిగా ‘అఖిల్’ సినిమా చేసి తప్పు చేశానని అన్నాడు.













Wednesday, December 23, 2015

"పాదాల పగుళ్ళ" నివారణకు చిట్కాలు !

మారుతున్న వాతావారణ పరిస్థితుల కారణంగా మానవ శరీరానికి అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. అందులో ఇతర సమస్యల గురించి కాస్త పక్కనపెడితే.. సాధారణంగా చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా బాధిస్తుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లక్కూడా సంభవిస్తుంది. ఈ సమస్య మొదట్లో అంతగా ప్రభావం చూపదుగానీ.. రానురాను చాలా ప్రాబ్లమ్స్’ను క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి.. ఈ పగుళ్ల లక్షణాలు కనబడిన వెంటనే వాటిని నివారించుకుంటే మంచిది.

1. వంటనూనె : వంటకాల్లో ఉపయోగించే ఏ నూనెతోనైనా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ముందుగా పాదాలను ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్ది మృత చర్మం, మురికి వదిలించాలి. తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి నూనె అప్లై చేయాలి. తర్వాత సాక్స్‌ వేసుకుని పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

2. బియ్యం పిండి : బియ్యం పిండిలో కాస్త తేనె, యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ చేర్చి పేస్ట్‌లా తయారుచేయాలి. గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలపాటు పాదాలను నానబెట్టిన అనంతరం ఈ పేస్ట్‌తో రుద్ది శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడిచి నూనె పూసుకుని సాక్స్‌ వేసుకుని పడుకోవాలి.
 
3. వేపాకు : ఈ ఆకులో పాదాల పగుళ్లనుంచి రక్షణ కల్పించే యాంటీఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా వుంటాయి. గుప్పెడు వేపాకుకు స్పూను పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనెతో మర్దిన చేసుకోవాలి.

4. రోజ్‌ వాటర్‌ - గ్లిజరిన్‌ : గ్లిజరిన్‌ చర్మాన్ని మృదువుగా తయారుచేస్తే.. రోజ్‌ వాటర్‌లోని ఎ, డి, ఇ, సి, బి3 విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి. ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి రోజూ నిద్రపోవడానికి ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి.

5. ప్యారాఫిన్‌ వ్యాక్స్‌ : పారాఫిన్‌ వ్యాక్స్‌కు ఆవ నూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి వేడిచేయాలి. వ్యాక్స్‌ పూర్తిగా కరిగేంతవరకూ వేడిచేసి పూర్తిగా చల్లార్చాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేయాలి.

Tuesday, December 22, 2015

"సిక్స్ ప్యాక్" చేస్తున్న స్టార్ కమెడియన్ ?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా యమా బిజీగా ఉన్న 30 ఇయర్స్ పృథ్వి ఓ భారీ సాహసానికి రెడీ అవుతున్నాడు. యంగ్ హీరోలు కూడా రిస్క్ అనుకునే సిక్స్ ప్యాక్ సాధించటానికి కండలు కరిగిస్తున్నాడు. ఈ విషయాన్ని పృథ్వి స్వయంగా ప్రకటించాడు. తెలుగులో మంచి ఫాంలో ఉన్న పృథ్వి ఇంత రిస్క్ తీసుకుంటుంది మాత్రం తెలుగు సినిమా కోసం కాదట. ఇప్పుడిప్పుడే కోలీవుడ్ లో కూడా ఫాం అందుకుంటున్న ఈ కామెడీ స్టార్, ఓ తమిళ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసే పనిలో ఉన్నాడు.

గతంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ కూడా సిక్స్ ప్యాక్ లో సందడి చేశాడు. అయితే సునీల్ హీరో అయ్యాకే సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. కానీ పృథ్వి మాత్రం కామెడీ పాత్ర కోసమే ఇంత రిస్క్ చేస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలో మూగవాడి పాత్రలో నటిస్తున్న పృథ్వి, ఆ సినిమా క్లైమాక్స్ లో షర్ట్ విప్పి కనిపించే సీన్స్ ఉన్నాయట, ఆ సీన్స్ లో సిక్స్ ప్యాక్ చేస్తే బాగుంటుందని అజిత్ సలహా ఇవ్వటంతో ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు ఈ కామెడీ స్టార్.



Monday, December 21, 2015

క్షమాపణ చెప్పిన "జూ.ఎన్టీఆర్" ?

గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్- బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. సినీ, రాజకీయ పరంగా వీరిమధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే, వీటికి బలం చేకూర్చేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యకు సారీ చెప్పారంటూ ఓ ఇంగ్లీష్ డైలీ తాజాగా ఓ వార్తా కథనం ప్రచురించింది. ఇటీవలే బాలకృష్ణకు ఫోన్ చేసి జూ. ఎన్టీఆర్  క్షమాపణ చెప్పారని తెలిపింది. ఇద్దరికి సన్నిహితుడైన ఒక సీనియర్ నటుడి ఫోన్ నుంచి జూనియర్ ఫోన్ చేసి బాలకృష్ణకు క్షమాపణలు చెప్పారని చెప్పింది.

అంతేకాదు,  కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల ప్రభావం ఎన్టీఆర్  కెరీర్ పై పడిందని చెప్పింది. ఇదిలాఉంటే, సంక్రాంతికి  బాబాయ్,  అబ్బాయ్ పోటాపోటీ గా సినిమాలు రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమైపోయారు. కాని తాజా పరిణామాల అనంతరం జూ. ఎన్టీఆర్ ఓ అడుగువెనక్కువేసి తన సినిమా రిలీజ్ ని వారం పాటు వాయిదా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జూనియర్ సినిమా ఆడియో విడుదలకు బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, దీనికి బాలకృష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. 


Saturday, December 19, 2015

హీరో "చెంప ఛెళ్లుమనిపించిన" హీరోయిన్ ?

1990లో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన 'ఘయాల్'కి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. 'ఘయాల్ వన్స్ ఎగైన్' పేరుతో వస్తోన్న ఈ మూవీ లో హీరోగా సన్నిడియోల్, హీరోయిన్ గా సోహఅలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోని హీరోయిన్ చెంప ఛెళ్లుమనిపించే సన్నివేశంలో నటించాల్సి వుంది.
 ఇందులో భాగంగా సీన్ షూట్ చేస్తున్నప్పుడు చెంపపై కొట్టినట్లుగా నటించాల్సిందిపోయి నిజంగానే సన్నీ చెంప ఛెళ్లుమనిపించిందట సోహఅలీఖాన్. దీంతో హీరో సన్నిడియోల్ ఏంజరుగుతుందో అర్థంకాక నిర్ఘాంతపోతే, హీరోయిన్ తీరు చూసి  సినిమా యూనిట్ అంతా బిత్తరపోయిందట. అసలెందుకు సోహ ఇలాంటి పనిచేసిందన్నది ఇప్పడు బాలీవుడ్ లో హాట్ న్యూస్ అయికూర్చుంది. 

Friday, December 18, 2015

"అతినిద్ర"ప్రాణాన్ని హరిస్తుందా?

సాధారణంగా అతిగా మద్యం సేవించినా.. పొగ తాగినా ప్రాణాలకు హాని కలుగుతుందని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్శిటీకి జరిపిన తాజా పరిశోధనలో అతిగా నిద్రపోవడం కూడా ప్రాణానికి హాని కలిగినట్టేనని చెపుతున్నారు. ఈ ముప్పు... అతిగా మద్యం సేవించడం కంటే ఎక్కువ ముప్పు అని ఈ పరిశోధన తేల్చింది. 
 
రోజుకు తొమ్మిది గంటలకు మించి నిద్రపోతే తొందరగా చచ్చిపోతారని తేల్చారు. ఈ పరిశోధనను 2,30,000 మంది ఆరోగ్య పరిస్థితిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అతిగా మద్యపానం, ధూమపానం చేసిన వారి కంటే అతిగా నిద్రపోయేవారు చనిపోవడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
దీనికితోడు ఎక్కువ నిద్రపోయేవారు, ఎక్కువసేపు కూర్చునేవారు చనిపోవడానికి ఉండే అవకాశాలు సాధారణ వ్యక్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగిన వారు సరాసరి ఆరు గంటలు పడుకుంటే క్షేమదాయకమని... మద్యం సేవించే వారు ఏడు గంటలు పడుకోవడం ఉత్తమమని ఈ పరిశోధకులు వెల్లడించారు. 


Thursday, December 17, 2015

కమల్ ని ఆలింగనం చేసుకుని "4 రోజులు స్నానం చేయలేదన్న" నటుడు ?


కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలక్షణ నటుడు కమల్ హాసన్‌ను ఒక్కసారి హత్తుకున్నానని (ఆలింగనం) ఆ తర్వాత నాలుగు రోజుల పాటు తాను స్నానం చేయలేదని చెప్పుకొచ్చారు. దీనికి కారణం లేకపోలేదన్నారు. 

విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని, వల్లమాలిన అభిమానమన్నారు. అందుకే ఒకసారి కమల్ హాసన్ తనను ఆలింగనం చేసుకున్నపుడు నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు. ఎందుకంటే ఆయన్ని హత్తుకున్న పరిమళం తనను వీడిపోవడం ఇష్టంలేక అలా చేశానని వెల్లడించారు. 

Wednesday, December 16, 2015

"అంకె"లతో "ముఖ" చిత్రాలు !









Tuesday, December 15, 2015

టీ, కాఫీలను తాగడానికి "ముందుగా" ఏం చెయ్యాలి ?

 టీ, కాఫీలను తాగడానికి ముందుగా ఒక గ్లాసు నీటిని తాగాలి.ఎందుకంటే టీ లోPH విలువ 6, కాఫీలో PH విలువ 5 ఉంటుంది. వీటిని తాగితే కడుపులో
అసిడిటి ఏర్పడి, అల్సర్లుగా మారే అవకాశం ఉంటుంది.కాబట్టి టీ, కాఫీలను తాగడానికిముందుగా ఒక గ్లాసు నీటిని తాగినట్లయితే అసిడిటి స్థాయిని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు.

Monday, December 14, 2015

హీరో ఛాన్స్ దేవిశ్రీకి ప్లస్సా ? మైనస్సా ??

