CSS Drop Down Menu

Thursday, June 30, 2016

గుడిముందు "ధ్వజస్తంభం" ఎందుకు పెడతారో తెలుసా ?

మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధయాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు పాండవులు. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకరిద్దరు ధైర్యం చేసినా, పాండవులతో యుద్ధం చేసి నిలువలేకపోయారు. అలా ఒకో రాజ్యమూ పాండవుల పాదాక్రాంతమవుతూ వచ్చింది. ఇంతలో యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు శ్రీకృష్ణుని పరమభక్తుడైన మయూరధ్వజుడనే రాజు. అపర పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు కూడా తండ్రికి తగినవాడే!

 
 అలాంటి తామ్రధ్వజుడు మణిపురానికి రక్షగా ఉన్న సమయంలో యాగాశ్వం ఆ రాజ్యంలోకి ప్రవేశించింది. తామ్రధ్వజునికి పాండవుల మీదా, వారి ధర్మ ప్రవర్తన మీదా గౌరవం లేకపోలేదు. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పోరాడకుండా లొంగిపోకూడదని నిశ్చియించుకున్నాడు. అందుకే ఆ యాగాశ్వాన్ని బంధించివేశాడు. నిరాఘాతంగా సాగిపోతున్న తమ అశ్వమేధ యాగానికి అడ్డంకి ఎదురొచ్చేసరికి పాండవులకు ఎక్కడలేని కోపం వచ్చింది. సకల సైన్య సమేతంగా వారంతా తమ అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆశ్చర్యం! వారందరూ కలిసి పోరు సల్పినా కూడా తామ్రధ్వజుని ఓడించలేకపోయారు. వారి మీద పైచేయి సాధించిన తామ్రధ్వజుడు ఠీవిగా ఆ అశ్వాన్ని తనతో పాటు తీసుకుపోయాడు.

జరిగిన సంఘటనతో ధర్మరాజు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. ఆ రాత్రి కృష్ణుడు దగ్గరకి చేరుకుని ఉపాయం సూచించమంటూ అర్థించాడు. దానికి కృష్ణుడు, తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవడం అయ్యే పని కాదనీ... కాబట్టి అతని అడ్డు తొలగించుకునేందుకు ఓ ఉపాయాన్ని సూచించాడు. కృష్ణుడు సూచించి ఉపాయం మేరకు మరుసటి ఉదయం వారిరువురూ బ్రహ్మణవేషాలను ధరించి మయూరధ్వజుని అంతఃపురానికి చేరుకున్నారు. తన కళ్ల ఎదురుగా ఉన్న విప్రులిద్దరినీ చూసిన మయూరధ్వజుడు సంతోషంగా వారిని ఆహ్వానించి క్షేమసమాచారాలను తెలుసుకోగోరాడు.

రాజు వారిని కదపడమే ఆలస్యం ‘రాజా మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు! మేం ఒక అడవిగుండా మీ రాజ్యం వైపు వస్తుండగా ఒక సింహం ఇతని కుమారుడిని పట్టుకుంది. పైగా అతడిని విడిచిపెట్టాలంటే ఒక షరతుని సైతం విధించింది’ అన్నాడు విప్ర వేషంలో ఉన్న కృష్ణుడు. ‘ఆ షరతేమితో చెప్పండి! తప్పకుండా తీరుద్దాము,’ అన్నాడు మయూరధ్వజుడు.

‘మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు,’ అన్నాడు కృష్ణుడు, మయూరధ్వజుని వంక సాలోచనగా చూస్తూ. కృష్ణుని మాటలకు మయూరధ్వజుడు తొణకలేదు సరికదా ‘అయ్యో! అదెంత భాగ్యం. మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోందంటే అంతకంటే ఏం కావాలి. తక్షణమే ఆ షరతుని తీరుద్దాం ఉండండి,’ అంటూ తన శరీరంలో సగభాగాన్ని కోసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. 

సేవకులు మయూరధ్వజుని ఆదేశాల ప్రకారం అతని శరీరంలోని సగభాగాన్ని ఛేదిస్తున్నారు. ఇంతలో ధర్మరాజు ఒక విషయాన్ని గమనించాడు. మయూరధ్వజుని ఎడమకంట కన్నీరు కారుతూ ఉండగాన్ని చూశాడు. వెంటనే ‘రాజా! ఈ దానం ఇవ్వడం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది. ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు కదా,’ అన్నాడు.

దానికి మయూరధ్వజుడు ‘విప్రోత్తమా! దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదు ఇది. నా కుడిభాగం ఎవరో ఒకరికి ఉపయోగపడిందే కానీ, ఎడమభాగం ఏ ఉపయోగమూ లేకుండానే నాశనం అయిపోతోంది కదా అన్నదే నా ఆవేదన’ అన్నాడు మయూరధ్వజుడు.

మయూరధ్వజుని జవాబుకి ధర్మరాజులు నివ్వెరబోయాడు. అతని ధర్మ నిరతిని పరీక్షించేందుకే కృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించారు. కృష్ణుడు సైతం మయూరధ్వజునికి తన నిజరూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థతపరిచాడు.
‘మయూరధ్వజా! నీ వ్యక్తిత్వం నిరుపమానం. నీకు ఏం కావాలో కోరుకో,’ అంటూ చిరునవ్వులు చిందించాడు పరంధాముడు.

‘కృష్ణా! ఈ శరీరం నశించిపోయినా కూడా, నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో ఉండేలా అనుగ్రహించండి’ అని కోరుకున్నాడు మయూరధ్వజుడు.

‘ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందూ నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తరువాతనే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు,’ అంటూ సెలవిచ్చాడు కృష్ణపరమాత్ముడు.

ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందరా ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారిచూపుతూ, ఉత్సవాలకు ఆరంభాన్ని అందిస్తూ, దైవానికి నిలువెత్తు కీర్తిపతాకగా నిలిచే ఆ ధ్వజస్తంభం... మయూరధ్వజుని వ్యక్తిత్వానికి ప్రతిరూపం!

Wednesday, June 29, 2016

ఆయన "ఆకలి తీర్చడం కోసం ఆస్తినంతా" అమ్మేసారు !

మాన‌వ‌తా దృక్ప‌థం క‌లిగి ఉన్న ఎవరైనా త‌మకు క‌లిగిన దాంట్లో పేద‌ల‌కు ఎంతో కొంత స‌హాయం చేస్తారు. ఇంకొంద‌రు త‌మ ఆత్మీయుల జ్ఞాప‌కార్థం కోస‌మో, లేదంటే వేరే ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ట్ర‌స్టును ఏర్పాటు చేసి పేద‌ల‌కు స‌హాయం అందిస్తారు. వీరంతా త‌మ‌కు ఉన్న‌, త‌మ‌కు అందిన నిధుల ప్ర‌కారం సేవ చేస్తారు. అలా సేవ చేసే వారినీ కాద‌న‌లేం. కానీ ఉన్న ఆస్తినంతా పేద‌ల‌కు సేవ చేయ‌డం కోస‌మే ధారాదత్తం చేస్తే? అస‌లు అలా సేవ చేసే వారుంటారా? అని మీరు అడ‌గ‌వ‌చ్చు. కానీ కచ్చితంగా ఉంటారు. అయితే అలాంటి వారు చాలా చాలా అత్య‌ల్పంగానే ఉంటారు. వారిలో చండీగ‌ఢ్‌కు చెందిన జ‌గ‌దీష్ లాల్ అహుజా కూడా ఒక‌రు.

జ‌గ‌దీష్ లాల్ అహుజా జ‌న్మించింది పాకిస్థాన్‌లోని పెషావ‌ర్‌లో. అప్ప‌టికింకా పాకిస్థాన్ భార‌త్‌లోనే క‌లిసి ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. కాగా 1947 లో భార‌త్‌కు స్వాతంత్ర్యం సిద్ధించాక వారి కుటుంబం పాటియాలాకు వ‌ల‌స వ‌చ్చింది. అప్పుడు జ‌గ‌దీష్‌కు 12 ఏళ్లు. అనంత‌రం వారు చండీగ‌ఢ్‌కు మారారు. అక్క‌డే జ‌గ‌దీష్ విద్యాభ్యాసం కూడా ముగిసింది. 

