CSS Drop Down Menu

Wednesday, November 29, 2017

పిల్లలు నిద్రలో పాస్ పోస్తున్నారా ?

పిల్లలు పక్క తడుపుతుంటే రాత్రి పూట ఖర్జూరాను చిన్న ముక్కలుగా చేసి పాలలో వేసి వేడి చేసి చల్లార్చి పిల్లలకు తాగించాలి. అలా చేస్తే ఖర్జూరాలోని ఆప్టాలిక్ యాసిడ్ జీర్ణక్రియను త్వరితం చేసి శరీరంలో ద్రవరూపంలోని మలినాలన్నీ త్వరగా మూత్రం ద్వారా పంపబడుతుంది. అంతకుముందే పూర్తిస్థాయిలో ద్రవరూపంలో మలినాలను పంపేశారు కాబట్టి రాత్రి నిద్రలో పోసుకోవడానికి ఇంకేమీ మిగిలి ఉండదు. పిల్లల్లో భయం, అభద్రతా భావం, ప్రేమ రాహిత్యం నరాల బలహీనత కారణంగా ఇది తలెత్తే అవకాశం వుందని చెబుతుంటారు. 



రాత్రి వేళల్లో వాష్ రూంకు పిల్లలు లేపితే విసుక్కోకుండా తీసుకెళ్ళాలి. ఒకసారి విసుక్కుంటే లేపినా విసుక్కుంటారని పక్కలోనే కానించేస్తారు. ఇంట్లో ఎక్కువగా గొడవలు లేకుండా చూసుకోవాలి. తరచూ గొడవలు అవుతుంటే పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు. పడుకునే ముందు ఖచ్చితంగా టాయ్‌లెట్‌కు వెళ్ళడం అలవాటు చేయాలి. మౌలికంగా పక్క తడపడం అనేది వ్యాధి కాదు. కాబట్టి దానికి మందులు వాడే అవకాశం తక్కువ.

Monday, November 20, 2017

"సముద్రంలో తేలే నగరాన్ని" నిర్మిస్తూ సంచలనం సృష్టిస్తున్న దేశం !

ఫ్రాన్స్ సర్కారు అద్భుత సృష్టితో తమ సత్తా ఏంటో నిరూపించురోనుంది. సరికొత్త రూ. 1135కోట్లతో సముద్రంలో తేలే నగరాన్ని నిర్మించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ సర్కార్ తెలిపింది.



ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.


2018 నుంచి పూర్తి స్థాయిలో ఈ నగరం ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయి. 2050 నాటికి సముద్రంపై తేలియాడే ఇలాంటి పలు నగరాలు వేల సంఖ్యలో నిర్మితమవుతాయని ఫ్రాన్స్ ప్రభుత్వాధికారి మిస్టర్ క్విర్క్ అన్నారు. 


Wednesday, November 15, 2017

"మీ పేరు" తోనే "రింగ్ టోన్" పెట్టుకోవాలని ఉందా ?

మీరు మీ ఫోన్లో రకరకాల రింగ్ టోన్స్ పెట్టుకొని ఉంటారు. కాని  "మీ పేరు" తోనే "రింగ్ టోన్"  పెట్టుకొని మీ పక్కవారిని ఆశ్చర్య పరచాలని  ఉందా ? ఐతే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి మీ రింగ్ టోన్ సెట్ చేసుకొని ఆనందించండి. 

      


Tuesday, November 14, 2017

"తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్" తో వచ్చిన "మోటో x4"


అందరూ అనుకున్నట్లుగానే మోటో ఎక్స్ 4 ఇండియాకి వచ్చేసింది.