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు సింగం 3 డైరెక్టర్ షాక్ ఇచ్చాడు. ఇప్పటివరకూ వచ్చిన సింగం 1, సింగం 2 చిత్రాలకు దేవిశ్రీ చేతనే సంగీతం చేయించారు. కానీ తాజాగా తీస్తున్న సింగం 3 చిత్రానికి సంగీతం వహించే బాధ్యత నుంచి దేవిశ్రీని తప్పించేశాడు దర్శకుడు హరి. ఈ బాధ్యతను హారిస్ జయరాజ్ కు అప్పగించినట్లు సమాచారం.
 
దేవిశ్రీని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించడం వెనుక పలు కారణాలున్నాయని అంటున్నారు. నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో రాబోయే చిత్రాలకు మ్యూజిక్ ఇస్తూ దేవిశ్రీ బాగా బిజీ అయిపోయాడు. మరోవైపు దిల్ రాజు నిర్మాతగా, సుకుమార్ దర్శకత్వంలో హీరోగా నటించబోతున్నాడు. హీరో అయిపోతున్న మ్యూజిక్ డైరెక్టరుతో ఇక మ్యూజిక్ ఏం చేయిస్తాం అనే ఆలోచనలో కోలీవుడ్ దర్శకులు ఉన్నట్లు సమాచారం. మరి ఇది దేవిశ్రీకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి.

Wednesday, December 9, 2015

ఇంటికెళ్లి కోన వెంకట్‌ని కొడతానన్న హీరోయిన్ ?

నిఖిల్ హీరోగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘శంఖరాభరణం' సినిమా ప్రమోషన్ లో భాగంగా మా టీవీ లో ప్రసారం అవుతున్న ‘మా టాకీస్' షో కి వెళ్ళిన చిత్ర యూనిట్ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న మాజీ హీరోయిన్ రాశి కామెంట్స్ విని షాకయ్యారు. ఈ కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడున్న సమయంలో రాశి కల్పించుకుని పాత ‘శంఖరాభరణం' గొప్ప మూవీ, పైగా సంగీత ప్రధాన చిత్రం. మీరు చేసిన క్రైమ్ కామెడీ కథకి శంకరా భరణం లాంటి గొప్ప టైటిల్ పెట్టడం ఏంటి ? అని ప్రశ్నిస్తూనే ఒకవేళ సినిమా బాగోలేక పొతే మాత్రం మీ ఇంటికొచ్చి మరీ కొడతాను అని అనేసింది. మరి ఆ కామెంట్స్ ఆమె నోటి నుండి అనుకోకుండా వచ్చాయో? లేక రాశి కావాలనే అలా మాట్లాడిందా? అనేది హాట్ టాపిక్ అయింది.





Tuesday, December 8, 2015

బిస్కట్లు తింటే "జ్ఞాపకశక్తి " తగ్గిపోతుందా?

బిస్కట్లు తింటే బుర్ర పనిచేయదా? అవుననే అంటున్నాయి కొత్త పరిశోధనలు. అదేపనిగా బిస్కట్లు, కేకులు తింటే మెమొరీ దెబ్బతినే ప్రమాదముందంటున్నారు. దీనికి కారణం బిస్కట్లు, కేకుల ప్రాసెసింగ్ సమయంలో బిస్కట్లు  కరకరలాడేందుకు, కేకులకు మంచి ప్లేవర్ రావడానికి వాడే ట్రాన్స్‌ఫ్యాట్స్ అనే కొన్నిరకాల కొవ్వు పదార్దాలే. దీనితో బాటు హైడ్రోజెనేటెడ్ ఆయిల్స్ వాడటం వల్ల ఆరోగ్యంపై చెడుప్రభావం చూపుతుందని సైంటిస్టులు తేల్చారు.
 ట్రాన్స్‌‌‌‌ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కట్లు, కేకులు ఎక్కువగా తినేవారిలో మెమొరీ పవర్ తగ్గి పోయే ప్రమాదముందంటున్నారు సైంటిస్ట్‌లు. బిస్కట్లు, కేకుల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావం గురించి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్ర్తవేత్తలు 45 ఏళ్లలోపు వయసున్న వెయ్యిమందిపై పరిశోధనలు చేశారు. ట్రాన్స్‌ఫ్యాట్స్‌తో కూడిన బిస్కట్లు, కేకులు అధికంగా తిన్నవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడాన్ని గమనించారు. మరికొంతమందిలో అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు బయట పడ్డాయి. బ్రిటన్‌లో ఈ ఫ్యాట్స్ వాడకాన్ని దాదాపు నిషేధించినంత పని చేశారు.

Monday, December 7, 2015

కలాం ఆస్తుల జప్తుకు ఆదేశాలు ! బీఎస్ఎన్ఎల్ నిర్వాకం ?

దేశం గర్వించదగిన శాస్ర్తవేత్త, మాజీ రాష్ర్టపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం గురించి అందరికీ తెల్సిందే! ఆయన మరణించి దాదాపు నాలుగునెలలు అవుతోంది. యావత్తు వరల్డ్  ఆయన్ని గుర్తించినా, ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మాత్రం గుర్తించలేదు.
 తనకు బకాయిపడ్డ స్వల్ప మొత్తాన్ని చెల్లించాలంటూ కలాంకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు బకాయి చెల్లించని పక్షంలో కలాంకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కూడా తన దిగువస్థాయి సిబ్బందికి ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసేసింది. ఇంతకీ మాజీ రాష్ర్టపతి పడిన బకాయి ఎంతో తెలుసా? కేవలం రూ.1029 మాత్రమే(phone no 2724800).
 ఐదేళ్ల కిందట అంటే 2010లో తిరువనంతపురం టూర్‌లో భాగంగా కేరళ రాజ్‌భవన్‌లో రెండురోజులు బస చేశారు. ఈ సందర్భానికి సంబంధించింది ఈ బిల్లు. నోటీసు మాత్రం నవంబర్ 18, 2015లో జారీ అయ్యింది. అంటే కలాం మరణించిన నాలుగు నెలలు అవుతోంది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ జారీ చేసిన నోటీసు విషయం తెలుసుకున్న కేరళ రాజ్‌భవన్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఆ బిల్లును తాము చెల్లిస్తామంటూ రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి. 

Saturday, December 5, 2015

జంటలో ఇద్దరూ సంపాదనపరులే ! కాని ఆ విషయంలో... ?

చూడ్డానికి కపుల్స్ చాలా హ్యాపీగా కనిపిస్తారు.. చిరునవ్వులు చిందిస్తూ తమ రత్నాల్లాంటి బిడ్డలతో, మంచి సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తారు. కానీ అసలు సంగతికొస్తే.. అవన్నీ పైపై మెరుగులేనని, లోపల అసలు విషయం ఏమీ లేదని ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇస్తున్న నిపుణులు చెబుతున్నారు. బెడ్ రూముల్లో ఎవరికివారు సెపరేట్ అట.. డబుల్ ఇన్ కమ్.. బట్ నో  సెక్స్ అంటున్నారు. మోడరన్ మ్యారేజీల్లో ఇలాంటి ధోరణి పెరిగిపోతోందట.. బెడ్ రూముల్లో వీళ్ళు లైంగికానందం పొందలేకపోతున్నారని, ఫలితంగా  విడాకులు పెరిగిపోవడం వంటివి జరుగుతున్నాయని వారు విశ్లేషించారు. 

చాలామంది మద్యం తాగుతూనో, నెట్ లేదా టీవీ చూడడంతోనో, స్నేహితులతోనే ఎంజాయ్ చేస్తూనో గడుపుతుంటారని. దీంతో భార్యాభర్తలమధ్య దూరం పెరిగిపోతోందని  అన్నారు. సెక్స్ అన్నది లేకపోతే  ఒంటరిగా ఫీలవుతారని  అభిప్రాయపడ్డారు. అందువల్లే వర్క్-లైఫ్ బ్యాలన్స్ అవసరమని  సూచించారు.

Friday, December 4, 2015

త్వరలో నోరూరించే "టెస్ట్‌ట్యూబ్ చికెన్"

లెక్కకు మించి పెరిగిపోతున్న జనాభా నాన్‌వెజ్ రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక ల్యాబ్ ఫుడ్డే దిక్కంటున్నాయి పరిశోధనలు.. నాన్‌వెజ్‌కు రోజూ పెరిగిపోతున్న డిమాండ్‌ను తట్టుకోవాలంటే  టెస్ట్‌ట్యూబ్ రెసీపీలే తప్పనిసరి అని తేల్చారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.. దాని తర్వాత టెస్ట్ ట్యూబ్  హాంబర్గర్స్ కూడా  వరల్డ్ మార్కెట్‌లో ఆదరణ పొందాయి. ఇవ్వన్నీ సరే.. త్వరలో లేబొరేటరీ నుంచి మరో అద్బుతాన్ని ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు సైంటిస్టులు.. ఇదే కనుక సక్సెస్ అయితే.. కొక్కొరోకో మంటూ తిరిగే  కోడిని టేస్ట్‌ఫుల్‌గా వండిలొట్టలేసుకు తినేందుకు పౌల్ర్టీల దగ్గర, చికెన్‌షాపుల దగ్గర వెయిట్ చేసేబాధ కూడా తగ్గుతుందంటున్నారు. రానున్న మరికొద్ది మాసాల కాలంలోనే ల్యాబ్ చికెన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

టెల్అవివ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమిత్ గిఫెన్ అనే బయోఇంజనీర్ సంవత్సరం నుంచి ల్యాబ్‌లో చికెన్ తయారుచేయడంపై ప్రయోగాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ కల్చర్డ్ మీట్ కల ఫలిస్తుందన్న నమ్మకం ఉందనీ టెస్ట్‌ట్యూబ్ చికెన్ రెసిపీ సెల్స్ పెంపకం సక్సెస్ అయితే ముందురోజుల్లో కబేళాల్లో జంతువుల కోత అవసరమే ఉండదంటున్నారు సైంటిస్ట్‌లు.ఈ సంవత్సరం చివరికల్లా  చికెన్ సెల్స్  కల్చర్ పూర్తి అవుతుందని,  చికెన్ కున్న అత్యధిక డిమాండ్‌ను  ల్యాబ్‌చికెన్ తీరుస్తుందనీ అంటున్నారు.  2050  సంవత్సరంనాటికి  పెరిగే 9బిలియన్ల జనాభా నాన్‌వెజ్ ఫుడ్  డిమాండ్.. కల్చర్ మీట్, ల్యాబ్ చికెన్ తోతీరుతుందని  పరిశోధకులు చెబుతున్నారు. పైగా కల్చర్ మీట్  తయారీలో అతితక్కువ గ్రీన్హౌజ్ గ్యాస్ విడుదలవుతుందనీ, నీటి వినియోగం కూడా  82 నుంచి 96శాతం తక్కువగా ఉంటుందనీ, లైవ్ స్టాక్ కోసం భూమి పెద్దగా అవసరం ఉండదనీ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీఆఫ్ ఆమ్‌స్టర్డామ్ పరిశోధనలు చెబతున్నాయి.

