CSS Drop Down Menu

Wednesday, April 25, 2018

పవన్ ను మీడియా దూరం పెడుతుందా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. తనపై వ్యక్తిగత దూషణలు చేసినందుకుగాను ఆఖరికి ఏ సంబంధం లేని విషయంలో తన తల్లిని సైతం దూషించి దానిపై పలు ఛానళ్లలో గంటల కొద్దీ డిబెట్లు పెట్టినందుకుగాను పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఛానళ్లపై మండి పడ్డారు. అంతేకాదు ఆ ఛానళ్లను బ్యాన్ చేయమని చూడొద్దని తమ అభిమానులకు సైతం పిలుపునిచ్చారు. ఆరు నెలలుగా నన్ను తిట్టీ,తిట్టీ ఇప్పుడు ఆఖరికి మా తల్లి దగ్గరకు వచ్చారా ? ఇప్పుడు నేను మీకు ఇస్తాను న్యూస్ అంటూ ఆరోజు నుండి  ఈరోజు వరకూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మీడియా వార్ చేస్తున్నారు. అంతేకాదు పలు ఛానళ్ల పేర్లు ఈ రాజకీయ కుట్ర వెనుక కొంత మంది ఉన్నారంటూ వారి పేర్లు కూడా బయట పెట్టారు. ఇంకా పలు సంచలన ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.

అయితే ఇప్పుడు మీడియా పవన్ పై యుద్దం ప్రకటించిందా ? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. తెలుగు టీవీ చానళ్లన్నీ ఆయనపై అనధికార బహిష్కరణ వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మీడియాపై యుద్ధం ప్రకటించి ట్విట్టర్ లో అదే పనిగా ఆరోపణలు చేస్తూ ఏవేవో వీడియోలు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పవన్ కల్యాణ్ వ్యవహారాన్ని  లైట్ తీసుకోవాలని మీడియా సంస్థలు నిర్ణయించుకున్నాయట. ఇక నుంచి పవన్ రాజకీయాన్ని, ఆయన మాటలను పట్టించుకోకూడదని డిసైడయ్యాయట. పవన్ కల్యాణ్ ను పట్టించుకోకపోతే సమస్య పరిష్కారమవుతుందని టీవీ చానళ్ల యజమానులందరూ నిర్ణయించుకున్నారట. దీంతో పవన్ కల్యాణ్ ఇక ఏ ఛానల్ లో కనపించరు ఆయన మాట ఏ ఛానల్ లో వినిపించదు అని అంటున్నారు. మరి మీడియా తీసుకున్న ఈ నిర్ణయంతో ట్విట్టర్, తన యూట్యూబ్ చానల్ లో మాత్రమే  తన గురించి ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఎన్ని రోజులు మీడియా పవన్ ను దూరం పెడుతుందో ?

Monday, April 16, 2018

ఆ "సింగర్ పాడితే కరెన్సీ నోట్ల వర్షం" కురుస్తుంది! ఎక్కడో తెలుసా ?

గుజరాత్ లోని నవ్ సారి ప్రాంతానికి  ఆ సింగర్ సుపరిచితుడు. కిర్తి దాన్ గద్వీ అనే ఆయన హార్మోనియం వాయిస్తూ కీర్తనలు పాడుతుంటే అంతా ఫిదా అయిపోయి కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తారు. స్టేజీ అంతా నోట్లతో నిండిపోతుంది. ఆయన గళ మాధుర్యమే అంత ! తాజాగా కిర్తి దాన్ పాడిన కీర్తనలకు ఎప్పట్లాగే ప్రేక్షకులు సమ్మోహితులయ్యారు. ఒక అమ్మాయి అయితే స్టేజీపైనే నిలబడి తన చేతిలోని నోట్లకట్ట నుంచి ఒక్కో నోటునూ కిందికి విసిరితే.. ఓ చిన్నారి తనూ తీసిపోలేదని కరెన్సీ కట్టనుంచి నోట్లను జారవిడిచింది. యూఎన్ఐ విడుదల చేసిన ఈ వీడియోలో ఈ ‘ కరెన్సీ సంగీత ‘ ప్రపంచాన్ని చూడవచ్చు.




Friday, April 13, 2018

టెక్ ప్రపంచంలో సరికొత్త విప్లవం?వాయిస్ అసిస్టెంట్!