జ‌గ‌దీష్ ఉద్యోగం చేయ‌కుండా స్థానిక మార్కెట్‌లో పండ్లు, కూర‌గాయ‌ల‌ను టోకున అమ్మే వ‌ర్త‌కుడిగా వ్యాపారం ప్రారంభించాడు. అన‌తి కాలంలోనే అది బాగా వృద్ధి చెంద‌డంతో అత‌నికి సంప‌ద కూడా చేకూరింది. ఈ క్ర‌మంలో జ‌గ‌దీష్‌కు ‘బ‌నానా కింగ్’ అనే పేరును కూడా స్థానిక వ‌ర్త‌కులు పెట్టేశారు. అంతలా అత‌ని వ్యాపారం వృద్ధి చెందింది మ‌రి. కానీ జ‌గ‌దీష్ మాత్రం త‌న‌కు క‌లిగిన సంప‌ద‌నంతా పేద‌ల కోస‌మే ఖ‌ర్చు చేసే వాడు. ఈ క్ర‌మంలో గ‌త 15 ఏళ్ల కిందట‌ ఓ రోజు చండీగ‌ఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్‌) వ‌ద్ద ఉన్న హాస్పిట‌ల్ ఆవ‌ర‌ణ‌లో ఆక‌లితో అల్లాడిపోతున్న పేద‌ల‌ను అత‌ను గ‌మ‌నించాడు. వారిని చూసిన జ‌గ‌దీష్ హృదయం చ‌లించిపోయింది. అంతే, వెంట‌నే వారికి ఉచితంగా భోజ‌నం పెట్టించాడు.




ఆ త‌రువాత నుంచి తానే ఇంటి వద్ద వంట‌లు చేయించి వాటిని కారులోకి ఎక్కించి మ‌రీ ఆ పీజీఐఎంఈఆర్ హాస్పిట‌ల్ వ‌ద్ద ఉన్న పేద‌ల‌కు ఆహారాన్ని అందించ‌డం మొద‌లు పెట్టాడు. ఒక్కొక్క‌రికి మూడు చ‌పాతీలు, ఆలూ చ‌నా కూర‌, హ‌ల్వా, ఒక అర‌టి పండు, స్వీట్లు, బిస్క‌ట్లు ఇవ్వ‌డం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో స్థానికంగా ఉన్న ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల హాస్పిట‌ల్ వ‌ద్దకు వ‌చ్చే పేద‌ల‌కు కూడా జ‌గదీష్ ఉచితంగా భోజ‌నాన్ని అందించ‌డం మొద‌లు పెట్టాడు. అలా అత‌ను ఆ రెండు హాస్పిట‌ల్స్‌లోనూ గ‌త 15 ఏళ్లుగా పేద‌ల‌కు భోజ‌నం పెడుతూ వ‌స్తున్నాడు. 

అప్పుడ‌ప్పుడు వారికి బ్లాంకెట్లు, స్వెట‌ర్లు, దుస్తుల‌ను కూడా జ‌గ‌దీష్ పంచుతుంటాడు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు వ్యాపారం ద్వారా వ‌చ్చిన ప‌లు ఖ‌రీదైన భ‌వ‌నాల‌ను కూడా అత‌ను పేద‌ల కోసం అమ్మేశాడు. వాటిని అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే అన్నార్థుల‌కు భోజ‌నం పెడుతున్నాడు. ఇప్పుడు జ‌గదీష్ వ‌య‌స్సు 80 సంవ‌త్స‌రాలు. అయినా ఆయ‌న ఇప్ప‌టికీ స్వ‌యంగా వ‌చ్చి పేద‌ల‌కు భోజ‌నం వ‌డ్డిస్తుంటాడు. దీని గురించి ఆయ‌న్ని ప్ర‌శ్నిస్తే త‌న ఒంట్లో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ఆ సేవ ఆగ‌ద‌ని చెబుతున్నాడు. నిజంగా పేద‌లకు ప‌ట్టెడ‌న్నం పెట్టాల‌ని ఆయ‌న ప‌డుతున్న తాప‌త్ర‌యం, త‌ప‌న చూస్తే ఆయ‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పేద‌ల కోసం త‌న ఆస్తుల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా సేవ‌కే అంకిత‌మైన ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెల‌పాల్సిందే.


Tuesday, June 28, 2016

పెళ్ళిళ్ళ లో "కొత్త ట్రెండ్" !

పెళ్ళిళ్ళు యుక్త వయస్సులో ఉన్నవారికేనా..? మేమూ పెళ్లి చేసుకుంటున్నాం అంటున్నారు సీనియర్ సిటిజెన్స్. భార్యను కోల్పోయి.. 60 లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వృధ్దులో. లేక  భర్తలను కోల్పోయి ఒంటరి జీవితం అనుభవిస్తున్న వయస్సు మళ్ళిన మహిళలో తోడూ కోసం పరితపిస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడీ ట్రెండ్ పెరిగిందని తోడు నీడ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. 

ఒంటరితనాన్ని భరించలేక వీరంతా సరికొత్త జీవితం ఆరంభిస్తున్నారు. పెళ్లి లేదా సహజీవనం చేస్తే తప్పేమిటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. తమ కూతుళ్ళు లేదా కొడుకులు నిరాదరిస్తున్న కారణంగా ఇలాంటి వాళ్ళంతా మేమూ పెళ్లి చేసుకుని ఒకరి కష్ట సుఖాలు మరొకరు చెప్పుకుంటూ ఊరట  చెందుతున్నామని ఈ వృద్ధులు అంటున్నారు. సమాజంలో ఈ పోకడ ఇదివరకటికన్నా ఎక్కువయిందని ఈ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు అంటున్నారు.

Monday, June 27, 2016

విచిత్రంగా భార్యపై "ప్రతీకారం" తీర్చుకున్న భర్త !

భర్త మోసం చేశాడని చాలా మంది భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేయడమో లేదా పంచాయితీకి పిలిపించి రచ్చ రచ్చ చేయడమో వంటివి చేసి తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటారు. చాలావరకు భర్తలే... భార్యల్నిమోసం చేస్తుంటారని వినున్నాం... చూస్తున్నాం కూడా. అయితే భార్యల చేతిలో మోసపోయిన భర్తలు చాలా తక్కువే. కాని ఇక్కడ  తన భార్య తనను మోసం చేసిందని ఓ భర్త చేసిన పనిని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అతను చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భార్య మోసం చేసిందని ఆ భర్త ఆమెపై చాలా వెరైటీగా పగ తీర్చుకున్నాడు. ఆ ప్రతీకారం గురించి తెలుసుకోవాలనుందా... అయితే ఈ వెరైటీ ప్రతీకారం గురించి చదవాల్సిందే...
 
ఇంగ్లాండ్‌లోని బ్రిడ్గ్‌నార్త్ సిటీలో భార్యా భర్తలు నివాసముంటున్నారు. తన భార్య... తనను మోసం చేసిందని ఆ భర్త ఆవేదన చెందలేదు. తన మీద పగ తీర్చుకోవాలని భావించాడు. ఈ పరిస్థితుల్లో తన భార్యకు సంబంధించిన అన్ని వస్తువులను టార్గెట్ చేశాడు. బాబు లడ్డు కావాలా... లడ్డూ అంటూ.... వస్తువులు కావాలా... బాబు వస్తువులు అంటూ ఆమె వాడుకున్న అన్ని వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశాడు. వీటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో తాను స్కార్చ్ కొనుక్కుని ఫుల్లుగా కళ్లుతిరిగి పడిపోయేవరకు తాగుతానని చెప్పుకొచ్చాడు. 
 
మిగతా డబ్బులను వ్యభిచారులకు చెందిన సేవా సంస్థకు ఇస్తున్నట్టు భర్త పేర్కొన్నాడు. అంతేకాక ఇంకో ఆఫర్‌ని కూడా ప్రకటించాడు. ఈ కారును ఎవరికైనా బహుమతిగా ఇవ్వమని, ముఖ్యంగా ఇష్టంలేని వ్యక్తులకు ఇవ్వాల్సిందిగా కోరాడు. తన భార్యలాగే ఈ కారంటే తనకు అసహ్యమని చెప్పాడు.  ఈ విధంగా తన భార్యపై కసితీరా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఆ భర్త.


Saturday, June 25, 2016

డ్రింక్స్ తాగే ముందు ఛీర్స్ ఎందుకు కొడతారో తెలుసా ?

