CSS Drop Down Menu

Saturday, March 31, 2018

"రంగులు" మారే వినాయకుడు !

మన భారతదేశంలో వున్న ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. మన దేశంలో తమిళనాడులో చాలా ఎక్కువగా ఆలయాలు వున్నాయి. అందుకే తమిళనాడు రాష్ట్రాన్ని "టెంపుల్ స్టేట్" అంటారు. ఇందులో కేరళాపురం గ్రామం కన్యాకుమారికి దగ్గరలో వుంది. కేరళాపురం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.ఎక్కువగా శివాలయాలు వున్నాయి.

 ఈ శివాలయంతో పాటు పురాతన వినాయకుని ఆలయం వుంది. ఈ దేవాలయంలో 6నెలలకు ఒక సారి మూలవిరాట్ అయిన వినాయకుడు రంగులు మారటం ఇక్కడ విశేషం. మార్చి నుండి ఆగస్ట్ వరకు నల్లని రంగులో,ఆగస్ట్ నుండి ఫిబ్రవరి వరకు తెల్లనిరంగులో వినాయకుడు మారుతూవుంటాడు.

ఆలయంలోని ప్రాంగణంలో వున్న బావిలోని నీరు కూడా రంగు మారుతుంది. వినాయకుడు నల్ల రంగులో వున్నప్పుడు నీళ్ళు తెల్లగాను, వినాయకుడు తెల్లగా వున్నప్పుడు నీళ్ళు నల్లగానూ మారతాయి. ఇందుకు గల కారణాలు ఇప్పటి వరకూ తెలియదు.

ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.

రోడ్డు మార్గం : కన్యాకుమారి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి 32 కి. మీ ల దూరంలో ఉన్న తక్కలై వరకు బస్సులు తిరుగుతాయి. అక్కడి నుండి సమీపాన ఉన్న కేరళపురం ఆలయం వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

కన్యాకుమారి రైల్వే స్టేషన్ చేరుకొని, బస్సులలో లేదా టాక్సీ ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. 


Wednesday, March 28, 2018

బొద్దింకగా పుట్టినా నా "కోరిక" తీరేదేమో అంటున్న యేసుదాస్ !

ప్రముఖ గాయకుడు యేసుదాస్.. బొద్దింకగా పుట్టివుంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే? యేసుదాస్ రోమన్ కేథలిక్ కుటుంబంలో పుట్టినప్పటికీ హిందూ సంప్రదాయాలనే పాటిస్తారు. హిందూ దేవుళ్ల మీద పాటలు పాడటమే కాకుండా పలు దేవాలయాలను సందర్శిస్తుంటారు. అందులో భాగంగా అయ్యప్పమాలను కూడా ధరించి శబరిమలకు వెళుతుంటారు యేసుదాస్. 

కానీ తనకు ఇష్టమైన శ్రీకృష్ణుడి దర్శనం గురువాయూర్‌లో లభించకపోవడమే యేసుదాస్ ఆవేదనకు ప్రధాన కారణమైంది. గురువాయూర్‌లో ఉన్న తన ఇష్ట దైవమైన శ్రీకృష్ణుడిని దర్శించుకునే అదృష్టం తనకు లేకుండా పోయిందని యేసుదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అదే ఏదైనా క్రిమికీటకంగా పుట్టింటే ఈపాటికే ఎప్పుడో స్వామిని దర్శించుకొని సంతోషపడే వాడినని తెలిపారు. కాగా గురువాయూర్‌లో అన్యమతస్థులకు ప్రవేశం లేదు. అక్కడికి యేసుదాస్ వెళ్లినా దేవాలయం బయటే శ్రీకృష్ణుడి భక్తి పాటలు పాడి వచ్చేసేవారు. కాగా అయ్యప్పస్వామిపై యేసుదాస్ పాడిన హరివరాసనం పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

Tuesday, March 27, 2018

రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్ !

రజనీకాంత్ సినిమాలలోని టైటిల్ కార్డ్స్ చూసినంతనే ప్రేక్షకుల ఆనందానికి అవధులుండవు.అలాంటి టైటిల్ కార్డ్స్ "అన్నామలై" సినిమా నుంచి "కబాలి" సినిమా వరకు ఈ క్రింది వీడియోలో చూసి ఆనందించండి.ఈ వీడియో నచ్చితే like చేయడం మాత్రం మర్చిపోకండి.  



Thursday, March 22, 2018

"అన్న ముఖ్యమంత్రి" అయితే "చెల్లిది టీ దుకాణం" ! ఎక్కడో తెలుసా?

