CSS Drop Down Menu

Thursday, December 28, 2017

చిరుతో సమస్యలొచ్చాయ్? అల్లు అరవింద్

మెగాస్టార్ చిరంజీవితో తన సంబంధం గురించి ఆయన బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ పర్యటనలో ప్రజారాజ్యం పార్టీ కనుమరుగవడానికి, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు అల్లు అరవింద్ కూడా ఓ కారణమంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చిరంజీవితో తనకు బావాబావమరిది రిలేషనే కాకుండా అంతకుమించి మంచి స్నేహితులమనే బంధం వుందని చెప్పుకొచ్చారు. 




తనపై నమ్మకంతో మెగాస్టార్ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించానని, దీంతో మనసులో రెండో ఆలోచనల లేకుండా చిరంజీవి ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేయగలిగారన్నారు. తనకు చేతనైన సాయం చిరంజీవికి చేశానని తెలిపారు. సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు కలసి కొనసాగినవారు చాలా అరుదని తనకు గుర్తున్నంత వరకు అలాంటి వారిలో బాపు-రమణ, కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి, చిరంజీవి-తాను ఉన్నామని అరవింద్ చెప్పారు. 

కానీ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయని తమ ఇద్దరి మధ్య చిన్నచిన్న సమస్యలు వచ్చాయని అల్లు అరవింద్ తెలిపారు. వ్యక్తిగతంగా తమ మధ్య విభేదాలు లేవని రాజకీయాల్లో వెళ్లినప్పుడు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. కానీ అవికూడా తమపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని ఎప్పటిలాగానే తామిద్దరం కలిసే ముందుకు సాగుతున్నామని వివరించారు.

Tuesday, December 26, 2017

"బ్లాక్ అండ్ వైట్" ని "కలర్" ఫోటోగా సులువుగా మార్చుకోండి !

మీ దగ్గర ఉన్న"బ్లాక్ అండ్ వైట్ ఫోటో" ని "కలర్ ఫోటో"గా ఎటువంటి సాప్ట్వేర్(software) మరియు  యాప్ ఉపయోగించకుండా సులువుగా మార్చుకోవాలంటే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసుకొని ఆనందించండి.



బ్లాగర్ వీక్షకులు నా యొక్క బ్లాగును ఆదరించినందుకు నా కృతజ్ఞతలు. అలాగే నా యొక్క "యూట్యూబ్ ఛానల్"ను కూడా  Subscribe చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. 

Subscribe చేసిన తరువాత దాని ప్రక్కనే ఉన్న "గంట" సింబల్ ను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి  వీడియోలు నోటిఫికేషన్స్ ద్వారా పొందగలరు.   

Friday, December 22, 2017

"రాత్రి" పూట పుట్టేవారు ఎలా ఉంటారో తెలుసా?

ప్రపంచంలో పుట్టిన మనుషులందరిలోను బాగా తెలివైన వారు కొందరు ఉంటారు. అలాగే కొంచెం తెలివైన వారు ఉంటారు. ఇంకా అసలు తెలివిలేని వారు చాలామందే ఉంటారు. అయితే కొంతమందికి పుట్టుకతోనే అమితమైన తెలివితేటలు వస్తాయి. కొందరికి అవి పెరుగుతున్నకొద్దీ వస్తాయి. ఇక తెలివితేటల విషయంలో ఎవరు ఎలా ఉన్నా రాత్రిపూట పుట్టిన వారు మాత్రం సహజంగానే ఇతర సమయాల్లో పుట్టిన వారి కంటే ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారట. మీరు విన్నది నిజమే. పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్న నిజమిది. 

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు వ్యక్తులను, వారు పుట్టిన సమయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వారి విజ్ఞానం, చదువు, తెలివితేటలు, ఐక్యూ స్థాయిలను కూడా పరిశీలించారు. దీన్ని మొత్తం బేరీజు వేసుకున్న తరువాత రాత్రి పూట పుట్టిన వారు బాగా తెలివిమంతులు అవుతారని, వారికే ఐక్యూ ఎక్కువగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. 

రాత్రి పూట పుట్టేవారికి తెలివితేటలే కాదు, సమస్యను పరిష్కరించే సత్తా కూడా ఉంటుంది. వీరు చదువుల్లో రాణిస్తారు. గొప్ప ఉద్యోగాలు చేస్తారు. సాధారణంగా రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర కావాలి కదా. కానీ రాత్రిపూట పుట్టిన వారికి ఐదు గంటల నుంచి 6 గంటల నిద్ర ఉన్నా సరిపోతుంది. వీరికి ఎక్కువ నిద్ర అవసరం లేదు. పనిలో బాగా చురుగ్గా ఉంటారు. ఎక్కువగా పనిచేస్తారు.


Friday, December 15, 2017

నాలుగు చెవుల గేదె !





Wednesday, December 13, 2017

మగాళ్ళను మించిపోయిన మహిళలు ! ఏ విషయం లోనో తెలుసా?

సాధారణంగా అన్ని రంగాల్లో మగాళ్లు ముందుంటారు. కానీ, ఇటీవలికాలంలో పురుషులతో స్త్రీలు కూడా పోటీపడుతున్నారు. శృంగారం మొదలుకుని, మద్యం సేవించే విషయం వరకు మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మహిళలు నిరూపిస్తున్నారు. తాజాగా వెల్లడైన ఓ అధ్యయన ఫలితాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆ రంగంలో మగాళ్ళ కంటే స్త్రీలే ఒక అడుగు ముందున్నారట. ఇంతకీ మహిళలు ఏ రంగంలో ముందున్నారనే కదా మీ సందేహం. మద్యం సేవించడంలో మగాళ్ళను స్త్రీలు మించిపోయారట. 


తాజాగా దేశంలో మద్యం తాగే మహిళల సంఖ్య పెరిగినట్టు జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడైంది. మందు తాగే మహిళలు ఎక్కువగా ఉన్న జాబితాలో 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం. సుమారు 10 యేళ్ల తర్వాత మద్యం తాగే మహిళల సంఖ్య 0.7 శాతానికి పెరగగా, మద్యం సేవించే పురుషుల శాతం 24.7 కు తగ్గినట్టు సర్వేలో వెల్లడైంది.

అంటే, గత 2005-2006వ సంవత్సరంలో మద్యం సేవించే మహిళల శాతం 0.4గా ఉండగా, ఇది 2015-2016 నాటికి వీరి శాతం 0.7 శాతానికి పెరిగింది. అదీకూడా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, గోవా, కేరళ, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళలు అధికంగా మద్యం సేవిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది. 