డ్రింక్స్ తాగే ముందు గ్లాసులు తాకించి ఛీర్స్ చెప్పుకోడం చూస్తూంటాం నిజంగా ఇప్పుడది సెలబ్రేషన్ సింబల్ అని చెప్పవచ్చు. కానీ దీనివెనుక ఓ ఇంటరెస్టింగ్ స్టోరీ వుంది. 



ఇది ఒక అనుమానపు చేష్టగా ఆరంభమైందట. ఎప్పుడంటే ... మధ్యయుగం లో ... అది కూడా ఆనాటి సముద్రపు దొంగలు ఈ సంప్రదాయానికి ఆద్యులట. వీరు ఓడలను దోచుకున్నాక ఆ సొమ్మును పంచుకోవడానికి, తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా దీవి పై దిగేవారు. అయితే కొందరు దొంగలు తమతోటివారి వాటాలను కాజేయడానికి వారి మద్యంలో విషం కలిపేవారు. అందువల్ల పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.

అదేమిటంటే మద్యం తాగే ముందు తమ గ్లాసుల్లోని(చెక్క లోటాలు) మద్యం ఒకదానిలోంచి మరోదానిలోకి చిందేలా గట్టిగా తాకించుకోవడం. అలా చేసేప్పుడు వారు 'ఛీర్స్ (ఛీర్ అంటే ఆనందించు, ఉత్సాహపడు, ఊరటచెందు)' అనుకునేవారు. అంటే చావు భయం వద్దు ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే అనేది వారి భావనట. అలా గ్లాసులు తాకించుకొని ఛీర్స్ చెప్పుకునే సంప్రదాయం మొదట బ్రిటన్లోకి, ఆ తరువాత అది పరిపాలించిన వలస రాజ్యాల్లోకి వ్యాపించి మనదాకా చేరిందట. భలే వుంది కదా .. అవును మరి ప్రతిదానికీ ఓ హిస్టరీ వుంటుంది.


Thursday, June 23, 2016

" ఆధార్ కార్డు " తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు !

ఏటియం కార్డు రాకముందు డబ్బులు తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అప్పట్లో బ్యాంకుల నుండి డబ్బులు తీసుకోవడానికి ఒక రోజు మొత్తం లైన్ కట్టాల్సి వచ్చేది. ఏటియం లు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా సులభంగా ఏటియం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటున్నారు.

ఆ తరువాత ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకొనే సౌకర్యం వచ్చింది. ఆ తరువాత ఒక ఏటియం కార్డు నుండి మరొక ఏటియం కార్డుకి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయగలిగే టెక్నాలజీ వచ్చింది, కాని ఇలా డబ్బులు డ్రా చేయాలంటే ప్రతిసారి ఏటియం కార్డుని జేబులో పెట్టుకొని తిరగాలి. కాని ఇప్పుడు ఏటియం కార్డు కూడా అవసరం లేకుండా డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

మన దేశంలో అన్ని పనులకు ఉపయోగపడేలా రూపొందించిన ఆధార్ కార్డు ద్వారా కూడా డబ్బులు డ్రా చేసుకొనే ఆవకాశాన్ని కల్పించారు ఆధార్ కార్డుని రూపొందించిన సంస్థ వారు.


 బ్యాంకు ఆకౌంట్ కి ఆధార్ కార్డుని జత చేసిన వారు తమ ఆధార్ కార్డుని ఏటియం మెషిన్ లో ఉపయోగించి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డుతో పాటు మీ వేలి ముద్రని కూడా డబ్బులు డ్రా చేయడానికి వాడుకోవచ్చు అని తెలిపారు. ఆధార్ కార్డు సదుపాయం ఉన్న ఏటియం మెషిన్ లను తొలిసారిగా బెంగళూరు లోని జయనగర్ డీసీబీ బ్యాంకులో ఆధార్ కార్డు రూపకర్త అయిన నందన్ నీలెకని గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా త్వరలోనే అన్ని ఏటియం మెషిన్లకి ఆధార్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకొనే టెక్నాలజీని విస్తరిస్తామని అని చెప్పారు.


Wednesday, June 22, 2016

"ఇంగువ"తో సంపూర్ణ ఆరోగ్యం !

అసెఫీటిడా అంటే ఏంటి? అని ఎవరన్నా అడిగితే కాసేపు ఆలోచించాల్సి ఉంటుంది. అదే ఇంగువ అనో హింగ్ అనో చెబితే మన రోజువారీ వంటకాల్లో ఉపయోగించే పదార్థం గుర్తుకువస్తుంది. ఫెరూలా అనే వృక్షజాతి నుంచి సేకరించిన పాలతో రూపొందించే ఇంగువని విడిగా తినడం కష్టమే. కానీ అదే ఇంగువని వంటల్లో వేసుకుంటే వచ్చే రుచీ, పరిమళం వేరు. భారతీయుల వంటకాల్లో, మరీ ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఇంగువ లేకుండా పని జరగదు. వెల్లుల్లి, ఉల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండే సనాతనవాదులు సైతం... వాటికి బదులుగా ఇంగువని చిలకరించి వంటకాల్లో అనూహ్యమైన రుచిని సాధిస్తుంటారు. మరి వందల సంవత్సరాలుగా మన వంటకాల్లో చేరిపోయిన ఈ ఇంగువను కేవలం రుచి, పరిమళానికేనా... లేదా మరేదన్నా ఆరోగ్యపరమైన కారణంతో వాడుతుంటారా? అంటే జవాబులు ఇవిగో...




 - చాలామందికి ఆహారం తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారిపోతుంది. ఇలాంటి ఉబ్బరాన్ని శుబ్బరంగా తగ్గిస్తుంది ఇంగువ. ఇలా కడుపు ఉబ్బరాన్ని తగ్గించే పదార్థాలని యాంటీ ఫ్లాట్యులెంట్స్‌ అంటారు. ఇంగువ అలాంటి యాంటీ ఫ్లాట్యులెంట్స్‌లో ఒకటి.

- కేవలం కడుపు ఉబ్బరాన్నే కాదు! జీర్ణసంబంధమైన సమస్యలెన్నింటిలోనో ఇంగువ అమోఘంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పిత్తదోష కారణంగా ఏర్పడే అరుచి, అజీర్ణం, ఆకలి లేకపోవడం లేకపోవడం వంటి సమస్యలకు ఇంగువ దివ్యౌషధం. ఆఖరికి కడుపు లోపల అయిన గాయాలను మాన్పే శక్తి కూడా ఇంగువకు ఉందని పరిశోధనల్లో తేలింది.

- అటు ఆయుర్వేదంలోనే కాకుండా ఇటు యునానీలో కూడా ఇంగువ ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఫిట్స్‌ వంటి మానసిక సంబంధమైన వ్యాధులకు మందుగా యునానీ వైద్యులు ఇంగువను వాడుతుంటారు.

- ఆడవారిలో రుతుసంబంధమైన సమస్యలకు ఇంగువ విరుగుడుగా పనిచేస్తుందని నమ్ముతారు. రుతుచక్రం సరిగా లేకపోవడం, రుతుక్రమ సమయంలో కడుపునొప్పి వంటి ఇబ్బందులను ఇంగువ సరిచేస్తుంది. అందుకే కొంతమంది బాలింతలకు ఇంగువను ఇస్తుంటారు.

- ఇంగువ ఇటు పొడిదగ్గు, అటు కఫంతో వచ్చే దగ్గలకు ఉపశమనంగా నిలుస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక తీవ్ర పడిశాన్ని (Influenza) కలిగించే H1N1 అనే వైరస్‌ను ఇంగువ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తేలింది.

- ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా షుగర్‌ వ్యాధి బాధలు కనిపిస్తున్నాయి. ఈ చక్కెర వ్యాధిని అదుపుచేయడంలో ఇంగువ తనదైన పాత్రను పోషించగలదంటున్నారు. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంగువ, రక్తంలో చక్కెర నిల్వలని అదుపు చేస్తుందని చెబుతున్నారు.

- ఇంగువలో coumarin అనే రసాయనాలు ఉన్నాయట. ఈ కౌమరిన్‌లకు రక్తాన్ని పలచన చేసే ప్రభావం ఉంటుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టి గుండెపోటుకి దారితీసే పరిస్థితి నుంచి బయటపడవచ్చు. రక్తంలో కొలెస్టరాల్‌ పేరుకోకుండా నివారించవచ్చు.

