CSS Drop Down Menu

Sunday, January 31, 2016

అతనితో ఒక్క సెకండ్ నటించినా చాలు అంటున్న నటి ?

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో కలిసి నటించడమా? వండర్ అంటోంది సన్నీ లియోన్. ఆమిర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమంటే..అంతకన్నా ఇంకేం కావాలి.. ఆ ఛాన్స్ వస్తే ప్రపంచం లోనే నేను హ్యాపియెస్ట్ గర్ల్ అవుతా అని పేర్కొంది. అతనితో ఒక్క సెకండ్ నటించినా చాలు..అదే పదివేలు.. అంతేకాదు..అతని వెనుక నడిచే సీన్ ఉన్నా నేను పొంగిపోతా. అలాంటి ఎమేజింగ్ పర్సన్ తో బాలీవుడ్ లో ఎవరైనా కలిసి పని చేయాలని కలలు కంటారు..ఉవ్విళ్ళూరుతారు అని ఓ ఇంటర్వ్యూ లో సన్నీ వ్యాఖ్యానించింది.తన మస్తీజాదే మూవీ ప్రమోషన్ సందర్భంగా ఇలా ఆమె ...ఆమిర్ ని ఆకాశానికెత్తేసింది. సన్నీ లియోన్ గతంతో తనకు సంబంధం లేదని, ఆమెతో ఓ చిత్రం చేసేందుకు తాను  రెడీ అని ఆమిర్ ఖాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Saturday, January 30, 2016

జీన్స్" ఫ్రంట్ జేబు లో చిన్నజేబు" ఎందుకుంటుందో తెలుసా ?


జీన్స్.. యంగ్, యూత్, ఓల్డ్ అనే తేడా లేకుండా ధరించేది. జీన్స్ అంటే అదో క్రేజ్..  రకరకాల మోడల్స్ లో క్రేజీ కలర్స్ లో దొరికే జీన్స్ లో ఒక సీక్రెట్ ఉంది. చాలా  మందికి ఈ సీక్రెట్ గురించి తెలిసి ఉండకపోవచ్చు.. జీన్స్ వేసుకునే వాళ్ల ప్యాంట్లకు ముందు రెండు పాకెట్స్, వెనుకు రెండు పాకెట్స్ కామన్. కానీ ఫ్రంట్ రైట్ సైడ్ పాకెట్ లో ఇంకో చిన్న పాకెట్ ఉండటం నోటీస్ చేసే ఉంటారు. అయితే చాలా మందికి అసలు ఈ పాకెట్  ఎందుకనేది ఒక డౌట్. అఫ్ కోర్స్.. కొంత మంది దీన్ని సీక్రెట్ పాకెట్ గా వాడుతుంటారు. కొంత మంది ఫ్యాషన్ అనుకుంటారు. కానీ ఈ పాకెట్ లో ఒక హిస్టరీ దాగి  ఉంది. 




మోడ్రన్  డేస్ నుంచి అందుబాటులోకి వచ్చిన జీన్స్ ప్యాంట్ వాడే వాళ్లలో కళాకారులు కూడా ఉండేవాళ్ళు. గిటార్ ప్లేయర్లు  గిటార్ పిక్ ఈ మిని పాకెట్ లో పెట్టుకునేందుకు  అని ఊహించారు. తరువాత పెన్ డ్రైవ్ లు పెట్టుకునే పాకెట్  గా వాడారు. అయితే చాలామంది యూత్ ఆ పాకెట్ ను కండోమ్స్ దాచిపెట్టుకునే పాకెట్ గా వాడుతుంటే  కొంతమంది మిగిలిన చిల్లర వేసుకునే పాకెట్ గా వాడుతున్నారు. కానీ అసలు కథ ఏంటంటే...ఈ పాకెట్ వాచ్ ఉంచుకోవడానికి పెట్టారట. 1880లో కౌ బాయ్స్  వాచ్ లు వాడేవాళ్లట. ఈ వాచ్ లకు ఒకచెయిన్  తగిలించి ఎటువంటి డ్యామేజి తగలకుండా వెయిస్ట్ కోట్ జేబులో ఉంచుకునే వాళ్లట. అయితే దీన్ని కొద్దిగా మాడ్రనైజ్ చేసి లెవి స్ట్రాస్ కంపెనీ ఈ మిని పాకెట్  అరేంజ్ చేసిందట. 







    

Friday, January 29, 2016

మహేష్ బాబు గురించి "బయటకు తెలియని" విషయాలు !

టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు. అలుపు లేకుండా, విరామం లేకుండా ఎప్పుడూ సినిమాలు, యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఎప్పుడో రేర్‌గా తప్ప బయట కార్యక్రమాల్లో, పంక్షన్లలో ఆయన అసలు కనిపించరు. ఆయనకు సంపాదనే తప్ప వేరే ధ్యాస లేదనే వారూ, ఫ్యామిలీతో విదేశాల్లో చక్కర్లు కొడుతూ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారనే వారు సైతం ఉన్నారు.
కానీ బయటకు తెలియని ఎన్నో విషయాలు మహేష్ బాబు సంపాదన వెనక ఉన్నాయి. ఆయన సంపాదిస్తున్న దాంట్లో 30 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇదంతా ఓల్డేజ్ హోమ్స్, హోమ్ లెస్ చిన్నారుల చదువుకు, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవహారాలు నమ్రత దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఈ విషయాల మహేష్ బాబు ద్వారా తెలుసుకున్న కమెడియన్ అలీ ఆ మధ్య ఓ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించారు.

Thursday, January 28, 2016

పాము కరిస్తే బతకడం కష్టం ! అటువంటిది 160 పాములు కరిస్తే ?

పాములు చూస్తే భయంతో మనుషులు పరుగు తీస్తారు. విషపూరిత పాము కరిస్తే బతకలేమని మనుషులు భయపడటం సహజం. అయితే అమెరికాలోని ఓ శాస్త్రవేత్త గత 16 సంవత్సరాల నుంచి 160 పాములచేత కరిపించుకున్నాడు. అతనే టిమ్ ఫ్రిదే (37). ఇన్ని పాములు కరిచినా అతను బతికాడు. ప్రపంచంలోనే అతి విషపూరితమైన బ్లాక్ మంబా, టైపస్ లాంటి పాములు కరిచినా టిమ్ ఫ్రిదే బతికి బట్టకట్టగలిగాడు. అతనిని చూసిన సాటి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యానికి గురౌతున్నారు.


అనేక పాముల చేత అతనే కరిపించుకున్నాడు. పాముల విష ప్రభావాన్ని పరిశోధించేందుకు, అతని శరీరం విషాన్ని తట్టుకునేందుకు వీలుగా ఇలా చేశాడు. ప్రస్తుతం టిమ్ కు ఏ పాము కరిచినా ఏమీ కావడం లేదు. 2011లో ఒకే సారి రెండు కోబ్రా పాముల చేత కరిపించుకున్న టిమ్ కోమాలోకి వెళ్లిపోయాడు. మృత్యువుతో పోరాటం చేసి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం విషపూరిత పాములను నుంచి మనుషుల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ తయారు చేసే పనిలో టిమ్ బిజీగా ఉన్నాడు.

Wednesday, January 27, 2016

"మనిషి కన్నా జంతువే మిన్న" అని నిరూపించిన సంఘటన!

ఒక పిచ్చి కుక్క రోడ్డు ప్రక్కన ఉన్న ఒక కుక్క పిల్లను కరవడానికి వచ్చింది.
అక్కడే చెట్టుపైన ఉన్న కోతి వెంటనే క్రిందికి దిగి ,ఆ పిచ్చి కుక్కను అడ్డుకొని,
ఆ కుక్క పిల్లను కాపాడింది.

అక్కడి నుంచి ఆ పిచ్చి కుక్క వెళ్లేంత వరకు , తన ఒడిలో కూర్చోబెట్టుకొని ,
ఆ కుక్క పిల్లను తన సొంత బిడ్డలా చూసుకుంది.

తర్వాత మళ్ళీ ఆ పిచ్చి కుక్క వచ్చి కరుస్తుందేమో అని ఆ కుక్క పిల్లను పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ తల్లడిల్లిపోయింది.ఆ కోతి పడే తపనను చూసి ,అక్కడే ఉన్న కొందరు ఒక పాత్రలో పాలు పోశారు. కుక్క పిల్ల ఆ పాలు త్రాగేటప్పుడు కూడా కోతి తన చేతులను అడ్డుపెట్టి ఎలా రక్షణగా నిలబడిందో ఒక్కసారి చూడండి.



ఎవరైనా ప్రమాదాల్లో ఉన్నప్పుడు " మనకెందుకులే " అని చూసీ చూడనట్లు వెళ్ళే వాళ్లకు ఇలాంటి సంఘటనలు కనువిప్పు కలిగించాలి.

Tuesday, January 26, 2016

"నాన్నకు ప్రేమతో" సుకుమార్ కు నచ్చ లేదట ?