టెక్ ప్రపంచంలో మెల్లిగా దూసుకువెళుతున్న వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ రానున్న కాలంలో అత్యంత పాపులర్ కానుంది. అందులో భాగంగా గూగుల్ సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకోస్తోంది. దానికి తగ్గట్లుగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. 

గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ తో పాటు పాటలు, అలాగే ఆన్ లైన్ స్ట్రీమ్స్ సర్వీసులను అందించే విధంగా గాడ్జెట్లను రెడీ చేస్తోంది. అమెజాన్ ఈకో ఇప్పటికే మార్కెట్లో ఇలాంటి ఫీచర్లను అందిస్తున్న నేపథ్యంలో గూగుల్ కూడా సరికొత్త గాడ్జెట్లతో ముందుకొచ్చింది. హోమ్ బేస్డ్ స్మార్ట్ స్పీకర్లను గూగుల్  దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.



గూగుల్ హోమ్ పేరుతో ఉన్న స్పీకర్ ధర రూ.9,999. గూగుల్ హోమ్ మినీ ధర రూ.4,499. గూగుల్ హోమ్ బరువు 477 గ్రాములు. పవర్ అడాప్టర్ తో పాటు వస్తుంది. 142.8 ఎంఎం పొడవు, 96.4 ఎంఎం వ్యాసార్థంతో ఉండే స్పీకర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ పరికరాలకు అనువుగా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాయిస్ ఆధారితంగా పనిచేస్తుంది.

'హే గూగుల్' లేదా 'ఓకే గూగుల్' అని చెబితే చాలు పనిచేస్తుంది. వైఫై ద్వారా ఈ స్పీకర్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ అడాప్టర్ సాయంతో ప్లగ్ కు అనుసంధానం చేసి మాత్రమే వాడుకోగలరు. అంతేకాదు దీంతో ఇంటిని స్మార్ట్ గా మార్చుకోవచ్చు. స్మార్ట్ లైట్లు ఉంటే 'ఓకే గూగుల్.. స్విచ్ ఆన్ లైట్స్' అని చెబితే చాలు లైట్లు ఆన్ అవుతాయి. గూగుల్ హోమ్ యాప్ ద్వారా ఇంట్లోని స్మార్ట్ పరికరాలను కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్పీకర్లకి లైట్లతో కూడిన ఇండికేషన్స్ ఉంటాయి. వాయిస్ కంట్రోల్ చేసుకునే సమయంలో ఈ లైట్లు సహకర్తిస్తాయి. గ్రే అండ్ వైట్ కలర్స్లో ఇవి యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ స్పీకర్లకి మ్యూట్ ఆప్సన్ అలాగే ఇతర ఫీచర్ల కూడా ఉన్నాయి. గూగుల్ అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. మీ దైనందిన కార్యకలాపాలకు ఈ స్పీకర్ లో ఉండే అలారం బాగా ఉపకరిస్తుందని గూగుల్ చెబుతోంది. మరిన్ని వివరాలు కోసం ఈ క్రింది లింకులపై క్లిక్ చేయండి.

Google Home:- http://fkrt.it/HSnMpLuuuN 

Google Home Mini:- http://fkrt.it/rmbx02NNNN 


Thursday, April 12, 2018

ఏపికి వచ్చిన రూ. 40 వేల కోట్లలో, రూ.38వేల కోట్ల నగదు అదృశ్యం ?


ఆర్బిఐ నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్లు పంపిణీ చేయడం మొదలు పెట్టిన నాటి నుంచి గత నెల మార్చి వరకూ ఏపికి వచ్చిన మొత్తం రూ. 40 వేల కోట్లు. అయితే ఆ నగదులో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బ్యాంకులన్నింటిలో కలిపి సుమారు 2000 కోట్ల డబ్బు మాత్రమే ఉందని తెలుస్తోంది. మరైతే..మిగతా ఆ డబ్బు రూ.38,000 కోట్ల నగదు ఏమైంది?...సహజంగా ఈ విషయం తెలియగానే అందరికీ వచ్చే డౌటే ఇది!. ఇప్పుడు అచ్చంగా అదే డౌట్ ఆర్బిఐ అధికారులకు వచ్చిందట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఎటిఎంలో డబ్బు రాక బ్యాంకుకు వెళితే నగదు లభించక ప్రజలు నానా ఇక్కట్లు పడుతూ బ్యాంకులను,ప్రభుత్వాలను తిట్టిపోస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం తెలిసిన ఆర్బీఐ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఎపికే డబ్బును పంపామని, అయినా అక్కడే నగదు కొరత రావడం ఏమిటంటూ ఆశ్చర్యపోయారట. అందుకే అసలేం జరిగిందో తెలుసుకునేందుకు విచారణ కోసం ఎపికి రానున్నారట.