- ఇంగువకి ఒంటి నొప్పులను నివారించే గుణం ఉందంటున్నారు. ముఖ్యంగా ఓ పట్టాన మందులకు లొంగని మైగ్రెయిన్ తలనొప్పులు, రుతుక్రమంతో పాటు వచ్చే కడుపునొప్పులను ఇది హరిస్తుంది.

చెప్పుకొంటూ పోవాలే కానీ ఇంగువ ఇచ్చే అద్భుత ఫలితాల జాబితా చాంతాడంత ఉంటుంది. అందుకే దీనిని ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి అన్ని సంప్రదాయ వైద్యాలలోనూ వాడుతుంటారు. ఇంగువని మన వంటకాల్లో చేర్చడం వల్ల పైన పేర్కొన్న లాభాలన్నీ ఎంతో కొంత కలుగుతూనే ఉంటాయి. అలా కాకుండా చిటికెడంత ఇంగువని గోరువెచ్చటి నీళ్లలోనో, మజ్జిగలోనో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఇంగువను ప్రత్యేకించి ఒక ఔషధిగా తీసుకోవాలంటే మాత్రం ఎవరన్నా తెలిసిన ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం మంచిది.

Tuesday, June 21, 2016

హత్య కేసులో 18 "సింహాల‌" అరెస్ట్ ?

సాధారణంగా మనుషులు హత్యలు చేస్తుంటారు. వీరికే భారత శిక్షా స్మృతి చట్టం కింద శిక్షలు వేసి వాటిని అమలు చేస్తుంటారు. కానీ, గుజరాత్‌లో ఓ విచిత్రం జరిగింది. ముగ్గురిని హత్య చేసిన కేసులో 18 సింహాలను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీటిలో హత్య చేసిన సింహాన్ని గుర్తించి.. దానికి శిక్ష వేయనున్నారు.


దీని పై గుజరాత్ అటవీశాఖ అధికారులు స్పందిస్తూ... ముగ్గురు పర్యాటకులను హ‌త్య చేసిన కేసులో 18 సింహాల‌ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఇందులో నేరం చేసింది ఒక్క‌టే. ఆ సింహాన్ని గుర్తించి జూలో జీవిత‌ఖైదు శిక్ష విధిస్తామని తెలిపారు. హత్యా స్థలంలో దొరికిన పంజా గుర్తుల ఆధారంగా ఆ సింహాన్ని గుర్తించనున్నట్టు తెలిపారు. 
 
నేరం చేసిన దానిని జూకి త‌ర‌లించి, మిగ‌తా వాటిని గిర్ అభ‌యార‌ణ్యంలో వ‌దిలేస్తామ‌ని తెలిపారు. గుజ‌రాత్‌లో 400 వ‌ర‌కు ఆసియా సింహాలు ఉన్నాయి. అయితే గిర్ అభ‌యార‌ణ్యంలో మాత్రం 270 వ‌ర‌కే ఆశ్ర‌యం క‌ల్పించ‌గ‌ల‌మ‌ని అక్క‌డి అధికారులు అంటున్నారు. దీంతో మిగ‌తా సింహాలు ఇలా ఊళ్ల‌పైకి వెళ్ల‌కుండా వాటిని ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లించాల‌ని ఈమ‌ధ్యే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీచేసింది. 

Monday, June 20, 2016

ప్రధాని కటింగ్ కి అక్షరాలా "లక్ష"రూపాయలు !

ఆశ్చర్యపోయినా ఇది నిజం. హెయిర్‌ కటింగ్‌కు లక్ష రూపాయలు. బట్టల ఇస్త్రీ చేయించుకోవడానికి రూ.14 వేలు, భోజనానికి 1.25 లక్షలు.  ఇతర గృహోపకరణాల కోసం రూ. 13 లక్షలు. ఇదీ ఓ ప్రధాని ఆరురోజుల బసకు చేసిన ఖర్చు. ఈ ఖర్చంతా బిలియనీర్ అయిన బిజినెస్ టైకూన్ దో కాదు. ప్రజాధనానికి కాపలా కాయాల్సిన ఓ దేశాధినేతది. ఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం ఆరు రోజుల పాటు న్యూయార్క్‌లో బస చేసిన ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, ఆయన భార్య సారా చేసిన ఖర్చు.  

ఈ విషయం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రజాధనాన్ని తమ విలసాల కోసం అధినేతలు ఎలా ఖర్చుపెడుతున్నారో తెలియజేసే దృష్టాంతాలకు పరాకాష్ట ఇది.

Saturday, June 18, 2016

జపాన్ లో "న్యూడ్ హోటల్"! ఉసూరుమంటున్నఊబ కాయులు ?

లావుగా ఉంటే నో ఎంట్రీ..ఇది జపాన్ లో త్వరలో ప్రారంభించబోయే నేక్డ్ రెస్టారెంట్ (న్యూడ్ హోటల్) వార్నింగ్.. పూర్తి నగ్నంగా ఉన్నవారికే ఈ హోటల్లో ప్రవేశానికి అనుమతిస్తారు. భారీ కాయులకు ప్రవేశం ఉండదట.. ఈ హోటల్లోకి వచ్చేవారి బరువును తూకం వేసి మరీ చూస్తామని ఈ హోటల్ నిర్వాహకులు అంటున్నారు. కస్టమర్ల  హైట్ కన్నా సగటు బరువు 15 కేజీలు ఎక్కువగా ఉంటే ఇక వాళ్ళు తిరుగుముఖం పట్టవచ్చు. అమృత అని వ్యవహరించే ఈ నగ్న హోటల్  వచ్చే నెల 29 న లాంచ్ కానుంది. బరువే కాదండోయ్..వయస్సు రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. 18- 60 ఏళ్ళ మధ్య వయసున్న వారికి ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఈ హోటల్ కు వచ్చేవారి బట్టలను యాజమాన్యమే భద్రంగా దాస్తుంది.

తలిదండ్రుల బరువు చూసి కరెక్ట్ వెయిట్ రేంజి కన్నా ఎక్కువగా ఉంటే తిప్పి పంపేస్తామని హోటల్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక పే మెంట్స్ అన్నీ ఆన్ లైన్ బుకింగ్ పేజ్ ద్వారా అడ్వాన్స్ గా చెల్లించాల్సిందే.. లండన్ లో భారీ కాయులను అనుమతిస్తారని, కానీ ఇక్కడ అలా ఉండదని ఆ ప్రతినిధి అన్నారు. అయితే ఇది విచక్షణ చూపడం కాదన్నారు. లావాటివాళ్ళను అనుమతిస్తే అది కొంతమంది గెస్టులకు ఇబ్బందికరంగా ఉంటుందట. రోమన్ ఈస్తేటిక్ విదానాలవంటి వాటిని మేం పాటిస్తున్నాం.. మ్యూజియం ల లోని కొన్ని బ్యూటిఫుల్ పెయింటింగులు అలాగే ఉంటాయి... చూస్తున్నారుగా అని ఆమె పేర్కొన్నారు. ఇక ఫెలో డైనర్లను ఎవరూ తాకరాదని, పైగా టాటూ లు వేయించు కున్న వాళ్ళు  కూడా అనర్హులేనని ఆ ప్రతినిధి బోలెడన్ని నిబంధనలు చెప్పారు.  ఇక్కడ ఫుడ్ తీసుకునేవారు టికెట్లకోసం 750 డాలర్లవరకు చెల్లించాలని, నగ్న పురుషుల స్ట్రిప్ టీజ్ డ్యాన్సులు అదరగొడతాయని ఊదరగొట్టారు. జపాన్ లో ప్రారంభించబోయే ఈ నేక్డ్ రెస్టారెంట్ ఇలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నా... సన్నపాటి వాళ్ళంతా ఎగిరి గంతేస్తుంటే ఊబ కాయులంతా ఉసూరుమంటున్నారు.

Thursday, June 16, 2016

అక్కడ "వెయిటర్స్‌గా కోతులు" పని చేస్తాయి!