హీరో ట్రెండీ గా ఉన్నాడు, బ్యాక్ డ్రాప్ బాగుంది.. కలెక్షన్లూ బాగున్నాయి. కానీ నాన్నకు ప్రేమతో సినిమాను  డైరెక్ట్ చేసిన సుకుమార్ కు మాత్రం ఈ సినిమా  నచ్చ లేదట. బాగా టైం తీసుకుని నాన్నకు ప్రేమతో సినిమాను ఇంకా బాగా తీద్దామనుకున్నాను. కానీ నా మెడ మీద సంక్రాంతి రేస్ కత్తి పెట్టి ఎన్టీఆర్  తొందర చేశారని కామెంట్ చేశాడట సుకుమార్. కావలసినంత టైం లేకపోవడం వల్ల  క్వాలిటీ ఎడిటింగ్ ఇవ్వలేకపోయానని తెగ ఫీలైనట్టు టాలీవుడ్ టాక్.

అంతే కాదట,.. డైరెక్టర్  కంటే రైటర్ గానే  బాగుంటానని కూడా ఫీలయ్యాడట సుకుమార్. సినిమా టాక్ బాగానే ఉంది కదా..ఇప్పుడెందుకీ వేదాంతం? అని కొందరంటుంటే,, అదేం కాదు. సుకుమార్  డైరెక్షన్ నుంచి బయటకు రావాలనుకుంటున్నాడు.. దానికి ఇలా ప్రిపేర్ అవుతున్నట్టు్న్నాడని ఫిల్మ్ నగర్ లో కామెంట్లు వినబడుతున్నాయట.
 

Monday, January 25, 2016

మనసుకు హత్తుకునే ఆ "శునక విశ్వాసం"

ఒక కుక్క.. యజమాని కారులో వెళుతోంది. అయితే సడన్ గా కార్ విండో నుంచి బయటకు దూకింది. అది గమనించని యజమాని కారుతో ముందుకు సాగిపోయాడు. చాలా దూరం వెళ్లాక కారులో కుక్క లేకపోవడాన్ని గమనించాడు. అయ్యో.. తాను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కేమైందోనని వెతికాడు. కుక్క ఆచూకీ కనిపెట్టలేకపోయాడు. ఈ క్రమంలో నెలలు గడిచిపోయాయి. కుక్కగురించి యజమాని మరచిపోయాడు. అయితే, ఆకుక్క మాత్రం కారునుంచి ఉరికిన చోటే వెయిట్ చేసింది. ఇలా..రోజు..వారం..నెల.. 6నెలలు... ఏకంగా ఏడు నెలలపాటు నిరీక్షించింది.




ఆదారి గుండా ప్రయాణిస్తోన్న మోటారిస్టులు, వాహనదారులు కుక్కను రోజూ గమనించసాగారు. ఎవరి కోసమే తదేకంగా కుక్క ఎదురుచూస్తుందన్న విషయాన్ని గ్రహించారు. కొందరైతే కుక్క సేతతీరేందుకు గొడుగులు, బిస్కెట్లు తదితర సామాగ్రి కుక్కదగ్గర ఉంచసాగారు. తర్వాత కూడా కుక్క అక్కడే ఉండటాన్ని చూసి విషయాన్ని మీడియాకు చెప్పారు. ఇది ఆనోటా ఈ నోటా యజమాని దగ్గరకు చేరింది. దీంతో తమ కుక్క కోసం హుటాహుటీన ఆ ప్రాంతానికి వెళ్లి కుక్కను తెచ్చుకుని కన్నీటిపర్యంతమయ్యారు యజమాని అతని కుటుంబసభ్యులు. మనసుకు హత్తుకునే ఈ ఘటన థాయ్ లాండ్ లో జరిగింది. ఆ విశ్వాసానికి మారుపేరైన ఆ శునకరాజం పేరు బిగ్ బ్లూ..  బిగ్ బ్లూ నీకు శతకోటి వందనాలు.  

Sunday, January 24, 2016

ఫోటో కార్టూన్





Saturday, January 23, 2016

మళ్లీ తెరపైకి జూ.ఎన్టీఆర్ వివాదం ?

హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బుధవారం నాడు హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని వారు ఆందోళన చేయడం గమనార్హం. వారసుడి విషయంలో నాలుగేళ్ల క్రితం టిడిపిలో వివాదం తలెత్తింది. నారా లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్‌లా నాడు మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఆ తర్వాత జూనియర్ రేసు నుంచి తప్పుకోవడం, లోకేష్ తెరపైకి రావడం జరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ, జూనియర్ ఎన్టీఆర్ పేరు టిడిపి వారసుడిగా తెరపైకి రావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు రెండు అయ్యాయి. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను ఏపీకి వారసుడిగా చాలామంది భావిస్తున్నారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. పలువురు జూనియర్ అభిమానులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళన చేశారు. జూనియర్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో దూరం కారణంగా చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చంటున్నారు.


