CSS Drop Down Menu

Saturday, April 30, 2016

"ఎండాకాలం లో బీరు తాగితే" మీకే ప్రమాదం !

అసలే ఎండలు మండిపోతున్నాయి. డీహైడ్రేషన్‌ను తగ్గించుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు పడుతుంటారు. అయితే బీర్ తాగితే వేసవిలో రిలీఫ్‌గా ఉంటుందని మందు బాబులు ఫుల్‌గా బీర్ లాగిస్తే మాత్రం డీహైడ్రేషన్‌తో తిప్పలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీర్‌తో పాటు ఆల్కహాల్ డ్రింక్స్ ఏది తీసుకున్నా.. శరీరంలో ఉన్న నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటే తరచూ యూరిన్ పాస్ చేయడం జరుగుతుందని తద్వారా డీ హైడ్రేషన్‌ సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఎక్కువగా బీర్లు తాగుతుంటారు. అలా తాగీ తాగీ నీటిని కోల్పోవడం చాలా ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవైపు ఎండలతో చెమట రూపంలో నీరు బయటికి వచ్చేస్తుంది. ఇక బీరు తాగితే మాత్రం డీ హైడ్రేషన్ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సో ఎండాకాలంలో బీరే కాదు.. ఆల్కహాల్ తీసుకునే ముందు ఓసారి ఆలోచించండి. 

Friday, April 29, 2016

గుళ్ళలో పెట్టే "వెజ్,నాన్‌వెజ్" ప్రసాదాలు !

భగవంతుడికీ, భక్తులకీ అనుసంధానమైనది ప్రసాదమేనంటారు. రుచి, శుచి, ఆరోగ్యం దాగున్న ప్రసాదం పెట్టే గుళ్లు మన దేశంలో చాలా ఉన్నాయి. ప్రసాదం అంటే అరచేతిలో రాసేదికాదు. కడుపు నిండా ప్రసాదాలు పెట్టే గుళ్లు కూడా ఉన్నాయి. ఆ మాత్రం ప్రసాదాలు పెట్టకపోతే ఆ దేవాలయాలకు భక్తుల రాకపోకలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయనుకోండి అది వేరే విషయం. దేవుళ్లకు పెట్టే ప్రసాదాల్లో ఆయా ప్రదేశాలు, ఆచారాలు బట్టి ఓన్లీ వెజిటేరియన్ ప్రసాదాలే కాకుండా నాన్‌వెజ్ ప్రసాదాలు కూడా ఉంటాయి. నోరూరించే ఆ ప్రసాదాల సమాచారం ఇదే.



ప్రసాదాల్లో ముందుగా చెప్పుకోవాలంటే.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒడిషాలోని పూరీ జగన్నాథ్ మహా ప్రసాదం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ జగన్నాథుడికి సమర్పించే నైవేద్యంలో 56 రకాల ప్రసాదాలుంటాయి. వీటిని ఆలయ సాంప్రదాయాల ప్రకారం గుడిలోవున్న వంటశాలలోని కుండల్లోనే తయారు చేస్తారు. ముందుగా మహా ప్రసాదాన్ని జగన్నాథుడికి సమర్పించక ముందు ఎటువంటి రుచి గానీ, వాసన గానీ ఉండదు. కానీ దేవుడివి నైవేద్యంగా సమర్పించగానే ప్రసాదానికి ఘమఘుమలతోపాటు అద్భుతమైన రుచి కూడా వస్తుందట. ఇక పూరీ జగన్నాథుడికి నివేదించే  ప్రసాదాల్లో పాయా, పొడిగా ఉండే గజ్జా, పన్నీర్‌తో కలిపి చేసే ఖీరా, కణిక అనే పాయసం, బియ్యం, పప్పు కలిపి చేసే సబ్జీ అబోధా ప్రసాదం భక్తులు అస్సలు మిస్ కానేకారు. జగన్నాథ్  ఆలయంలోనే నాన్‌వెజ్ ప్రసాదం కూడా నైవేద్యంగా పెడతారు. గుడి ఆవరణలోని ప్రత్యేక ఆలయంలోవుండే జగన్నాథుడి సహధర్మపత్ని విమలాదేవికి ప్రతిరోజూ దుర్గాదేవి పూజలు చేసి అమ్మవారికి బలి ఇచ్చిన మేక మాంసాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. దీంతోపాటు గుడికొలనులో పట్టిన చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. 


వందల ఏళ్ల చరిత్ర గల రాజస్థాన్‌లో సల్సార్ బాలాజీ ఆలయంలో పెట్టే సావమణి ప్రసాదం. ఇక్కడున్న స్వయంభూ హనుమాన్ ఆలయం(దీన్నే శక్తి స్థల్ అని కూడా పిలుస్తారు)లో ఆంజనేయుడి విగ్రహం గుండ్రగా ఉంటుంది. ఆంజనేయుడికి గడ్డాలు, మీసాలు కూడా ఉంటాయి. ఇక్కడకొచ్చి దర్శనం చేసుకంటే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ మీసాల ఆంజనేయుడికి భక్తులు  50 కేజీలకు తగ్గకుండా నైవేద్యాన్ని సమర్పిస్తారు. నెయ్యి కలిపిన దాల్ భాటి, చుర్మా, బూందీ, దూద్ పేడా లడ్డూ ఉండే ప్రసాదం కోసం భక్తులు ఎగబడతారు.