ఆ రెస్టారెంట్‌లోకి వెళ్లటానికి కస్టమర్స్‌ కుతూహలం చూపిస్తారు. ఆలస్యమైనా ఫర్వాలేదని రెస్టారెంట్‌ ముందు జనాలు క్యూ కడతారు. ఎందుకంటే అక్కడ వెయిటర్స్‌గా కోతులు పని చేస్తాయి. అడిగిందే తడవు చిత్తం కస్టమరూ అన్నట్లు ఆర్డర్‌ను తీసుకొస్తాయి. అక్కడ తినేవారికి వినోదం మినిమమ్‌ గ్యారెంటీ. జపాన్‌లో ఉండే ఈ మంకీస్‌ రెస్టారెంట్‌ విశేషాల్ని తెల్సుకుందామా.

  • జపాన్‌లోని టోక్యోనగరంలో ఉండే కయాబుకియా టావెర్న్‌ రెస్టారెంట్‌లో మంకీ వెయిటర్స్‌ ఉన్నాయి. 

  • ఈ రెస్టారెంట్‌లో యట్‌ చాన్‌, ఫకు చాన్‌ అనే రెండు కోతులు పని చేస్తున్నాయి. యజమాని పేరు కవోరు వస్తుకా. 
 
  • రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టేవారికి సాదరంగా కోతులు స్వాగతం పలుకుతాయి. ఎవరైనా కస్టమర్‌ ఆశ్చర్యపోయి ఆ కోతుల వైపు ఆసక్తిగా చూస్తే బాల్‌మీద నడవటం, ఫోజులు కొట్టడం.. చేస్తూ ఆతిథ్యంలోనే కాస్త వెరైటీ ఫన్‌ను ఇస్తాయి. 
 
  • ఈ రెండు కోతులకూ రెస్టారెంట్‌ యజమాని మాస్కులు వేయిస్తాడు. ఒక్కో రోజు ఒక్కో గెట్‌పలో ప్రత్యక్షమవుతాయి. 
 
  • టై కట్టుకని వెయిటర్‌ జాబ్‌ను పక్కాగా నిర్వర్తిస్తాయి. 
 
  • యట్‌ చాన్‌ రెస్టారెంట్‌లోని టేబుల్‌ మధ్య చకచకా పరుగెడుతుంది. కస్టమర్స్‌ అడిగిన ఫుడ్‌తో పాటు బీర్‌, ఇతర డ్రింక్‌లను స్పీడ్‌గా సప్లై చేస్తుంది. 
 
  • కస్టమర్స్‌ తినటం అయిపోయాక చేతులు శుభ్రపరచుకోవటానికి హాట్‌ టవల్‌ను తీసుకొచ్చి మరీ ఇస్తుంది ఫకు చాన్‌. దాని హాస్పిటాలిటీ చూస్తే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. 
 
  • రెస్టారెంట్‌లో ఉండే ఈ జంట వెయిటర్స్‌ను చూడటానికే ఎక్కువ మంది వస్తుంటారు. ఇతర దేశాలవారూ తెల్సుకుని మరీ ఆ రెస్టారెంట్‌లోకి వెళ్తుంటారు. వీలైతే రెండు సెల్ఫీలు, నాలుగుఫోజులు కొడతాయి ఈ మంకీ వెయిటర్స్‌. 
 
  • యాన్‌ అనే 62 ఏళ్ల రెగ్యులర్‌ కస్టమర్‌ ‘నా పిల్లలు నేను చెప్పిన మాట వినరు, ఈ కోతులు భలే వింటాయి. కొందరి మనుషుల కంటే ఇవి చాలా నయం’ అంటూ మురిసిపోతాడు. 
 
  • ఈ వెయిటర్స్‌కు టిప్‌గా పండ్లు, సోయా బీన్స్‌ ఎక్కువగా కస్టమర్స్‌ ఇస్తుంటారు. ఎందుకంటే వాటికి సోయాబీన్స్‌ అంటే చాలా ఇష్టం. 
 
  • మొత్తానికి కోతులే వెయిటర్స్‌గా ఉండటం అద్భుతమైన మార్కెటింగ్‌ సా్ట్రటజీ అని నిపుణులు అంటున్నారు. ఆ కోతులవల్లే కయాబుకియా రెస్టారెంట్‌ వ్యాపారం వర్ధిల్లుతోంది.

  • యజమాని కవోరు వస్తుకా ఓ రోజు రెస్టారెంట్‌లో పని చేస్తుంటే తన పెంపుడు కోతులు అనుకరించాయట. అందుకే వాటిని వెయిటర్స్‌గా తీసుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చిందట. 
 
  • ‘ఏప్స్‌తో మాత్రమే రెస్టారెంట్స్‌లో రోజుకు కేవలం రెండు గంటలు పని చేయించుకోవచ్చు’ అని జపాన్‌లోని జంతువుల చట్టం చెబుతోంది. అయితే ఈ రెండు కోతులకు మినహాయింపు. లోకల్‌గా ఉండే అధికారులు వీటి పనిని చూసి పర్మిషన్‌ సర్టిఫికేట్‌ కూడా ఇచ్చారు.
 
  • చాన్‌ జోడీ తర్వాత వాటికి పుట్టిన మూడు పిల్లకోతులు ఆ రెస్టారెంట్‌లో వెయిటర్స్‌గా పనిచేస్తాయట. ఇందుకోసం ట్రైనింగ్‌ అవుతున్నాయి కూడా.
    ఈ వీడియో గాని చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి .

    https://youtu.be/CcPDEtSRYXA


Wednesday, June 15, 2016

మీరు ఎప్పుడైనా ఇలాంటి పుష్పాలు చూసారా ?


1) Camelia



2)  Dahlia



3)  Hoya Aldrichii

 


 4)  Hoya Kerrii



 5)  Hoya Pubicalyx



 6) Passiflora Caerulea



 7) Viola Sacculus



  8) Rafflesia-Arnoldii



 9)Flower Petals Resemble Tons Of Tiny Twin Butterflies




 
 



 

Tuesday, June 14, 2016

"బొట్టు బిళ్ళ‌లు"తో అయోడిన్ లోపాన్ని నివారించు కోవచ్చు!

మ‌హిళ ముఖానికి అందం బొట్టు. నుదుట బొట్టు లేక‌పోతే ముఖం బోసిపోయిన‌ట్లు ఉంటుంది. ఈ కాలంలో అమ్మాయిలు, మ‌ధ్య వ‌య‌సు వారు... తీరిక లేక కుంకుమ బొట్టుకు బ‌దులు బొట్టు బిళ్ళ‌లు వాడుతున్నారు. అయితే, మామూలు బొట్టు బిళ్ళ‌లు పెట్టుకునే క‌న్నా... ఇపుడు అయోడిన్ బొట్టు బిళ్ల‌లు పెట్టుకోవ‌డం ఆరోగ్య‌క‌రం అంటున్నారు మ‌హారాష్ట్ర వైద్య నిపుణులు. 

శ‌రీరంలో అయోడిన్ లోపం వ‌ల్ల గాయిట‌ర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వ‌స్తాయి. దీనిని నివారించేందుకు అతివ‌ల‌కు ఓ సులువైన మార్గం ఇది. మ‌హారాష్ట్ర‌లో మ‌హిళ‌లు ఇపుడు అయోడిన్ బొట్టు బిళ్ళ‌ల‌ను విరివిగా వాడుతున్నారు. వీటిని నుదుట‌న పెట్ట‌కుంటే, రోజుకు 100 నుంచి 150 మిల్లీ గ్రాముల అయోడిన్ శ‌రీరంలోకి వెళ్లిపోతుంద‌ట‌. అందుకే రాత్రిళ్లు 8 గంట‌ల‌పాటు ఈ బొట్టు పెట్టుకుని ప‌డుకుంటే, అయోడిన్ లోపం నుంచి నివార‌ణ పొంద‌వ‌చ్చ‌ట‌.
 
మ‌న దేశంలో 71 మిలియ‌న్ల మంది అయోడిన్ లోపంతో వివిధ ర‌కాల జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని ఎన్.ఐ.డి.డి.సి. పి స‌ర్వేలో వెల్ల‌డి అయ్యింది. అందుకే మ‌హారాష్ట్ర‌లోని చాలా మంది మ‌హిళ‌లు ఈ అయెడిన్ బొట్టుబిళ్ళ‌ల‌ను వాడుతూ, అయోడిన్ లోపాన్ని నివారించే మెరుగైన ఫ‌లితాల‌ను పొందుతున్నారు.


