CSS Drop Down Menu

Monday, January 29, 2018

ట్రంప్ 200 సంవత్సరాలపాటు జీవిస్తాడా ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి డైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ నివేదిక ఇచ్చారు. ట్రంప్ శరీరంలో అద్భుతమైన జన్యువులు వున్నాయని ఆయన తెలిపారు. ట్రంప్ మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నారని.. జాక్సన్ వెల్లడించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక మొదటిసారిగా జాక్సన్ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు 200 సంవత్సరాల పాటు జీవించే అనుకూలతలు ఉన్నాయని షాకింగ్ నిజాన్ని చెప్పారు.



ట్రంప్ ఆహార మెనూనూ మెరుగ్గా మార్చి ఉంటే 200 ఏళ్లపాటు నిక్షేపంలా జీవించేందుకు అవకాశం ఉండేదన్నారు. మానసిక పరీక్షలో భాగంగా కాగ్నిటివ్‌ను పరీక్షిస్తే.. 30కి 30 మార్కులొచ్చాయి. కానీ కొంత మేర మేధస్సు అతనిలో క్షీణించింది. దీన్నే అల్జీమర్స్‌గానూ పేర్కొంటారని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ ఎంతో చురుకైన వారని.. ఆయన ఆలోచన శక్తి విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.

Saturday, January 27, 2018

"కుటుంబానికి చెడ్డ పేరు వచ్ఛేలా ఎందుకు మాట్లాడారంటున్న" మంచులక్ష్మి!

నాన్నా.. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో ఎందుకు అలా మాట్లాడారు. మీరు అలా మాట్లాడినందుకు మన మంచు కుటుంబానికి చెడ్డ పేరు వచ్చినట్లు నాకు అనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మీ డాడి ఎందుకు అలా మాట్లాడారంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు నాన్నా. ఆ టివి యాంకర్‌కు అడగడం తెలియదనుకోండి. అంతేగాని మీరెందుకు అంత ఆవేశపడ్డారంటూ మంచు లక్ష్మి తండ్రి మంచు మోహన్ బాబును ప్రశ్నించిందట. 

గత మూడురోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు 95 శాతం మంది రాజకీయనాయకులందరూ రాస్కెల్స్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. నాకు తెలిసి ఒక్క ఎన్‌టిఆర్ మాత్రమే నిజమైన రాజకీయ నాయకుడు. లంచం అంటే ఏంటో ఆయనకు అస్సలు తెలియదంటూ మోహన్ బాబు చెప్పారు. ఎన్‌టిఆర్ విషయం పక్కన బెడితే మిగిలిన రాజకీయ నాయకులను ఉద్దేశించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

ఎవరు ప్రశ్నించినా ఒప్పుకోని మోహన్ బాబు తన కుమార్తె మంచులక్ష్మి ప్రశ్నిస్తే మాత్రం మెల్లగా సమాధానం చెప్పారట. ఎందుకంటే మంచులక్ష్మి అంటే మోహన్ బాబుకు అంత ఇష్టమట. నా గురించి నీకు తెలుసు కదమ్మా.. ఆ యాంకర్ అడిగిన ప్రశ్న నన్ను బాధించింది. అందుకే అలా సమాధానం చెప్పాను.. అని మోహన్ బాబు అన్నారట.


Monday, January 22, 2018

భారతదేశ రాష్ట్రాలు! వాటి రాజధానులు!!




Flipkart Republic Day Sale
https://goo.gl/492Tof 

Amazon Great Indian Sale
http://amzn.to/2Dwi6pQ

Tuesday, January 16, 2018

మస్కిటో కాయిల్స్‌ను వెలిగిస్తున్నారా? ఐతే తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే !

ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటారు. కానీ ఇక్కడ దోమల చక్రం  వెలిగిస్తే ఆరోగ్యానికి మరింత హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. సిగరెట్లు కాల్చడం కన్నా ఒక మస్కిటో కాయిల్‌ను వెలిగిస్తే ఊపిరితిత్తులలోకి అది చొరబడి శ్వాసకోశ సంబంధింత వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయం కొంతమంది వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. 




శ్వాసకోస వ్యాధి ఒక్కటే కాదు నాడీ వ్యవస్థ దెబ్బతిని చివరకు కంటిచూపును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌ను వెలిగించడం కన్నా ఫ్యాన్ వేసుకుని దుప్పటి కట్టుకుని నిద్రించడం ఎంతో ఉత్తమమని వైద్య నిపుణులు చెపుతున్నారు. పిల్లలపై ఈ దోమల కాయిల్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

Monday, January 15, 2018

సంక్రాంతి శుభాకాంక్షలు


Saturday, January 13, 2018

మీ కళ్ళను కంప్యూటర్ కాంతి నుంచి రక్షించుకోవడానికి సులువైన మార్గం !


కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు పనిచేసేవారికి కళ్ళకు హాని కలగకుండా ఉండాలంటే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసినట్లైతే కళ్ళకు ఎటువంటి హాని కలగవు . 


Wednesday, January 10, 2018

థాయ్‌లాండ్ లో మొదలైన కొత్త ట్రెండ్ ! అక్కడ మగవాళ్ళంతా ఏం చేస్తున్నారో తెలిస్తే....

థాయ్‌లాండ్ మగాళ్లలో కొందరు ఇటీవలి కాలంలో ఓ సర్జరీ కోసం ఎగబడుతున్నట్లు తేలింది. తమ భాగస్వాములను తృప్తి పరిచేందుకు తమ శరీరం ఎంత తెల్లగా వుంటుందో దానికి సమానంగా తమ పురుషాంగం కూడా తెల్లగా మెరిసిపోవాలంటూ అంగానికి వైటనింగ్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు 100 దాకా నమోదైనట్లు తేలింది.

విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది. వెంటనే ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నవారికి హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగానికి వైటనింగ్ శస్త్రచికిత్సలు చేయించుకోవద్దనీ, ఈ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అంగం ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం కూడా వున్నట్లు తెలిపింది. 

ఐతే థాయ్ లాండ్‌లో పురుషాంగాన్ని వైటనింగ్ చేయడం ద్వారా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటనలు వెలుస్తున్నాయి. దీనిపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కానీ ఆపరేషన్లు చేయించుకునే మగవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే వున్నట్లు చెపుతున్నారు.

Monday, January 8, 2018

బాబు, జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం ?

వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడుల మధ్య గత కొన్నిరోజులుగా మాటల యుద్ధం తగ్గిపోయింది. ఒకవేళ ఆరోపణలు చేసుకున్నా అర్థవంతమైన ఆరోపణలు తప్ప, అనవసరమైన విమర్శలు అస్సలు చేసుకోవడం లేదు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుక సమయంలో చంద్రబాబు నాయుడు పెట్టిన ట్వీట్‌తో జగన్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.




ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఇరు పార్టీల నాయకులు మాత్రం యధావిధిగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే విమర్శలు మాత్రం పెద్దగా ఘాటైన రీతిలో సాగటంలేదు. గతంలో అయితే ఇద్దరు నేతలు పరస్పరం చేసుకునే విమర్శలు తారాస్థాయిలో ఉండేవి. 

ప్రజల్లో చులకన అయిపోతున్నామన్న భావనతోనే ఇద్దరు నాయకులు విమర్శల్లో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఎన్నికల ముందు జరిగే ఎన్నికల ప్రచారం వరకు మాత్రమేనని, ప్రచారంలో మాత్రం ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విమర్శలు మానడంపై రాజకీయ విశ్లేషకులు ఇది నిజంగానే బాబు, జగన్‌ల మధ్య ఏదయినా రహస్య ఒప్పందమేమోనంటూ సెటైర్లు వేస్తున్నారు.

Saturday, January 6, 2018

మీ పేరులో మీకు నచ్చిన ఇమేజ్ పెట్టుకోండి!

మీ పేరులో మీకు నచ్చిన ఇమేజ్ గాని, మీ ఫోటోని గాని పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ని సర్ ప్రైజ్ చేయండి.అది చేయాలంటే నేను ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి చూడండి. 


Friday, January 5, 2018

"విలన్‌"గా జబర్దస్త్‌ చమ్మక్ చంద్ర !

జబర్దస్త్‌తో చమ్మక్ చంద్రకు మంచి పేరే వచ్చింది. బుల్లితెరపైనే కాదు వెండితెర పైనా చమ్మక్ చంద్ర కొన్ని సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ పెద్ద అవకాశాలేవీ చమ్మక్ చంద్రకు రాలేదు. తాజాగా తమిళంలో చమ్మక్ చంద్రకు విలన్‌గా అవకాశం వచ్చింది. "సేయల్" అనే సినిమాలో చమ్మక్ చంద్ర విలన్‌గా నటిస్తున్నారు.

భారీ యాక్షన్ కథతో తెరకెక్కుతోంది సేయల్ సినిమా. దర్శకుడు రవి. గతంలో రవి భారీ విజయాలు సాధించిన సినిమాలనే తీశాడు. చమ్మక్ చంద్రకు రవి స్నేహితుడు. దీంతో చమ్మక్ చంద్రను ఈ సినిమాలో విలన్‌గా పెట్టాడు. నాకు విలన్‌గా చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఆ కోరిక కాస్తా తమిళ సినిమాతో తీరిపోతోంది. విలన్‌గానే చేయమంటే చేయడానికి నేను సిద్థంగా ఉన్నానని చెబుతున్నాడు చమ్మక్ చంద్ర.