అదేసమయంలో 2005-2006 లో మద్యం సేవించే పురుషుల శాతం 33.1 శాతంగా ఉండగా, 2015-2016 నాటికి  24.7 శాతానికి తగ్గిపోయిందనీ ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో తాగే మహిళల శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. దేశ రాజధాని ఢిల్లీలో అయితే, మద్యం సేవించే మహిళలకు ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ కూడా ఉందట. ఆ యాప్‌కు 'శక్తి' అనే పేరు పెట్టినట్టు సమాచారం. 

Tuesday, December 12, 2017

మీ ఫోటోలను పెన్సిల్ డ్రాయింగ్ ఫోటోలుగా మార్చుకోవాలనుకుంటున్నారా ?

మీ ఫోటోలను పెన్సిల్ డ్రాయింగ్ ఫోటోలుగా మార్చుకొని చూసుకోవాలనుకొంటే నా యొక్క క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి ఆనందించండి. 




Saturday, December 9, 2017

పిజ్జా, బర్గర్ల కన్నా "సమోసా"లే మేలు ?

జంక్ ఫుడ్స్ అయిన పిజ్జాలు, బర్గర్లు వగైరా వగైరా ఆహార పదార్థాలను తినేవారిలో ఒబిసిటీ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు సైతం తప్పవని అంటున్నారు. అయితే సాయంత్రం పూట తీసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ల కంటే సమోసా బెటరని ఓ అధ్యయనంలో తేలింది.




అప్పుడప్పుడే నూనెలో వేయించే తాజా సమోసాలు ఆరోగ్యానికి మేలేనని సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిర్వ‌హించిన తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. బాడీ బార్డ‌ర్: లైఫ్‌స్టైల్ డిసీసెస్ పేరుతో విడుద‌ల చేసిన ఈ నివేదిక‌లో స్థూల‌కాయ‌త్వం, మాన‌సిక ఎదుగుద‌ల‌, కేన్స‌ర్‌, హృద్రోగాల వంటి రోగాల‌కు ఆహార‌పు అల‌వాట్లకు మ‌ధ్య సంబంధం వున్నట్లు పరిశోధకులు వివరించారు. 

బర్గర్ కంటే సమోసాల్లో రసాయనాలు తక్కువగా వుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. బర్గర్లతో సాస్, చీజ్.. ఇతర ప్రిజర్వ్ చేసే ఆహార పదార్థాలుంటాయి. ఇవి ఒబిసిటీకి దారితీసే అవకాశాలు అధికంగా వున్నాయి. అయితే సమోసాలో వుండే ఆలూ, పిండి పదార్థాలు సహజమైనవని.. వాటితో ఆరోగ్యానికి కాస్త మేలే జరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 

సమోసాల్లో వుండే గోధుమ పిండి, ఉడికించిన ఆలూ, పచ్చి బఠాణీలు, ఉప్పు, పచ్చిమిర్చి, కూరగాయలు, నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయని పరిశోధకులు తెలిపారు. 2016 సెప్టెంబర్ నుంచి మార్చి 2017 వరకు జరిగిన పరిశోధనలో 15 రాష్ట్రాలకు చెందిన 13వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 9-17 ఏళ్ల మధ్య గల విద్యార్థులపై ఈ పరిశోధన జరిపామని చెప్పారు. అధిక చక్కెర, ఉప్పు కలిగిన ప్యాకేజ్డ్ ఫుడ్, బేవరేజస్ వల్లనే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఈ పరిశోధనలో వెల్లడైనట్లు పరిశోధకులు వెల్లడించారు.


Thursday, December 7, 2017

భారతీయులకు వచ్ఛే ప్రాణాంతక జబ్బులకుగల కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు !

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా, భారతీయ పౌరులతో పోల్చుకుంటే ఉత్తర అమెరికా, యూరప్ ప్రజలు ఎంతో బెటరంటున్నారు. దీనికి ప్రధాన కారణం భారతీయుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువట.. ఈ విషయంలో అమెరికా, యూరప్ ప్రజలే ఎంతో మేలట. 

ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలకు చెందినవారితో పోలిస్తే.. భారతీయుల ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం తక్కువగా ఉంటుందట. ఈ కారణంగానే మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం నుంచి భారతీయులు ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ విషయాలను సీఎస్ఐఆర్ (శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి)లోని జీనోమిక్స్‌, ఇంటిగ్రేటివ్‌ బయోలజీ విభాగం డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 

ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉండటం వెనుక.. జాతి, శారీరక శ్రమ, పోషకాహారం, పెంపకంలాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ విషయాలను అమెరికన్‌ థొరాసిక్‌ సొసైటీ వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

Tuesday, December 5, 2017

జీన్స్ ప్రియులా ? ఐతే జాగ్రత్త !

ఫ్యాషన్ పేరిట జీన్స్ వేసుకుంటున్నారా? కంఫర్ట్‌బుల్ కోసం వాటిని పదే పదే వాడుతున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. జీన్స్ వేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అయినప్పటికీ.. వాటితో ఏర్పడే అనారోగ్య సమస్యలను వింటే షాక్ కాక తప్పరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీన్స్ ఫ్యాంటులతో కాస్త జాగ్రత్తగా వుండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 





చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు బిగుతు జీన్స్‌ వేసుకుంటారు. వీటివల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు శరీరం లోపల నరాల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. రక్త ప్రసరణ సమస్యలు ఎదురవుతాయి. అలాగే జీన్స్ వేసుకుని కింద కూర్చోవడం కూడదు. కాళ్లు ముడుచుకుని కూర్చోవడం చేయకూడదు. 

జీన్స్ ప్యాంట్ వేసుకుని కాళ్లు ముడుచుకుని కూర్చోవడం ద్వారా కండరాలు, నరాలకు దెబ్బ తప్పదని.. అదే అలవాటుగా పెట్టుకుంటే నడవలేని పరిస్థితికి కూడా దారితీయవచ్చునని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాకుండా వ్యాయామం చేసే సమయంలో జీన్స్ వేసుకోవడం, జీన్స్ వేసుకుని స్క్వాటింగ్ చేయడం కూడా ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Saturday, December 2, 2017

భోజనం చేసిన వెంటనే"కూలింగ్ వాటర్"తాగుతున్నారా?

చాలా మందికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగుతుంటారు. ఇలా ఐస్ వాటర్ తాగడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 


ఒకవేళ ఖచ్చితంగా ఐస్ వాటర్ తాగాలని అనుకుంటే మాత్రం భోజనం చేశాక 20-30 నిమిషాల తర్వాత తాగడం మంచిదట. భోజనం చేసిన వెంటనే చల్లటినీరు తాగితే గుండెపోటు, కేన్సర్ వంటి వ్యాధులు దరిచేరే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, కొవ్వు ప్రేగుల్లో పేరుకుని పోతుందట. 