అన్న అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతని చెల్లెలు మాత్రం ఓ మారుమూల గ్రామంలో టీ కొట్టుపెట్టుకుని తమ కుటుంబాన్ని భారాన్ని మోస్తోంది. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి, ఆ చెల్లెలు ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అతని చెల్లెలు శశిపాయల్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కోఠార్ అనే గ్రామంలో చిన్నపాటి టీ దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. 

తన అన్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడనే భావన ఆమెకు ఏమాత్రం లేదు. పైగా, ఆయన వద్దకు వెళ్లి ఏదేనా సాయం పొందాలన్న ఆలోచన అస్సలు లేదు. వారిని చూసి ఇరుగుపొరుగువారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాగా యోగి తన రాజకీయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులకు ఏమాత్రం స్థానం కల్పించలేదు. యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిపాయల్ ఈరోజుకీ ఉత్తరాఖండ్‌లోని కోఠార్ గ్రామంలో చిన్న దుకాణంలో టీ విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకరావడమే ఇందుకు నిదర్శనం. 

గ్రామంలోని పార్వతి మందిరం సమీపంలో తన భర్త పూరన్‌సింగ్‌తో పాటు ఈ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ దుకాణంలో పూజా సామగ్రి కూడా విక్రయిస్తుంటారు. ఆమె తన సోదరుడు యోగిని 2017 ఫిబ్రవరిలో కలుసుకున్నారు. 

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శశిపాయల్ మాట్లాడుతూ 'నా సోదరులందరి స్వభావం వైవిధ్యంగా ఉంటుంది. మా నాన్నే అందరినీ కష్టపడిపెంచారు. అయితే యోగి పెద్దయ్యాక అందరికీ సేవ చేస్తానని చెప్పేవాడు. అప్పుడు ఆ మాటను తేలికగా తీసుకున్నాం. ఇప్పుడు అది నిజమైంది అని చెప్పుకొచ్చింది. 

Wednesday, March 21, 2018

అమెరికన్ పాప్ సింగర్ "గోల్డ్ డ్రెస్" డిజైనర్ ఎవరో తెలుసా ?

అమెరికన్ పాప్ సింగర్, బ్యూటీ బియాన్స్ లాస్ ఏంజిలిస్ లో మెరిసింది. ఓ అవార్డు వేడుకలో తళుక్కుమన్న ఈమె బంగారు కాస్ట్యూమ్స్ లో మిలమిలలాడుతూ కనిపించగానే అంతా చప్పట్లే చప్పట్లు. తమ కళ్ళముందు అప్సరసలా కనిపించిన బియాన్స్ ని అలాగే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయారంతా! ఇంతకీ ఈ అమ్మడు ధరించిన గోల్డ్ డ్రెస్ డిజైన్ చేసిందెవరో కాదు భారతీయ డిజైనర్లు ఫల్గుణి,షేన్ పీకాక్.




Wednesday, March 14, 2018

అత్యాచారం చేయబోయిన డ్రైవర్ కే తిరిగి ఉద్యోగం ఇచ్చిన యాంకర్ ఎవరో తెలుసా ?

బుల్లితెర యాంకర్ రేష్మి గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. జబర్దస్త్ షోతో బాగా ఫేమస్ అయిన రేష్మి ఆ తరువాత సినిమాల్లో కూడా నటించింది. అంతేకాదు వరుస ఆఫర్లతో ఇప్పుడు ముందుకు దూసుకెళుతోంది. బుల్లితెరకు పరిచయం కాకముందు రేష్మి ఎన్నో బాధలు పడ్డారట. తినడానికి తిండి లేక తల్లి అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్ళలేక నరకయాతనను అనుభవించారట. అయితే కొన్నిరోజుల తరువాత జబర్దస్త్‌లో అవకాశం రావడం ఆ తరువాత సినిమాల్లోను మెల్లగా నిలదొక్కుకోవడంతో రేష్మి సమస్యలు కాస్త తీరాయట.




కానీ కొన్నినెలల క్రితం మాత్రం ఒక సినిమా షూటింగ్‌కు నంద్యాలకు వెళ్ళేటప్పుడు ఆమె కారు డ్రైవర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడట. దీంతో రేష్మి గట్టిగా కేకలు పెట్టడంతో డ్రైవర్ కారు దిగి వెళ్ళిపోయాడట. ఆ తరువాత  కొన్నిరోజుల క్రితం తిరిగి ఆ కారు డ్రైవరే కనిపించి రేష్మిని ఉద్యోగం అడిగారట. 