Thursday, January 4, 2018

అబ్బాయిలు ఎంత బాధ వచ్చినా ఎందుకు "ఏడవరో" తెలుసా?

సాధారణంగా ఏదైనా బాధ, కష్టం వస్తే కన్నీరు పెట్టుకుంటారు. కొన్నిసార్లు వెక్కివెక్కి ఏడుస్తుంటారు. అందులోను మహిళలయితే ఇక చెప్పాల్సిన పని వుండదు. ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వారి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతుంటాయి. కానీ అబ్బాయిలు మాత్రం ఎంత కష్టం వచ్చినా ఏడవరు. వారికి కష్టం వచ్చినా కంటి నుంచి కన్నీటి చుక్క ఎందుకు రాదో చాలామందికి తెలియదు.

అమ్మాయిలు, అబ్బాయిల్లోని భావ నియంత్రణపై పరిశోధనలు జరిపితే కొన్ని సరికొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఈ పరిశోధనల్లో అమ్మాయిలు, అబ్బాయిల్లో మెదడు ఆకారం వేర్వేరుగా ఉంటుందని పరిశోధనలో తేలింది. అబ్బాయిల మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం 19 శాతం ఎక్కువగా ఉంటుందట. అందుకే అబ్బాయిల్లో ఏడుపును నియంత్రించే సామర్థ్యం ఉంటుందట. 

అందుకే మగవారు ఎమోషనల్‌గా పెద్దగా కనెక్ట్ అవ్వరని చెబుతున్నారు. అందుకే అబ్బాయిలు ఎంత బాధ వచ్చినా ఏడవరని పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన 110 మందిపై చేసి ఒక నిర్థారణకు వచ్చారు. అదీ విషయం.

Wednesday, January 3, 2018

"చలికాలం"లో తీసుకోవాల్సిన ఆహారాలు?

చలికాలంలో జొన్నలు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన క్యాల్షియం లభిస్తుంది. దీనివల్ల కండరాలు బిగుసుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్నతో చేసిన రొట్టె, జొన్నలతో చేసిన సంకటి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకున్నట్లేనని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అలాగే చలికాలంలో ఏర్పడే జలుబు, దగ్గును దూరం చేసుకోవాలంటే.. దానిమ్మను చలికాలంలో తినాలి. దానిమ్మ ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా దానిమ్మ రక్షణనిస్తుంది. చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణలో కూడా దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. చలికాలంలో వెచ్చదనం కోసం నువ్వులు తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సక్రమంగా వుంటుంది. ఇంకా నువ్వుల్లో వుండే ఐరన్, క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి.

చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు కంద గడ్డలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూర్చినవారవుతారు. కందగడ్డల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా చలికాలంలో వారానికి రెండుసార్లు పాలకూర తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చలికాలపు వ్యాధులను నివారించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండి.. రక్తం పెరగడానికి దోహద పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్
http://fkrt.it/kY0tHTuuuN

Monday, January 1, 2018

వచ్చే ఎన్నికల్లో "టిడిపి"ని గెలిపిస్తానంటున్న రఘువీరారెడ్డి !

కాంగ్రెస్ నేత అందులోను ఎపి కాంగ్రెస్‌కు అధ్యక్షులు ఇలా మాట్లాడమేంటి అనుకుంటున్నారా? అయితే ఇందులో ఒక పెద్ద చిక్కే ఉంది. తన సొంత నియోజకవర్గమైన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు రఘువీరారెడ్డి. అదే చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తానంటున్నారు. రఘువీరారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

కళ్యాణదుర్గంలో గత  కొన్నినెలలుగా నీటి సమస్య అధికంగా ఉంది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జనవరి 2వ తేదీ నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో తమ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నీటి సమస్యను పరిష్కరిస్తామని స్థానిక టిడిపి నేతలు హామీ ఇస్తున్నారు. అయితే అదంతా నేను నమ్మను. నాకు మాటలు కాదు చేతలు కావాలి. 

కళ్యాణదుర్గంలో నీటి సమస్యను తీరిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయను. నామినేషన్ కూడా వేయను. టిడిపి అభ్యర్థి గెలుపుకు దగ్గరుండి సపోర్ట్ చేస్తానంటూ ఇందిరమ్మ రాజ్యం - ఇంటింటా సౌభాగ్యం కార్యక్రమంలో రఘువీరారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే చెరువులను, అభివృద్థిని ఎలాగో ప్రభుత్వం చేయదు కాబట్టి రఘువీరారెడ్డి అంత ధైర్యంగా మాట్లాడారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.