అదేసమయంలో భోజనం చేశాక గోరు వెచ్చటి నీరు తాగితే గుండెతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. పైగా, గోరు వెచ్చని నీరు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ చేరకుండా చేస్తుందట. 


Wednesday, November 29, 2017

పిల్లలు నిద్రలో పాస్ పోస్తున్నారా ?

పిల్లలు పక్క తడుపుతుంటే రాత్రి పూట ఖర్జూరాను చిన్న ముక్కలుగా చేసి పాలలో వేసి వేడి చేసి చల్లార్చి పిల్లలకు తాగించాలి. అలా చేస్తే ఖర్జూరాలోని ఆప్టాలిక్ యాసిడ్ జీర్ణక్రియను త్వరితం చేసి శరీరంలో ద్రవరూపంలోని మలినాలన్నీ త్వరగా మూత్రం ద్వారా పంపబడుతుంది. అంతకుముందే పూర్తిస్థాయిలో ద్రవరూపంలో మలినాలను పంపేశారు కాబట్టి రాత్రి నిద్రలో పోసుకోవడానికి ఇంకేమీ మిగిలి ఉండదు. పిల్లల్లో భయం, అభద్రతా భావం, ప్రేమ రాహిత్యం నరాల బలహీనత కారణంగా ఇది తలెత్తే అవకాశం వుందని చెబుతుంటారు. 



రాత్రి వేళల్లో వాష్ రూంకు పిల్లలు లేపితే విసుక్కోకుండా తీసుకెళ్ళాలి. ఒకసారి విసుక్కుంటే లేపినా విసుక్కుంటారని పక్కలోనే కానించేస్తారు. ఇంట్లో ఎక్కువగా గొడవలు లేకుండా చూసుకోవాలి. తరచూ గొడవలు అవుతుంటే పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు. పడుకునే ముందు ఖచ్చితంగా టాయ్‌లెట్‌కు వెళ్ళడం అలవాటు చేయాలి. మౌలికంగా పక్క తడపడం అనేది వ్యాధి కాదు. కాబట్టి దానికి మందులు వాడే అవకాశం తక్కువ.

Monday, November 20, 2017

"సముద్రంలో తేలే నగరాన్ని" నిర్మిస్తూ సంచలనం సృష్టిస్తున్న దేశం !

ఫ్రాన్స్ సర్కారు అద్భుత సృష్టితో తమ సత్తా ఏంటో నిరూపించురోనుంది. సరికొత్త రూ. 1135కోట్లతో సముద్రంలో తేలే నగరాన్ని నిర్మించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ సర్కార్ తెలిపింది.



ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.


2018 నుంచి పూర్తి స్థాయిలో ఈ నగరం ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయి. 2050 నాటికి సముద్రంపై తేలియాడే ఇలాంటి పలు నగరాలు వేల సంఖ్యలో నిర్మితమవుతాయని ఫ్రాన్స్ ప్రభుత్వాధికారి మిస్టర్ క్విర్క్ అన్నారు. 


Wednesday, November 15, 2017

"మీ పేరు" తోనే "రింగ్ టోన్" పెట్టుకోవాలని ఉందా ?

మీరు మీ ఫోన్లో రకరకాల రింగ్ టోన్స్ పెట్టుకొని ఉంటారు. కాని  "మీ పేరు" తోనే "రింగ్ టోన్"  పెట్టుకొని మీ పక్కవారిని ఆశ్చర్య పరచాలని  ఉందా ? ఐతే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి మీ రింగ్ టోన్ సెట్ చేసుకొని ఆనందించండి. 

      


Tuesday, November 14, 2017

"తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్" తో వచ్చిన "మోటో x4"


అందరూ అనుకున్నట్లుగానే మోటో ఎక్స్ 4 ఇండియాకి వచ్చేసింది.



ఇందులో యూజర్లను ఆకట్టుకునే స్టన్నింగ్ ఫీచర్లతో తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందించారు.
మోటో అలెక్స్ యాప్ కూడా ఇందులో ఉంది.ఫోన్ టచ్ చేయకుండానే అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నీళ్లలో పడినా ఏ మాత్రం కంగారు పడక్కర్లేదు. రక్షణ కవచం ఉంది. అత్యాధునిక ‘డ్యుయల్‌ రేర్‌ కెమెరా సిస్టం’తో అదిరే ఫొటోలు తీయొచ్చు. 12 మెగాపిక్సల్‌ కెమెరాతో ‘డ్యుయల్‌ ఆటోఫోకస్‌ పిక్సల్‌ టెక్నాలజీ’ని వాడుకుని తక్కువ వెలుతురులోనూ క్వాలిటీ తగ్గని ఫొటోలు క్లిక్‌ మనిపించొచ్చు.అల్యూమినియం బాడీతో ఈ ఫోన్‌ పూర్తిగా గ్లాస్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. ఈ లుక్ రావడంతో ఫోన్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా ఉంది.

ఫోన్  స్పెసిఫికేషన్లు:-
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
3,4 జీబీ ర్యామ్ /32,64 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12,8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ (ముందు, వెనుక)
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్. 

Moto x4 
3 జీబీ ర్యామ్ /32 జీబీ స్టోరేజ్ - http://fkrt.it/xQpTG!NNNN
4 జీబీ ర్యామ్ /64 జీబీ స్టోరేజ్ - http://fkrt.it/kVYn~TuuuN




Monday, November 13, 2017

ఇలాంటి "వెరైటీ లవ్ ప్రపోజల్" ఎవరూ చేసి ఉండరు.

చైనా యువకుడు తన ప్రేయసికి వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశాడు. అతడు లవ్ ప్రపోజ్ చేసిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ చైనా యువకుడు ఎలా లవ్ ప్రపోజ్ చేశాడంటే దాదాపు 31,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 25.5 లక్షలు) విలువ చేసే పాతిక ''ఐఫోన్ ఎక్స్'' మొబైల్స్‌కొని, వాటిని హార్ట్ ఆకారం పేర్చి మధ్యలో పెళ్లి రింగ్‌ను ఉంచాడు. ఆపై ప్రేయసి ముందు మోకారిల్లి పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది విన్న ప్రేయసి షాక్ అవడమే కాకుండా ప్రేమికుడికి వెంటనే ఓకే చేసేసింది. 



తన ప్రేయసికి స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టమని అందుకే.. తాజాగా విడుదలైన ''ఐఫోన్ ఎక్స్" ఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చానని తెలిపాడు. అంతేగాకుండా 25 మొబైల్సే ఎందుకిచ్చానంటే.. తన ప్రియురాలి వయస్సు పాతికేళ్లని చెప్పాడు. ఇక ప్రేయసి తన పెళ్లి ప్రపోజల్‌కు పచ్చాజెండా ఊపడంతో ఆ ప్రేమికుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో ఆ యువకుడు తన ప్రియురాలిని మెప్పించడంలో సహకరించిన మిత్రులందరికీ తలో ''ఐఫోన్ ఎక్స్" బహుమతిగా ఇచ్చేశాడు.