తిరుపతి లడ్డూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంత క్రేజో తెలిసిందే.. తిరుమల బాలాజీ ఆలయంలో పెట్టే లడ్డూ ప్రసాదం  ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. తిరుమలలో లడ్డూ ప్రసాదంతోపాటు వడ, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, మిర్యాల పొంగలి, ఆపమ్, పాయసం, జిలేబీ, మురుకు, దోశె, కేసరి, మల్హోరా ప్రసాదాలు కూడా మంచి రుచిగా ఉంటాయి. తరువాత అమృతసర్‌లోని గోల్డెన్ టెంపుల్. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్‌కు రోజూ లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులకు గోల్డెన్ టెంపుల్‌  లోని లంగాలర్‌ లో కుల, మత రహితంగా ప్రసాదం వడ్డిస్తారు. లంగార్‌లోని సాంప్రదాయ వంటశాలలో రోజూ రెండు లక్షల చపాతీలు, ఒకటిన్నర టన్నుల పప్పు, వండి వడ్డిస్తారు. భక్తులకు ప్రసాదంగా పంచేందుకు 100  క్వింటాళ్ల గోధుమ పిండి, 25 క్వింటాళ్ల ధాన్యాలు, 10 క్వింటాళ్ల రైస్, 5000 లీటర్ల పాలు, 10 క్వింటాళ్ల చక్కెర, 5 క్వింటాళ్ల  నెయ్యి ఉపయోగిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఈ వెజిటేరియన్ ప్రసాదాన్ని రుచి చూడాల్సిందే. 


అలాగే త్రికూటా పర్వత ప్రాంతం. జమ్మూ సమీపంలోని కత్రాలోవున్న వైష్ణోదేవి ఆలయంలో పిండి రూపంలో ఉండే అమ్మవారు ఎంతో ప్రసిద్ధో.. ఆ దేవాలయంలో  పెట్టే ప్రసాదానికీ అంతే పేరుంది. ఇక్కడ వైష్ణోదేవి అమ్మవారికి రాజ్‌మా, బియ్యంతో ఉడికించిన ప్రసాదం, కడీ చావల్, శెనగలు, పూరీ, ప్రసాదంగా పెడతారు. వీటిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా వండుతారు. వీటితోపాటు ప్రసాదంగా ఇచ్చే పఫ్డ్ రైస్, డ్రైడ్ యాపిల్స్, ఎండుకొబ్బరి, వాల్ నట్స్ ఎంతో ఫేమస్. చివరిగా మధురైకి 20 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలోవున్న కల్లా జాగర్  కోవిల్. దీన్నే  అలాగర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. విష్ణుమార్తి కొలువై ఉన్న  ఈ ఆలయంలో ప్రసాదం గొప్ప రుచి గల సాంబార్, దోశె భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

Thursday, April 28, 2016

ప్రపంచం మొత్తం మీద "మహిళలే నిర్వహిస్తున్న మార్కెట్" ఎక్కడుందో తెలుసా ?

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కి వెళితే అక్కడ ఒక ప్రత్యేకమైన మార్కెట్ కనిపిస్తుంది. ఇందులో విశేషం ఏముంది అంటారా... ఆ మార్కెట్‌లో అమ్మకందారులంతా మహిళలే కావడం విశేషం. ప్రపంచం మొత్తం మీద స్త్రీలే నిర్వహిస్తున్న మార్కెట్ ఇదే కావడం విశేషం. దాదాపు నాలుగువేల మంది మహిళలు ఈ మార్కెట్‌లో విక్రయదారులుగా ఉన్నారు. 

 
 
ఇక్కడ అన్ని రకాల వస్తువులు, బట్టలు, పండ్లు, తినుబండారాలను అమ్ముతుంటారు. ఇక్కడ లభించే వస్తువులు మరెక్కడా లభించవని మహిళా విక్రయదారులు గర్వంగా చెపుతున్నారు. ఒకతరం నుంచి మరో తరానికి సుమారు 500 ఏళ్ళుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందట. 
 
 
 
దీన్ని అక్కడి భాషలో ''ఇమా కీథేల్'' మార్కెట్ అని వ్యవహరిస్తారు. ఆంగ్లంలో ''మదర్స్ మార్కెట్'' అని దీని అర్థమని అంటున్నారు. వస్తువులు కొనడానికి వచ్చే ప్రజలు, టూరిస్టులపట్ల వీళ్ళంతా ఎంతో సభ్యతగా వ్యవహరిస్తారట. ఈ మహిళలందరూ పెళ్ళయిన వారే కావడం గమనార్హం.
 

Wednesday, April 27, 2016

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడే పిల్లల్లో "మెల్లకన్ను" వస్తుందా ?

ఏదైనా అతిగా చేస్తే ఇబ్బందులు తప్పవు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. కానీ సైంటిఫిక్‌గా రుజువుచేశారు పరిశోధకులు. స్మార్ట్‌ఫోన్ అతిగా వాడే ఐదేళ్లలోపు పిల్లల్లో మెల్లకన్ను వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కొరియాలోని చొన్నామ్‌వర్సిటీ వైద్యుల బృందం ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో ఏకదాటిగా అరగంటపాటు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను చూస్తూ గడిపే పిల్లలకు మెల్లకన్ను వస్తున్నట్లు తేల్చేశారు. 

ఏడు నుంచి 16 ఏళ్ల వయసున్న 12 మందిపై ఈ పరిశోధన చేపట్టారు. రోజూ 4 నుంచి 8 గంటలపాటు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేలా ప్లాన్ చేశారు. స్మార్ట్‌ఫోన్- వాళ్ల కంటి చూపునకు మధ్య 20 నుంచి 30 సెంటీమీటర్ల దూరం వుంచారు. ఇలా చేస్తే.. రెండునెలల్లో 12 మందిలో 9 మందికి కళ్లలో తేడాలొచ్చినట్టు గుర్తించారు. దీనివల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి కనుపాపలు పైకి, కిందకు, పక్కకు మారే ప్రమాదం ఎక్కువట. స్మార్ట్‌ఫోన్‌ను 2 నెలలుగా వాడని 12 మందిలో 9 మంది పిల్లల చూపు బాగా మెరుగుపడింది. సో.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను 30 నిమిషాలకంటే కంటే ఎక్కువచూడొద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. 

Tuesday, April 26, 2016

రేష్ డ్రైవింగ్‌ చేసే వారి భరతం పట్టనున్న డిజిటల్ ఇండియా !