Friday, January 22, 2016

కేసీఆర్ టైలర్ సెంటిమెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్లు ఎక్కువే! ఆయన సీఎం అయిన తర్వాత కూడా చిన్నిచిన్న సెంటిమెంట్లను వదులుకోలేదు. 1990 నుంచి నేటి వరకు ఆయన దుస్తులు కొనుగోలు చేసేది ఒక షాపులోనే, బట్టలు కుట్టించుకునేదీ అక్కడే! తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ హైదర్‌గూడాలోని ఓ ఖాదీ భాండార్‌లో షాపింగ్ చేశారు.
 
క్లాత్ కొనుగోలు చేసిన సీఎం, అక్కడే కొలతలు ఇచ్చి కుట్టించుకునేందుకు ఆర్డరిచ్చారు. దీనిపై షాపు యజమాని తన ఆనందాన్ని వ్యక్తంచేశాడు. కేసీఆర్ సీఎం అయినా మర్చిపోకుండా తమ షాపులోనే షాపింగ్ చేయడం సంతోషంగా వుందన్నాడు.


Thursday, January 21, 2016

"హద్దు దాటుతున్న" అభిమానుల అభిమానం !

హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయంటే ఫ్యాన్స్ భారీ హోర్డింగులు పెట్టి నానా హంగామా చేయడం షరామామూలే! కానీ ఈ పిచ్చి మరింత ముదిరింది.. అందరిముందు మేకలను బలిచ్చి, ఆ రక్తాన్ని ధియేటర్ల ముందు పోస్టర్స్‌పై జల్లుతున్నారు పిచ్చి అభిమానులు. ఇలా చేస్తే ఆ సినిమా హిట్టవుతుందన్నది వాళ్ల నమ్మకమే కావచ్చు.. కానీ బహిరంగంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పేనంటున్నారు జంతు ప్రేమికులు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కడప జిల్లాలో జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్ సమయంలో పులివెందులలోని లక్ష్మి హాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి చర్యను అత్యంత పాశవిక, ఆటవికంగా పేర్కొంటున్నారు. ఈ యవ్వారంపై ఓ స్వచ్ఛంద సేవా సంస్థ లీగల్‌గా ప్రొసీడ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

గతంలో ‘బాహుబలి’ రిలీజ్ సమయంలో వికారాబాద్‌ పట్టణంలోనూ ఇలాగే జరిగింది. ఇలా హీరోల సినిమాలు హిట్ కావడం కోసం మూగజీవాలు బలివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు ‘బాహుబలి’కే పరిమితమైన ఈ ఒరవడి.. ఇప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ వరకు వచ్చింది. రేపటి రోజున మిగతా హీరోల ఫ్యాన్స్ వీటికి ఫుల్‌స్టాప్ పెడతారా? లేదా? అనేది చూడాలి. వీటిపై హీరోలు స్పందించకపోవడాన్ని జంతుప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. 

Wednesday, January 20, 2016

ఒకే నోటుపై "రెండు సీరియల్ నెంబర్స్ "

కరెన్సీ నోట్లపై ముద్రణ చాలా జాగ్రత్తగా వుంటుంది. భారీ సెక్యూరిటీ మధ్య మింట్ సిబ్బంది ముద్రిస్తారు. ఇక నోటు అచ్చువేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగవు. ఒక నోటుపై కనిపించే నెంబరు.. మరో నోటుపై అస్సలు రాదు. అంతేకాదు ఓ నోటుపై ముద్రించిన నెంబరు.. రెండు చోట్లున్నా ఒకటిగానే వుంటుంది. కానీ ఓ బిజినెస్‌మేన్‌కు రెండు నెంబర్లతో వున్న 500 రూపాయలు నోట్ వచ్చింది.





దీపావళికి ముందురోజు మూడు ఏటీఎంల నుంచి చెన్నైకి చెందిన బిజినెస్ మేన్ మోహన్‌రాజ్ కొంత డబ్బును విత్ డ్రా చేశారు. శనివారం వాటిని లెక్కిస్తుండగా అందులో ఓ నోటుకు 500 రూపాయల నోటు పైభాగంలో IBH768505 అని, దిగువ భాగంలో IBH768506 అని వుంది. దీంతో షాకైన అయిన, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. 