Wednesday, November 8, 2017

"తేనెలో ఊరపెట్టిన ఉసిరికాయ"ను తింటే వచ్చే ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాస కాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే  శరీరానికి ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, దాంతో ఎన్నో అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. 



ఈ తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మంపై ఏర్పడిన ముడతలు తగ్గిపోతాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా కూడా మారుతుంది. 

ఈ చలి కాలంలో ఆస్తమా అనేది చాలా మందిని ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేరు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే దాంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే తేనె, ఉసిరి మిశ్రమంలో ఉండే సహజ సిద్ధమైన పోషకాలు ఆస్తమాను దూరం చేస్తాయి. శ్వాసకోశ సమస్యలు రాకుండా చూస్తాయి.

తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. దీంతో ఈ మిశ్రమం వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి. చలికాలం మన జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. తిన్నది ఓ పట్టాన జీర్ణం కాదు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే ఆ సమస్య ఉండదు. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అంతేకాదు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. 

ఆకలి మందగించిన వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మంచిది. దీంతో ఆకలి పెరుగుతుంది. అంతేకాదు, మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా సేవిస్తుంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీని వల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఇది స్థూలకాయం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది.

Monday, November 6, 2017

తిరుమలకు వెళ్ళిన వాళ్ళు ఈ "ఆకు" తింటే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారట ?

హథీరాం బాబాజీ తిరుమలలో 500 సంవత్సరాల క్రితం నివసించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి హథీరాం బాబాజీతో పాచికలాడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. బాబాజీ మొదట్లో శ్రీవారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకునేవారు. అయితే రోజూ ఊరికే ప్రసాదాలు ఇవ్వడం ఇష్టంలేని ఆలయ అధికారులు హథీరాంజీని కట్టెలు కొడితేనే ప్రసాదాలని షరతులు విధించారు.

హథీరాంజీ ఏనుగులాగా బలంగా ఉండేవారని పురాణాల్లో ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల కోసం కట్టెలు తెచ్చి వాటిని గొడ్డళ్ళతో హథీరాంజీ ముక్కలు చేసేవారట. కొన్ని రోజుల తర్వాత బాబాజీకి బాధ అనిపించిందట. తన సమయంతా దీనికి కేటాయిస్తున్నానేంటి అనుకునేవారట హథీరాంజీ. తిండి సంగతి దేవుడెరుగు ముందు తపస్సు చేసుకుందామని నిర్ణయానికి వచ్చి శ్రీవారి ఆలయానికి దూరంగా పాపవినాశనం అడవుల్లోకి వచ్చేశారు.

అతి సమీపంలోని అటవీ ప్రాంతంలో హథీరాంజీ బాబాజీ తపస్సుకు కూర్చొన్నారు. ఆ సమయంలో ఆయనకు ఆకలి వేసింది. ఆకలిని తట్టుకోలేక ఎదురుగా ఉన్న చిన్న చెట్టు ఆకులను తీసుకుని ఆరగించాడు. ఆ ఆకులు తియ్యగా ఉండటంతో ఆవురావురమంటూ ఆ ఆకులన్నింటినీ ఆరగించాడు. పక్కనే ఉన్న తీర్థంలో నీళ్ళు తాగాడు. ఆకలి తగ్గాక బాబాజీకి భయమేసింది. ఆకుల వల్ల ఏమన్నా అవుతుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే ఏమీ కాలేదు. 

ఆకులు తిన్న తర్వాత అన్నం మాట మర్చిపోయి ఆకులు మాత్రమే తినడం ప్రారంభించాడు. అలా తన తపస్సును పూర్తి చేశాడు. అలా 12యేళ్ళపాటు తపస్సు చేసి ఆ బద్ధాకును తింటూ వచ్చాడు. కొంతమంది ఈ ఆకులను రామభద్రం ఆకులు లేక రామపత్తి అని పిలుస్తుంటారు. గతంలో అన్ని చెట్లు ఉండగా బాబాజీ ఈ ఆకునే తినడం ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదంతా శ్రీవారి మహిమేనని పురాణాలు చెబుతున్నాయి. 

ఈ బద్ధి చెట్టు శేషాచలం అడవుల్లో మాత్రమే విరివిగా పెరుగుతాయి. ఇంక ఎక్కడా కనిపించదు. పాపవినాశనం దగ్గరలో వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర హథీరాంజీ బాబాజీ సమాధి ఉంది. ఇక్కడే ఆయన తపస్సు చేశారు. అక్కడికి వెళ్ళిన భక్తులకు బద్ధాకును ఇస్తుంటారు. ఈ ఆకు తియ్యగా, పుల్లగా ఉంటుంది. దీన్ని ఎంతైనా తినొచ్చు. ఇది తింటే సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఖాయమట. 

Friday, November 3, 2017

Redmi ఫోన్ లో వచ్చే "Female For English" అనే నోటిఫికేషన్ ఎలా తొలగించాలో తెలుసా?


Redmi ఫోన్ లో వచ్చే "Female For English" అనే నోటిఫికేషన్ మీరు  క్లోజ్ చేసినా అది మళ్ళీ మళ్ళీ వచ్చి చిరాకు తెప్పిస్తుంది. అది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి ఆ  నోటిఫికేషన్ రాకుండా చేసుకోండి. 



Tuesday, October 31, 2017

ఒక టేబుల్ స్పూన్ సోంపును అన్నం తిన్న తరువాత తింటే ?

సోంపుకు కొలెస్ట్రాల్‌కు ఉన్న లింకేంటి. సోంపు అంటే కొంతమంది ఇష్టపడతారు. మరికొంతమంది అసహ్యించుకుంటారు. ఇంట్లో గాని, రెస్టారెంట్‌లో గాని భోజనం తిన్న తరువాత సోంపును తినేవారు చాలామంది ఉంటారు. ఇది తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. 



సోంపు ఎంత ఎక్కువగా తింటే అంత కొవ్వు కరిగిపోతుంది. సోంపు అనేది భోజనం చేసిన తరువాత తినే స్వీట్ పదార్థం అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. సోంపు త్వరగా జీర్ణం చేసి క్రొవ్వును బాగా కరిగిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఒక టేబుల్ స్పూన్ సోంపును అన్నం తిన్న తరువాత తింటే నోట్లో లాలాజలం ఉత్పత్పై ఎసిడిటి సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తీసుకున్న ఆహారంలో నీటి శాతాన్ని గ్రహించి మలబద్ధకంలో నివారిస్తుంది. 