Thursday, December 3, 2015

పిల్లలకు "ఎలాంటి" ఆహారాన్ని తినిపించాలి ?

వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. మెత్తగా ఉడికించిన అన్నంకి, కొద్దిగా పెరుగు, పంచదార కలిపి బాగా మెత్తగా చేసి పెట్టాలి. పిల్లలకు తినిపించే ఆహారాల్లో ఇదొక బెస్ట్ ఫుడ్. 
 
కావల్సినన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ పెరుగన్నంలో ఉన్నాయి. సాధారణంగా పిల్లల పెరుగుదలకు నెయ్యితో కూడిన ఆహారాన్ని తినిపించాలి. ఇది పెరుగుదలకు మాత్రమే కాకుండా శక్తి, ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. 
 
రైస్ లేదా రోటితో పప్పు వంటివి పిల్లలకు పెట్టొచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాదు వెజిటేబుల్ లేదా చికెన్ తినిపించాలనుకొన్నప్పుడు అందులో పెప్పర్‌ను చేర్చడం వల్ల కావల్సినన్ని న్యూట్రిషియన్స్ అందిస్తాయి. 
 
అలాగే వెరైటీగా రైస్‌ తినిపించవచ్చు. కిచిడి అనేది పప్పు, రైస్, కూరగాయలతో చాలా మృదువుగా తయారు చేసి తినిపించవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తినడమే కాకుండా అధిక న్యూట్రీషన్లు అందిస్తుంది. 
 
ఇంకా గోధుమ రవ్వను చాలా మెత్తగా ఉడికించి, కూరగాయలు కూడా చేర్చి తినిపించవచ్చు. చివరగా నెయ్యిని గార్నిష్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని న్యూట్రీషన్లు అంటున్నారు.

Wednesday, December 2, 2015

"శాండ్‌విచ్" కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు !

సాధారణంగా అనేక మంది పేద మహిళలు పొట్టకూటి కోసం పడుపు వృత్తి చేస్తుంటారు. మరికొంతమంది అమ్మాయిలు జల్సాలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు.  ఆ దేశ అమ్మాయిలు, మహిళలు మాత్రం ఒక్కపూట కడుపు నింపుకునేందుకు పురుషులకు పడక సుఖం అందిస్తున్నారు. అదీ కూడా ఒకే ఒక్క శాండ్‌‌విచ్ కోసం. ఇలాంటి దారుణ పరిస్థితిని గ్రీస్ మహిళలు ఎదుర్కొంటున్నారు. 
 
గ్రీస్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం తీరని కష్టాల్లోకి నెట్టిన విషయంతెల్సిందే. ఈ సంక్షోభం కేవలం ఆ దేశాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ఓ కుదుపు కుదిపింది. ఫలితంగా గ్రీస్ దేశానికి తీరని కష్టాలను మిగిల్చింది. చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. కొందరు యువతులు ఆకలి బాధలను తాళలేక ఓ శాండ్‌విచ్ కోసం తమ శరీరాన్ని అమ్ముకుంటున్న వైనం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. 
 
తాజాగా గ్రీక్‌ దేశంలో 17 వేల మందికిపైగా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైన నిజం. తూర్పు యూరప్‌లో వ్యభిచార వృత్తిలో గ్రీక్ మహిళలే ఎక్కువ మంది ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. గ్రీక్‌లో ఆర్థిక సంక్షోభం రాకముందు సెక్స్ వర్కర్లు దాదాపు రూ.4000 వేల వరకు డిమాండ్ చేసేవారు. కాగా ఇప్పుడు 150 రూపాయలు ఇస్తే చాలన్నట్టుగా పరిస్థితి మారింది. 17-20 ఏళ్ల వయస్సులో ఈ వృత్తిలోకి వస్తున్నట్టు సర్వేలో తేలిన నిజం.

Tuesday, December 1, 2015

"మందుకథ"

సరదాగా సాయంత్రం పూట ఫ్రెండ్స్‌తో ఓ బీరేస్తే కొంపలంటుకోవులే బాస్ .. అనుకునే వాళ్లకి కొన్ని షాకింగ్ నిజాలు! ఆల్కహాల్  చేసే చేటు గురించి సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినకొన్ని విషయాలు తెలుసుకుందాం.

 మొదటి సిప్ నాలుక మీదనుంచి గొంతులోకి జారగానే మీకు మతిమరుపు మొదలవుతుంది. అలా ఒక క్వార్టర్ ఫినిషింగ్ అయిన పావుగంట తరువాత బాడీలో రసాయనిక చర్య జరిగి శరీరంలో హ్యాపీనెస్ అనే కొత్త 'కెమికల్' రిలీజ్ అవుతుంది. దాని కారణంగా పెదవిపై చిరునవ్వు తొణికిసలాడుతుంది.

అరగంట తరువాత స్టమక్ యాక్టివేట్ అవుతుంది. నాలుక కొత్త రుచులు కోరుతుంది. వేపుళ్లు, స్సైసీ స్నాక్స్‌ కావాలంటుంది.

 ఇక 60 నిమిషాలు గడిచి మూడో క్వార్టర్‌లోకి అడుగు పెట్టగానే ఆల్కహాల్ తన ప్రభావాన్ని కిడ్నీలపై చూపడం మొదలుపెడుతుంది.ఎక్కువ సార్లు యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీన్నే 'బ్రేకింగ్ ద సీల్'  అని పిలుస్తుంటారు. మందు మొదలుపెట్టి రెండుగంటలు అయ్యేసరికి నాలుగో క్వార్టర్‌కు చేరుకుంటుంది. అప్పుడు మీ మనసు మీ మాట వినదు. బ్లడ్‌లో ఆల్కహాల్ కలిసి నిన్న మొన్నటి సంగతుల్ని రీ కలెక్ట్ చేయడం మొదలుపెడుతుంది. మీకు తెలియకుండానే మీ కిష్టమైన పాట హమ్ చేస్తుంటారు. 

మందు ముందుకూర్చుని రెండున్నర గంటలు దాటిన తరువాత మాట తడబడుతుంది. ఇక మీరేం మాట్లాడుతున్నారో మీకర్ధంకాదు. మీకు తెలియకుండానే పెద్దగా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు.

 మూడోగంట... ఆరోపింట్ బీర్.. లివర్‌లో హ్యాపీనెస్ 'కాక్ టైల్' అయి కొత్త ఎంజైమ్ పుట్టుకొస్తుంది. దానిపేరే 'రిమోర్స్'... స్వర్గం ఎంత దూరం.. ఇంకెంత.. బెత్తెడే అన్నట్టుంటుంది.

 మందు మొదలెట్టి నాలుగో గంట గడిచేసరికి ఇక నడవలేక, నిలబడలేక నానా ఇబ్బందులు మొదలు. వచ్చే వామ్టింగ్ సెన్సేషన్‌ను అపుకోవడానికి కారంగా ఉండే కబాబ్ ముక్క  వెదుక్కుంటారు.

 అంటే ఒకపింట్‌తోస్టార్ట్ అయి చివరకునానా యాతనలు పెట్టే మందుకథలు.. అనేకం.. మమేకం.. ఒకపెగ్గుతోఆగకుండా మందుతో మమేకమై తాగితే ఇంతే సంగతులంటున్నారు.


Monday, November 30, 2015

ఆడ పిల్లలఫై "దారుణమైన" అనాగరిక చర్యలు !

కేమరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా..  ఈ మూడు దేశాల్లో ఆడ పిల్లలుగా పుట్టడం కంటే.. అడవిలో మానై పుట్టడమే మేలనుకుంటారట. అక్కడ ఆడపిల్లలు యుక్తవయసుకొస్తున్నారంటే చాలు. ప్రాణాలు గిజగిజలాడి పోతాయట. వయసు తో బాటు  నాచురల్ గా పెరిగే  ఛాతి పెరగకుండా వాటిని ఆటవిక పధ్ధతుల్లో అణిచి వేస్తారట.


బ్రెస్ట్ ఐరనింగ్ అని పిలిచే ఈ ప్రక్రియలో ఛాతి కనపించకుండా అణచివేస్తే ఆడపిల్లల వయసు దాచిపెట్టడంతో బాటు, వారి  మీద మగవాళ్ల కన్ను పడకుండా ఉండేందుకు ఈ ఆటవిక పద్దతిని అవలంబిస్తున్నారట. ఈ అనాగరిక మూఢ నమ్మకంలో తల్లులే ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ నివేదిక పేర్కొంది. తమ పిల్లలకు బ్రెస్ట్ ఐరనింగ్ చేస్తే  లైంగిక వేధింపులు, అత్యాచారాలనుంచి  రక్షణ కలుగుతుందన్న మూఢనమ్మకమేకారణమట.


ఈ బ్రెస్ట్ ఐరనింగ్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3.8 మిలియన్ల మంది  నానా హింస బారిన పడి నరకం చూస్తున్నట్టు యూ ఎన్  నివేదిక పేర్కొంది. ఆడతనాన్ని ప్రతిబింబించే ఛాతి పెరగనీయకుండా ఉండేందుకు  తల్లులు ఆశ్రయిస్తున్న అనాగరిక పద్దతి దారుణంగా ఉంటుందట. పెద్ద పెద్ద రాళ్లు, లేదా వెడల్పాటి గరిటె లాంటి దాన్ని బొగ్గుల మీద కాల్చి వాటితో ఛాతిని అణుస్తారట. ఈ పద్ధతిలో  బ్రెస్ట్ టిష్యూ దారుణంగా దెబ్బ తింనడం వల్ల  ఆడతనం అణిగిపోతుందనేది తల్లుల భావనట.

 కామెరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆనాగరిక ఆచారంలో 58 శాతం తల్లులే ప్రధానంగా ఉన్నారని పబ్లి్క్ హెల్త్  సర్వీస్ లెక్కలు చెబుతున్నాయి. డబ్బున్న  కుటుంబాలకు చెందిన యువతులైతే వెడల్పాటి బెల్టు గట్టిగా చుట్టుకుంటారట. దీని కారణంగా ఛాతి పెరగవట.