Friday, January 15, 2016

"సంక్రాంతి శుభాకాంక్షలు"



Wednesday, January 13, 2016

"334" సంవత్సరాల జైలు శిక్ష పడిన నిందితుడెవరో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆన్‌లైన్ దాడులకు సంబంధించి అనేక వార్తలను ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. ఇంటర్నెట్ వేదికగా సాగుతోన్న ఆన్‌లైన్ దాడుల్లో భాగంగా హ్యాకర్లు, తాము లక్ష్యంగా చేసుకున్న కంప్యూటర్‌లలోకి వైరస్ జొప్పంచి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. తరువాత , ఆ కంప్యూటర్‌లలోని విలువైన సమాచారాన్ని దొంగిలించి తమకు అనుకూలంగా వాడుకుంటారు.
మోసపూరిత ప్రకటనలతో భారీ హ్యాకింగ్‌కు పాల్పిడిన ఓ హ్యాకర్‌కు న్యాయస్థానం ఏకంగా 334 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.టర్కీకి చెందిన Onur Kopcak (26) , మరో 11 మంది హ్యాకర్లతో కలిసి మోసపూరిత ఆన్‌లైన్ స్కామ్‌లకు పాల్పడినట్లు కోర్టు నిర్థారించింది.
ఈ కరుడుగట్టిన హ్యాకర్ బ్యాంకింగ్ ఇన్స్‌స్టిట్యూషన్స్ మాదిరిగా ఇంటర్‌ఫేస్‌ను రూపొందించించి అనేక కార్డ్ హోల్డర్‌లను మోసం చేసినట్లు న్యాయస్థానం నిర్థారించింది. ఈ నేరం క్రింద ఇతగాడికి 2013లోనే 199 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇతగాడి ఉచ్చులో చిక్కి నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తుండటంతో కేసును మరోసారి పున: సమీక్షించన న్యాయస్థానం ప్రధాన నిందితుడైన Onur Kopcakకు ఏకంగా 334 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది.

Friday, January 8, 2016

"వింటర్ హేట్స్"








Saturday, January 2, 2016

"మర్మావయాలను కోసి" కూర వండమన్నాడు ! ఎందుకు ?

తన భార్య కన్నె తనాన్ని నాశనం చేసిన ఓ రేపిస్ట్  మర్మావయాలను కోసి కూర వండుకు తింటే గాని అతగాడి గుండె మంట చల్లారలేదు.షాక్ పుట్టించే ఈ సంఘటన రెండు నెలల కిందట ఇండోనేషియాలోని లాంపంగ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అతని పేరు రూడీ ఎఫెండీ.. ఉండేది జకార్తాలో..30 ఏళ్ల రూడీకి పెళ్లయింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. పెళ్ళయిన తరువాత మామూలుగా జరిగే తొలిరాత్రి నాడు తన భార్య కన్య కాదని తెలుసుకున్నాడు. పట్టరాని  కోపం తెచ్చుకున్నాడు.సంభాళించుకున్నాడు. భార్య నూరియాను అనునయించి అసలు విషయం చెప్పమన్నాడు. దీంతో నూరియా తను డేటింగ్ చేసిన ఫ్రెండ్ తోనే అత్యాచారానికి గురయ్యానని చెప్పింది. ఇది విన్న ఎఫెండి మనసులో క్రూరమైన ప్లాన్ రెడీ అయిపోయింది. సరే .. జరిగిందేదో జరిగింది. అతనితో మాట్లాడాలి. ఒక్కసారి రమ్మనమని భార్య నూరియాతో చెప్పాడు. ఆమె మాట విని తన మాజీ ప్రియుడు నూరియా తో మాట్లాడేందుకు ఇంటికి వచ్చాడు. అతను రావడమే ఆలస్యం.. ఎఫెండీ ఆ మాజీ ప్రియుణ్ని కత్తితో కసిదీరా చనిపోయిన దాకా పొడిచాడు. ఆ తరువాత అతన్ని తగులబెట్టాడు. ఈ దారుణానికి ఒడిగట్టే ముందు ఎఫెండీ ఆ వ్యక్తి  ప్రవేట్ పార్ట్ ను కోసివేసి రాత్రికి కూర వండమని భార్యకు చెప్పాడు. పైగా తనతో బాటు భార్యను కూడా తినమన్నాడు. అలా చేస్తేనే  కానీ తన కోపం చల్లారదని చెప్పాడట ఎఫెండీ.  అదీ విషయం.