CSS Drop Down Menu

Wednesday, February 28, 2018

ఈ లక్షణాలు ఉంటే "కిడ్నీ" విషయంలో జాగ్రత్త పడాల్సిందే !

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయనే విషయం అందరికి తెలిసిందే. అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు మరియు ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్‌లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలా?

1. చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉన్నది. అందువల్ల మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి.

2. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి. దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది.

3. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం మరియు ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం మరియు వాంతులు వస్తాయి. ఇది రక్తంలో వ్యర్థాల ఫలితంగా జరుగుతుంది. ఈ వికారం ఆకలిని తగ్గిస్తుంది.

4. కిడ్నీలు ఎరిత్రోపయోటిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి. అవి శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఆ ప్రభావం పడుతుంది. అలసట మరియు మెదడుకు సంబందించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భంలో రక్తహీనత వస్తుంది. కిడ్నీలు ఉండే వీపు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలు చెడిపోయినప్పుడు కనపడే సాధారణ సంకేతం.






5. ఈ నొప్పితో పాటు కీడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లకు కూడా కారణమవుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనడానికి సంకేతమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Monday, February 26, 2018

జంతువుల గర్భావధి కాలం



Monday, February 12, 2018

"శృంగార సామర్ధ్యం" పెంచే సులువైన చిట్కా!

శృంగార సామర్ధ్యం పెంచే వాటిలో మునగకాయ ముఖ్యమైనదన్న విషయం తెలిసిందే. ఆడ, మగ ఇద్దరూ ప్రతిరోజు లేదా రెండు రోజులకొకసారైనా మునగకాయను, మునగాకుని కూరలాగా చేసుకుని తినడం వల్ల శృంగార విషయంలో మంచి ఫలితం ఉంటుంది. మునగ తరువాత శృంగార సామర్ధ్యాన్ని పెంచేది ఖర్జూరం. ఎండు ఖర్జూరం లేదా సాధారణ ఖర్జూరం ఏదైనా మనిషిలో అద్భుతాలను సృష్టిస్తాయి. మనిషి శరీరానికి సత్వరమైన శక్తిని ప్రసాదిస్తుందని డాక్టర్లు ఖర్జూరాన్ని తినమని సిఫారస్ చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు, నీరసంతో ఉన్నప్పుడు, రక్తం పెరుగుదలకు, రక్తప్రసరణ బాగా ఉండేందుకు ఖర్జూరం బాగా పని చేస్తుంది. 




ఎండు ఖర్జూరం లేదా సాధారణ ఖర్జూరం పండును తేనెలో రెండు గంటల పాటు నానబెట్టి ఆ తరువాత తింటే అద్బుతమైన శృంగార సామర్ధ్యం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తేనెలో నానాబెట్టి  తీసుకోవడం వల్ల వారం నుండి పది రోజుల్లో శీఘ్రస్కలనం సమస్యకు గుడ్ బై చెప్పి భాగస్వామికి సంతోషం కలిగించేలా శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని నిపుణులు ప్రయోగం చేసి నిరూపితం చేసినది. శృంగార సామర్ధ్యం పెంచుకోవడానికి లేనిపోని మందులు వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకునేకంటే ఖర్జూరం తినడం వల్ల సామర్ధ్యం పెరగడంతో పాటు ఆరోగ్యానికి అన్నివిధాల మంచిది.


  

Saturday, February 10, 2018

సిల్క్ స్మితతో చేయకపోవడానికి కారణం ఇదే? అంటున్న డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ !

అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మిత అందానికి ఫిదా కాని వారంటూ వుండరు. అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్‌గా తన హవాను కొనసాగించిన సిల్క్ స్మితతో ఏర్పడిన విభేదాల గురించి డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ నోరు విప్పారు. సిల్క్ స్మిత అందమైన ఆర్టిస్టని తనకు నచ్చిన తారల్లో ఆమె కూడా వున్నారన్నారు. 