రాష్ట్రవ్యాప్తంగా తమ ఖాతాల్లోని నగదు డ్రా చేసుకునేందుకు ఎపి ప్రజల పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏ వూరులో చూసినా సుమారు 90 శాతం ఎటిఎం లు పనిచేయవు. ఆ పనిచేసే ఎటిఎంలకు లెక్కలేనంత మంది కస్టమర్ల తాకిడి. పోనీ బ్యాంకు నుంచి తీసుకుందామా అంటే...అచ్చం నోట్ల రద్దు నాటి పరిస్థితులను తలపిస్తూ నగదు రేషన్. ఇక ప్రత్యామ్నాయ మార్గాలన్నీ బంద్. ఇవీ సంక్షిప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న నగదు కష్టాలు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నగదు కష్టాలు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నగదు అవసరాల కోసం రూ.13 వేల కోట్లు పంపాలని ఆర్బీఐని గట్టిగా కోరిందట. దీనిపై వారు లెక్కలు తీసి చూసి ఎపి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం అంతటితో ఆగిపోలేదని తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. ఎపి నుంచి నగదు కోసం ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఎపికి పంపిన నగదు లెక్కలు చూసిన ఆర్బిఐ అధికారులు ఒక విషయం కేంద్రానికి నివేదించారట.

కానీ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో కేవలం 2300 కోట్ల రూపాయల నగదే ఉందని, ఆ డబ్బును అటు బ్యాంకుల్లో ఇచ్చేందుకే ఉంచాలో...లేక ఎటిఎంలో పెట్టాలో అర్థం కావడం లేదని ప్రభుత్వానికి తెలిపాయట. ఇదే విషయం ఆర్బిఐ దృష్టికి వెళ్లేసరికి నోట్ల రద్దు అనంతరం డబ్బు పంపడం ప్రారంభించిన నాటి నుంచి గత నెల మార్చి వరకు ఎపికి 40 వేల కోట్ల రూపాయల నగదు పంపించామని, ఎపి బ్యాంకులు చెబుతున్న ప్రకారం 2300 కోట్ల నగదే ఉంటే మరి మిగతా 37,700 కోట్ల నగదు ఏమైందని సహజంగానే సందేహపడ్డారట. అందుకే ఈ వ్యవహారం ఏంటో తేల్చాలని నిర్ణయించుకున్నారట.

అసలే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వైరం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఎపిలో ఇలా డబ్బుల లెక్కలు తేడా వచ్చాయనేసరికి కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఈ ఈ విషయంపై క్షేత్ర స్ధాయి వరకూ వెళ్లి ఏం జరుగుతుందో క్షణ్ణంగా దర్యాప్తు చేయాలంటూ ఆర్బిఐని ఆదేశించిందట. దీంతో అతి త్వరలో ఆర్బిఐ అధికారులు రాష్ట్రానికి వచ్చి దర్యాప్తు మొదలుపెట్టనున్నట్లు ఢిల్లీ స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎపిలో ఒక వైపు వైసిపి...మరోవైపు బిజెపి రాష్ట్రంలో నగదు అధికార పార్టీ నేతలు దోచేసి దాచేశారని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆర్భిఐ అధికారులు రంగంలోకి దిగనుండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. అయితే ఆర్బిఐ నిజంగానే క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే ఎపిలో అదృశ్యమైన నగదు ఆచూకి కనిపెట్టడం అంత కష్టమేమీ కాదంటున్నారు...అయితే వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయోనని పలువురు అప్పుడే ఆందోళన చెందుతున్నారట.





Saturday, April 7, 2018

"టాకింగ్ టామ్" పాడిన "దారిచూడు, దుమ్ముచూడు మామా" అనే పాట!

కృష్ణార్జునయుద్ధం సినిమాలోని టాకింగ్ టామ్ పాడిన "దారిచూడు, దుమ్ముచూడు మామా" అనే పాటను చూసి ఆనందించండి.ఈ వీడియో కనుక నచ్చితే like,share చేయండి. Subscribe చేయడం మాత్రం మర్చిపోకండి. 