ముఖ్యంగా 11,15 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లల్లో శరీర భాగాలు  పురుషుల కంట బడనీయక పోతే మగాళ్ళ కళ్ళు తమ పిల్లల మీద పడవని ఆ తల్లుల నమ్మకమట. మహిళల మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతున్న  ఈ అనాగరికపు ఆచారం మీద ఇప్పుడిప్పుడే చైతన్యం ప్రారంభమైంది.

Saturday, November 28, 2015

శృంగారం "రోజూ"కంటే,"వారాని"కొక్కసారే మంచిదంట ?

దంపతుల రోజువారీ సెక్స్‌పై సొసైటీ ఫర్ ది పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించగా, ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనేవారికంటే.. వారంలో ఒక్కసారే శృంగారంలో పాల్గొనే దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నట్టు తేలింది. ఈ సర్వేను అమెరికాలో 14 యేళ్ళపాటు.. మూడు దఫాలుగా నిర్వహించారు. తొలి దఫాలో 25 వేల అమెరికా జంటలపై నిర్వహించారు. ఇందులో 11285 మంది పురుషులు, 14225 మంది స్త్రీలు పాల్గొన్నారు. రెండో దఫాలో 335 మందిపై (138 మంది పురుషులు, 197 మంది స్త్రీలు), మూడో దఫాలో 2400 మంది జంటలపై నిర్వహించారు. 
 
ఈ సర్వే ప్రకారం 'ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే అంత ఎక్కువ హ్యాపీగా ఉంటామని చాలా మంది భావిస్తారని, అది అక్షరాలా శుద్ధ తప్పని చెపుతోంది. నిజానికి తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారే ఎక్కువ హ్యాపీగా ఉంటారు. సెక్స్‌లో ఎక్కువసార్లు పాల్గొనాలనే ఆతృతతో చాలామంది తమ భాగస్వామిని బలవంతం చేస్తుంటారు. దాంతో వారు ఇష్టం లేకపోయినా.. తప్పని పరిస్థితుల్లోనే సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఇది వారి సంబంధాలను దెబ్బ తీస్తుందని ఈ సర్వేలో తేలింది. 
 
అందువల్ల శృంగారంలో పాల్గొనే దంపతులిద్దరూ సంతోషంగా గడపాలంటే ఇద్దరికీ నచ్చినపుడే సెక్స్‌కు సిద్ధపడాలని, అయితే సెక్స్‌ చేయకపోయినా ఇద్దరూ ఎక్కువ సమయం జంటగా గడపాల' ఈ పరిశోధన చెపుతోంది. పైగా, దీనికి వయస్సుతో సంబంధం లేదని, నవ దంపతులైనా, పాత దంపతులైనా సరే ఇది అందరికీ వర్తిస్తుందని ఈ సంస్థకు చెందిన పరిశోధకులు చెపుతున్నారు.
 


Friday, November 27, 2015

"శృంగారానికి" "తమలపాకులకి" గల సంభందం?

విందు భోజనం ఆరగించాక.. తమలపాకుల్ని, పాన్ మసాలాను తీసుకోవడం పరిపాటి. అయితే తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. మౌత్ ఫ్రెష్నర్‌గా ఉపయోగపడే తమలపాకును నమలడం ద్వారా సెక్స్ లైఫ్‌కు బూస్ట్ నిచ్చినవారవుతారని తాజా అధ్యయనంలో తేలింది. తమలపాకుల్ని నమలడం ద్వారా అజీర్ణ సంబంధిత రోగాలు నయమవుతాయి. 
 
తమలపాకుల్లోని అప్రోడియాస్టిక్ పదార్థాలు సెక్సు లైఫ్‌ను మెరుగుపరుస్తాయి. దీంతో పాటు రక్తంలోని చక్కెర స్థాయుల్ని తమలపాకులు క్రమబద్ధీకరిస్తాయి. తమలపాకులో కాస్త తేనెను చేర్చి నమిలితే దగ్గు మటుమాయం అవుతుంది. అంతేగాకుండా.. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. తమలపాకుల రసాన్ని  సేవించడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Thursday, November 26, 2015

అమితాబ్ బయట పెట్టిన "షాకింగ్" న్యూస్ ?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షాకింగ్ విషయం బయట పెట్టారు. బిగ్ బి తరచూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం... మళ్లీ వెంటనే కోలుకుంటుండటం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు సీరియస్ అనారోగ్యం ఏమీ లేదని అభిమానులు భావిస్తూ వచ్చారు. తాజాగా అమితాబ్ ఓ షాకింగ్ విషయం బయట పెట్టారు. తనకు హెపటైటిస్ బి వైరస్ సోకిందని, దాని వల్ల 75 శాతం లివర్ పాడైపోయిందని కేవలం 25 శాతం లివర్ మాత్రమే ఆరోగ్యంగా ఉందని చెప్పారు. 1983లో కూలీ సినిమా షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయనకు రెండొందల మంది రక్తమిచ్చారు. ఇందులో ఒకరి రక్తం నుంచి హెపటైటిస్ బి వచ్చిందని అనుమానిస్తున్నారు.
ఈ విషయం గురించి అమితాబ్ మాట్లాడుతూ..‘కూలీ మూవీ సెట్లో యాక్సిడెంట్ తర్వాత హెపటైటిస్ బి నాకు యాక్సిడెంటల్ గా వ్యాపించింది. ఆ సమయంలో నాకు దాదాపు 200 మంది రక్తదానం చేసారు. దాదాపు 60 బాటిళ్ల రక్తం ఎక్కించారు. ఈ క్రమంలోనే ఆ వైరస్ వచ్చి ఉంటుంది. చాలా కాలం అనంతరం వివిధ టెస్టుల తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు' అని తెలిపారు. 2000 సంవత్సరం వరకు, అంటే యాక్సిడెంట్ అయిన 18 ఏళ్ల వరకు ఎలాంటి సమస్యా రాలేదు. మెడికల్ చెకప్స్ లో అంతా నార్మల్ గానే వచ్చింది. కొంత కాలం తర్వాత దాదాపు 75 శాతం లివర్ పాడైనట్లు గుర్తించారు. ఇపుడు నేను మీ ముందు నిలబడ్డానంటే కేవలం 25 శాతం లివర్ ఆరోగ్యంగా ఉండటం వల్లే  అని వెల్లడించారు.

Wednesday, November 25, 2015

వయాగ్రా "శృంగారానికే" కాదు ! "షుగర్ ని తగ్గించడానికి" కూడా !!

సాధారణంగా వయాగ్రా అంటే శృంగార భావనలను ప్రేరేపించే ఉత్ప్రేరకంగా మాత్రమే ప్రతి ఒక్కరికీ తెలుసు. అంటే శృంగార భావనలను ప్రేరేపించి అంగానికి రక్తసరఫరా పెంచి... అంగం గట్టిపడేందుకు దోహదపడుతుంది. అయితే, ఇది డయాబెటిస్ నిరోధకాలుగా కూడా పని చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. 
సాధారణంగా రక్తంలోని చక్కెర స్థాయిని బట్టి డయాబెటీస్‌ను నిర్ధారిస్తారు. రక్తంలోని చక్కెర స్థాయిలు పరగడుపున 90 ఎమ్‌జీ, భోజనం తర్వాత 180 ఎమ్‌జీ దాటితే డయాబెటిస్‌గా నిర్ధారిస్తారు. అయితే డయాబెటిస్‌ కంటే ముందు దశను ప్రీ డయాబెటిస్‌ అంటారు. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉండగానే ఈ వయాగ్ర మాత్రలను వాడితే డయాబెటిస్‌ రాకను నిరోధిస్తాయట. 
సిల్డెనఫిల్‌ అనే వయాగ్ర మాత్ర ఇన్సులిన్‌ నిరోధకతను అడ్డుకోవడం ద్వారా ఇది టైప్‌-2 డయాబెటిస్‌ను అడ్డుకుంటుందట. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉన్న 51 మందికి ఈ మందును మూడు నెలలపాటు ఇచ్చి పరీక్షించగా వారి రక్తంలో చక్కెర స్థాయులు నార్మల్‌గానే ఉన్నట్టు తేలిందట. దీనిపై మరింత లోతుగా పరిశోధించి త్వరలోనే మరిన్ని వివరాలు బయటపెడతామని యూఎస్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ పరిశోధకుడు డాక్టర్‌ నాన్సీ బ్రౌన్‌ అంటున్నారు. 

Tuesday, November 24, 2015

"సీతాఫలాలు" ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు?

సీతాఫలం అన్ని దేశాలలోనూ విరివిగా దొరికే  పండు. ఈ పండును గుండె జబ్బు ఉన్నవారు సీజన్‌ ఉన్నంతవరకు తప్పకుండా తింటుంటే.. గుండె సంబందిత సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది.
విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి,  మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో చిన్నా, పెద్దా అందరి నోళ్లలోనూ నీళ్లూరిస్తుంది. ఈ పండును సీజన్ ముగిసేంతదాకా ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమేగాకుండా, ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది.
సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీలవరకు శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాముల.. విటమిన్ సి 50 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ నాలుగు శాతం, సోడియం పది మిల్లీగ్రాములు ఈ పండులో లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను ఒకటి లేదా రెండింటిని తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.
ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతం అవుతాయి. బలహీనత, సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది. వాంతులు, తలనొప్పి విరుగుడుగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది. ప్రతిరోజూ తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది. కుదుళ్లకు దృఢత్వానిస్తుంది.
పేగుల్లో వుండే హెల్మింత్స్‌ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది. త్రిదోష నివారిణిగా శరీరంలో వుండే వాత, పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది.
అయితే.. ఆస్తమా ఉన్నవారు మాత్రం ఈ సీతాఫలంను తీసుకోకూడదు. మధుమేహం ఉన్నవారు తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే మామూలుగా పండిన పండును మాత్రం తింటే ఎలాంటి బాధా ఉండదు. అదే ఎక్కువగా పండిన పండును మాత్రం తిన్నట్లయితే అందులో గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా ఉండి, చక్కెర వ్యాధి గ్రస్తులకు ఎక్కువగా హాని చేస్తుంది. అలాగే లివర్‌ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి.