డిజిటల్ ఇండియాలో భాగంగా మోదీ గవర్నమెంట్ కొత్త స్కీం ప్రవేశపెట్టింది. జాతీయ రహదారులపైనేకాదు.. నార్మల్‌ రోడ్లపైనా రేష్ డ్రైవింగ్‌తో సామాన్యులకు వాహనదారులు ఇబ్బందిపెట్టిన, పెడుతున్న సందర్భాలు లేకపోలేదు. యాక్సిడెంట్స్ చేసి మరీ రయ్యనపోతున్నారు. ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పధకాన్ని ప్రారంభించింది.


 రేష్ డ్రైవింగ్ చేసినా, ట్రాఫిక్ రూల్స్ అధిగమించినా, యాక్సిడెంట్ చేసి వాహనం ఆపకుండా వెళ్లిపోయినా వివరాలు గతంలో తెలిసేవికావు.. దీనివల్ల బాధితుడు నానా ఇబ్బందిపడేవాడు. ఇలాంటివాటికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది కేంద్రం.

డిజిటల్ ఇండియాలో భాగంగా VAHAN  స్పేస్ వాహనం నెంబరు టైప్ చేసి ఈ నెంబర్‌కు 77382 99899 SMS‌కు పంపితేచాలు... వెంటనే కారు ఎవరిది? వెహికల్ ఎవరి పేరుమీద వుంది అన్న డిటేల్స్‌ని వెంటనే ఫోన్‌కి వస్తాయి. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం బాధితుడికి మరింత సులువుకానుంది.

Monday, April 25, 2016

పవన్ "ఫిట్ నెస్" సీక్రెట్ !

ప్రతీ రోజూ తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేయడం పవన్ కు అలవాటట. అంతేకాక, తన ఫుడ్ లో కూడా పూర్తిగా శాకాహారమే ఉంటుందని, ఏడాదిలో ఆరు నెలల పాటు రోజుకు ఒక పూటే మీల్స్ తీసుకుని, మిగిలిన పూటల్లో ఫ్రూట్స్ తీసుకుంటుంటాడట. స్ట్రిక్ట్ ఫుడ్ డైట్, వ్యాయామం, యోగాతో పాటు, అనవసరమైన విషయాల మీద బుర్ర పెట్టకుండా తన పని తాను చేసుకుపోవడమే తన ఫిట్ నెస్ వెనుక ఉన్న రహస్యం అంటున్నాడు పవర్ స్టార్.

Friday, April 22, 2016

"తేలు విషం"తో సిగరెట్లు !

పాకిస్థాన్‌లో స్మోక్ లవర్స్‌కు పిచ్చి పీక్‌కు వెళ్లింది? ఇప్పుడు తాగుతున్న  సిగరెట్ కిక్  చాలక మరింత కిక్ కోసం కొత్తదారులు వెదుకుతున్నారట. గంజాయి, మార్ఫిన్, చరస్, ఓపియమ్ లాంటి మత్తు పదార్ధాలు కూర్చిన సిగరెట్ల కంటే తేలుకొండి విషంతో తయారు చేసిన సిగరెట్లకు పిచ్చి గిరాకీ ఏర్పడిందట. మీరు చదివింది నిజమే.. పొగాకుతోపాటు తేలుపొడిని కూడా కలిపి సిగరెట్లలో కూర్చిన సిగరెట్ తాగితే  కిక్కు నషాళానికెక్కి.. తు..చ ల్..మే ఆవూ.. అనిపిస్తుందట.

మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలతో తయారైన సిగరెట్లు తాగి తాగి బోరు కొట్టిన పాకిస్థానీ స్మోకర్ల బుర్రలో పుట్టిందీ తేలు సిగరెట్. మొదట తేళ్లను చంపి వాటిని ఎండబెట్టి బొగ్గుల మీద వాటిని కాల్చి పొడి చేసి ఆ పొడిని  సిగరెట్లలో కూరి తాగుతారు. పాకిస్థాన్ నార్త్ వెస్ట్రన్‌లోని ఫక్తున్హా  ప్రాంతం ఈ సిగరెట్లకు బాగా ఫేమస్. ఈ స్కార్పియన్ సిగరెట్లను ఇరవయ్యో ఏట నుంచి కాలుస్తున్న సోహబత్ అనే వ్యక్తి జలీల్ కబాబ్ హౌజ్‌లో ఒక వ్యక్తి దగ్గర ఒక్కో తేలును జస్ట్.. రూపాయి, రెండు రూపాయలకు కొనుగోలు చేసేవాడు. పెషావర్‌లో వేడి అధికంగా ఉండి తేళ్ళు విపరీతంగా దొరికే మటాని ఏరియా నుంచి తెచ్చి వీటిని సప్లై చేస్తున్నారట. తేలు తోక, కొండె భాగాల్లో ఉండే విషాన్ని ఒకసారి రుచి చూస్తే చాలు దానికి బానిసలై పోతారట. ఈ కొండి భాగాన్ని కొంతమంది హషిష్, పొగాకు మిశ్రమంతో కలిపి  సిగరెట్లు లేదా సన్నని గొట్టంలో కూర్చి పీల్చుతారు. ఈ కిక్కు సుమారు పదిగంటల పాటు ఉంటుందట. మొదటి ఆరు గంటలు శరీరం కొద్దిగా ఇబ్బందిపడినా మత్తుకు అలవాటు పడ్డ తరువాత అడ్జెస్ట్  ఐపోతుందట. కిక్కు సంగతేమో గానీ, ఈ స్కార్పియాన్ సిగరెట్లు తాగడం వల్ల మెదడు బాగా దెబ్బతింటుందని ఎక్స్ పర్టులు చెబుతున్నారు. మామూలుగా దొరికే 1750 రకాల తేళ్ల జాతుల్లో 25 రకాల తేళ్ల విషం మనుషుల ప్రాణాలు తీస్తుందని చెబుతున్నారు. తేలు విషంతో కూడిన సిగరెట్లను తాగేవాళ్ళలో మెమొరీ లాస్ ఎక్కువని అంటున్నారు. భ్రాంతిలో మునిగిపోవడం లాంటి  రుగ్మతలు కూడా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

Thursday, April 21, 2016

"వారానికోసారి" బిర్యానీ లాగించేస్తున్నారా ?