తన భార్యకు బాగా లేదని, అనారోగ్యంతో ఉందని, మీరు దయతలిస్తే కానీ నా పరిస్థితి బాగుండదని చెప్పాడట. దీంతో రేష్మి మనస్సు కరిగిపోయి అతన్నే డ్రైవర్‌గా పెట్టుకోవడంతో పాటు లక్ష రూపాయల డబ్బులు కూడా ఇచ్చిందట. కష్టం గురించి తెలిసి మరో వ్యక్తి కష్టపడకుండా ఉండేందుకు రేష్మి చేసిన సహాయంపై అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


Monday, March 12, 2018

రంగస్థలం లో "టాకింగ్ ఏంజెలా" పాడిన పాట!

రంగస్థలం లో "రంగమ్మ మంగమ్మ" పాటని టాకింగ్ ఏంజెలా పాడితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూసి ఆనందించండి.ఈ వీడియో నచ్చితే like చేయడం మాత్రం మర్చిపోకండి.  



Saturday, March 10, 2018

రజనీయా మజాకా! కుక్కకు కళ్లుతిరిగే ఆఫర్ ?

సాధారణంగా సినీ నటీనటులకు, క్రికెటర్లకు కళ్లు తిరిగే ఆఫర్లు వరిస్తుంటాయి. మూగజీవులకు మాత్రం కడుపునిండా తిండి పెట్టడమే గగనమవుతున్న ఈ రోజుల్లో ఓ శునక రాజాకు కళ్లు తిరిగే ఆఫర్ వరించింది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం "కాలా". ఇందులో ఓ కుక్క కీలక పాత్ర పోషించింది. దీంతో ఆ కుక్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రజనీకాంత్‌తో కలిసి నటించడం వల్ల ఈ కుక్కకి భారీస్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది.

ఈ అంశంపై ఆ కుక్క ట్రైనర్ స్పందిస్తూ.. 'చెన్నైలోని ఓ రోడ్డుపై ఓ కుక్క కనిపించింది. దీన్ని పట్టుకుని 'మణి' అనే పేరు పెట్టి ట్రైనింగ్ ఇచ్చాం. "కాలా" చిత్రం కోసం ఓ కుక్క కావాల్సి రావడంతో దర్శకుడు పా.రంజిత్ అనేక కుక్కలను పరిశీలించిన తర్వాత మణిని ఎంపిక చేసుకున్నాడు. 

నిజానికి రజనీ‌సార్‌కి ఈ కుక్క అంటే చాలా ఇష్టం. షూటింగ్ జరిగినన్నినాళ్లు ఆయన దానిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దాని కోసం ప్రత్యేకమైన బిస్కట్లు తెచ్చేవారు. ఇప్పుడు ఈ కుక్కను కొనడానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను దీనిని అమ్మదలచుకోలేదు. ఎందుకంటే నేను దీన్ని ఓ బిడ్డలా చూసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. 

Friday, March 9, 2018

"బుడగ"లతో అబ్బురపరిచే బొమ్మలు

జపాన్ కు చెందిన కళాకారుని చేతిలో ఆశ్చర్యం కలిగించే రీతిలో,మీరు ఇంత వరకు చూడని  బుడగలతో  చేసిన అద్భుతమైన జంతువులు,పక్షులు,కీటకాలు మరియు జలచరాల బొమ్మలు  చూడాలనుకుంటే ఈ క్రింది వీడియో తప్పక చూడండి.ఈ వీడియో మీకు నఛ్చి నట్లైతే like  చేసి subscribe చేసుకోండి.      


Tuesday, March 6, 2018

నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా? అంటున్న ఏపీ ముఖ్యమంత్రి !

మంచిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా? బయట కాసేపు తిరిగి గట్టిగా అరిచి ఇంటికి వెళ్లి పడుకుంటే మంచిగా నిద్ర పడుతుందట. ఇంతకీ ఈ విషయం చెప్పింది ఎవరనుకుంటున్నారా...? ఎవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు  'పలకరింపు' పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాుడుతూ... ఎప్పుడూ ఇంట్లోనే ఉండకుండా రోజులో కాసేపు బయట తిరగాలని, ఆ సమయంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలని అన్నారు. అంతేకాదు...ప్రతి ఒక్కరూ కాసేపైనా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతోనే 'హ్యాపీ సండే' కార్యక్రమానికి రూపకల్పన చేశానని, రోడ్లపై డ్యాన్సులు వేస్తుంటే చూసి ఆనందింవచ్చని అన్నారు. బయటకు వచ్చి కాసేపు గట్టిగా అరచి ఆపై ఇంటికి వెళితే, ఉత్సాహంగా ఉంటుందని, రాత్రి పూట మంచిగా నిద్ర పడుతుందని చెప్పారు. బంగారం, వజ్రాలను ధరిస్తే ఆనందం రాదని, ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉన్నట్టేనని అన్నారు.