Monday, November 23, 2015

పరిశోధకులకు సైతం అంతుచిక్కని "నదిలా పారిన ఇసుక"

ప్రకృతి వింతల్లో ఇదో అద్భుతమైన వింత..నీటి ప్రవాహాన్ని, లావా ప్రవాహాన్ని చూశాం. కానీ నదిలా పారే ఇసుకను చూడాలంటే ఇరాక్ వెళ్ళాల్సిందే. అక్కడి విచిత్ర వాతావరణమే ఇందుకు కారణమని అంటున్నారు. భారీ వర్షాలు, మంచు, ఇసుక తుపానులు ఇరాక్‌‌లో కనీవినీ ఎరుగని పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

 ఆ దేశంలో క్లైమేట్ పూర్తిగా మారిపోయింది. కంకర రాళ్ళు, ఇసుక నీటి ప్రవాహంలా కొట్టుకుపోతున్నాయి. ఓ ఇరాకీయుడు ఆశ్చర్యంగా ఈ వండర్‌ని చూస్తూ నిల్చుండిపోయాడు. ఈ వీడియో నెట్‌లో హల్‌‌చల్ చేస్తోంది. భూగర్భ పరిశోధకులు సైతం ఈ వింతకు నిర్దిష్టమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు.

ఈ వింత మీరు కూడా చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి .


Saturday, November 21, 2015

"కార్డు" లేకుండా ఏటీఎం నుంచి డబ్బు !

ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు తీసుకునే కొత్త టెక్నాలజీ మిషిన్‌లను చైనా ప్రారంభించింది. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి... మన ముఖమే ఏటీఎం కార్డులా పని చేస్తుంది! తాజా టెక్నాలజీ ద్వారా జేబులో పెట్టుకోవాల్సిన ఏటీఎం కార్డుతో అవసరమే ఉండదు. కార్యాలయంలో అటెండెన్సు కోసం వాడే బయోమెట్రిక్ సాంకేతిక.. ఐరిస్ ఆధారంగా హాజరు పడుతుంది. దానినే కొంచెం మార్చి ముఖాన్ని గుర్తించి, ఒక పాస్ వర్డ్ అడిగి, దానిని బట్టి ఖాతాకు సంబంధించిన కార్యకలాపాలు చేసుకునే సరికొత్త టెక్నాలజీని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఇలాంటి పది మిషన్లను చైనా మర్చంట్ బ్యాంక్ వివిధ నగరాలలో ఏర్పాటు చేసింది. ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన బ్యాంకు కార్యకలాపాలను ఈ మిషన్ల ద్వారా నిర్వహించుకోవచ్చు. టెలిఫోన్ నెంబర్లను కూడా పాస్ వర్డుగా ఎంటర్ చేయాలి. మరో విషయమేమంటే... అచ్చం ఒకేలా ఉండే కవలు ఇద్దరు వచ్చినా కూడా వాళ్లలో ఎవరి అకౌంటును వాళ్లకే యాక్టివేట్ చేసేలా ఈ సాంకేతికత ఉంది. కళ్లజోడు పెట్టుకున్నా, మేకప్ వేసుకున్నా మీ ముఖాన్ని గుర్తిస్తుంది. దీని ద్వారా కేవలం 42 సెకన్లలోనే డబ్బు డ్రా చేసుకోవచ్చు.



Friday, November 20, 2015

బ్రహ్మానందం తన కెరీర్ ను తనే నాశనం చేసుకుంటున్నాడా ?

దాదాపు 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్న బ్రహ్మానందం హవా ఈమధ్య పూర్తిగా తగ్గిపోయింది. అయితే అతనికి ఇటువంటి పరిస్థితి రావడంపై కొన్ని పుకార్లు పరిశ్రమలో హడావుడి చేస్తున్నాయి. అవేమిటంటే దర్శకులని బ్రాహ్మి చిన్న చూపు చూస్తాడని టాక్.

పారితోషికం కోసం కొత్త దర్శకుల సినిమాల్లో నటిస్తాడు కానీ, ఆ దర్శకులు చెప్పే వాటిని బ్రాహ్మి పట్టించుకోడని, సినిమాలో బ్రాహ్మి నటించాల్సిన సీన్ గురించి చెబితే దీనికి ఇంతొద్దు….ఈమాత్రం చాలు అంటాడట. అంతేకాదు ఆ సీన్ ని ఆయనే ఎడిట్ చేస్తాడట. అలాగే ఆ సినిమాకి సంబందించిన కాజువల్ వాక్ లేదా వాకవే సీన్ తీయాలంటే షూట్ చివర్న వెల్లిపోయేటప్పుడు తీసుకో, మళ్ళీ దానికి ప్రత్యేకంగా యాక్ట్ ఎందుకు అని సెటైర్స్ వేస్తాడని ఫిలిం నగర్ గాసిప్.

దాని ఫలితంగా ప్రస్తుతం చాలామంది కొత్త దర్శకులు అయన టార్చర్ భరించలేక కొత్త హాస్య నటులతో సినిమాలు తీస్తున్నారు. అంతేకాదు ఈమధ్య బాగా పేరులోకి వస్తున్న ఓ దర్శకుడు బ్రాహ్మి గురించి తన సన్నిహితులతో మాట్లాడుతూ బ్రాహ్మి 65 ఏళ్ల వయసులో మరికాస్త కొత్తగా చేద్దామనే ప్రయత్నం చేయడం లేదని అందుకే అయన కామెడీ మొహం
  మొత్తుతోందని కామెంట్ చేసినట్లు టాక్.

ఈ కారణాలు వల్లే చిన్న దర్శకుల నుండి పెద్ద దర్శకులవరకు పృధ్వీ, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సప్తగిరి లాంటి కమెడియన్లకు వరస పెట్టి అవకాశాలు ఇస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. పైగా బ్రహ్మీకి రోజుకు నాలుగు నుంచి అయిదు లక్షలు కావాలి. అదే డబ్బుతో కొత్త కమెడియన్ల బ్యాచ్ వస్తుంది కదా అన్న నేటితరం దర్శకుల ఆలోచనలు ప్రస్తుతం బ్రహ్మికి శాపంగా మారింది అనే వార్తలు హడావిడి చేస్తున్నాయి.


Thursday, November 19, 2015

"నెరసిపోయే జుట్టు"కు సింపుల్ చిట్కా "కరివేపాకు"

చిన్న వయస్సులోనే జుట్టు నెరసిపోతే.. కరివేపాకు ఉపయోగించండి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమే. కానీ కొందరికి 20 ఏళ్లు కూడా నిండకుండా జుట్టు తెల్లబడిపోతుంది. ఈ సమస్య అమ్మాయిల్లో తలెత్తితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి కరివేపాకు హెయిర్ టానిక్‌లా పనిచేస్తుంది.
 
కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు. శిరోజమూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉన్నది. 
 
ఇందుకుగాను ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని అందులో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడి చేయాలి. కరివేపాకులు నల్లగా మారిన తర్వాత వేడి చేయడం ఆపేసి దించేయాలి. ఇలా వచ్చిన నూనెను వారంలో రెండుమూడుసార్లు మాడుకు మర్దన చేస్తుంటే శిరోజాలు బాగా పెరగడంతోపాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. చక్కని రంగుతో నిగనిగా మెరిసిపోతాయి.


Wednesday, November 18, 2015

అమరావతి "ముహూర్తం బాగోలేదని",అందుకే ఆ వేడుకకు హాజరైన వారందరూ "కష్టాల్లో పడ్డారంటున్న" స్వామీజీ ?

విశాఖపట్నం శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మళ్లీ షాకింగ్ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం సరికాదని స్వరూపానందేంద్ర మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం బాగోలేదని.. అందుకే ఆ వేడుకకు హాజరైన వారందరూ కష్టాల్లో పడ్డారని తెలిపారు.

ఈ క్రమంలో అమరావతి శంకుస్థాపనకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారని, బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత మొదలైందని  చెప్పారు. 
 
కేసీఆర్‌‌పై సీబీఐ కేసు కూడా బయటికి వచ్చిందని.. ఇవన్నీ అమరావతి ముహూర్తం సరిగ్గా లేకపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని.. తెలిపారు. ముహూర్తం సమయాన్ని పండితుల సూచనల మేరకు నిర్ణయించివుంటే ఈ కష్టాలు వచ్చివుండే కాదని స్వరూపానందేంద్ర చెప్పుకొచ్చారు.  
 

Tuesday, November 17, 2015

"డయాబెటిస్" వ్యాధికి "నిద్ర"కి గల సంబంధం ?

ఎక్కువ గంటలు పని చేస్తూ నిద్ర వస్తున్నా గట్టిగా అదిమి పట్టేస్తూ నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ వ్యాధి త్వరగా వచ్చే అవకాశముంది. మూడురోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రపోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణలో మార్పులు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్ళు ఎక్కువసేపు మెళకువతో వుండేవారు గుర్తించాల్సిన విషయం ఇది. 
 
అయితే వయసులో వుండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చంటున్నారు. కానీ భవిష్యత్ జీవితంలో ఇది సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదముందంటున్నారు. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించిన వారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. 
 
నిద్రలేమి వారి ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకువెళ్ళే ప్రమాదం సైతం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు వహించండం మరవకూడదంటున్నారు వైద్యులు.

Monday, November 16, 2015

మనిషి లాగే " ఊపిరి" పీల్చుకుంటున్న"భూమి" ? తప్పకుండా చూడండి .

కెనడాలో ఇదో అద్భుతమేకాదు.. హాట్ టాపిక్ కూడా! ప్రకృతి రహస్యాల్లో ఇది కూడా వింత అద్భుతంగా పరిగణిస్తున్నారు. కెనడాలోని నోవా స్కోషియా అడవుల్లో ఓ వ్యక్తికి వండర్ సీన్ కనిపించింది. అసాధారణంగా భూమి పైకి.. కిందికి ఊపిరి పీల్చుకున్నట్టుగా దర్శనమివ్వడంతో ఆ వ్యక్తి కాస్త తన సెల్‌ఫోన్ షూట్ చేశాడు. ఈ వీడియోని చూసిన లక్షలాది మంది ఆశ్చర్యపోయారు.

 భారీ చెట్ల వేళ్ల కారణంగానే ఈ నేచురల్ వింతలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. వేగంగా వీస్తున్న గాలి కారణంగా కూడా ఈ అద్భుతం జరిగివుండవచ్చని కొంతమంది అంటున్నారు. ఆన్‌లైన్‌లో ల్యాండ్ బ్రీతింగ్ వండర్ సృష్టిస్తోంది. తన కెమెరాకు ఈ దృశ్యాన్ని ఎక్కించిన బ్రియాన్ నట్టల్‌ను అభినందించనివాళ్లు లేరు. 

ఈ వీడియోని ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి చూడండి .


Saturday, November 14, 2015

వరుడు మనిషి ! వధువు ప్లాస్టిక్ బొమ్మ? చైనాలో వింత పెళ్ళి ?