సోంపును రెగ్యులర్‌గా వాడితే బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్ దరిచేరనివ్వద్దు. అధిక బరువును తగ్గిస్తుంది. రోజూ సోంపు పౌడర్‌ను నీళ్ళలో కలుపుకుని తాగితే బరువు బాగా తగ్గుతారు. సోంపును అధికంగా వాడితే అంత ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Monday, October 30, 2017

పవన్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంతో తనకు రీమేక్ చిత్రాలంటేనే విరక్తి కలిగిందని దర్శకుడు జయంత్ సి పరాన్జీ చెప్పారు. పైగా, పవన్‌తో తాను తీసిన తీన్‌మార్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ''తీన్‌మార్ సినిమాతో నాకు రీమేక్ సినిమాలంటేనే విరక్తి కలిగింది. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. కానీ చేయక తప్పలేదన్నారు".



పైగా, నేను పలు రీమేక్ చిత్రాలు చేశాను. కాకపోతే వాటిని తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా కొన్ని సీన్లు మార్చాను. కానీ తీన్‌మార్‌ని సేమ్ టు సేమ్ దించేయాల్సి వచ్చింది. తప్పలేదు ఆ టైమ్‌లో అలా చేయాల్సి వచ్చింది..'' అంటూ తీన్‌మార్ విషయంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించారు. 

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. మరి తెలిసి కూడా అంత పెద్ద హీరో అవకాశం ఇస్తే ఎందుకలా ప్లాప్ సినిమా తీశారంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Saturday, October 28, 2017

43వేల మంది మగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి ! ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఓ గ్యాంగూ కాదు, ఏకంగా 43వేల మంది మృగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మెక్సికోకు చెందిన కార్లా జాసింటో గత ఏడాది అంతర్జాతీయ మీడియా ముందుకొచ్చింది. 12 ఏళ్ల వయసులో మానవ అక్రమ రవాణా ముఠా చేతుల్లోకి చిక్కుకున్న ఈమె బలవంతంగా వేశ్యగా మార్చబడింది. డబ్బు మీద మోజుతో, తనను కలిసిన వ్యక్తితో బయటికి వెళ్లింది. 

అంతే అప్పటి నుంచి సెక్స్ బానిసగా మారిపోయానని వెల్లడించింది. రోజుకు 30మంది విటులను భరిస్తూ నాలుగేళ్ల  పాటు నరకయాతన అనుభవించానని జాసింటో తెలిపింది. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా వచ్చేవి కావని పరిస్థితి అంత దారుణంగా వుండేదని చెప్పుకొచ్చింది.

ఉదయం పది గంటల నుంచి అర్థరాత్రి వరకూ తనపై మృగాళ్లు పడుతుంటే, బాధను తట్టుకోలేక ఏడుస్తూ, కళ్లు మూసుకునే దాన్ని అంతకుమించి ఏమీ చేయలేని స్థితిలో వుండేదాన్నని చెప్పుకొచ్చింది. పోలీసుల దాడులతో తిరిగి జనజీవనంలోకి వచ్చిన కార్లా ప్రస్తుతం ఓ మంచి న్యాయవాది. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోర్టులకు వచ్చే కేసులను వాదిస్తూ తనలాంటి అభాగ్యుల తరపున నిలుస్తోంది.

Friday, October 27, 2017

కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఈ చేపలను తినండి.

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్లను ఆరోగ్యంగా వుంచుతాయి. వారానికి కనీసం రెండు సార్లైనా చేపలను ఆహారంలో చేర్చుకుంటే కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు.






చేపలు తిననివారు బదులుగా ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు ఉండే అవిసెగింజలూ, బాదం, వాల్‌నట్లూ, పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని తీసుకోవాలి. విటమిన్‌ సి ఉండే పండ్లు తినడం కూడా తప్పనిసరే. చక్కెరశాతం తక్కువగా ఉండే పదార్థాలనే ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇక కీళ్ల నొప్పులకు అధికబరువు కూడా ఒక కారణమే. బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం చేస్తూనే పండ్లూ, తాజా కూరగాయలూ, ఆకుకూరలూ, చిరు ధాన్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.


అలాగే యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండే సి.విటమిన్‌ ను తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్యను అదుపులో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Thursday, October 26, 2017

ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త !

ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లకు పెంచింది. అంటే ప్రస్తుతం కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లుగా ఉంది. దీన్ని 2 మెగాబైట్లకు పెంచనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. 



ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని మరింత ప్రోత్సహించేలా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఇకపై కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 2 మెగాబైట్లుగా ఉండనుందని టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటోందని గ్రామీణ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని ఆయన అన్నారు.

3జీ, 4జీ తరాలు పోయి 5జీ తరం రానుందని, ఈ నేపథ్యంలో కనీస వేగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరత దృష్ట్యా 2 ఎంబీపీఎస్ వరకూ మాత్రమే వేగం పెంచలగమని భావిస్తున్నట్టు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీగా మారుతోందని, దీనికి వేగవంతమైన ఇంటర్నెట్ తప్పనిసరిని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Wednesday, October 25, 2017

పెంపుడు జంతువులకు పన్ను చెల్లించాలంటున్న ప్రభుత్వం ! ఎక్కడో తెలుసా?

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం, ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే, పంజాబ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టింది. అయితే, ఈ రాష్ట్రంలో ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పన్ను చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. 

ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది ఎవరో కాదు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ ఉత్తర్వుల మేరకు పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు జంతువైనా ఇంట్లో ఉన్నట్టయితే పన్ను కట్టాల్సిందే. పంచాయతీలను మాత్రం ఈ పన్ను పరిధి నుంచి మినహాయించారు. జంతువులను బట్టి రూ.200 నుంచి రూ.500వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 

ఒకవేళ పన్ను కట్టకపోతే... మున్సిపల్ సిబ్బంది ఆ జంతువులను స్వాధీనం చేసుకుంటారు. అయితే, కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు కూడా పన్ను వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ పన్ను విధింపు ఉత్తర్వులపై పంజాబ్ రాష్ట్ర ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. 


Monday, October 23, 2017

కార్తీకమాసంలో "శివ కేశవుల"ను ఏ విధంగా పూజించాలో తెలుసా?

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని చెపుతారు. ఐతే కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ, శని వారాల్లో శ్రీమహావిష్ణువును ఉసిరితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. 




ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాల వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరి పూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తీక మాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. 

ఈ కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారని విశ్వాసం. యజ్ఞయాగాదులకన్నా కార్తీకవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. 

తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం, ఈ కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజ అత్యంత శ్రేష్టమని పండితులు చెబుతున్నారు.

ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.


Saturday, October 21, 2017

ఇలాంటి వెరైటీ "వెడ్డింగ్ ఇన్విటేషన్" ఎవరూ చూసి ఉండరు.

వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేసరికి ఈ మధ్యకాలంలో క్రియేటివికి తగ్గట్టుగా రెడీ చేస్తున్నారు. తాజాగా అశోక్- సరయు అనే వధూవరుల వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇలావుంది. నవంబర్ రెండున గురువాయూర్ ఆలయంలో ఉదయం పదకొండున్నర గంటలకు వీళ్ల మ్యారేజ్ జరుగుతున్నట్లు, నాలుగున సరస్వతి ఆలయంలో సాయంత్రం మూడుగంటల నుంచి రిసెప్షన్ ఆపై విందు వుంటుందని ఎంచక్కా లిక్కర్ బాటిల్‌పై ముద్రించిన ఫోటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.






Thursday, October 19, 2017

టివి నటి రాత్రుళ్లు ఆ పని ఎందుకు చేస్తుందో తెలిస్తే ?

మలయాళ బుల్లితెర నటి కవితా లక్ష్మి పగలంతా నటిగా షూటింగ్‌ల్లో పనిచేస్తుంది. రాత్రైతే చాలు హోటల్ నడుపుతుంది. ఇందుకు కారణం ఆర్థిక కష్టాలే. సీరియల్స్ ద్వారా వచ్చే డబ్బు కుటుంబానికి సరిపోకపోవడంతో  అదనంగా సంపాదించేందుకు గాను రాత్రిపూట రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్ పెట్టుకుంది. ఇడ్లీ, దోసెలు వంటివి అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుంటోంది. 




మలయాళంలో సూపర్ హిట్ అయిన "స్త్రీధనం'' సీరియల్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కవితా లక్ష్మీ తాను ఒంటరిగా ఉంటూ ఓ పాప, బాబును చూసుకుంటున్నానని మలయాళ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కుమారుడిని పై చదువుల కోసం బ్రిటన్‌కు పంపానని అక్కడ అతడు పార్ట్‌టైమ్ జాబ్ చేసి ఉద్యోగం చేసి గంటకు పది పౌండ్లు సంపాదించవచ్చునని మధ్యవర్తులు చెప్పిన మాట నమ్మి మోసపోయానని చెప్పుకొచ్చింది. 

అందుకే ప్రస్తుతం కుమారుడి చదువులకు అవసరమయ్యే ఫీజులు పంపాల్సి వుందని తెలిపింది. అందువల్లే నటనతో పాటు హోటల్ నడుపుతున్నానని తెలిపింది. కాగా నెయ్యత్తికరా పరిధిలోని నిమ్స్ ఆస్పత్రి సమీపంలో వుందని వెల్లడించింది.

Wednesday, October 18, 2017

నీరసంగా వున్నారా? ఈ పండ్ల రసాన్ని తాగితే సరి !

నీరసంగా వున్నారా? ద్రాక్షపండ్ల రసాన్ని తాగేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్షపండ్లలో శరీరానికి కావాల్సిన కొన్ని పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదు గల పోషకాలు నీరసాన్ని దూరం చేస్తాయి. ద్రాక్ష రసం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కార్పోహైడ్రేట్‌, సిట్రిక్‌ ఆసిడ్‌, ప్రోటీనులు, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. అనారోగ్య  సమస్యలను దూరం చేసుకోవచ్చు. 



ద్రాక్ష రసంలో కొద్దిగా పంచదార కలిపి పరిగడుపున తాగితే.. అల్సర్‌, పొట్ట రుగ్మతలు దూరమవుతాయి. ముఖ్యంగా నాలుగు పదులు నిండిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే.. రోజూ ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోజూ ఈ పండ్లరసాన్ని తాగితే.. ఎముకలు, దంతాలు బలపడతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా వుంటుందని వారు సూచిస్తున్నారు.

Tuesday, October 17, 2017

ఉరకలెత్తుతున్న శ్రీశైలం జలాలు !



Monday, October 16, 2017

"జామ చేసే మేలు" తెలిస్తే రోజూ తింటారు.

గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.





బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుంది. 

ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చును. 

పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఇందులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది.

 పచ్చి జామకాయ ముక్కలను కప్పెడు తీసుకొని, బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైందవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడడమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.

బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలకు, గర్భిణులకు దీనిని టానిక్‌లా వాడవచ్చు.

 జామపండులో సి-విటమిన్ అధికంగా ఉండడంతో చర్మానికి మేలు చేస్తుంది. వీటితో పాటు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది.

 విటమిన్-ఏ అధికంగా ఉండే జామపండుతో కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Saturday, October 14, 2017

హైదరాబాబాద్‌లో క్వార్టర్ బాటిల్ మందుకొట్టి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు?

హైదరాబాబాద్‌లో ఇకపై క్వార్టర్ బాటిల్ మందుకొట్టి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడినా ఎలాంటి కేసులు నమోదు చేయరు. అయితే, బీఏసీ మోతాదు మాత్రం మించితే మాత్రం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని భావించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. 

సాధారణంగా 100 ఎంఎల్ బ్లడ్‌లో 30 ఎంజీ బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) ఉంటే పట్టుకుంటూ, వారి వాహనాలను స్పాట్‌లో సీజ్ చేయడంతో పాటు, కౌన్సెలింగ్ చేస్తారు. ఇలా పట్టుబడినవారు ఇంటికెళ్లి మరుసటి రోజు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే సమయంలో వివాహితుడైతే భార్యను, పెళ్లికాకుంటే తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా దగ్గరి బంధువును విధిగా తీసుకుని రావాల్సి ఉంటుంది. అపుడే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి వాహనాలను తిరిగి అప్పగిస్తుంటారు. 

అయితే, చాలా మంది మందుబాబులు కౌన్సిలింగ్‌కు హాజరుకాకుండా వాహనాలను వదిలేసుకుంటున్నారు. పైగా, కౌన్సెలింగ్‌ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ కారణంగానే ఆయా స్టేషన్‌లలో వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఇపుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇలా ఉన్న వాహనాల సంఖ్య 3,760కి పైగా ఉంది. దీంతో బీఏసీ కౌంట్‌ను 100కు సవరించి, అంతకన్నా ఎక్కువ మోతాదులో మద్యం తాగి దొరికితేనే వారికి కౌన్సెలింగ్ వర్తింపజేసే ఆలోచనలో ఉంది. 

దీనిపై హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ.. డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కి, కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. దీంతో అలాంటి వాహనాలన్నీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటి సంరక్షణ భారం పోలీసు విభాగానికి తలనొప్పిగా మారింది. ఇందుకోసం కొత్త విధానాన్ని రూపొందించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. 