అతిగా ఏంతిన్నా అజీర్తి ఖాయమే... ఇది గుర్తెరిగి తింటేనే పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండొచ్చని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అయితే, ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తది కనుక్కున్నారు. వారానికోసారేకదాని పూటుగా చికెన్, మటన్, బిర్యానీ లాగించేస్తే చాలా ఇబ్బందే అంటున్నారు. కాలేయ సమస్యలకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఒక్కటే కారణం కాదని, అదేపనిగా చికెన్, మటన్ బిర్యానీలు తినేవారిలో కూడా కాలేయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు.

 https://rewardme-in.secure.footprint.net/Assets/Modules/Editorial/Recipe/Images/authentic-eid-al-fitr-chicken-biryani-2-size-3.jpg

మద్యం సేవించే అలవాట్లు లేకున్నా, బిర్యానీ తినే అలవాటున్న వారిలో కాలేయ సమస్యలు ప్రతి ఏడాది 30 నుంచి 35 శాతం వరకు పెరుగుతున్నాయని పరిశోధనలో తేల్చారు. కూల్ డ్రింక్ సేవిస్తూ బిర్యానీ తింటే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువట. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతి నొప్పి, నీరసం వంటి లక్షణాలే కాలేయ వ్యాధులకు సింప్టమ్స్ అని చెబుతున్నారు. బిర్యానీ తయారీలో వాడే వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వినియోగించడం, నాణ్యత లేని మాంసాహారాన్ని వాడటం వల్ల కాలేయ సమస్యలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

Wednesday, April 20, 2016

ప్రజలు "చెప్పుతో కొట్టినా భరిస్తానన్న" నల్లపురెడ్డి ?

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి సునీల్‌కు గూడూరు శాసనసభ టికెట్ ఇప్పించింది తానే అని, అందువల్ల ప్రజలకు సునీల్ చేసిన మోసానికి తాను క్షమాపణ చెబుతున్నానని, అయినా కోపం తగ్గకపోతే తనను గూడూరు ప్రజలు చెప్పుతో కొట్టినా భరిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు.

గూడూరు శాసనసభా నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన సునీల్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపైనే నల్లపురెడ్డి మాట్లాడారు. సునీల్ ఇంత దెబ్బ కొడుతారని అనుకోలేదని, సిగ్గుతో తల దించుకుంటున్నానని ఆయన అన్నారు.

సునీల్ బాగా పనిచేస్తాడని తాను జగన్‌తో చాలా సార్లు చెప్పినట్లు ఆయన తెలిపారు. కానీ తనను మోసం చేసి సునీల్ టిడిపిలో చేరారని ఆయన అన్నారు. తమ కుటుంబానికి ఏదో శాపం ఉందని, అందుకే ఇలాంటి వెన్నుపోట్లు తమ కుటుంబానికి పదేపదే ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.

సునీల్ దారుణంగా వెన్నుపోటు పొడుస్తాడని తాను ఊహించలేదని ఆయన అన్నారు. సునీల్ చేసిన పనికి తాను తలెత్తుకోలేకపోతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ పార్టీ వీడడం వెనక తన పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరులో రాజరాజేశ్వరి దేవి, సూళ్లూరుపేట చెంగాలమ్మ, రామతీర్థం శివుళ్లపై ప్రమాణం చేస్తున్నానని, సునీల్ పార్టీ వీడడం వెనక తన పాత్ర ఉంటే తన కుటుంబం సర్వనాశనం అవుతుందని ఆయన అన్నారు.

Tuesday, April 19, 2016

"పూరి" పై దాడి !

‘లోఫర్’ మూవీ నష్టాలు దర్శకుడు పూరి జగన్నాథ్‌ని ఇబ్బందుల్లో నెట్టింది. ఈ మూవీ హక్కులు కొన్న తాము నష్టపోయామని, దీన్ని భర్తీ చేయాలంటూ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు ఆయన ఇంట్లో ప్రవేశించి ఆయనపై దాడి చేశారట. సుధీర్, ముత్యాల రామదాస్, అభిషేక్ అనే డిస్ట్రిబ్యూటర్లు మూడు రోజులక్రితం తన ఇంటికి వచ్చి తనే మీద దాడి చేశారని పూరి జగన్నాథ్ జూబిలీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని వాళ్ళు డిమాండ్ చేశారని, అయితే దేనితో తనకు సంబంధం లేదని, ఈ సినీ నిర్మాత సి.కళ్యాణ్‌ను కలుసుకోవలసిందిగా తాను కోరినా వినలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
 తను తీస్తున్న తాజా సినిమా హక్కులు తమకే ఇవ్వాలంటూ బెదిరించారని తెలిపాడు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని కూడా హెచ్చరించారన్నాడు. 2015 డిసెంబరు 17న ‘లోఫర్’ చిత్రం రిలీజయింది. ఈ సినిమా నైజాం, ఆంధ్ర, సీడెడ్ హక్కులను ఈ డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. కానీ బాక్సాఫీసు వద్ద మూవీ చతికిలబడడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ఇదిలాఉండగా పూరిపై దాడి చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. టాలీవుడ్‌లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది.

Monday, April 18, 2016

"అరేబియా సముద్రం" లో అద్భుత శివాలయం !