అతనో ఇరవై ఎనిమిదేళ్ళ అందగాడు. అతనంటే ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ అతనికి క్యాన్సర్ వ్యాధి సోకిందని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో అతను పెళ్లి ఆలోచన మార్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటే కొద్ది కాలానికే అమ్మాయి విడో గా మిగిలిపొతుందని భావించి ఆ యువకుడు ఓ కొత్త పెళ్లికి తెరతీశాడు.



వివరాల్లోకి వెళ్తే...చైనాకు చెందిన ఒక కుర్రవాడు మంచి స్మార్ట్ గా ఉంటాడు కానీ, డాక్టర్లు అతనికి  టెర్మినల్ క్యాన్సర్ అని తేల్చారు. మరణానికి దగ్గరగా ఉన్న అతను అది సంభవించే లోపే ...  పెళ్లి అనే  తీయని అనుభూతిని అనుభవించాలనుకున్నాడు. తన పెళ్ళి కోరిక తీరేలా, ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేలా ఒక ప్లాస్టిక్ బొమ్మతో పెళ్ళికి రెడీ అయ్యాడు.



అతనితో బాటే ఆ బొమ్మ పెళ్లి కూతురికి మేకప్ చేశారు. పెళ్లి డ్రస్ తొడిగారు. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. అందరూ అతని ఆలోచనను అభినందించారు. అందరూ ఆశ్చర్యపోయేలా, సంప్రదాయ బద్ధంగా ప్లాస్టిక్ పెళ్ళి కూతురితో  వివాహం చేసుకున్నాడు.



మోకాళ్ల మీద వంగి ప్లాస్టిక్ పెళ్లి కూతురికి వామ్ వెల్ కమ్ చెబుతున్న ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. పెళ్ళి తంతు అయిపోయిన తరువాత 35 వేల డాలర్ల ఖర్చుతో పెళ్ళి విందు కూడా ఇచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలి గించేలా చైనాలో జరిగిన ఈ పెళ్లి వివరాలు, ఫోటోలు ఇంటర్నెట్ లో  తెగ చూసేస్తున్నారు. ఆ చైనా కుర్రాడిని మెచ్చుకుంటున్నారు .

Friday, November 13, 2015

బరువు తగ్గాలంటే ? "బస్సు, రైలు ప్రయాణం" చేయాలంట ?

లావుగా ఉన్నారా? ఏం చేసినా బరువు తగ్గకుండా అలానే ఉన్నారా? అయితే టూ వీలర్, ఫోర్ వీలర్‌లో ప్రయాణం చేయడానికి బ్రేక్ వేయాలంటున్నారు.. జపాన్ శాస్త్రవేత్తలు. లావుగా ఉన్నామని బాధపడకుండా.. అందమైన శరీరాకృతి పొందటానికి బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణించడం ఎంతో మంచిదని వారంటున్నారు. 
 
చెమటలు పట్టేలా వ్యాయామాలు చేయకుండా బరువు తగ్గాలంటే.. బస్సు, రైలు ప్రయాణం బెస్ట్ అని, బస్సులు, రైళ్లలో ప్రయాణించేవారు సులభంగా సన్నబడతున్నారని, కారు, బైకుల్లో ప్రయాణించే వారికంటే బస్సుల్లో ట్రావెల్ చేసేవారు 44 శాతం వరకు ఒబిసిటీకి దూరంగా ఉన్నారని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు రెండు మూడు కిలోమీటర్లు నడిచి.. ఆపై ఇల్లు చేరి విశ్రాంతి తీసుకుంటారు.
 
అదే ఆఫీసులకు వెళ్లి పనిచేసే వారు అధికంగా శ్రమపడతారని.. వారు ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు, బస్టాండ్‌కు వెళ్లేందుకు నడుస్తున్నారని... వారికి నడిచే దూరమే తెలియదని.. తద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. తద్వారా బీపీ, షుగర్, హృద్రోగ వ్యాధుల నుంచి తప్పించుకుంటున్నారని వెల్లడించారు. 

Thursday, November 12, 2015

"దాల్చినచెక్క"తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

దాల్చినచెక్క, తేనెను రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బరువు తగ్గించుకోవాలనుకుంటే అతి తక్కువ క్యాలరీలు కలిగిన తేనెను తీసుకోవచ్చు. ఉదయం తేనె, నిమ్మరసం రెండింటిని గోరువెచ్చని నీటితో చేర్చి తీసుకుంటే, అలాగే కొద్దిగా తేనె కూడా బ్రేక్‌ ఫాస్‌‌టలో చేర్చుకుంటే బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే దాల్చిన చెక్క కూడా బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దాల్చిన చెక్క మరియు తేనెను రెగ్యులర్‌ డైట్‌ లో చేర్చుకోవడం చాలా అవసరం.
స్వీట్‌ హనీ వ్యాయామానికి కావల్సిన శక్తిని అందించే ఒక మంచి టానిక్‌ వంటిది. బరువు తగ్గాలనుకొనే వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్‌‌స చేసి ప్రతి రోజూ ఉదయం వ్యాయామానికి ముందు తీసుకుంటే మంచి ఎనర్జీతో పాటు, బరువును ఎఫెక్టివ్‌గా తగ్గిస్తుంది
ఊబకాయస్తులు మరియు అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నవారు, కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి 2టేబుల్‌ స్పూన్ల తేనె మరియు 3టేబుల్‌ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా మిక్‌‌స చేసి రెగ్యులర్ గా కొద్దిరోజులు తీసుకొంటే అధిక కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవచ్చు.
తేనె మరియు దాల్చిన చెక్కలోని షుగర్‌ కంటెంట్‌ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే తేనె శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. అరటేబుల్‌ స్పూన్‌ తేనెను ఒక గ్లాసు నీళ్ళలో మిక్‌‌స చేసి దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసి బాగా మిక్‌‌స చేసి భోజనానికి ముందు తీసుకుంటే విటాలిటీ పెంచుతుంది.
భోజనానికి ముందు రెండు టేబుల్‌ స్పూన్ల తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్‌‌స చేసి తినాలి . ఇలా చేయడం వల్ల ఎసిడిటి తగ్గిస్తుంది. ఈ రెంటింటి కాంబినేషన్‌ వల్ల బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. తిన్న ఆహారంను విచ్ఛిన్నం చేయడానికి తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది .
తేనె మరియు దాల్చిన చెక్క ఈ రెండింటి కాంబినేషన్‌ త్వరగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ పరకడుపున లేదా రాత్రి నిద్రించడానికి ముందు తీసుకుంటే శరీరంలో నిల్వచేరిన ఫ్యాట్‌ను కరిగిస్తుంది. దాల్చిన చెక్క, తేనె మిశ్రమం పెద్ద పేగులలోని పారాసైట్‌‌స, ఫంగస్‌, బ్యాక్టీరియాను శుభ్రం చేస్తుంది.
తేనె బ్లడ్‌ షుగర్‌ లెవల్‌‌సను స్థిరంగా ఉంచుతుంది. దాంతో ఆకలి కంట్రోల్‌ అవుతుంది. తేనె మరియు దాల్చిన చెక్క కాంబినేషన్‌ బరువు తగ్గించడం మాత్రమే కాదు సెల్యులైట్‌ అనే అధనపు ఫ్యాట్‌ను కూడా కరిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Wednesday, November 11, 2015

"దీపావళి శుభాకాంక్షలు"


Tuesday, November 10, 2015

బరువు తగ్గించే ఫుడ్ మెనూ !

బరువు తగ్గాలంటే ముఖ్యంగా ఆహారంలో బరువు తగ్గాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. రోజువారీ డైట్‌లో పోషకాలు సమృద్ధిగా ఉండేలా, లో క్యాలరీ ఫుడ్‌గా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు ఆధారంగా అత్యవసరమైన పోషకాలు సరైన సమయంలో తీసుకుంటే బరువు తగ్గవచ్చునని శరీరాకృతిని మెరుగుపరుచుకోవచ్చు. 
 
ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..?
కొవ్వు తీసేసిన పాలను తాగాలి. ఎముకలు బలంగా ఉండటానికి - మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, మాంసకృత్తుల కోసం - కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్‌లెస్ చికెన్‌, వేరుశనగలు వంటివి తీసుకోవాలి.
 
హోల్‌ వీట్‌, జొన్నలు, తెల్ల ఓట్స్‌, రాగిమాల్ట్. శెనగలు, రాజ్‌మా, బొబ్బర్లు, పచ్చి బఠాణి, సోయా ఉత్పత్తులు, పెసలు, మొలకెత్తిన గింజలు...వీటి వల్ల మాంసకృత్తులు, పిండి పధార్ధాలు, 'బి' విటమిన్లు అందుతాయి. తద్వారా బరువు తగ్గుతుంది. ముదురు పసుపు, నారింజ రంగు పండ్లు, కూరగాయలు, తాజా ఆకుకూరలు తదితరాలు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 


Monday, November 9, 2015

షకీలా "చెంపచెళ్లుమనిపించిన" నటి ?

వెండితెరమీద హీరోయిన్‌‌గా వెలిగిపోవాలని సినిమాల్లోకి వచ్చిన హాట్ బ్యూటీ షకీలా గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైంది. అయితే, హాట్ బ్యూటీగా తనకు తిరుగులేదనట్లుగా ఒక ఏడాదిలో దాదాపు 180 సినిమాలకు పైగా నటించింది. అయితే, కెరీర్ పీక్ స్టేజ్‌‌లో ఉన్నా, లేకున్నా ఆమె ఎప్పుడూ చాలా సాధారణ జీవితమే అనుభవించింది. అయితే, తన జీవితంలో షూట్‌లో ఉండగా ఎదురైన అనుభవాలు చెప్పమంటే, సిల్క్ స్మిత తన చెంపచెళ్లుమనిపించిందని, దానికి ఆమె సారీ చెప్పలేదని అది ఇప్పటికీ తనను బాధిస్తూనే ఉందని షకీలా తన మనసులోమాట బయటపెట్టింది. 


Saturday, November 7, 2015

పళ్లు తళతళలాడిపోవాలని వాటితో గాని అతిగా తోమితే ?

అమ్మాయిలు అందానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటారు. కొంతమంది తమ పళ్లు ముత్యాల్లా తళతళలాడిపోవాలని ఏవేవో పద్ధతులు పాటిస్తుంటారు. వీటిలో బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పళ్లు తోమడం. ఈ రెండూ కలిస్తే రసాయనిక క్రియ జరుగుతుంది. వీటిని బ్రెష్ పై అద్దుకుని పళ్లు తోముకుంటే పళ్లు తళతళలాడిపోతాయి. 
 