ఇపుడు 60 ఎంఎల్ మద్యం సేవిస్తే శరీరంలో 30 బీఏసీ నమోదవుతుంది. ఆపై ఓ అర్థగంట ఎక్కడైనా గడిపి వాహనం నడుపుతూ వెళ్లి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికినా, ఆ పాటికి బీఏసీ తగ్గిపోతుంది. ఇక 30 బీఏసీ కౌంట్‌ను 100కు సవరిస్తే, నిరభ్యంతరంగా ఓ క్వార్టర్ మందేసి బండెక్కి డ్రైవ్ చేసుకుంటూ మందుబాబులు వెళ్లిపోవచ్చని పలువురు వైద్య నిపుణులు చెపుతున్నారు. 

Flipkart : 

Big Diwali Sale:- http://fkrt.it/j7EiqTuuuN

Amazon:

Great Indian Festival:- http://amzn.to/2yjYNu3

Friday, October 13, 2017

"బీరు" తాగిన వెంటనే చేయకూడని పనులు !

బీరు అనగానే 18 యేళ్ళ కుర్రాళ్ళ నుంచి 60 యేళ్ళ వృద్ధుల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమే. సామాన్యంగా పార్టీ చేసుకోవాలనుకున్నా.. లేకుంటే ఎక్కడైనా పార్టీకి కూర్చున్నా ఎక్కువగా తాగేది బీరు మాత్రమే. మత్తు పదార్థాల్లో యువత ఎక్కువగా తీసుకునేది ఇదే. బీరు ఎంత తాగితే అంత కిక్కొస్తుందని చెబుతుంటారు. 



బీరు తాగితే బాగా లావవుతారని చెబుతుంటారు. అయితే బీరు తాగిన వెంటనే ఇది మాత్రం చేయకూడదని చెబుతున్నారు వైద్యులు. అమెరికన్ రీసెర్చ్ చేసిన సర్వేలో ఈ మూడు పనులు చేయకూడదు. 

మొదటిది:- బీరు తాగిన వెంటనే పెరుగు అస్సలు తీసుకోకూడదు. చాలామంది తాగింది దిగిపోవాలని మజ్జిగ, పెరుగు తీసుకుంటుంటారు. కానీ అలా అస్సలు తీసుకూకూడదు.

రెండవది:- పాన్, గుట్కా ఇవి అస్సలు వేసుకోకూడదు.

మూడవది:- బీరు తాగిన వెంటనే అన్నం తినకూడదని అనుకుంటుంటారు. కానీ బీరు తీసుకున్న తర్వాత అన్నం తినవచ్చు.

Thursday, October 12, 2017

"101సంవత్సరాల బామ్మ"చేసే పని చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !

వయసు మళ్ళినవాళ్ళు హాయిగా "కృష్ణా, రామా" అంటూ పొద్దు పుచ్చేస్తుంటారు. ఎనభై, తొంభై, వందేళ్ళ వాళ్ళయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇల్లు కదలడానికే ఆపసోపాలు పడిపోతుంటారు. అయితే ఆ బామ్మ మాత్రం అలాంటిది కాదు. ఏజ్ కూడా ఎంతో కాదు.. జస్ట్.. 101 ఏళ్ళు మాత్రమే.. అయినా పాతికేళ్ళదానిలా చాలా చలాకీగా లైఫ్ లాగించేస్తోంది. పేరు మన్ కౌర్. చండీగఢ్‌కు చెందినదైనా పాటియాలాలో ఉంటోంది. స్పోర్ట్స్, అథ్లెట్స్, ఈవెంట్స్ అంటే ఆమెకు ప్రాణం. ఎందులోనైనా ఈజీగా గెలిచేస్తోంది.జావెలిన్ త్రో, షాట్ పుట్, జిమ్.. రన్నింగ్.. ఏదైనా సరే.. యూత్ తో పోటీ పడుతూ నాదే గెలుపని సగర్వంగా చాటుతోంది.




ఈ మధ్య న్యూజి లాండ్ లోని ఆక్లాండ్ లో జరిగిన వాల్డ్ మాస్టర్స్ గేమ్స్ లో వంద మీటర్ల స్ప్రింట్ లో విక్టరీ సాధించి పాపులర్ అయిపోయింది. చైనాలో ఇటీవల ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడానికి ఉబలాటపడినా.. వీసా లభించలేదు. అయినా కౌర్ చలించలేదు. అన్ని ఆటల్లోనూ రాణిస్తున్న ఈమెను 'మిరకిల్ ఫ్రం చండీగఢ్' అని అంతా అభివర్ణిస్తుంటారు. ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం తనకెంతో సంతోషం కలిగిస్తుందని కౌర్ చెబుతోంది. ఆహారం మితంగా తినాలని, రోజూ జిమ్ కెళ్ళి వ్యాయామం చేయాలని అంటోంది. అన్నట్టు ఈమె 79 ఏళ్ళ కొడుకు గురు దేవ్ సింగ్ కూడా మంచి క్రీడాకారుడే.. ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ఉంటాడు.




Tuesday, October 10, 2017

చిరంజీవి అంటే ఎవరో తెలియదన్న ప్రభాస్ ! అలా ఎందుకన్నాడో తెలుసా?

ప్రభాస్‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. సినీ పరిశ్రమలో కంటే ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో చిరు అంటే ప్రభాస్‌కు అమితమైన ఇష్టం. చిరంజీవి కూడా ప్రభాస్ పైన అభిమానం చూపుతుంటారు. అందుకే బాహుబలి షూటింగ్ సమయంలో నేరుగా వెళ్ళి ప్రభాస్‌తో మాట్లాడి వచ్చారు చిరంజీవి. 


చిరు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా గురించి స్నేహితులతో ప్రభాస్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఏ సినిమా ప్రారంభిస్తే ఆ సినిమా ముగిసేంత వరకు నేను ఆయన్ను ఆ క్యారెక్టర్ లోనే ఊహించుకుంటాను. కాబట్టి ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఎవరో తెలియదు. నాకు తెలిసిన వ్యక్తి 'సైరా నరసింహారెడ్డి' అని స్నేహితులతో అన్నారట. చిరుపై ఎంత ప్రేమ ఉంటే ప్రభాస్ ఇలా చెప్పి ఉంటారని స్నేహితులు అనుకుంటున్నారు.



Monday, October 9, 2017

"వెన్న" తింటే "కొవ్వు" పెరుగుతుందా ?

వెన్న తింటే కొవ్వు పెరగదు. గుండెకు మేలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెన్న తింటే కొవ్వు పెరుగుతుందనీ, బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. అయితే ఇందులో నిజం లేదని, వెన్నలోని ఎ విటమిన్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతాయి. 