ఇంతవరకు మీరు ఆలయాలను కొండల మీద, గుట్టల మీద, నదులు - సముద్రాల ఒడ్డున, ఊరి మధ్యలో ... పర్వతాల్లో, గుహాల్లో చూసి ఉంటారు అవునా ? ఈ ప్రదేశాల్లో కాకుండా, ఇంకా ఎక్కడైనా మీరు ఆలయాలను చూశారా ? ఊహించండి ... ఇంకా ఏదైనా ప్రదేశం మీ బుర్రకు తట్టవచ్చేమో ..? (లేదు కదూ ..!)
సముద్రం లోపల ఊహించారా ? అవునండీ .. సముద్రం లోపలే ? ఏం ఆశ్చర్యపోతున్నారా ? నిజమండీ బాబోయ్ .. సముద్రం లోపల ఆలయం ఉంది. అదెక్కడో కాదు .. మన భారతదేశంలోనే ... అరేబియా సముద్రం లోపల ఉందండీ. ఇక్కడికి వెళితే రాగలమో ?లేమో ? అనేగా మీ సందేశం. అయితే దీని గురించి మీకు చెప్పాల్సిందే .. !
గుజరాత్ లోని భావ్ నగర్ నగరానికి సమీపాన ఉన్న కొలియాక్ అనే గ్రామంలో సముద్రం నుండి 1. 5 కిలోమీటర్ల లోపల ఉన్నది.
ఇక్కడ చెప్పబడుతున్న ఆలయం శివునికి అంకితం చేయబడినది. ఇందులో శివలింగం ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రధాన దైవం. ఈ గొప్ప శివలింగం అరేబియా సముద్రంలో ఉంటుంది.


ఆలయానికి ఏ టైమ్ అంటే ఆ టైమ్ లో వెళ్ళకూడదు. దీనికంటూ ఒక సమయం ఉంది. ఉదయాన్నే లేచి అక్కడికి వెళితే కనపడదు ఈ ఆలయం.ఒకవేళ మీరు వెళ్లారే అనుకోండి ... అక్కడ మీకు ఆలయం కనిపించదు ... దూరంలో సముద్రంలో నిలబడి ఉన్న ద్వజస్తంభం కనిపిస్తుంది.

మధ్యాహ్నం పూట వెళితే మీరు ఆలయాన్ని చూడవచ్చు. ఆ సమయంలో సముద్రం మెల్లగా వెనక్కి వెళుతుంది (మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో ఈ దృశ్యం కనిపిస్తుంది). అలా సముద్రం వెనక్కి వెళ్ళిన తరువాత మీరు ఆలయం వద్దకు తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్ళవచ్చు, ఆలయంలో పూజలు చేయవచ్చు.


ఇలా రాత్రి 10 గంటల వరకు మీరు అక్కడే .. ఆలయంలో హాయిగా గడపవచ్చు. ఆ సమయం దాటితే మాత్రం వెనక్కి వచ్చేయ్యాలి లేకుంటే సముద్రంలో కలిసిపోతారు. రాత్రి 10 దాటితే సముద్రం మళ్లీ ముందుకు వచ్చి గుడిని ముంచెత్తుతుంది. దాంతో గుడి కనిపించదు. ఇదీ ఇక్కడ జరిగే అద్భుత వింత.



ఆలయంలో ఎత్తుగా ఉండేది ద్వజస్తంభం. సుమారు ఆ లెవల్ వరకు (20 మీ) నీళ్ళు వచ్చేస్తాయి. ఇలాగా కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచి జరుగుతుందట.
ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెబుతుంది. పాండవులు పూజలు చేసి ప్రతిష్టించిన 5 శివలింగాలు ఇప్పటికీ ఆలయంలో చెక్కు చెదరకుండా ఉన్నాయి.
పౌర్ణమి లో ... చంద్రుని వెన్నల కాంతుల్లో ... సముద్రం ముందుకు వచ్చి, మెల్లగా తనలోకి గుడిని తీసుకుపోవడం అద్భుతంగా కనిపిస్తుంది. వీలైతే చూడండి. ఈ ఘట్టాన్ని తిలకిస్తున్నంత సేపు .. కళ్లుఆర్పకుండా చూస్తూ ఉండటమే ఇక్కడ కొసమెరుపు. చూస్తున్నంత సేపు ఇటువంటి అద్భుత దృశ్యం ప్రపంచంలో మరెక్కడా లేదేమో అనిపిస్తుంది.


ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా మీరు భావ్ నగర్ చేరుకోవాలి. భావ్ నగర్ నుండి బస్సుల్లో లేదా ఆటోల్లో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు. భావ్ నగర్ లో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి ముంబై, ఢిల్లీ, గాంధీనగర్, జైపూర్ వంటి అంగరాలకు రెగ్యులర్ గా విమానాలు నడుస్తుంటాయి.
 రైలు మార్గం భావ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా అహ్మదాబాద్, ఓఖా, వడోదర, ముంబై నగరాల నుండి ప్రతిరోజూ రైళ్లు నడుస్తుంటాయి. 
 రోడ్డు  బస్సు మార్గం భావ్ నగర్ వ్యాపార నగరం. సమీప పట్టణాల నుండి, సూరత్, రాజ్ కోట్, జామ్ నగర్ ప్రాంతాల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.

దీనికి సంబందించిన వీడియో చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి. 

 https://youtu.be/j3WHHA-MNe4




Friday, April 15, 2016

"కొత్త వివాదం రేకిత్తించడానికి రెఢీ" అయిన భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ !

పురుషులతో సమానంగా మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాల్సిందేనంటూ శనిసింగనాపూర్ ఆలయంలో నానా రభస చేసి..చివరికి కోర్టు మెట్లు ఎక్కి ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ తాజాగా మరో వివాదం రేకిత్తించడానికి రెఢీ అయ్యారు.  సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయంలోకి ప్యాంటు, కోటు వేసుకుని వెళ్లారు. దీనిని ఆలయ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడి నిబంధనల ప్రకారం చీరతోనే మహిలు లోపలికి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెప్పడంతో, ఆమె మండిపడ్డారు. ఇష్టమొచ్చిన దుస్తులను ధరించనీయకుండా అడ్డుపడతారా? అని ప్రశ్నించారు. ఇంకేముంది ఈవిడ గారు టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడానికి కొత్త అస్త్రం దొరికినట్లైంది.