అయితే సిల్క్ స్మిత మంచి పేరు తెచ్చుకున్నాక సొంతంగా డ్యాన్స్ మాస్టర్లను తయారు చేసుకుందని చెప్పారు. ముఖ్యంగా పులిగిరి సరోజను ఆమె రిఫర్ చేస్తుండేదని ఒక వేళ డేట్స్ సర్దుబాటు కాక తనలాంటి వారిని పెడితే, స్మిత సరిగ్గా చేసేది కాదని చెప్పుకొచ్చారు. 

బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు సినిమాలో స్మితతో పాట అనుకున్నాం. కానీ రిహార్సల్స్ ముగిశాక తనతో చేయనని అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసిందని అప్పటికే ఆ పాటకు మంచి స్టెప్స్ అనుకున్నాం. కానీ ఆమె వెనక్కి తగ్గడంతో స్మితకు తాను దూరమయ్యానని శివశంకర్ అన్నారు. స్మిత స్థానంలో జయమాలిని బాలయ్య సినిమాకు తీసుకున్నామని తెలిపారు. 



Friday, February 9, 2018

"తక్కువ వయస్సు" ఉన్నవారిలా కనిపించాలని ఉందా? ఐతే ఇవి తినండి.

1. పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. మొలకల్లో ఎంజైములూ, యాంటీ ఆక్సిడెంట్లూ మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. అందుకే ఇటీవల వీటిని చాలమంది మొలకెత్తించి తింటున్నారు. అయితే వీటిని మొలకల రూపంలోనో లేదా ఉడికించి... ఎలా తిన్నా కాలేయం, జుట్టు, గోళ్లు, కళ్ల ఆరోగ్యాన్ని పెంపొదిస్తాయని ఆయుర్వేదం పేర్కొంటుంది.



2. క్యాలరీలు తక్కువ పీచు ఎక్కువగా ఉండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా ఊబకాయం తగ్గుతుంది. 

3. పెసల్ని క్రమంతప్పకుండా తినేవాళ్లు తమ నిజ వయసుకన్నా పదేళ్లు తక్కువుగా కనిపిస్తారు. ఎందుకంటే వీటిలో అధిక కాపర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

4. అజీర్తి, జీవక్రియా లోపంతో బాధపడేవాళ్లకు పెసలు మందులా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. వీటిల్లోని క్యాల్షియం ఎముక నిర్మాణానికి దోహదపడుతుంది. సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యల్నీ నివారిస్తుంది. బీపీ రోగులకు ఇవి మంచిదే. 

5. పెసల్లోని ఐరన్ వల్ల అన్ని అవయవాలకీ ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి... తదితర లోపాలతో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. వీటిల్లోని విటమిన్లు, హర్మోన్లను ప్రేరేపించడంతో పిల్లల్లో పెరుగుదలకి తోడ్పడతాయి.

Thursday, February 8, 2018

"ఉరి"పై తీర్పు ఇచ్చాక పెన్నుపాళీని ఎందుకు విరిచేస్తారు?

భారతీయ శిక్షాస్మృతిలో ఉరి అనేది అత్యంత పెద్ద శిక్ష. ఇటువంటి శిక్ష విధించిన తర్వాత జడ్జి తన పెన్ను పాళీ(నిబ్)ని విరిచేస్తారు. ఈ దృశ్యం చాలా సినిమాల్లో కనిపిస్తుంటుంది. ఇలాచేయడం వెనుక రాజ్యాంగంతో ముడిపడిన ఒక కారణం ఉందట. 

ఒకసారి నిర్ణయం లిఖించిన తర్వాత జడ్జికి సైతం ఈ నిర్ణయాన్ని మార్చేందుకు అధికారం ఉండదు. దీనికితోడు జడ్జి చేతుల మీదుగా ఒక జీవితానికి ముగింపు పలికిన పెన్ను మరోమారు వినియోగించేందుకు ఉపకరించదట. అందుకే ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పు రాసిన పెన్ను పాళీని జడ్జి విరిచేస్తారట. 