అంతేకాకుండా వెన్నను ఆహారం ద్వారా తీసుకోవడం వలన త్వరగా కడుపు నిండినట్లు ఉండడంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని వలన అధికబరువు సమస్య తలెత్తదు. వెన్నలో మంచి కొలెస్ట్రాల్ వుండటం ద్వారా చిన్నపిల్లలకు ఇవ్వడం ద్వారా మేలే జరుగుతుంది. 

చిన్నపిల్లలకు రోజూ రెండు స్పూన్ల వెన్న ఇవ్వడం ద్వారా వారి మెదడూ, నాడీ వ్యవస్థ ఎదుగుదల చక్కగా ఉంటుంది.  చిన్నతనం నుంచి పిల్లలకు తగు మోతాదులో వెన్నను తినడం అలవాటు చేయడం మంచిది. పెద్దలు మాత్రం రోజుకో స్పూన్ వెన్నను ఆహారంలో చేర్చుకుంటే హృద్రోగ వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Monday, October 2, 2017

ప్రపంచ సినిమా రంగంలో "సరికొత్త" సంచలనం ?


2009లో అవతార్ సినిమా తర్వాతనే హాలీవుడ్లో 3డి సినిమాల జోరు పెరిగింది. అయితే ఈ 3డి సినిమాలు చూడాలంటే ప్రత్యేకంగా 3డి గ్లాసులు ధరించాల్సి వస్తుంది. అయితే త్వరలో రాబోతున్న ‘అవతార్' సినిమా సీక్వెల్స్ 3డి గ్లాసుల వాడకం నుండి విముక్తి కలిగించనున్నాయి.





అంటే 3డి గ్లాసులు లేకుండానే మనకు 3డి సినిమా చూసిన అనుభూతిని కలిగించే టెక్నాలజీని ‘అవతార్' సీక్వెల్స్ ద్వారా పరిచయం చేయబోతున్నారు. ఈ టెక్నాలజీ ప్రపంచ సినిమా రంగంలో సరికొత్త సంచలనానికి నాంది అంటున్నారు.





Saturday, September 30, 2017

విజయదశమి శుభాకాంక్షలు

బ్లాగర్ వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు 


Monday, September 25, 2017

ఈ చిన్న చిట్కా పాటిస్తే యువకుల్లా మారిపోవచ్చు !

చాలామంది వయస్సయిపోతోందని బాధపడుతుంటారు. ఆరోగ్యం సహకరించక, ముఖమంతా ముడతలు పడిపోయి రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడే మనకు 60 దాటిపోయిందా అని బాధపడిపోతుంటారు. కానీ 60 వయస్సు వారు కూడా 20 వయస్సు వారిగా మారిపోవడం చాలా ఈజీ. చిన్న ఆరోగ్య చిట్కాతో ఇలా మారిపోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

చాలామంది ఉదయం లేవగానే టీ, కాఫీలను తాగుతుంటారు. అవి తాగడం వల్ల ఐదు నిమిషాల ఆనందం మాత్రమే ఉంటుంది. వాటితో ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉండవు. మరికొందరైతే ఆరోగ్యం కోసం రకరకాల జ్యూస్‌లను తాగుతుంటారు. అవన్నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాయని నమ్ముతుంటారు. వీటికన్నింటికి కన్నా పసుపు కలిపిన నీళ్ళను తాగితే ఎంతో మంచిందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపు వాత, పిత్త, కఫ రోగాలను నయం చేసే గుణం కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పసుపులో అధికంగా ఉంటాయి. 

ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో హాఫ్ టీస్పూన్ పసుపు వేసి అందులో హాఫ్ లెమన్ జ్యూస్‌ని ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగాలి. ఇలా 12నెలల పాటు ఖాళీ కడుపుతో ఉదయం తాగాలి. ఒళ్ళునొప్పులు బాగా తగ్గిపోతాయి. వాపులను, కీళ్ళనొప్పులను బాగా తగ్గిస్తుంది. లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. బ్లడ్ క్లాస్ట్ ను నివారించడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు. అంతేకాదు టైప్ డయాబెటిస్‌ను కూడా నివారించుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణశక్తి మెరుగుపడి, మతిమరుపు సమస్యను నివారిస్తుంది. దీంతో పాటు యువకుల్లాగా కనిపించడం ఖాయమంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Friday, September 22, 2017

"కళ్ళ కింద నల్లటి వలయాలు" పోవాలంటే ఏం తాగాలో తెలుసా ?

కాఫీ తాగితే కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కళ్ళ కింద నల్లటి వలయాలకు డీ హైడ్రేషన్, అలర్జీ, జన్యుపర అంశాలు, సరిపోయేంత స్థాయిలో నిద్ర లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. 

రోజు కప్పు కాఫీ తాగటం వలన కళ్ళ కింద ఏర్పడిన వలయాలను తొలగించుకోవచ్చు, కానీ జన్యుపరంగా సంక్రమించిన కంటి కింద వలయాలను తొలగించలేం. కళ్ళ కింద ఉండే రక్తం తొలగిపోవటం వలన జన్యుపరంగా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాంటప్పుడు కెఫిన్ వుండే కాఫీ తాగడం వలన చర్మ సంబంధిత రోగాలు దూరమవుతాయి.  




ఒక కప్పు కాఫీలో చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలను కాఫీ తొలగిస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటాన్ని నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.



Wednesday, September 20, 2017

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ "ఫేవరేట్ డాన్సర్" ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరోల్లో డాన్సులు వేస్తూ చేతులు కాళ్ళు విరగ్గొట్టుకునే హీరోగా అల్లు అర్జున్‌కు పేరుంది. అంటే.. కష్టమైన డాన్స్ మూమెంట్స్ కోసం అంతలా శ్రమిస్తాడు. అందుకే ప్రతి ఒక్క యువ హీరో డాన్స్ చేసేందుకు అల్లు అర్జున్‌తో పోటీ పడుతుంటారు. ఇలాంటి వారిలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. 




ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా పలు ప్రశ్నలకు ఎన్టీఆర్ తనదైనశైలిలో సమాధానాలు ఇచ్చాడు. అల్లు అర్జునే తన ఫేవరేట్ డాన్సర్ అని చెప్పారు. 

టాలీవుడ్‌లో ఎవరి డాన్సులు నచ్చుతాయని ప్రశ్నిస్తే, బన్నీ డాన్సులే తనకు నచ్చుతాయని తేల్చి చెప్పాడు. నందమూరి హీరో ఇలా తనకు మెగా హీరో డాన్సులు నచ్చుతాయని చెప్పడం పట్ల అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.