ఐతే వీటిని వారానికి ఒక్కసారి మాత్రమే వాడాలి. అలాకాకుండా పదేపదే వాడితే పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది. బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి దంతాలకు పట్టించి ఒక నిమిషం తర్వాత బ్రష్ తో సున్నితంగా రుద్దుకుని ఆ తర్వాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక్క నిమిషానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదు.

Friday, November 6, 2015

"అనుష్క ఫై హాట్‌హాట్" కామెంట్స్ చేసిన అలీ!

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు వార్తలకెక్కారు. ఈ దఫా టాలీవుడ్ అగ్రహీరోయిన్ అనుష్కను లక్ష్యంగా చేసుకుని హాట్‌హాట్ కామెంట్స్ చేశారు. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన 'సైజ్ జీరో' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో అలీ పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుష్క తొడలను రచ్చ రచ్చ చేశాడు. ఆమె తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. తొడలంటే అనుష్క తొడలే అంటూ అనుష్క తొడలపై పెద్ద చర్చే లేపారు. 'బిల్లా' సినిమాలో ఆమె తొడలు చూసిన నుంచి తాను పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్పాడు.

 
 అంతేకాకుండా, అనుష్క హాట్‌హాట్ జిలేబిలా ఉంటుందన్నారు. జిలేబి అంటే ఇష్టపడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండరన్నారు. అందుకే ప్రకాష్... అనుష్కను ఈ చిత్రంలో జిలేబీలతో కొట్టించారన్నారు. దీనికి కారణం లేకపోలేదన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన సినిమాల్లో నటించిన హీరోయిన్లందరినీ ప్రపంచంలోని పూలు, పండ్లతో కొట్టించడమే కాకుండా, ఎంతో మంది అమ్మాయిల తొడలను ఈ ప్రపంచానికి చూపించారన్నారు. 
 
ఇపుడు ఆయన తనయుడికి హీరోయిన్లను కొట్టించేందుకు పండ్లు పూలు లేకపోవడంతో జిలేబీలను ఎంచుకున్నారంటూ సెటైర్లు వేశారు. అలీ చేసిన ఈ కామెంట్స్‌కు ఆడియో ఫంక్షన్‌కు హాజరైన ఆహుతులు.. తమ ముఖాలకు చేతులు అడ్డంపెట్టుకుని బలవంతపు నవ్వుతో నవ్వారు. అనుష్క కూడా ఈ కామెంట్స్‌కు ఎలా స్పదించాలో తెలియక మిన్నకుండిపోయారు. 
 
కాగా, ఇటీవలి కాలంలో అలీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో రచ్చరచ్చ జరుగుతున్నా ఈ స్టార్ కమెడియన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా... మరింత రెచ్చిపోయి అగ్రహీరోయిన్లను సైతం వదిలిపెట్టడం లేదు కదా.. ఏకంగా హీరోయిన్ల శరీర అవయవాలపై సెటైర్లు వేస్తూ వార్తల్లో నానుతున్నాడు. 


Thursday, November 5, 2015

కిడ్నీలో రాళ్ల బాధకు చెక్ పెట్టడం ఎలా?

ఆపరేషన్స్ చేయించుకున్నాక కూడా కొందరికి కిడ్నీలో రాళ్లున్నాయని వైద్యులు చెప్తుంటారు. కిడ్నీలో రాళ్లను నివారించాలంటే రోజుకో గ్లాసు నారింజపండ్ల రసం తాగితే చాలు. రాళ్ల బాధ మాయమవుతుంది. ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ బాధపెడుతుంటుంది. ఇలాంటి వారు రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. 
 
కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు.
 
కాబట్టి సహజసిద్ధమైన సిట్రేట్‌లు లభించే సిట్రస్ ఫలాలను తీసుకోమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సిట్రేట్‌లు నారింజలో పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన సిట్రస్ ఫలాల కన్నా నారింజపండ్లలోని సిట్రేట్లు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.


Wednesday, November 4, 2015

" అలిగిన" అఖిల్ ?

డాడీ నాగ్ మీద అఖిల్ గుర్రుగా వున్నాడట. తన ‘అఖిల్’ మూవీ వాయిదా వేయాలని నాగార్జున తీసుకున్న నిర్ణయం ఈ యువహీరోని అప్‌సెట్ చేసిందంటున్నారు. నిజానికి ‘అఖిల్’ మూవీ గతనెల దసరా నాటికి రిలీజ్ అవుతుందని భావించారు. అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల అది రిలీజ్ కాలేకపోయిందని వార్తలు వచ్చాయి. అసలు కారణం అది కాదని, ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ని రీషూట్ చేయాలని నాగ్ సూచించారని, అందువల్ల వాయిదా పడిందని కూడా ఫిల్మ్‌నగర్‌లో న్యూస్ చక్కర్లు కొట్టింది. ఏదిఏమైనా అఖిల్ మాత్రం మనస్తాపం చెందాడట! తన మూవీ ప్రమోషన్ కోసం అఖిల్ చాలారోజుల క్రితమే హైదరాబాద్ వుమెన్స్ కాలేజీలో హల్‌చల్ చేయడంతోబాటు, యూఎస్ కూడా వెళ్లి అక్కడా ప్రమోట్ చేసి వచ్చాడు.

 కానీ నాగ్ తీసుకున్న నిర్ణయంతో అలిగిన అఖిల్ రెండు రోజులు ఎవరితోనూ మాట్లాడలేదట. నాగార్జున ఫోన్ చేసినా స్పందించలేదట. ప్రెస్‌మీట్‌కు హాజరు కాకపోవడంతో నాగార్జునే అటెండ్ అయి లాంఛనంగా ప్రకటన చేశాడు. తన తండ్రి తన ఫేవరేట్ యాక్టర్ కాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అఖిల్ వ్యాఖ్యానించడం అక్కినేని ఫ్యాన్స్‌ని షాక్‌కి గురిచేసింది. బహుశా తన ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ’ సినిమా.. దసరాకి రిలీజ్ అయ్యేలా చూసేందుకే నాగ్.. ఆ డెసిషన్ తీసుకున్నారా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. చివరకు మొన్న నాగ్ రిలీజ్ డేట్ ప్రకటనతో .. తండ్రీ కొడుకుల మధ్య రేగిన ‘కోల్డ్‌వార్’కు  ఫుల్‌స్టాప్ పడినట్టే  చూడాలి.

Tuesday, November 3, 2015

కీళ్ళనొప్పులు తగ్గాలంటే ?

కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే వారానికి రెండు సార్లు చేపలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చేపలను తినడం వల్ల పలు రకాలైన ప్రయోజనాలున్నాయి. వారానికి రెండు లేదా ఒకసారైనా చేపలను తినడం వల్ల రుమటాయిడ్‌, ఆర్థ్రరైటిస్‌ వంటి కీళ్ళనొప్పుల ముప్పును సగం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. 
 
స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 32 వేలమంది స్వీడన్‌ మహిళలపై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధకుల బృందం తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్న మహిళల ఆహారపు అలవాట్లను గురించి విశ్లేషించింది. వీరిలో ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తీసుకున్న వారిలో కీళ్ళనొప్పుల ముప్పు తక్కువగా ఉన్నట్టు తేలింది. 
 
సాల్మొన్‌, తాజా ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఈ ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలు లభ్యమవుతాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 27 శాతం మంది ఈ కొవ్వు ఆమ్లాలను తక్కువగా తీసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తంగా కీళ్ళనొప్పులకు ఎక్కువగా గురయ్యే మహిళలు వారానికి ఒకసారైనా నూనెతో కూడిన చేపల్ని తినాలని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ అలన్‌ సిల్మాన్‌ చెబుతున్నారు. 


Monday, November 2, 2015

"మెగా ఫ్యామిలీ స్టార్స్ సినిమాలపై వర్మ కామెంట్ల"కు ఇదా కారణం ?

సినీ ఇండస్ట్రీలో కొందరిని చేదు అనుభవాలు అలానే వేధిస్తుంటాయి. పీడిస్తుంటాయి. వాటిని ఎంత మర్చిపోదామన్నా వల్లకాదు. అలాగే రాంగోపాల్ వర్మ పరిస్థితి కూడా ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మెగా ఫ్యామిలీ స్టార్స్ సినిమాలపై వర్మ కామెంట్లు అందుకే చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. 20 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరు చిత్రంతో జరిగిన అవమానం ఇంకా వర్మను పీడిస్తోందట.
 
అందుకే బ్రూస్‌లీ చిత్రమే మెగాస్టార్‌ 150వ చిత్రంగా తాను భావిస్తున్నానని వర్మ ట్వీట్ చేయడం వెటకారమైనదని అంటున్నారు. ఇంకా ఈ బ్రూస్ లీ చిత్రంలో చిరు నటించడం తనకు అస్సలు నచ్చలేదనీ, బ్రూస్‌లీలో చిరు నటించడం ప్రజారాజ్యం పార్టీ పెట్టినంత తప్పని, తెలిసితెలిసి మెగాస్టార్‌ ఆ పని చేశారేంటబ్బా అని వర్మ విమర్శించారు.
 
ఇంకా ఈమధ్య చిరంజీవి చేయబోతున్న తదుపరి చిత్రం కత్తికి రీమేక్‌ అనే వార్తపైనా వర్మ మండిపడ్డారు. ఇలా చేస్తే మెగా అభిమానులను అవమానించడమే అవుతుందని చెప్పుకొచ్చారు. ఐతే ఇలా మెగా స్టార్స్ పైన వర్మ ట్వీట్లు చేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయనీ, 20 ఏళ్ల కిందట వర్మకు చిరు ఓ సినిమాకు ఛాన్స్‌ ఇచ్చాడట. అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవడమే కాకుండా కర్నూల్‌లో షూటింగ్‌ పార్ట్‌ కూడా కొంత జరిపారట. 
 
ఐతే ఆ తర్వాత వర్మ పద్ధతి నచ్చక చిరంజీవి ఆ చిత్రం నుంచి వర్మను తప్పించారట. అంతేకాకుండా 150వ చిత్రం చేసే అవకాశాన్ని తన ప్రియ శిష్యుడు పూరీ జగన్నాథ్ కు ఇవ్వకుండా మరొకరిని ఆలోచించడం కూడా వర్మకు నచ్చలేదని సమాచారం. అందువల్లనే చిరంజీవికి వర్మ మెత్తని సెటైర్లు వేస్తున్నారని అంటున్నారు.
  