Tuesday, February 6, 2018

కంప్యూటర్ లేదా లాప్టాప్ లో "ఫోల్డర్స్ కి మీ ఫోటోలని" ఎలా పెట్టుకోవాలో తెలుసా?

మీ కంప్యూటర్ లేదా లాప్టాప్ లో ఫోల్డర్స్ కి మీ ఫోటోలని గాని, మీకు నచ్చిన ఫోటోలను  గాని పెట్టుకొని మీ కంప్యూటర్ కి సరికొత్త లుక్ తెచ్చి మీ ఫ్రెండ్స్ ని ఆశ్చర్యచకితుల్ని చేయండి.ఈ విధంగా మీరు చేయాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి.నచ్చినట్లయితే "Like" ఇచ్చి "subscribe" చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ కు ఈ వీడియో షేర్ చేయండి. 


Friday, February 2, 2018

మగజాతి "అంతరించి"పోతుందా ?

త్వరలోనే మగజాతి అంతరించిపోయే దిశగా సాగుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ కెంట్‌ పరిశోధనలో తేలింది. పురుషుల పుట్టుకకు కీలకమైన 'వై' క్రోమోజోమ్‌ క్రమంగా కుచించుకుపోతోందని వారి పరిశోధనలో వెల్లడైంది. 



సాధారణంగా ప్రతి మనిషికీ ప్రతికణంలోనూ 23 జతల (46) క్రోమోజోములుంటాయి. వాటిలో 22 జతలు ఆటోజోమ్స్‌. మిగిలిన ఒక్క జత.. ఎక్స్‌, వై క్రోమోజోములు. వీటినే సెక్స్‌ క్రోమోజోమ్స్‌ అని పిలుస్తారు. తల్లి కడుపులో ఉన్న పిండం తాలూకూ లింగాన్ని నిర్ధారించేవి ఇవే. రెండు ఎక్స్‌లు కలిస్తే ఆడపిల్ల.. ఎక్స్‌, వై క్రోమోజోములు కలిస్తే మగపిల్లాడు పుడతారు. అలాంటి 'వై' క్రోమోజోమ్‌ ఇపుడు గతంతో పోలిస్తే బాగా కుచించుకుపోతోందట. 

దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే... తొలినాళ్ల క్షీరదాల్లో ఎక్స్‌, వై క్రోమోజోములు ఒకే పరిమాణంలో ఉండేవి. ఎక్స్‌ క్రోమోజోములో ఉన్న అన్ని జన్యువులూ 'వై'లోనూ ఉండేవి. అయితే, 'వై' క్రోమోజోములో ఉన్న ప్రాథమిక లోపం ఏమిటంటే.. మిగతా అన్ని క్రోమోజోములూ రెండు కాపీలు ఉంటే (జతలుగా).. ఒక్క 'వై' క్రోమోజోమ్‌ మాత్రమే 'సింగిల్‌ కాపీ' ఉంటుంది. తండ్రి నుంచి కొడుక్కి వస్తుంది. సాధారణంగా తరాలు గడిచేకొద్దీ జన్యు ఉత్పరివర్తనాలు (జీన్‌ మ్యుటేషన్స్‌) జరుగుతుంటాయి.

అయితే, ‘వై’ క్రోమోజోముకు జెనెటిక్ రీకాంబినేషన్ సౌలభ్యం లేకపోవడంతో దానిలోని జన్యువులు తగ్గిపోతూ అది కుచించుకుపోవడం ప్రారంభించింది. ఇది ఇలాగే కొనసాగితే మరో 46 లక్షల సంవత్సరాలకు.. భూమ్మీద మగవాళ్లే లేకుండా అంతరించిపోతారని కెంట్‌ వర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.