 కొన్ని దేవాలయాల్లో అమలవుతున్న సంప్రదాయ వస్త్ర ధారణ పద్ధతులు ఆమెకు నచ్చడం లేదంట. వేసుకునే దుస్తులపై నిబంధనలేంటని ప్రశ్నించారు. అంతటి ఆగకుండా ఇలాంటి నియమాల్ని ఇక ఉపేక్షించబోనని దీనిపై మరో ఉద్యమానికి రెఢీ అయ్యింది. దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో అక్కడి కట్టుబాట్లు ప్రకారం వస్త్ర నిబంధనలు అమలవుతున్నాయి. తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాల్లో పురుషులు షర్ట్ లేకుండా వస్తేనే అనుమతిస్తుండగా, కేరళలో చాలా దేవాలయాల్లో కేవలం పంచెతో మాత్రమే వెళితేనే అనుమతిస్తారు.

ఇక మహిళల విషయానికి వస్తే, జీన్స్, టీషర్ట్స్, మినీస్, షార్ట్స్ ధరించి వస్తే ఆలయాల్లోకి అనుమతించడం లేదు. తిరుమలలో సైతం మహిళలు చీర లేదా పంజాబీ డ్రస్, చుడీదార్ మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని తాను వ్యతిరేకిస్తున్నానని భగవంతుడి దగ్గరికి పవిత్రమైన మనస్సుతో వెళ్లాలి కాని చీరలు, పంచెలు కట్టుకుని వెళ్లడమేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. యధా ప్రకారం సంప్రదాయవాదులు ఈమె తీరుపై మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం దేవాలయ కట్టుబాట్లను మీరితే అంతు చూస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సరికొత్త వివాదం దేశంలో ఏ విధంగా ప్రకంపనలు సృష్టిస్తోంది వేచి చూడాలి.

Thursday, April 14, 2016

"పెళ్లికాని జంటలు 10 గంటల" పాటు ఈ హోటళ్లలో ఎంచక్కా గడపొచ్చు!

స్టార్టప్ కంపెనీలు... నేటి తరం ఔత్సాహిక యువతలో ఓ వినూత్న ఆలోచనకు నాంది పలుకుతున్నాయి. అలాంటి ఆలోచనే ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి వచ్చింది. అతడి పేరు సంచిత్ సేథీ. ఇంతకీ అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే? పెళ్లికాని యువతీ యువకులకు హోటల్లో గదులను ఇప్పించడం. పెళ్లికాని ప్రేమికులు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడపాలంటే చాలా కష్టం. వాళ్లకు గదులు దొరకవు. ఒకవేళ ఏదైనా హోటల్లో గది తీసుకుందామన్నా పోలీసులతో ఇబ్బందే. ఈ సమస్యను గుర్తించిన బిట్స్ పిలానీ మాజీ విద్యార్థి సంచిత్ సేథి ఓ పరిష్కారం కనుగొన్నాడు. ఈ హోటళ్లలో పెళ్లికాని జంటలు కూడా ఎంచక్కా గడపొచ్చు. వెబ్‌సైట్‌లో ఉన్న జాబితాలో ఉండే హోటళ్లలో 10 గంటల పాటు గడిపేందుకు అనుమతి ఇస్తారు. నిజానికి పెళ్లికాని యువతీ యువకులకు రూములు ఇవ్వకూడదన్న నిబంధన మన రాజ్యాంగం లేదు. మన చట్టాల ప్రకారం అది శిక్షార్హం కూడా కాదు. కానీ భారత సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెళ్లికాకుండా యువతీ, యువకులు ఒకే రూంలో ఉండటం మన సమాజానికి ఇష్టం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని హోటళ్లలో రూములు ఇచ్చేందుకు మేనేజర్లు సైతం భయపడతారు. అంతేకాదు రూము ఎందుకంటూ అనేక ప్రశ్నలు సంధిస్తారు.
 
చాలాసార్లు రూము ఇవ్వలేమని కూడా చెబుతారు. ఈ అడ్డంకుల్ని అధిగమించి పెళ్లికాని జంటలకు ఆతిథ్యం ఇచ్చేలా 'స్టే అంకుల్' పేరిట డిసెంబర్ 2015లో సేథీ స్టార్టప్ సంస్థను మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ స్టార్టప్ సంస్థ విజయవంతంగా అందరి మన్ననలను అందుకుంటోంది. తొలుత ఎనిమిది గంటల పాటు హోటల్ రూం కోరుకునే వారికి సాయపడాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆపై, పెళ్లికాని జంటల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఆ దిశగా ఇప్పుడు కసరత్తు పెట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, సిమ్లా, బెంగళూరు, పాటియాలా తదితర ప్రదేశాల్లోని వందలాది హోటళ్లతో సేథీ ఒప్పందం చేసుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో 34, ముంబైలో 10 హోటళ్లను ఈ జాబితాలో పొందుపరిచాడు. అయితే దేశంలోనే పేరుగాంచిన ఓబెరాయ్, ట్రైడంట్ హోటల్స్ సైతం సేథీ ఆఫర్‌కు తలొగ్గడం విశేషం. సాధారణంగా ఈ హోటల్స్ 24 గంటల పాటు అద్దెకిస్తున్న సంగతి తెలిసిందే. "10 గంటల పాటు గడిపేందుకు రూ. 1200 నుంచి రూ. 5 వేల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగానే రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ లేదంటే రాత్రి 8 గంటల నుంచి ఉదయం వరకూ రూములు తీసుకోవచ్చు. ప్రీమియం హోటళ్లనే మేము ఎంచుకున్నాం. త్వరలోనే మరిన్ని నగరాలు, పట్టణాలకు విస్తరిస్తాం" అని సేథీ తెలిపారు.

Monday, April 11, 2016

"గొంతుక, కాళ్ళకు 460 కోట్లు బీమా" చేయించుకున్నది ఎవరో తెలుసా ?