Saturday, October 31, 2015

గుండె పోటుకు బై బై చెప్పడానికి సులువైన మార్గం ?

రోజూ 3 అరటిపండ్లతో గుండె పోటుకు బై బై చెప్పేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం పరిశోధనల్లోనూ తేలిపోయింది. రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
 
కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. అయితే రోజూ మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని తాజా పరిశోధన తేల్చింది.

Friday, October 30, 2015

"ఏపీ కేబినెేట్" లోకి "నారా లోకేష్" ?

 చినబాబు క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైమొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కీలక భూమిక పోషిస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్, ఇక మీదట ఏపీ కేబినెేట్ లో చేరి తన సత్తా చాటే అవకాశం ఉందంటున్నారు. లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖలు అప్పగిస్తే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింత తోడ్పాటు వస్తుందని టీడీపీ నేతలు చంద్రబాబుమీద వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ ను ప్రభుత్వంలోకి తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  
తెలంగాణ సీఎం కేసీఆర్, తన తనయుడు కేటీఆర్ ను ప్రభుత్వంలోకి తీసుకుని కీలక శాఖలు అప్పగించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే అనేక కీలక పరిశ్రమలు ఏపీకి రావడంలో లోకేష్ పాత్ర ఉంది. అతని వ్యక్తిగత పరిచయాలు, ఎన్నారైలతో గల సంబంధాలు, లోకేష్ ఆలోచనా విధానం ఆంధ్రప్రదేశ్ కు ఎంతో అవసరమని టీడీపీ నేతలు అంటున్నారు.
  లోకేష్ ను కేబినెేట్ లోకి తీసుకుంటే ప్రొటోకాల్ ఇబ్బందులు కూడా తలెత్తవని వారు చెబుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని లోకేష్ కు ఐటీ, ఇండస్ట్రీస్ వంటి శాఖలిచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని వారు చంద్రబాబును కోరుతున్నారు.  రాజధాని నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్న ప్రస్తుత తరుణంలో లోకేష్ సేవలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని వారు వాదిస్తున్నారు. 

Thursday, October 29, 2015

ఆహారం తీసుకున్న తర్వాత ఏ "నీళ్ళు" తాగొచ్చు ?

ఆహారం తీసుకున్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమయ్యేందుకు కొన్ని ఎంజైములు, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత 15 లేదా 20 నిమిషాలకు తర్వాత నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా గుండెకు ఎంతో మంచిది. గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్ ఉత్పత్తికి బ్రేక్ వేయవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. చైనీయులు, జపనీస్ ఆహారం తీసుకున్న తర్వాత గ్రీన్ ట్రీ లేదా గోరువెచ్చని నీటిని తీసుకుంటున్నారు. 
 
గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఆహారం తేలిగ్గా జీర్ణం కావడంతో పాటు ఆరోగ్యానికి కీడు చేసే కొలెస్ట్రాల్‌ను నిరోధించగలుగుతుంది. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని సూప్ కూడా తీసుకోవచ్చు. అయితే ఫ్రిజ్ వాటర్ మాత్రం తీసుకోకూడదు. 
 
కానీ చల్లని నీరు తాగితే ఆరోగ్యానికి కీడు చేసే వ్యాధులు ఏర్పడుతాయి. గుండెపోటు, క్యాన్సర్ వంటి రోగాలు ఫ్రిజ్ వాటర్ తీసుకోవడంతో ఏర్పడతాయి. ఇంకా అజీర్ణం, కొలెస్ట్రాల్ పెరగడం వంటివి జరుగుతాయి. ఫ్రిజ్ వాటర్‌ను వాడుతూ ఉంటే గుండె, కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గోరు వెచ్చని నీరే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నమాట.
 

Wednesday, October 28, 2015

26 వ తేదీ "డేంజర్" డేటా ?

వార్షిక క్యాలెండర్‌లో 26వ తేదీని డేంజర్ డేట్‌గా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో సంభవించిన అనేక ఉత్పాతాలకు ఈ తేదీకి లింకు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే 26వ తేదీని అత్యంత ప్రమాదకర తేదీగా పరిగణిస్తున్నారు. 1700 సంవత్సరంలో జనవరి 26వ తేదీన ఉత్తర అమెరికాలో సంభవించిన భూకంపం మొదలుకుని నిన్నటికినిన్న అక్టోబర్ 26వ తేదీన హిందూకుష్ పర్వత ప్రాంతాల కేంద్రంగా వచ్చిన భూకంపం వరకు 26వ తేదీన సంభవించినవే కావడం గమనార్హం. ఈ ఉత్పాతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. 
 
1700 సంవత్సరంలో జనవరి 26న నార్త్ అమెరికాలో భూకంపం, 1883లో ఆగస్టు 26న అగ్నిపర్వతం బద్దలు, 1926 జూన్ 26న లో రోడ్స్ భూకంపం సంభవించింది. అంతేనా.. 1939 డిసెంబరులో టర్కీ భారీ భూకంపం, 1976 జూలైలో చైనా భూకంపం, 2003 డిసెంబరులో ఇరాన్ భూకంపం, 2010లో జూన్‌లో తాసిక్, జలైలో తైవాన్ భూకంపాలతో పాటు.. మెంట్వా సునామీ సైతం 26వ తేదీనే వచ్చాయి. 
 
వీటితోపాటు ముంబై నగరంపై ఉగ్రదాడి (26/11), 2001లో గుజరాత్ భూకంపం, 2004 వచ్చిన సునామీ, నేపాల్‌లో 10 వేల మందిని పొట్టన బెట్టుకున్న భూకంపం (ఏప్రిల్ 26వ తేదీ), నిన్న ఆప్ఘన్, పాకిస్థాన్‌లలో తీవ్ర ప్రాణనష్టం కలిగించిన పెనుభూకంపం కూడా 26వ తేదీనే వచ్చింది. దీంతో ప్రపంచ చరిత్రలో 26వ తేదీకి, ఉత్పాతాలకూ సంబంధముందన్న వాదన మరింతగా బలపడినట్లయింది. వీటితో పాటు మరికొన్ని ఉత్పాతాలు. 
 
1. జనవరి 26, 1531 : పోర్చుగల్ లిస్బన్‌లో భూకంపంలో 30 వేల మంది మృత్యువాత
2. జనవరి 26, 1700 : పసిఫిక్‌లో భూకంపం. 
3. జూలై 26, 1805 : నేపాల్‌, ఇటలీ, కలబ్రియాలో భూకంపం. 26 వేల మంది మరణం. 
4. ఆగస్టు 26, 1883 : అగ్నిపర్వతం బద్ధలు. మృతులు 36 వేల మంది. 
5. డిసెంబర్ 26, 1861 : గ్రీస్‌లో భూకంపం. 
6. మార్చి 26, 1872 : యూఎస్‌ఏలోని ఓవెన్స్ వ్యాలీలో భూకంపం. 
7. ఆగస్టు 26, 1896 : లాండ్, ఐలాండ్, స్కైడ్‌లలో భూకంపం. 
8. నవంబర్ 26, 1902 : బొహెమియా (ఇపుడు రిపబ్లిక్ ఆఫ్ కొరున)లో భూకంపం. 
9. నవంబర్ 26, 1930 : ఇజులో భూకంపం. 
10. సెప్టెంబర్ 26, 1932 : గ్రీస్, ఐరిస్సోస్‌లలో భూకంపం. 
11. డిసెంబబర్ 26, 1932 : చైనాలోని కన్సులో భారీ భూకంపం, 70 మంది మృత్యువాత. 
12. అక్టోబర్ 26, 1935 : కొలంబియాలో భూకంపం. 
13. డిసెంబర్, 1939, టర్కీలోని ఇర్జిన్‌కాన్‌లో భూకంపం, 41 వేల మంది మృత్యువాత. 
14. నవంబర్ 26, 1943 : టర్కీలోని టోయ లడిక్‌లో భూకంపం. 
15. డిసెంబర్ 26, 1949 : జపాన్‌లోని ఇమైచ్చిలో భూకంపం. 
16. మే 26, 1957 : టర్కీలోని బోలు అబాంట్‌లో భూకంపం. 
17. మార్చి 26, 1963 : జపాన్‌లో వకాస్ బేలో భూకంపం. 
18. జూలై 26, 1963 : యుగోస్లేవియాలో భూకంపం, వెయ్యి మంది మృతి. 
19. మే 26, 1964 : శాండ్‌విచ్ దీవుల్లో భూకంపం. 
20. జూలై 26, 1967 : టర్కీ, పులుమూరులో భూకంపం. 
21. సెప్టెంబర్ 26, 1970 : కొలంబియాలో బహియా సొలానోలో భూకంపం. 
22. జూలై 26, 1971 : సాల్మాన్ దీవుల్లో భూకంపం. 
23. ఏప్రిల్ 26, 1972 : టర్కీ ఎజైన్‌లో భూకంపం.
24. మే 26, 1975 : నార్త్ అంట్లాటిక్‌లో భూకంపం. 
26. మార్చి 26, 1977: టర్కీలోని పలులో భూకంపం. 
26. డిసెంబర్ 26, 1979 : ఇంగ్లండ్‌లోని కర్లీస్లీలో భూకంపం. 
27. ఏప్రిల్ 26, 1981 : యుఎస్ఏలోని వెస్ట్‌మోర్లాండ్‌లో భూకంపం. 
28. మే 26, 1983 : జపాన్‌లోని చుబు, నిహోంకైలో భూకంపం. 
29. జనవరి 26, 1985 : అర్జెంటీనా, మెండోజాలో భూకంపం. 
30. జనవరి 26, 1986 : యుఎస్ఏలోని ట్రెస్ పినోస్‌లో భూకంపం. 
31. ఏప్రిల్ 26, 1992 : యూఎస్ఏ, కాలిఫోర్నియా, కేప్ మెండోనికాలో భూకంపం. 
32. అక్టోబర్ 26, 1997 : ఇటలీలో భూకంపం. 
33. డిసెంబబర్ 26, 2004 : సుమత్రా దీవుల్లో సునామి. 
34. మే 26, 2006 : జకర్తాలో భూకంపం. 
35. జూన్ 26, 2010 : టాసిక్‌లో భూకంపం. 
36. అక్టోబర్ 26, 2010 : మెంత్వానిలో సునామీ.