Friday, April 6, 2018

"శృంగార సామర్థ్యాన్ని" పెంచే సులువైన చిట్కాలు !

 యుక్త వయసులో ఉన్నవారికి మానసిక ఒత్తిడి, తీసుకునే ఆహారం వల్ల శృంగారంలో సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యను మనకు దొరికే కొన్ని వస్తువుల ద్వారా తగ్గించుకోవచ్చు. అవేంటంటే...

1. పొద్దుతిరుగుడు విత్తనాలు: ఈ విత్తనాలలో ఉండే జింక్ మగవారిలో వీర్యవృద్ధిని కలిగిస్తుంది. అంతేకాకుండా శృంగార వాంఛను కలుగజేస్తుంది.

2. కిస్‌మిస్ : వీటిని ఆవునెయ్యిలో వేయించి తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు శృంగారం పట్ల కోరికను కలుగజేస్తుంది. ఇవే కాకుండా దానిమ్మ, అరటిపండు, మునగకాయ, మునగాకు, క్యారెట్, పుచ్చకాయ లాంటివి తరచుగా తీసుకోవడం వల్ల వీర్యకణాలు వృద్ధి చెంది శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దానిమ్మరసంలో కొంచెం నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగితే మంచిది. అల్లం రసంలో ఉప్పు కలిపి తాగాలి.

3. పుచ్చకాయలో సహజంగానే శృంగార పటుత్వాన్ని పెంచే లక్షణం ఉంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల శృంగార సమస్యలు తలెత్తవు. మునగపూలు భార్యాభర్తలిద్దరూ పాలల్లో కలుపుకుని తాగడం వల్ల శృంగార వాంఛ కలుగుతుంది. 

4. గుమ్మడి విత్తనాలు : ఇందులో బీటాకెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కాలరీలు అందిస్తుంది. కళ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-సి ఎక్కువగా లభిస్తుంది కనుక శృంగార సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. రోజువారి ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల శృంగార సమస్యను తగ్గించుకోవచ్చు.

Tuesday, April 3, 2018

సింహాచలం ఆలయం లో హీరో 'నితిన్" దొంగతనం ?




వైజాగ్ లోఛల్ మోహన్ రంగ  ప్రమోషన్ కార్యక్రమాలని ముగించుకున్నా తర్వాత నితిన్ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సుల కోసం సింహాచలం ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకునే సందర్భంలో నితిన్ కు వింత అనుభవం ఎదురైంది.


ఆలయంలో లక్ష్మి నరసింహ స్వామి వారి ఉంగరం పోయిందని, నితిన్ దొంగిలించాడంటూ ఆలయ అర్చకులు అతడిపై నింద వేశారు. దీనితో నితిన్ ఖంగారు పడిపోయాడు. తాను తీయలేదని కావాలంటే చెక్ చేసుకోండి అంటూ నితిన్ కోరాడు.


తాను ఉంగరం తీయలేదని నితిన్ చెబుతున్నా అర్చకులు బంధించారు. హీరోగా మంచి పేరు సంపాదించిన మీరు స్వామివారి ఉంగరం దొంగిలించడం ఏంటి.. మర్యాదగా ఆ ఉంగరాన్ని ఇచ్చేయండి  అంటూ అర్చకులు నితిన్ ని నిలదీశారు. నేను తీయలేదు మొర్రో అంటున్నావినిపించుకోలేదు. అనుమానం ఉన్న మరి కొంత మందిని కూడా అర్చకులు బంధించి ఎక్కడకి కదలడానికి వీల్లేదని ఆదేశించారు.నితిన్ తో సహా బందీలుగా ఉన్న వారంతా ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతూ కనిపించారు.

ఆలయ అర్చకులు ఎట్టకేలకు ఉంగరం దొరికిందని ప్రకటించడంతో బందీలుగా ఉన్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అర్చకులు అసలు విషయం చెప్పడంతో నితిన్ సహా బందీలుగా ఉన్న  వారి  ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. అసలు అక్కడ దొంగతనమే జరగలేదు. ప్రతి ఏడాది స్వామివారికి సింహాద్రి అప్పన్న కల్యాణ ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు వినోద ఉత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగానే స్వామివారి ఉంగరం పోయిందంటూ కొంత మంది భక్తులని ఆటపట్టిస్తారు. ప్రతి ఏడాది జరిగే ఈ తంతులో ఈ సారి నితిన్ కూడా భాగమయ్యాడు.