 

Monday, June 13, 2016

లైకుల కోసం ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

ఆకలేస్తే అన్నం తింటారు. కానీ ఓ యువతి మాత్రం ఆకలేస్తే ఇష్టమొచ్చిన వస్తువులన్నింటిని తినేయడంతో ఓ తల్లి భయబ్రాంతులకు గురైంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే... ఆ తల్లి కూతురు చేస్తున్న వింత పనికి డాక్టర్‌ని సంప్రదించాల్సింది పోయి పోలీసులకు ఫిర్యాదు చేసి వారితో దర్యాప్తు చేయించింది. అసలు ఎందుకు ఇలా చేస్తుందోనన్న నిజం తెలుసుకొని నివ్వెరపోయింది. 
 
ఆ వివరాలు పరిశీలిస్తే.. చైనాలోని ఒక అమ్మాయి బతికున్న చేపలను, వానపాములను, పాముల్లాంటి చేపలు తింటుంది. ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులను, ప్లాస్టిక్‌ని కరకర నమిలితినేస్తుంది. ఇంట్లో ఏ వస్తువు కనిపించినా వదలడం లేదు. దీంతో కంగారుపడిన ఆ యువతి తల్లి పోలీసులకు చెప్పి దర్యాప్తు చేయించింది. 
 
ఈ దర్యాప్తులో ఆ అమ్మాయికి ఒక ఆన్‌లైన్ ఖాతా ఉందని, చైనాకు చెందిన ఓ వీడియో యాప్ ద్వారా వాటిని ఆన్‌లైన్ లో పెట్టింది. ఆన్ లైన్‌లో హిట్స్ కొట్టాలన్న లక్ష్యంతోనే ఇలాంటి పనులు చేసిందని తేటతెల్లమైంది. ఆమె ఇలాంటి వింత పనులు చేయడం ద్వారా మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఒకేసారి ఆమె ఖాతాలో చేరిపోయారట. నిజంగా సోషియల్ మీడియాలో లైకుల కోసం యువత ఎలాంటి పనైనా చేయడానికి వెనుకాడరనేదానికి ఇదే ఉదాహరణ. 


Saturday, June 11, 2016

టాప్‌లెస్ యాంకర్లతో న్యూస్ రీడింగ్ ?

న్యూస్ ఛానల్ యాంకర్లు న్యూస్‌లు ఎలా చదువుతారు... ఇదేం ప్రశ్న అని తలబద్దలు కొట్టుకోకండి! అసలు విషయం ఏంటంటే మన దేశంలో న్యూస్ చదివే యాంకర్లు పద్ధతిగా చీర కట్టుకుని చదువుతుంటారు. అదే అల్బానియా దేశంలో మాత్రం న్యూస్‌ రీడర్లు టాప్‌లెస్‌గా వార్తలు చదువుతారు. వివరాల్లోకి వెళితే.. ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాలలో పోటీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే న్యూస్ ఛానల్‌లో కూడా ఆ పోటీ తప్పకుండా ఉంటుంది. 
 
అయితే అల్బానియాలో అయితే న్యూస్ ఛానల్ మధ్య పోటీ విపరీతంగా ఉంటుందట. అందుకే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చెయ్యడానికి ఫైర్ టీవీ న్యూస్ ఛానల్ వార్తలని టాప్ లెస్ యాంకర్లతో చదివిస్తుంది. దీనికి 'నేకడ్ ట్రూత్' అని కాప్షన్ కూడా పెట్టారు. అంటే న్యూస్ రీడర్లు బ్రా, టాప్ లేవీ ధరించకుండా వార్తలు చదువుతారు. అయితే పైవి పూర్తిగా కనబడకుండా ఓపెన్ బ్లేజర్, కోటు వంటివి ధరిస్తుంటారు. ఇలా వార్తలు చదివే అమ్మాయిలనే ఈ న్యూస్ ఛానల్  ఎక్కువ శాతంలో సపోర్ట్ చేస్తుందట. 
 
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... మొదట వార్తలను టాప్ లెస్‌గా చదివించాలని ఆ న్యూస్ ఛానల్ భావించిందట, కానీ అల్బానియా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఆ సాహసం చెయ్యలేకపోయిందట. నిజానికి ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక ముద్రవేసుకోవాలని, అంతేకాకుండా న్యూస్ చూస్తున్నంతసేపు వీక్షకులను తమ న్యూస్‌తో కట్టిపడేయాలని ఈ న్యూడ్ కాన్సెప్ట్‌ని చేపట్టింది. అయితే ఈ ఛానల్‌లో టాప్‌లెస్‌గా వార్తలు చదువుతున్న హోగ్జాగ్ అనే యాంకర్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె వారానికి సుమారు 2 లక్షల 25 వేల రూపాయల పారితోషికం తీసుకుంటుందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ..! 


Friday, June 10, 2016

లేటెస్ట్ ట్రెండ్ "చైనా న్యూమరాలజీ"

మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా.. ? పోనీ రాశులు?  తిధులు, నక్షత్రాలూ…?  ఇవన్నీ పక్కన పెట్టండి…. లాస్ట్ కి న్యూమరాలజీనైనా నమ్ముతారా… నమ్మితే కింద మీ జాతకాన్ని చూసుకోండి, నమ్మకపోయిన కింద ఉన్న మీ జాతకాన్ని చూసుకొని ఇలాగే జరిగిందా..? లేదా…? అని ఓ సారి మీ జ్ఞాపకాలను నెమరేసుకోండి. ఇప్పుడు చాలామంది చైనా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. ఓ సారి మీరు కూడా  ట్రై చేయండి, మన పేరు ఆధారం చేసుకొని మన వ్యక్తిత్వం, మన ఆలోచనల విధానాన్ని   ఈ అంకెల ద్వారా  అంచనావేసి చెబుతారట. ( షరతులు వర్తిస్తాయ్).



ఉదాహరణకు:
అనిల్ (ANIL) అనే వ్యక్తి   పేరును ఉపయోగించి అతడి వ్యక్తిత్వం ఎలాంటిదో న్యూమరాలజీ ప్రకారం పరీక్ష చేద్దాం.

A=1, N=5, I=1,  L=3 . వీటి మొత్తం కలపండి.  1+5+1+3=10.
మీకు  మొత్తం రెండంకెల సంఖ్య వస్తే వాటిని రెండుగా వేరు చేసి కలపండి.   10= 1+0= 1. ఇప్పుడు ‘1’ అంకె ప్రకారం ఎలా ఉందో టెస్ట్ చేద్దాం.

 1. మీరు ఎంతో ధైర్యం కలవారు. మీకు ఎదురయ్యే దారిలో ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని ప్రతిష్టాత్మకంగా భావించి ఎదుర్కోగల సత్తా మీ సొంతం. ఎంతో నమ్మకంతో ఆ సమస్యలకు ఎదురెళ్ళి విజయం సాధిస్తారు.

 2. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. సొంత విశ్వాసం చాలా తక్కువ. దానివల్ల వ్యక్తిగతంగానే కాకుండా ఇతర కారణాల వల్లా సమస్యల్లో పడతారు.

3. ఎలాంటి పనైనా సరే కష్టపడి సాధిస్తారు. మీకున్న తెలివితేటల వల్ల ఇతరుల కంటే ముందుగా ఆ పనిని పూర్తిచేసి ముందుకు సాగుతూ, ప్రత్యేక గుర్తింపు పొందుతారు.

 4. తొందరగా ఎవరితోనూ కలవలేరు, మాటలు కలుపలేరు. ఒకసారి వారు మీకు దగ్గరైన తర్వాత వారికోసం ఏం చేయడానికైనా సరే ఆలోచించరు.

5. చాలా తెలివైనవారు, చేయాల్సిన పనిని ఎప్పుడు చేయాలో వెంటనే పూర్తిచేస్తారు, ఎలాంటి వాయిదా వేయకుండా తక్కువ టైంలో పూర్తిచేసి రిలాక్స్ గా ఉంటారు.

6. మీతో పాటు మీ చుట్టూ ఉండేవారు గౌరవంగా ఉండేలా ఆదేశాలిస్తారు. అలాంటి సమయంలో మీరు మిమ్మల్ని నియత్రించుకోలేరు. మీ జీవితంలో అనవసరమైన దుబారా ఖర్చులకు చాలా దూరంగా ఉంటారు.