పాప్ సంగీత సంచలనం మారియా కేరీ అంటేనే ఓ సంచలనం.  అమెరికన్ పాప్ స్టార్ అయిన కేరీ పాటలంటే వెర్రెత్తిపోయే ఫ్యాన్స్ ఎంతోమంది.  తాజాగా ఈ వైట్ బ్యూటీ ఓ సంచలనం నమోదు చేసింది. తన గొంతు, కాళ్లకు కలిపి మొత్తంగా 460కోట్ల రూపాయలకు బీమా చేయించి హాట్ న్యూస్ లోకెక్కింది. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే తన గాత్రానికి(వోకల్ కార్డ్స్) 230 కోట్ల రూపాయలు, తన కాళ్లకు 35 మిలియన్ డాలర్ల బీమా చేయించుకుంది. దీంతో మొత్తం 70 మిలియన్ డాలర్ల బీమా చేయించింది కేరీ.



మారియా కేరీ పాటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె పాటల రికార్డింగ్స్ దాదాపు 200 మిలియన్లు అమ్ముడుపోయాయి. తనకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు సమకూర్చిన గొంతు, కాళ్లకు మారియా కేరీ ఇప్పుడు భద్రతనిచ్చుకుంది. ఇక ఆమె కాళ్లంటేనే పడిచచ్చేవాళ్లెంతోమంది. 2006లో ఆమె సౌందర్యవంతమైన కాళ్లకు 'లెగ్స్ ఆఫ్ ఏ గాడెస్' అవార్డును కూడా ఇచ్చి సత్కరించారు.


Thursday, April 7, 2016

"39 మంది పెళ్ళాలతో కాపురం" చేస్తూ రికార్డు సృస్టించిన ఘనుడు ?

నిజంగా ఆడు మగాడ్రా బుజ్జీ..! అని మిజోరాం ప్రజలంటుంటే, ఒక్కరితోనే చస్తుంటే వీడెలా మెయిన్ టైన్ చేస్తున్నాడు..ఏమైనా పోటుగాడంటే వీడే అనేవాళ్లు బయటవాళ్లు. ఇంతకీ ఆ పోటుగాడు..మగాడు ఎవడనేగా మీ డౌట్. అతనెవరో కాదు మిజోరాం రాష్ట్రానికి చెందిన జియోనా.


ఇతనిలోని స్పెషాలిటీ ఏంటంటే, 39 మందిని పెళ్ళాడి వాళ్లతో సంసారం చేస్తూ 94 మంది పిల్లల్ని, 33 మంది మనమల్లు మనమరాళ్ళను కన్నాడీ మిజోరాం మొనగాడు. 71 ఏళ్ల జియోనా చినా పెద్ద భార్య జతియాంగికి 74 సంవత్సరాలు.. జియోనా కంటే ఆమె మూడేళ్లు పెద్దది. తన ఫ్యామిలీ మెంబర్స్ వసతి కోసం బక్త్వాంగ్ గ్రామంలో ఏకంగా 100 గదులతో నాలుగు అంతస్తుల హోటల్ లాంటి పెద్ద భవనాన్ని నిర్మించేశాడు జియోనా.


తమ భార్యలు, పిల్లతో కలిసి జియోనా కుమారులందరూ కూడా ఈ సౌధంలోనే ఉంటున్నారు. జియోనా కుటుంబంలో మగాళ్లంతా కార్పెంటింగ్ వృత్తిలో ఉన్నారు, తమ స్వంత ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ వీళ్ళు తమ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఉదయం పూట కనీసం ఐదారుగురు భార్యలు తన పక్కనే ఉండి సపరిచర్యలు చేయాలట కానీ.. రాత్రి మాత్రం అందరిలోకి చిన్న భార్యతో సరిపెట్టేసుకుంటాడట ఈ మహానుభావుడు.


కడుపు నిండా తినటం, ఒళ్ళు అలసిపోయేలా పనిచేయటం, ప్రతి రోజూ సంసార సుఖం తన ఆరోగ్య రహస్యం అని శలవిస్తున్నాడీ కలియుగ మన్మధుడు. బహుభార్యత్వం అమల్లో ఉన్న ఈ చైనా తెగలో ఎక్కువ మంది భార్యలుండటం వింతేమీ కానప్పటికీ 39 మంది పెళ్ళాలతో కాపురం చేయటంలో మాత్రం ఇతనిదే ప్రపంచ రికార్డు.

 

Wednesday, April 6, 2016

"సెల్‌ఫోన్స్" వాడని పట్టణం ఎక్కడుందో తెలుసా ?

వెస్ట్ వర్జీనియాలో గ్రీన్ బ్యాంక్ అనే పట్టణం ఉంది. 13,000 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉన్న ఈ పట్టణం 1958లో ఏర్పడింది. యూఎస్ నేషనల్ రేడియో క్వైట్ జోన్ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో మైక్రోవేవ్ ఓవెన్, సెల్‌ఫోన్, వై-ఫై వంటి సేవలను వినియోగించుకోకూడదన్న నిషేధం అమల్లో ఉంది. ఇక్కడ నివసించే ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోమంటూ అగ్రిమెంట్ పై సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీకి దూరంగా ఉంటున్నా ఇక్కడి స్థానికులు ఆనందంగా తమ కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్నారు.


Saturday, April 2, 2016

క్రికెట్‌లో వాడుతున్న "టెక్నాలజీ"

క్రికెట్ ఇప్పుడు ప్రపంచానికి పట్టిన ఫీవర్. అది టీ 20 అయినా, వన్డేలు అయినా, టెస్ట్ లు అయినా...ఏదయినా సరే దాన్ని ఉత్కంఠతో చూడాల్సిందే.. ఇక పొట్టి క్రికెట్ వచ్చిన తరువాత క్రికెట్ ప్రపంచమే మారిపోయింది. 14వ శతాబ్దం నుంచి నేటి దాకా దాదాపు 100కు పైగా దేశాల్లో ఈ క్రికెట్ ఆడుతున్నారు. అయితే క్రికెట్‌లో టెక్నాలజీ ఏముంది అని చాలామందికి డౌటు రావచ్చు...క్రికెట్ లో కూడా విప్లవాత్మక టెక్నాలజీని ప్రవేశపెట్టారు..అవేంటో మీరే చూడండి.