ఇందులో యూజర్లను ఆకట్టుకునే స్టన్నింగ్ ఫీచర్లతో తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందించారు.
మోటో అలెక్స్ యాప్ కూడా ఇందులో ఉంది.ఫోన్ టచ్ చేయకుండానే అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నీళ్లలో పడినా ఏ మాత్రం కంగారు పడక్కర్లేదు. రక్షణ కవచం ఉంది. అత్యాధునిక ‘డ్యుయల్‌ రేర్‌ కెమెరా సిస్టం’తో అదిరే ఫొటోలు తీయొచ్చు. 12 మెగాపిక్సల్‌ కెమెరాతో ‘డ్యుయల్‌ ఆటోఫోకస్‌ పిక్సల్‌ టెక్నాలజీ’ని వాడుకుని తక్కువ వెలుతురులోనూ క్వాలిటీ తగ్గని ఫొటోలు క్లిక్‌ మనిపించొచ్చు.అల్యూమినియం బాడీతో ఈ ఫోన్‌ పూర్తిగా గ్లాస్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. ఈ లుక్ రావడంతో ఫోన్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా ఉంది.

ఫోన్  స్పెసిఫికేషన్లు:-
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
3,4 జీబీ ర్యామ్ /32,64 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12,8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ (ముందు, వెనుక)
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్. 

Moto x4 
3 జీబీ ర్యామ్ /32 జీబీ స్టోరేజ్ - http://fkrt.it/xQpTG!NNNN
4 జీబీ ర్యామ్ /64 జీబీ స్టోరేజ్ - http://fkrt.it/kVYn~TuuuN




Monday, November 13, 2017

ఇలాంటి "వెరైటీ లవ్ ప్రపోజల్" ఎవరూ చేసి ఉండరు.

చైనా యువకుడు తన ప్రేయసికి వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశాడు. అతడు లవ్ ప్రపోజ్ చేసిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ చైనా యువకుడు ఎలా లవ్ ప్రపోజ్ చేశాడంటే దాదాపు 31,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 25.5 లక్షలు) విలువ చేసే పాతిక ''ఐఫోన్ ఎక్స్'' మొబైల్స్‌కొని, వాటిని హార్ట్ ఆకారం పేర్చి మధ్యలో పెళ్లి రింగ్‌ను ఉంచాడు. ఆపై ప్రేయసి ముందు మోకారిల్లి పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది విన్న ప్రేయసి షాక్ అవడమే కాకుండా ప్రేమికుడికి వెంటనే ఓకే చేసేసింది. 



తన ప్రేయసికి స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టమని అందుకే.. తాజాగా విడుదలైన ''ఐఫోన్ ఎక్స్" ఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చానని తెలిపాడు. అంతేగాకుండా 25 మొబైల్సే ఎందుకిచ్చానంటే.. తన ప్రియురాలి వయస్సు పాతికేళ్లని చెప్పాడు. ఇక ప్రేయసి తన పెళ్లి ప్రపోజల్‌కు పచ్చాజెండా ఊపడంతో ఆ ప్రేమికుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో ఆ యువకుడు తన ప్రియురాలిని మెప్పించడంలో సహకరించిన మిత్రులందరికీ తలో ''ఐఫోన్ ఎక్స్" బహుమతిగా ఇచ్చేశాడు.

Wednesday, November 8, 2017

"తేనెలో ఊరపెట్టిన ఉసిరికాయ"ను తింటే వచ్చే ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాస కాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే  శరీరానికి ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, దాంతో ఎన్నో అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. 



ఈ తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మంపై ఏర్పడిన ముడతలు తగ్గిపోతాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా కూడా మారుతుంది. 

ఈ చలి కాలంలో ఆస్తమా అనేది చాలా మందిని ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేరు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే దాంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే తేనె, ఉసిరి మిశ్రమంలో ఉండే సహజ సిద్ధమైన పోషకాలు ఆస్తమాను దూరం చేస్తాయి. శ్వాసకోశ సమస్యలు రాకుండా చూస్తాయి.

తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. దీంతో ఈ మిశ్రమం వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి. చలికాలం మన జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. తిన్నది ఓ పట్టాన జీర్ణం కాదు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే ఆ సమస్య ఉండదు. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అంతేకాదు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. 

ఆకలి మందగించిన వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మంచిది. దీంతో ఆకలి పెరుగుతుంది. అంతేకాదు, మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా సేవిస్తుంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీని వల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఇది స్థూలకాయం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది.