7. మీరు కొత్తదనాన్ని స్వాగతిస్తారు. మీకే తెలియని ఓ క్రియేటర్ మీలో ఉన్నాడు. కళలంటే మీకు చాలా ఆసక్తి. పాత పద్ధతులను అనుసరించడానికి ఇష్టపడరు.

8. మీకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. వాటి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. బంధాలు, బాధ్యతలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు.

9. ఈ నెంబర్ వచ్చినవారికి ఉన్నట్లుండి కోపం వస్తుంది, ఆ తర్వాతే వెంటనే కూల్ అయ్యి, మాములుగా అందరితో కలిసిపోతారు. ఎలాంటి పనైనా సరే అది పూర్తయ్యేవరకూ వదిలిపెట్టరు.

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ సంఖ్యాబలం ఎలా ఉందో మీరూ తెలుసుకోండి.


Tuesday, June 7, 2016

మీ స్మార్ట్ ఫోన్ లో "రీసైకిల్ బిన్‌" ఆప్షన్‌ కావాలంటే ?

విండోస్ కంప్యూటర్‌లలో కనిపించే రీసైకిల్ బిన్ ఆప్షన్ గురించి మనందరికి తెలుసు. పీసీలో అవసరంలేని ఫైల్స్‌ను ఈ ట్రాష్ క్యాన్‌లోకి డంప్ చేసుకుని అవసరమైనపుడు వాటిలో కావల్సిన ఫైల్స్‌ను రీస్టోర్ చేసుకునే వీలుంటుంది. ఇక్కడ దురదృష్టకర విషయం ఎంటంటే..? మైక్రోసాఫ్ట్ అందిస్తోన్నరీసైకిల్‌బిన్ లాంటి ఫీచర్ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అందించలేకపోతోంది.
 
 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో విండోస్ తరహా రీసైకిల్‌ బిన్ ఆప్షన్ కావాలా..? ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ కనిపిస్తోంది. మరి ఇలాంటపుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇష్టంగా ఉంచుకున్న డేటా అనుకోకుండా డిలీట్ అయిపోతే ఏం చేస్తారు..? ఈ సమస్యకు సమాధానమే Dumpster App .ద రీసైకిల్ బిన్ ఫర్ ఆండ్రాయిడ్ అనే ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ బెస్ట్ రీసైకిల్ బిన్ గా వ్యవహరించగలదు. ఈ యాప్ ద్వారా ఫోన్‌లో డిలీట్ అయినా డేటాను తిరిగి రికవరీ చేసుకునేందుకు వీలుంటుంది. యాప్ ప్రత్యేకతలను తెలుసుకుందాం...

Dumpster App గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. ఈ యాప్‌‌ను మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఎంచక్కా మీ రీసైకిల్ బిన్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.


Dumpster యాప్, మీరు మీ ఫోన్‌లో డిలీట్ చేసే ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, అవసరమైనపుడు మీరు వాటిని తిరిగి రీస్టోర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఫోన్‌లో మీరు డిలీట్ చేసే ఫైల్స్‌ను భద్రంగా స్టోర్ చేసే Dumpster యాప్ మీ ముందు రెండు ఆప్షన్‌లను ఉంచుతుంది. అందులో మొదటిది రీస్టోరింగ్ ఆప్షన్. అంటే మీరు డిలీట్ చేసిన ఫైల్స్‌‍లో అవసరమైన వాటిని తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చన్నమాట. మరొక ఆప్షన్ శాస్వతంగా డిలీట్ చేయటం. అంటే డిలీట్ చేసిన ఫైల్స్‌ను శాస్వతంగా ఫోన్ నుంచి తొలగించటమనమాట.
యాప్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఫైల్స్‌ను ఎంపిక చేసుకోటం ద్వారా Dumpster ఆ ఫైల్స్‌కు సంబంధించిన క్యాచీని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఫైల్స్‌ను వైరస్ దాడుల నుంచి కాపాడుతుంది.

Dumpster యాప్ ప్రీమియమ్ వర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. ప్రీమియమ్ వర్షన్ యాప్ క్లౌడ్ బ్యాకప్‌తో పాటు యాడ్ ఫ్రీ ఇంటర్‌ఫేస్ అందిస్తుంది. ఏడాదికి రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది.


Monday, June 6, 2016

ఒకటా ? రెండా ?? ఏకంగా 400 కుక్కలకు ఆమె అమ్మ !

ఒకటి రెండు కుక్కలను సాకాలంటేనే ఎంతో ధనవంతులైతే మినహా ఆ సాహసం చేయరు. ఆ సాదు జీవులపై ప్రేమ ఉండాలేగాని.. డబ్బుదేముంది అంటోంది ఢిల్లీ నగరానికి చెందిన ప్రతిమాదేవి. 




 ఆమె చుట్టూ సుమారు 400 కుక్కలు.. వాటికి మూడు పూటలా కడుపు నిండా తిండి పెట్టి.. వాటి ఆలనాపాలన చూస్తుంది. ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర వస్తువులు పోగు చేసి అమ్మి రోజుకు రూ. 150 సంపాదిస్తుంది ప్రతిమాదేవీ. వచ్చిన డబ్బుతో వీధి కుక్కలన్నింటికీ ఉదయం 6 గంటలకు పాలు, బిస్కెట్స్, మధ్యాహ్నం 12 గంటలకు ఆహారంతో పాటు పాలు, రాత్రి 11 గంటలకు భోజనం సమకూరుస్తుంది. ఇక రాత్రి పూట ఆమె నివాసంలో ఉండకపోతే కుక్కలు కూడా నిద్ర పోవట. ఆమె లేకుండా కూడా భోజనం చేయవట. కుక్కలకున్న విశ్వాసం అది అన్న మాట. కుక్కల ఆలనాపాలనకు ప్రతిమా దేవీ తన జీవితాన్ని ధారపోస్తుంది.




 ప్రతిమాదేవీకి వివేక్(18) అనే అబ్బాయి చేదోడువాదోడుగా ఉంటూ కుక్కలను బాధ్యతగా చూసుకుంటాడు. తన భర్త వద్ద లేని సంతోషం కుక్కలతో ఉంటే వస్తుందని చిరునవ్వు నవ్వుతూ చెబుతుంది ప్రతిమా దేవీ. ఆ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో ప్రతిమాదేవిపై ప్రశంసల వెల్లువెత్తున్నాయి. 

మీరూ ఈ వీడియో చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ పై  క్లిక్ చేసి చూడండి .


 

Saturday, June 4, 2016

ఈ ఆచారాన్ని వింటే "జుగుప్స"కలగడం మాత్రం ఖాయం!

సాధారణంగా కొన్నికొన్ని కుటుంబాలకు కొన్నివింత ఆచారాలు పద్ధతులుంటాయి. అవి మనకు వింతగా కూడా అనిపించొచ్చు. కానీ, సింగపూర్‌కు చెందిన ఓ కుటుంబ ఆచారం మాత్రం వింటే ముక్కున వేలేసుకుంటారు. పెళ్లయిన తర్వాత ఆలుమగలు కలుసుకునే తొలిరాత్రి గుట్టుచప్పుడు కాకుండా పెద్దలు ఏర్పాటు చేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. పైగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కూడా. 
 
అయితే సింగపూర్‌కు చెందిన ఓ కుటుంబంలోని పెళ్లైన నవవధువులు మాత్రం శృంగారంలో పాల్గొనేటప్పుడు కుటుంబసభ్యులు పక్కనే ఉండాలట, వారి సమక్షంలో 'ఆ' కార్యం జరగాలట. వారంతా కళ్లార్పకుండా చూస్తుంటే స్త్రీ, పురుషులిద్దరూ నగ్నంగా మారి శృంగారంలో పాల్గొనాలట. ఈ దృశ్యాలను చుట్టు పక్కల ఉన్న కుటుంబసభ్యులు వీడియో కూడా తీసి లాకర్‌‌లో భద్రపరుచుకుంటారు. 
 
ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఈ ఆచారాన్ని వింటే జుగుప్సకలగడం మాత్రం ఖాయం. ఈ ఆచారం గురించి వారిని అడిగితే ఎన్నో తరాలుగా మా కుటుంబంలో ఉన్న ఆచారం ఇది. కుటంబంలో ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుని ఇలా తొలిసారి శృంగార జీవితంలోకి అడుగుపెడుతుండటం మాకందరికీ గర్వకారణం. అలాంటి పుణ్యకార్యానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండడం మాకు సిగ్గుగా అనిపించదు. నేను తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా మా కుటుంబసభ్యులందరూ ఉన్నారని ఆ కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు. హైటెక్ ప్రపంచంలో కూడా ఇలాంటి వింత ఆచారాలేంటో! 
 