LED BAILS:- ఈ రకమైన బెయిల్స్ ను తొలిసారిగా ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు వీటిని ఐసీసీ వరల్డ్ టీ 20కి వాడుతున్నారు. ఈ బెయిల్స్ కు మైక్రో ప్రాసెసర్ ఉంటుంది. ఈ బెయిల్స్ సెకండ్ కు 1/1000th వేగంతో రియాక్షన్ ని గుర్తించగలవు. దీని పేటెంట్ కి అయిన ఖర్చు ఎంతో తెలుసా దాదాపు 40 వేల డాలర్లు. ఇవే ఇప్పుడు మ్యాచ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.


SPIDER CAM:- క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్ నలుమూలలా ఈ స్పైడర్ కామ్ లు తిరుగుతూ మ్యాచ్ ని షూట్ చేస్తాయి. మ్యాచ్ మొత్తాన్ని నిలువుగా అలాగే అడ్డంగా ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో గ్రౌండ్ నలువైపులా తిరుగుతుంటాయి. ఇదంతా కేబుల్ టెక్నాలజీ ద్వారా అలాగే సాఫ్ట్ వేర్ ద్వారా మాత్రమే కంట్రోల్ అవుతూ ఉంటుంది. అణువణువునా గాలిస్తూ ఉంటాయి.


HAWK EYE:- ఇది లెగ్ బిఫోర్ వికెట్ కి వాడే అత్యంత అధునాతనమైన టెక్నాలజీ. కామెంటేటర్స్ అలాగే వీక్షకులు అందరూ చూసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. బాల్ పడిన తరువాత దాన్ని లెగ్ బిఫోర్ కింద బౌలర్ అప్పీల్ చేసినప్పుడు ఈ టెక్నాలజీ అంపైర్ కు చాలా సహాయం చేస్తుంది. చూసేందుకు ఇది నీడలాగా ఉంటుంది. కాని కరెక్ట్ పొజిషన్ లో బాల్ పడిందా లేదా అని కరెక్ట్ గా చెబుతుంది.


HOT SPOT:- బాల్ బ్యాట్ కు తగిలిందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు అంపైర్ ఈ రకమైన టెక్నాలజీని ఉపయోగిస్తారు. బాల్ బ్యాట్ హెడ్జ్ లకు గాని లేకుంటే ఎక్కడైనా తగిలి తగలనట్లు వెళ్లినప్పుడు ఈ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ టెక్నాలని చాలా ఖరీదుతో కూడుకున్నది కావడంతో దీన్ని అమలు చేయట్లేదు.


SNICKO METER:- ఈ రకమైన టెక్నాలజీని అలెన్ ప్లాస్కెట్ ఆవిష్కరించారు. ఇది వికెట్ కి బాల్ కి అలాగే బ్యాట్ కి బాల్ కి మధ్య దూరాన్ని ఇలా సిగ్నల్స్ రూపంలో అందిస్తుంది. స్టంప్స్ దగ్గరలో మైక్రోఫోన్స్ తో కూడిన టెక్నాలజీ ఉంటుంది. అక్కడ ఫలితం ఎలా వచ్చిందనేది ఈ స్నిక్ మీటర్ ధ్వనులతో సహా వినిపిస్తుంది. ఆద్వనిని బట్టే అంపైర్ నిర్ణయం తీసుకుంటారు.


STUMP CAMERA:- ఈ రకమైన టెక్నాలజీని స్టంపౌట్స్ లో ఉపయోగిస్తారు. బ్యాట్స్ మెన్ క్రీజు వదిలినప్పుడు కీపర్ స్టంపౌట్స్ కి అప్పీల్ చేసినప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించే అంపైర్ నిర్షయం తీసుకుంటారు.


SPEED GUN:-  స్పీడ్  గన్ పేసర్ల వేగాన్ని అంచనా వేసే టెక్నాలజీ.ఇది బౌలర్ వేసే బంతి వేగాన్ని కొలుస్తుంది. గిన్నీస్ రికార్డ్ లో చోటు సంపాదించిన బౌలర్ల బంతి వేగం ఈ టెక్నాలజీ ద్వారానే తెలుసుకుంటారు. ఇప్పటివరకు అత్యంత వేగంతో విసిరిన బంతిగా షోయబ్ అక్తర్ నిలిచాడు. ఇతను ఇంగ్లండ్ మీద దాదాపు గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరారు. ఇదే ఇప్పటివరకు అత్యధిక రికార్డు.


BALL SPIN RPM:- 2013లో యాషెస్ సీరిస్ లో స్కై స్పోర్ట్ వారు దీన్ని ప్రవేశపెట్టారు. బాల్ నిమిషానికి టర్న్ ఎలా అవుతోంది. దానికి సంబంధించిన రేటింగ్ ను ఇచ్చే టెక్నాలజీ. బాల్ టర్న్ అయిన తరువాత ఆ బాల్ వేగాన్ని కొలుస్తారు..ఇది స్నిన్నర్ల సామర్ధ్యాన్ని అంచనా వేసే టెక్నాలజీ. 


SUPER SLOW MOTION:- దీనికి అడ్వాన్స్ హై స్పీడ్ కెమెరాలు వాడుతారు. ఈ టెక్నాలజీ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఫ్రేమ్ చాలా స్లోగా మూవ్ కావాలంటే ఈరకమైన టెక్నాలజీ తప్పనిసరి. అందుకుని ముందుగానే హై స్పీడ్ కెమెరాలు ఈ టెక్నాలజీకి వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తుంటారు.