Monday, November 6, 2017

తిరుమలకు వెళ్ళిన వాళ్ళు ఈ "ఆకు" తింటే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారట ?

హథీరాం బాబాజీ తిరుమలలో 500 సంవత్సరాల క్రితం నివసించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి హథీరాం బాబాజీతో పాచికలాడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. బాబాజీ మొదట్లో శ్రీవారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకునేవారు. అయితే రోజూ ఊరికే ప్రసాదాలు ఇవ్వడం ఇష్టంలేని ఆలయ అధికారులు హథీరాంజీని కట్టెలు కొడితేనే ప్రసాదాలని షరతులు విధించారు.

హథీరాంజీ ఏనుగులాగా బలంగా ఉండేవారని పురాణాల్లో ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల కోసం కట్టెలు తెచ్చి వాటిని గొడ్డళ్ళతో హథీరాంజీ ముక్కలు చేసేవారట. కొన్ని రోజుల తర్వాత బాబాజీకి బాధ అనిపించిందట. తన సమయంతా దీనికి కేటాయిస్తున్నానేంటి అనుకునేవారట హథీరాంజీ. తిండి సంగతి దేవుడెరుగు ముందు తపస్సు చేసుకుందామని నిర్ణయానికి వచ్చి శ్రీవారి ఆలయానికి దూరంగా పాపవినాశనం అడవుల్లోకి వచ్చేశారు.

అతి సమీపంలోని అటవీ ప్రాంతంలో హథీరాంజీ బాబాజీ తపస్సుకు కూర్చొన్నారు. ఆ సమయంలో ఆయనకు ఆకలి వేసింది. ఆకలిని తట్టుకోలేక ఎదురుగా ఉన్న చిన్న చెట్టు ఆకులను తీసుకుని ఆరగించాడు. ఆ ఆకులు తియ్యగా ఉండటంతో ఆవురావురమంటూ ఆ ఆకులన్నింటినీ ఆరగించాడు. పక్కనే ఉన్న తీర్థంలో నీళ్ళు తాగాడు. ఆకలి తగ్గాక బాబాజీకి భయమేసింది. ఆకుల వల్ల ఏమన్నా అవుతుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే ఏమీ కాలేదు. 

ఆకులు తిన్న తర్వాత అన్నం మాట మర్చిపోయి ఆకులు మాత్రమే తినడం ప్రారంభించాడు. అలా తన తపస్సును పూర్తి చేశాడు. అలా 12యేళ్ళపాటు తపస్సు చేసి ఆ బద్ధాకును తింటూ వచ్చాడు. కొంతమంది ఈ ఆకులను రామభద్రం ఆకులు లేక రామపత్తి అని పిలుస్తుంటారు. గతంలో అన్ని చెట్లు ఉండగా బాబాజీ ఈ ఆకునే తినడం ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదంతా శ్రీవారి మహిమేనని పురాణాలు చెబుతున్నాయి. 

ఈ బద్ధి చెట్టు శేషాచలం అడవుల్లో మాత్రమే విరివిగా పెరుగుతాయి. ఇంక ఎక్కడా కనిపించదు. పాపవినాశనం దగ్గరలో వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర హథీరాంజీ బాబాజీ సమాధి ఉంది. ఇక్కడే ఆయన తపస్సు చేశారు. అక్కడికి వెళ్ళిన భక్తులకు బద్ధాకును ఇస్తుంటారు. ఈ ఆకు తియ్యగా, పుల్లగా ఉంటుంది. దీన్ని ఎంతైనా తినొచ్చు. ఇది తింటే సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఖాయమట. 

Friday, November 3, 2017

Redmi ఫోన్ లో వచ్చే "Female For English" అనే నోటిఫికేషన్ ఎలా తొలగించాలో తెలుసా?


Redmi ఫోన్ లో వచ్చే "Female For English" అనే నోటిఫికేషన్ మీరు  క్లోజ్ చేసినా అది మళ్ళీ మళ్ళీ వచ్చి చిరాకు తెప్పిస్తుంది. అది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి ఆ  నోటిఫికేషన్ రాకుండా చేసుకోండి.