Thursday, June 2, 2016

"పచ్చగడ్డి" మీద నడవండి ! ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి !!

మనిషి ఈ ప్రకృతిలో ఒక చిన్న భాగమే! కానీ ఈ ప్రకృతికీ తనకూ ఏమాత్రం సంబంధం లేదన్నంతగా అతని జీవనశైలి మారిపోయింది. ఒక పక్క ప్రకృతిని తనకు అనుకూలంగా ఎడాపెడా వాడేసుకుంటూనే, నాలుగ్గోడల మధ్యే జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఫలితం... కృత్రిమమైన జీవితంలాగానే, కృత్రిమమైన జబ్బులూ వచ్చేస్తున్నాయి.

మరే ఇతర జీవికీ లేనంతగా, మనిషి చిన్న వయసు నుంచే నానారకాల వ్యాధుల పాలిట పడుతున్నాడు. అందుకే ప్రకృతికి తిరిగి చేరువయ్యే మనిషికి ఆరోగ్యం కూడా దక్కుతుందంటూ కొత్త కొత్త పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిలో ఒకటే పచ్చగడ్డి మీద నడక! రోజురోజుకీ ప్రచారంలోకి వస్తున్న ఈ విధానం వల్ల చాలా ఉపయోగాలే ఉంటాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే...




 రిఫ్లెక్సాలజీ అనే శాస్త్రం ప్రకారం మన శరీరంలోని నాడులన్నీ కూడా పాదాల దగ్గరకి వచ్చి ఉంటాయి. కాబట్టి మన పాదంలోని ఒకొక్క భాగం మీద ఒత్తిడిని తీసుకువచ్చినప్పుడు, అక్కడ ఉన్న నాడికి చెందిన అవయవం మీద అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. పచ్చగడ్డిలో నడిచేటప్పుడు మన పాదంలోని ప్రతి అణువు మీదా ఒత్తిడి కలిగి తీరుతుంది కాబట్టి... రిఫ్లెక్సాలజీ ప్రకారం ఇది మన శరీరం మొత్తాన్నీ స్వస్థత పరుస్తుంది.

 పచ్చటి నేల మీద నడిచేటప్పుడు భూమితో ఒక అనుబంధం ఉన్న భావన కలుగుతుంది. మనం ప్రకృతి ఒడిలో ఉన్నంత తృప్తిగా ఉంటుంది. ఇలాంటి అనుభూతి వల్ల మనసు చాలా ప్రశాంతని పొందుతుందంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంతో ఏర్పడే ఒత్తిడి, భయాందోళనలన్నీ... ఇలా ప్రకృతిలో మమేకం అవ్వడం వల్ల దూరమవుతాయంటున్నారు.

నిరంతరం పాదాలకు తోలుతోనో, ప్లాస్టిక్‌తోనో చేసిన చెప్పులను ధరించడం వల్ల... మన శరీరం మీద భూమిలోని అయస్కాంత క్షేత్రం చూపించే ప్రభావంలో అనుకూల/ ప్రతికూల మార్పులు రావచ్చు. రోజులో కాసేపన్నా ఇలా గడ్డి మీద నడవడం వల్ల మన శరీరం మీద ఈ ప్రభావం సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.

పచ్చగడ్డి మీద నడవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని తేలింది. ఇందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి- రిఫ్లెక్సాలజీ ప్రకారం పచ్చగడ్డి మీద నడిచేటప్పుడు, మన పాదంలో... కంటినాడి మీద ప్రభావం చూపే స్థానాల మీద ఒత్తిడి కలుగుతుంది. రెండు- నిరంతరం కంప్యూటర్ ముందో, పుస్తకం ముందో, పేపరు పట్టుకునో కూర్చునే మనకి అప్పుడప్పుడూ కాస్త దూరంగా, పచ్చగా ఉండే వస్తువులు కనిపిస్తూ ఉండాలని వైద్య శాస్త్రం చెబుతోంది.

నిరంతరం బూట్లు లేదా చెప్పులు ధరించి ఉండేవారికి... అరికాళ్లలో రక్తప్రసారం తగ్గిపోయి, పాదాలు మొద్దుబారిపోయి ఉంటాయి. ఇలాంటి వాళ్లు రోజులో కాసేపన్నా పచ్చగడ్డి మీద నడిస్తే అప్పుడు తెలుస్తుంది... ఆ స్పర్శలో ఉన్న హాయి ఏమిటో. ఒక రకంగా చెప్పాలంటే పచ్చగడ్డిలో నడక మన పాదాలకు మంచి మసాజ్‌లాంటిది.

 ఉదయాన్నే కాసేపు అలా పచ్చగడ్డి మీద నడిస్తే ఆ తాజా గాలి, పచ్చగడ్డి మీద నుంచి వచ్చే పసిరిక వాసనా, మెత్తటి గడ్డి అందించే స్పర్శా... ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతని అందిస్తాయి. ఇక ఆ సమయంలో పై నుంచి వచ్చే సూర్యరశ్మి కూడా మనకు రోజువారీ అవసరమయ్యే విటమిన్‌ ‘డి’ను అందిస్తుంది. నేటి జీవనశైలితో వస్తున్న కీళ్ల వ్యాధి నుంచి డయాబెటిస్‌లకు ‘డి’ విటమిన్‌ లోపం కూడా ఓ కారణం అని ఇప్పటికే తేలింది. నిరంతరం నాలుగ్గోడల మధ్యే ఉంటున్న జనానికి సహజమైన ఈ విటమిన్‌ అందడం లేదని వెల్లడైంది. దీనికి ఉదయపు నడకే అత్యుత్తమ పరిష్కారం అని చెబుతున్నారు.

చెప్పుకుంటూ పోతే... పచ్చగడ్డి మీద నడిస్తే వేస్తే కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఓ నాలుగడుగులు అలా వేసి చూడండి. ప్రత్యేకించి కాకపోయినా... ఎప్పుడన్నా పచ్చగడ్డి కనిపిస్తే దాని మీద పాదం మోపి చూడండి. మీరే ఒప్పుకుంటారు... ఆ స్పర్శలో ఏదో మాయ ఉందని!

Wednesday, June 1, 2016

"హాట్‌ వాటర్‌ బీచ్‌" గురించి తెలుసా ?

ఆ సముద్ర తీరంలో తవ్వితే పొగలొస్తాయి. అక్కడి నీళ్లు సలసలమని కాగుతుంటాయి. విచిత్రంగా ఉంది కదూ.

 * ‘హాట్‌ వాటర్‌ బీచ్‌’గా పిలిచే ఇది. న్యూజిలాండ్‌లోని కోరమాండల్‌ ద్వీపకల్పపు తూర్పు తీరంలో ఉంది.

* తీరంలో ఇసుక నుంచి బుసబుస మంటూ వేడి నీటి బుడగలు వస్తుంటాయి. పర్యటకులు పారలతో వచ్చి తవ్వడం మొదలుపెడతారు. ఎవరికి వారే మడుగులు తయారు చేసుకుని పొగలు కక్కే వేడి నీళ్లలో జలకాలాటలు ఆడుకుంటారు. ఇసుకని తీస్తూ గుండ్రని మడుగులుగా చేసుకుని ‘స్పా పూల్స్‌’గా మార్చుకుంటారు.



 * ఈ నీటి ఉష్ణోగ్రత 64 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉంటుందిట.

* ఒక వైపు కెరటాలు ఎగసిపడుతుంటే మరో వైపు తీరంలోని ఈ మడుగులో పడుకుని హాయిగా సేదతీరుతారు. మరి అంత వెచ్చని నీళ్లు అయితే బొబ్బలు రావా? అందుకే కొంతమంది ఎగసివస్తున్న అలల చల్లటి నీటిని మడుగుల్లో కలుపుకుంటారు.



* ఈ తీరంలో ఇసుక కింద వేడి నీటి బుగ్గలుండటం వల్లే ఇలా వేడి నీళ్లు వస్తున్నాయి.

* ఇక్కడికి ఏటా దాదాపు ఏడు లక్షల మంది పర్యటకులు వస్తారు.